ప్రేమతో మొదలై...మర్డర్ తో మలుపు తిరిగింది! | Start with love and turn with Murder!

start-with-love-and-turn-with-murder

ప్రేమతో మొదలై...మర్డర్ తో మలుపు తిరిగింది! | Start with love and turn with Murder!

మూడు నగరాలు.. రెండు ప్రేమకథలు... ఒక సంఘటన అంటూ ఆది పినిశెట్టి ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. ఈమధ్య కాలంలో వేరే కథానాయకుల  చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చిన ఆది పినిశెట్టి ఈసారి హీరోగా ఓ చిత్రం చేశారు. అదే... `నీవెవరో`. తాప్సి రితికాసింగ్ ఇందులో కథానాయికలు. `నిన్ను కోరి`లాంటి ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన ఎమ్.వి.వి. సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. లవర్స్ అనే చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్న హరినాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

హైదరాబాద్ లో సెటిలైపోయిన కేథరిన్ | Catherine Settled in Hyderabad

catherine-settled-in-hyderabad

హైదరాబాద్ లో సెటిలైపోయిన కేథరిన్ | Catherine Settled in Hyderabad

కేథరిన్ థ్రెసా మెయిన్ రోల్ సినిమాలు ఫ్లాఫ్ అయినా... ఆమె మంచి పాత్రలు చేసిన సినిమాలు మాత్రం బానే హిట్టయ్యాయి. రుద్రమదేవి - సరైనోడు - నేనేరాజు నేనే మంత్రి వంటి సినిమాలతో హిట్స్ రుచి చూసిన కేథరిన్ థ్రెసా కూడా హైదరాబాద్ లో ఇల్లుకొని సెటిలైన జాబితాలో చేరింది. ఈ  హాట్ బ్యూటీ త్వరలో హైదరాబాదులో సొంతింట్లో గృహ ప్రవేశం చేయనుందట.

ఈ మధ్య ఫిల్మ్ నగర్ నుంచి సెలబ్రిటీలు మణికొండకు - గచ్చిబౌలికి - ఓఆర్ ఆర్ కు మారుతున్నారు. తాజాగా కేథరిన్ థ్రెసా కూడా ఓఆర్ ఆర్ సమీపంలో ఓ ఇల్లు కొనేశారట. సౌత్ ఇండియాలో కొన్ని మంచి ఆఫర్లు రావడంతో హైదరాబాదులో అద్దె ఇంట్లో ఉంటూ అన్నిటికీ హాజరవుతోంది. అయితే ఇక్కడ ఎక్కువ కాలం నుంచి ఉండటం - ఆఫర్లు ఇక్కడే ఉండటం - హైదరాబాద్ అన్ని విధాలా బెస్ట్ డెస్టినేషన్ కావడంతో ఇక్కడే ఒక ఇల్లు ఉంటే బాగుంటుందని భావించి కోకాపేటలో డూప్లెక్స్ ఇల్లు కొనేసిందట. అయితే ఇంకా సరైన ముహుర్తం కోసం వేచి చూస్తోంది. ఆషాడం కావడంతో ఈ నెల అనంతరం మంచి రోజు చూసి గృహ ప్రవేశం చేయాలని భావిస్తోందట.

హెబ్బా పటేల్.. 24 సార్లు పెట్టేసింది.. | Hebba Patel has been posted 24 times ..

Hebah-Patel-reveals-interesting-facts-about-24-kisses-movie-Andhra-Talkies.jpg

హెబ్బా పటేల్.. 24 సార్లు పెట్టేసింది.. | Hebba Patel has been posted 24 times ..

హెబ్బా పటేల్.. కుమారి 21F మూవీతో కుర్రాళ్ల మనసును కొల్లగొట్టిన హీరోయిన్.. అందం - గ్లామర్ కలగలిపిన ఈమె నటన చూసి అందరూ ఫిదా అయ్యారు. చలాకీదనంతో ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన హెబ్బాకు ఆ తర్వాత అవకాశాలు లేక సైడ్ అయిపోయింది. కుమారి 21F సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ ను అందుకోలేకపోయింది.

చాలా రోజుల తర్వాత మళ్లీ మనముందుకు వస్తుంది. అదీ కుర్రళ్లకు కాకపుట్టించే క్యారెక్టర్ తో.. అదిత్ అరుణ్ హీరోగా నటిస్తున్న ‘24 కిసెస్’ సినిమా లో హీరోయిన్ గా హెబ్బా పటేల్ నటిస్తోంది. ఇందులో ఫ్రొఫెసర్ తో ప్రేమలో పడే మీడియా స్టూడెంట్ గా నటిస్తోంది. సినిమా పేరులో చెప్పినట్టే ఇందులో మొత్తం 24 లిప్ టు లిప్ ముద్దులను హెబ్బా పెడుతుందట.. ప్రతి ముద్దుకు ఓ లెక్క.. కారణం ఉంటుందట.. ఇంత రోమాంటిక్ క్యారెక్టర్ ను తాను చేయగలుగుతానా లేదా అని హెబ్బా మొదట్లో ఫీల్ అయ్యిందట.. కానీ కథ మొత్తం విన్నాక నమ్మకం కుదిరి చివరకు ఈ సినిమాలో నటించింది.. ముద్దులతో మురిపించింది.

