కాజల్ ఎక్కడా కాంప్రమైజ్ కాదట!

Kajal-Agarwal-Shares-pic-at-Trisha-Designer-Store-Andhra-Talkies
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఇప్పుడు కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ సక్సెస్ సాధించేసిన ఈ భామలో ఇప్పుడు హుషారు బాగానే పెరిగిపోయింది. దీనికి ముందు జనతా గ్యారేజ్ ఐటెం సాంగ్ తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టేసింది. వరుసగా ఈమె సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ లో చేరిపోవడం.. భారీ ప్రాజెక్టులు చేతిలోకి రావడంతో కాజల్ కి సంతోషం రెట్టింపు అయిపోయింది.

షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ల లాంటివి ఈమెకు కొత్తేమీ కాదు కానీ.. తాజాగా హైద్రాబాద్ లో జరిగిన ఇలాంటి ఓ కార్యక్రమానికి చక్కగా చీరకట్టుతో విచ్చేసిన కాజల్.. ఆ తర్వాత షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తుంటేనే.. అసలు టార్గెట్ ఏంటో అర్ధమవుతుంది. క్లీవేజ్ షోకులు కనిపిస్తున్న ఫోటోలు ఏరి ఎంపిక చేసి మరీ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తోంది చందమామ. గతంలో కూడా అమ్మడు గ్లామర్ కురిపించేది కానీ.. మరీ ఇలా ఓపెన్ అయిపోయేది కాదు. ఇప్పుడు కాజల్ ట్రెండ్ మార్చేసినట్లుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ అజిత్ మూవీ వివేకంలోను.. ఇళయ దళపతి విజయ్ 61లోను.. తెలుగులో నేనేరాజు నేనే మంత్రి అంటూ రానాకు జోడీగాను నటిస్తోంది కాజల్. ఇన్నేసి క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్న టైంలో కూడా.. షోకుల ప్రదర్శనలో కాజల్ కాంప్రమైజ్ కాకపోవడం ఆశ్చర్యకరమే. 
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...