నడిరోడ్డుపై కేకలు పెట్టించిన మలైకా అరోరా

Malaika-Arora-goes-shopping-for-household-items-Andhratalkies
సాధారణంగా సెలబ్రిటీ సుందరాంగుల షాపింగ్ అంటే.. భారీ షాపింగ్ మాల్స్ లోనో.. లేకపోతే ఫారిన్ కంట్రీస్ లోనో ఉంటుంది. కానీ ఇండియన్ బ్యూటీస్ ఎవరూ.. తమకు క్రేజ్ ఉన్న ఏరియాలో రోడ్ సైడ్ షాపింగ్ చేసేందుకు సిద్ధపడరు. ఒకటి స్టేటస్ కారణమైతే.. జనాలు గుమిగూడిపోయే ప్రమాదం ఉండడం మరో రీజన్ గా చెప్పచ్చు. కానీ కెవ్వు కేక బ్యూటీ మలైకా అరోరా మాత్రం తాను అలా కాదు అని చెప్పకుండానే.. చేసి చూపించేసింది.

ఈమెకు ఏదో స్టేషనరీ అవసరం పడగానే.. రోడ్డు పక్కన కార్ ఆపేసి కనిపించిన స్టేషనరీ దుకాణంలోకి దూరిపోయింది మలైకా. అమ్మడి షాపింగ్ ని.. డేరింగ్ ని అయితే.. పొగడాల్సిందే కానీ.. అలా వెళ్లినపుడు మలైకా అవతారమే కీలకమైన పాయింట్. బాగా డీప్ కట్స్ ఉన్న టాప్.. లోపల నుంచి కనిపిస్తున్న డెనిమ్ మినీస్.. మలైకో సోకులను దాయడం లేదు సరికదా మరింతగా ఎక్స్  పోజ్ చేసేస్తున్నారు. స్టైలింగ్ విషయంలో ఎప్పుడూ టాప్ గేర్ లో ఉండే మలైకా.. రోడ్డు పక్క షాపింగ్ తో కేకలు పెట్టించేసింది.

అదృష్టవశాత్తూ ఎక్కువ మంది గమనించేలోపే తుర్రుమనేసింది కానీ.. లేకపోతే సిట్యుయేషన్ ఎలా ఉండేదో! తాను ఐటెం సాంగ్స్ కోసమే పుట్టాను అన్నట్లుగా మాట్లాడే మలైకా అరోరా ఖాన్.. ప్రస్తుతం సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించింది. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...