రంగస్థలం సినిమా ఎవర్ గ్రీన్ హీరోయిన్ సమంత ఇప్పట్లో తగ్గేలా లేదే

Heroin-Samantha-At-Rangasthalam-Success-Meet-Andhra-Talkies
టాలీవుడ్ లో నిజంగా చాలా పెద్ద మార్పులే వస్తున్నాయి. ఓ విధంగా అందుకు కారణం ఆడియెన్స్ మైండ్ సెట్ చేంజ్ అవడమే. పెళ్లైన హీరోయిన్ ను ఎవడు చూస్తాడు అనుకునే రోజులు పోయాయి మనసులో నటన పై ఆసక్తి ఉంటే ఎవ్వరైనా ఎవర్ గ్రీన్ హీరోయిన్ అవుతారని సమంత చెప్పకనే చెప్పేసింది. రంగస్థలం సినిమాలో ఆమె కనిపించిన తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. పెళ్లి అయిన సమంత పెళ్లి కానీ సమంత అనే కోణంలో ఎవరు ఆలోచించలేదు.

సినిమా విజయంలో ఆమె పాత్ర చాలానే ఉందని చెప్పవచ్చు. ఇక నిన్న జరిగిన రంగస్థలం విజయోత్సవంలో కూడా సమంత కనిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది. అందరికి చేతులెత్తి నమస్కరం పెట్టి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆమెను పొగిడిన ప్రతి గెస్ట్ కి దండం పెట్టడం చూసిన తరువాత ఆమె నిబద్దత భావం ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చు. చూస్తుంటే సమంత తన కెరీర్ కు ఇప్పట్లొ ఎండ్ చెప్పేలా లేదు అనిపిస్తోంది.

ఇక సినిమా ప్రముఖులు కూడా ఆమెకు పెళ్లి అయ్యింది అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆమెకు నటనపై ఆసక్తి ఉన్నంత వరకు హీరోయిన్ గా కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రంగస్థలం ఈవెంట్ లో బాబాయ్ అబ్బాయ్ లు మెగా ఫ్యాన్స్ ను కనువిందు చేశారు. ఇద్దరు ప్రేమగా ముద్దు పెట్టుకోవడం అందరు ఎంతగానో మురిసిపోయారు. ఇక రంగస్థలం సినిమా 100 కోట్ల (షేర్స్) మార్క్ ను ఇటీవల క్రాస్ చేసిన సంగతి తెలిసిందే.

రంగమ్మత్త (అనసూయ) తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామెడీ

Power-Star-Pawan-kalyan-comments-on-Anasuya-At-Rangasthalam-Success-Meet-Andhra-Talkies
జబర్దస్త్ యాంకర్ గా హల్ చల్ చేయడం మొదలుపెట్టిన రోజుల్లోనే.. అనసూయ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం అన్న అంశం.. పవన్ కళ్యాణ్ సినిమాతో మొదలైంది. అత్తారింటికి దారేది చిత్రంలో ఆమెను ఐటెం సాంగ్ చేయమని అడగడం.. ఆమె నో చెప్పడం వంటివి అప్పట్లో మెగా ఫ్యాన్స్ అనసూయను టార్గెట్ చేసేందుకు కారణం అయ్యాయి.

ఇన్ని ఏళ్ల తర్వాత అనసూయ అండ్ పవన్ కళ్యాణ్ ఒక స్టేజ్ పై కలిసి కనిపించడం జరిగింది. రంగస్థలం సక్సెస్ మీట్ లో స్టేజ్ పై ఇద్దరూ కనిపించగా.. అనసూయ గురించి పవన్ మాట్లాడడం ఆసక్తి కలిగించింది. ఈ సినిమాలో ఎవరూ యాక్టర్స్ కనిపించలేదని.. అందరూ ఆయా పాత్రధారులే కనిపించారని చెప్పాడు పవన్. తాను ప్రీమియర్ చూసి బైటకు వచ్చిన తర్వాత.. అనసూయ కనిపిస్తే షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించానని చెప్పాడు పవన్. రంగమ్మత్త పాత్రలో తానే నటించినట్లు చెప్పిందని.. అప్పుడు ఓ సారి అటూ ఇటూ చూడాల్సి వచ్చిందన్నాడు పవర్ స్టార్.

రంగమ్మత్త పాత్రలో నటించినది ఈమేనా అని నమ్మలేకపోయానని.. అంతగా ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయిందని.. పవన్ వెర్షన్ అని అర్ధం చేసుకోవచ్చు. తన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు.. అనసూయ ఫేస్ ఫీలింగ్స్ చూడాలి.. నా సామిరంగా.. ఆమె సంతోషానికి అవధులు లేవంతే. 
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...