మహేష్ ముద్దు వెనుక కన్నీటి కథ

Reason-behind-Mahesh-Babu-Kiss-to-Namrata-Andhra-Talkies
మహేష్ హీరోగా నటించిన భరత్ అనే నేను రిలీజైన మొదట్లో మహేష్ తన భార్య నమ్రతకు ప్రేమతో ముద్దు ఇస్తున్న ఫొటో ఒకటి వైరల్ అయింది. ముచ్చటైన జంటకు కేరాఫ్ అడ్రస్ లా ఉండే వీళ్లిద్దరి మధ్య అనురాగం చూసి అంతా హ్యాపీగా పీలయ్యారు. మహేష్ ఇలాంటి ఫొటో షేర్ చేయడ ఇదే ఫస్ట్ టైం. ఆ ముద్దు వెనుక కదిలించే బ్యాక్ గ్రౌండ్ స్టోరీ రీసెంట్ గా బయటకొచ్చింది.

మహేష్ ఇంతకుముందు నటించిన బ్రహ్మోత్సవం - స్పైడర్ సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. హీరోగా మహేష్ గట్టి హిట్ కొట్టాల్సిన టైంలో భరత్ అనే నేను రిలీజైంది. ఈ మూవీ రిలీజ్ కు మూడు రోజుల నుంచి తనకు టెన్షన్ మొదలైందని మహేష్ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు. కానీ అంతకుమించి నమ్రతానే ఎక్కువ టెన్షన్ పడిందట. సినిమా ఇండియాలో కన్నా ముందు ఒకరోజు యూఎస్ లో విడుదలైంది.

‘‘యూఎస్ లో ప్రీమియర్లు విడుదలైన రోజున మొదటి గంట నుంచే ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందా అని నమ్రత ఆరాటపడుతూనే ఉంది. ఫస్ట్ రివ్యూ రాగానే వచ్చి నన్ను నిద్రలేపింది. ఆ క్షణం తన కంటినిండా నీళ్లే కనిపించాయి. అప్పుడు నాకనిపించింది ఈ సినిమా కూడా ఫ్లాపేనని. కానీ నమ్రత సంతోషం.. కన్నీళ్లు కలగలసిన స్వరంతో ఎంతో ఎమోషన్ గా చెప్పింది సినిమాకు సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని. ఆ క్షణం మా ఇద్దరికీ ఎన్నటికీ మరువలేనిది’’ మహేష్ తన అనుభవనాన్ని పంచుకున్నాడు.

తన కోసం భార్య పడే ఆరాటం చూస్తే ఏ భర్త గుండె చలించకుండా ఉంటుంది? అదీ టాలీవుడ్ బెస్ట్ కపుల్ స్వీట్ కిస్ వెనుకున్న లవ్ స్టోరీ. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...