చేసిన నేరాన్ని ఒప్పుకున్న ప్రముఖ నటుడు

saidapet-court-fine-rs-5200-on-Tamil-Actor-Jai-Andhra-Talkies.jpg
తప్పులు చేయటం.. తమకే పాపం తెలీదన్నట్లుగా వ్యవహరించటం కొందరు ప్రముఖ నటీనటులకు తెలిసిన విద్యనే. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ జీవించే గుణం ఉన్న నటుల ఉదంతాలు అందరికి తెలిసిందే. నేరం చేసి కూడా.. కాదంటే కాదంటూ వాదించి అడ్డంగా దొరికిపోయినోళ్లు కొందరైతే.. మరికొందరు తప్పించుకున్నోళ్లు ఉన్నారు. తాజాగా మాత్రం  చేసిన తప్పును కోర్టు ఎదుట ఒప్పేసుకున్నారో ప్రముఖ నటుడు.

తమిళ యువ నటుడిగా సుపరిచితుడైన జై.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. జర్నీ లాంటి అనువాద సినిమాలతో  తెలుగోళ్లకు దగ్గరైన ఆయన.. ఈ మధ్యన డ్రంక్ అండ్ డ్రై నేరంలో బుక్ అయ్యారు. గత నెల 21న మద్యం తాగేసి కారు నడపటమే కాదు.. చెన్నై మహానగరంలోని అడయారు బ్రిడ్జి సమీపంలోని గోడను ఢీ కొట్టారు.

ఈ ఉదంతంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి.. సైదాబాద్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే.. ఈ కేసు విచారణ గురువారం వచ్చింది. అయితే.. విచారణకు జై హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి జైకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టుకు వచ్చిన జై.. తాను చేసిన నేరాన్ని అంగీకరించారు.

దీంతో అతనికి రూ.5200 జరిమానా విధించటంతో పాటు.. ఆరు నెలల పాటు వాహనాన్ని డ్రైవ్ చేయకూడదన్న ఆదేశాల్ని జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో రానున్న ఆరునెలల పాటు జై.. వాహనం నడిపే అవకాశాన్ని కోల్పోయారు.
saidapet-court-fine-rs-5-200-on-Tamil-Actor-Jai-Andhra-Talkies

ముస్లింతో పెళ్ళి.. డోంట్ కేర్ - Priyamani

Sexy-Heroin-Priyamani-About-Her-Marriage-Andhra-Talkies
జగపతి బాబుతో కలిసి నటించిన పెళ్లయిన కొత్తలో సినిమాతో ప్రియమణి తెలుగులో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్నాళ్లు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ఈమధ్యనే ముస్తఫా రాజ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నా తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదంటోంది  ప్రియమణి.  పెళ్లయిన తర్వాత మొదటి సారిగా మీడియా ముందుకొచ్చిన ఆమె తన ప్రేమ కబుర్లు - వైవాహిక జీవితం గురించి ఎన్నో విశేషాలు చెప్పింది. 

‘‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో మొదటిసారి ముస్తఫాని చూశాను. అప్పటికప్పుడుమా మధ్య ప్రేమ పుట్టేయలేదు. ముందు ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉన్నాం. నా పట్ల ఆయన కేర్ తీసుకునే తీరు నాకెంతో నచ్చింది. అలా ప్రేమలో పడ్డాను. పెళ్లయింది కదాని సినిమాలకు దూరం అవ్వాలని అనుకోవడం లేదు.  నిజం చెప్పాలంటే పెళ్లయిన మూడో రోజే షూటింగ్ కు వెళ్లిపోయాను. అప్పుడు కూడా నా భర్త అర్థం చేసుకున్నారు. ఆడవాళ్లు పెళ్లయ్యాక అన్నీ వదిలేసి వంటింటికే పరిమితమై పోవాలని కోరుకునే టైప్ కాదు మా ఆయన’’ అంటూ ప్రియమణి తన లైఫ్ పార్ట్ నర్ గురించిన విశేషాలు చెప్పుకొచ్చింది.

తాను ఓ ముస్లింని పెళ్లి చేసుకుంటున్న ఓ విషయం మీడియాకు చెప్పినప్పుడు చాలా నెగిటివ్ కామెంట్లు వచ్చాయని చెప్పింది ప్రియమణి. కానీ అవేం తాను లెక్క చేయలేదని అంటోంది. తన పెళ్లికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఎవరమనుకున్నా డోంట్ కేర్ అని.. తనకు సంబంధించినంత వరకు తన భర్త - కుటుంబమే ముఖ్యమంటోంది ప్రియమణి.
Sexy-Heroin-Priyamani-About-Her-Marriage-Andhra-Talkies

దీపావళికి పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఖాయమేనట

Mega-Hero-Pawan-kalyan-25th-movie-First-Look-Teaser-on-Diwali-Andhra-Talkies
స్టార్ హీరోల సినిమాలు మొదలైన దగ్గర నుంచి.. షూటింగ్ ఎండింగ్ వరకు సినిమాకు సంబంధించిన న్యూస్ ఏదో ఒకటి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ తెగ ఉత్సాహం చూపిస్తారు. మధ్యలో పండుగలు వస్తే.. ఫస్ట్ లుక్.. మోషన్ పోస్టర్.. టీజర్.. ప్రోమో.. గ్లింప్స్.. ఇలా రకరకాల పేర్లతో అభిమానులకు గిఫ్ట్ ఇస్తుంటారు. పవన్ కళ్యాణ్ సినిమాను మొదలు పెట్టి నెలలు గడుస్తోన్నా.. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గాని ఫస్ట్ లుక్ గాని పూర్తి స్థాయిలో బయటకు రాలేదు.

రీసెంట్ గా పవన్ పుట్టిన రోజున అనిరుధ్ స్వరపరిచిన ఓ పాట టీజర్ ని విడుదల చేశారంతే. దీంతో పాటు ఇక థీమ్ పోస్టర్ని కూడా చూపించారు. వాటితో అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. అందుకే దసరా నాటికి ఓ టీజర్ ని రిలీజ్ చేద్దామని దర్శకుడు త్రివిక్రమ్ భావించాడట. కానీ షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ లో ఉండడంతో.. చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారని తెలుస్తోంది. అయితే.. దీపావళి కి మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునేలా తప్పకుండా టీజర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం చిత్ర యూనిట్ హాలిడే బ్రేక్ లో ఉంది. రీసెంట్ గా విదేశాల్లో చిత్రీకరణకు పూర్తి చేసుకొని వచ్చింది. మళ్లీ అక్టోబర్ మొదటి వారంలో మరో షెడ్యూల్ నిమిత్తం త్రివిక్రమ్ టీమ్ విదేశాలకు ప్రయాణం కానుండగా.. దీపావళికి టీజర్ విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. .

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. డిసెంబర్ ప్రారంభాని కల్లా సినిమాను పూర్తి  చెయ్యాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నాడట. డిసెంబర్ లోనే పాటలు.. ట్రైలర్ రిలీజ్ కానుండగా.. జనవరి 10న ఈ చిత్రం విడుదల చేస్తామని ఇఫ్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసేశారు.
Mega-Hero-Pawan-kalyan-25th-movie-First-Look-Teaser-on-Diwali-Andhra-Talkies
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...