సంచలన విషయం చెప్పిన భావన

Bhavana-disclosed-that-Pulsar-Suni-kept-receiving-instructions-from-a-Woman
భావన నటిగా ఉన్నప్పటి కంటే కూడా.. రెండు నెలల కిందటి కిడ్నాప్ కేసుతో ఎక్కువగా మీడియాలో ఆమె పేరు చర్చనీయాంశమైంది. మొత్తం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఆమె కిడ్నాప్ వ్యవహారం. ఈ కేసులో కీలక నిందితుడైన పల్సర్ సుని.. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే పోలీసులకు చిక్కాడు. కిడ్నాప్ గ్యాంగ్ మొత్తం కూడా పోలీసులకు దొరికింది. అయినప్పటికీ రెండు నెలలుగా ఈ కేసులో పెద్దగా పురోగతి లేదు. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దల ప్రమేయం ఇందులో ఉన్నట్లుగా అనుమానాలు వచ్చినప్పటికీ.. ఇప్పటిదాకా విచారణలో ఎవరి పేర్లూ బయటికి రాలేదు. పోలీసులు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి.

ఐతే భావన మాత్రం ఈ కేసు విషయంలో చాలా పట్టుదలగా ఉంది. అసలు నిందితులకు శిక్ష పడేదాకా తన పోరాటం ఆగదని ఆమె అంటోంది. తాజాగా ఒక మలయాళ పత్రికకు ఆమె ఓ సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె వెల్లడించిన ఓ విషయం సంచలనం రేపుతోంది. తనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డ సమయంలో పల్సర్ సుని క్రమం తప్పకుండా ఒక ఫోన్ కాల్ మాట్లాడాడని.. అవతలి వాళ్ల ఆదేశాల మేరకే అతను తనను వేధించాడని ఆమె తెలిపింది. అవతలి వ్యక్తి ఒక మహిళ అని భావన చెప్పడం విశేషం. ఒక మహిళ అయి ఉండి భావన మీద ఇలాంటి అఘాయిత్యం చేయించడానికి పూనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ ఆ మహిళ ఎవరై ఉంటారనే విషయంలో ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

No comments:

Post a Comment