రేణు మళ్లీ దాచేసింది | Renu reappeared

Renu-Desai-Hide-her-fiance-Andhra-Talkies.jpg

రేణు మళ్లీ దాచేసింది | Renu reappeared

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఎవరిని పెళ్లాడబోతోందో తెలుసుకోవాలన్న ఉత్సుకత జనాల్లో కనిపిస్తోంది. కానీ రేణు మాత్రం అతనెవరో రివీల్ చేయడానికి ఇష్టపడట్లేదు. గత నెలలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న రేణు.. ఆ సందర్భంలో తనకు కాబోయే వాడి ముఖం చూపించకుండా ఎంగేజ్మెంట్ దృశ్యాన్ని మాత్రమే పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో జనాలు ఎంతగా అడుగుతున్నా ఆ వ్యక్తి ఫొటోను పంచుకోవట్లేదు. ఈలోపు రేణు మూడేళ్ల కిందట తన సోదరుడి పెళ్లిలో అతడితో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలోకి తెచ్చేసి అతనే కాబోయే భర్త అంటూ ప్రచారం చేశారు కొందరు. అప్పుడు కూడా రేణు స్పందించలేదు. తనకు కాబోయే భర్తను పరిచయం చేయలేదు.

యన్.టి.ఆర్’ షూటింగుకి ఎవరొచ్చారో తెలుసా? | Do you know what NTR shoots are?

Ramoji-Rao-Visits-NTR-Biopic-Sets-Andhra-Talkies.jpg

యన్.టి.ఆర్’ షూటింగుకి ఎవరొచ్చారో తెలుసా?

తెలుగు సినిమాపై.. తెలుగు రాజకీయాలపై తిరుగులేని ముద్ర వేసిన నందమూరి తారక రామారావు జీవిత కథతో ‘యన్.టి.ఆర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ స్వయంగా తండ్రి పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్నాడు. కొన్ని రోజుల కిందటే చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం రామోజీ పిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. తాజాగా చిత్రీకరణ జరుగుతున్న చోటికి ఒక విశిష్ట అతిథి వచ్చారు. ఆయన మరెవరో కాదు.. ఫిలిం సిటీ అధినేత.. మీడియా మొఘల్ రామోజీ రావు.  ఆయన అరగంట పాటు అక్కడే ఉండి సినిిమా విశేషాలు తెలుసుకున్నారట.

జబర్దస్త్ ఆర్టిస్ట్.. పె..ద్ద స్మగ్లర్! | Jabbarthast Artist .. big smuggler

Jabardasth-Artist-Turns-Red-Sandalwood-Smuggler-Andhra-Talkies.jpg

జబర్దస్త్ ఆర్టిస్ట్.. పె..ద్ద స్మగ్లర్!

బుల్లితెరపైన తన హాస్యంతో నవ్వులు పువ్వులు పూయించే ఆర్టిస్ట్ ఒకరు తెర వెనుక చేసే పనులు బయటకు రావటంతో షాక్ తినటం పోలీసుల వంతైంది. సీరియల్స్ లోనూ.. జబర్దస్త్ కార్యక్రమంలోనూ చిన్న చిన్న పాత్రలువేసే ఒక అర్టిస్ట్ భాగోతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఆ మధ్య వరకు సాదాసీదా ఆర్టిస్ట్ గా నే అందరికి తెలిసిన అతగాడి బ్యాక్ గ్రౌండ్ గుట్టు రట్టు అయిన అందరికి ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేస్తోంది. ఎర్ర చందనం అక్రమ రవాణాతో సదరు ఆర్టిస్ట్ ఇప్పుడు కోట్లకు పడగలెత్తటమే కాదు.. సినిమాలకు ఫైనాన్స్ చేసే వరకూ వెళ్లటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

తిరుపతికి చెందిన ఒక సాదాసీదా వ్యక్తి టీవీ సీరియల్స్ లోనూ.. జబర్దస్త్ కార్యక్రమంలో పాత్రలు పోషిస్తుంటాడు. దాంతో వచ్చే సంపాదన తృప్తిని ఇవ్వలేదు. అదే సమయంలో ఆర్టిస్ట్ గా వచ్చి ఫేంతో పరిచయమైన పరిచయాలతో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తే వచ్చే లాభాల లెక్క అతడి మనసును మార్చేసినట్లు చెబుతున్నారు.

కాజల్ చుట్టూనే కథ అంతా! | The story around Kajal

Kajal-Playing-Key-Role-in-Bellamkonda-Srinivas-and-Teja-Film-Andhra-Talkies.jpg

కాజల్ చుట్టూనే కథ అంతా! | The story around Kajal


నేనే రాజు.. నేనే మంత్రి సినిమా తర్వాత దర్శకుడు తేజ ‘ఎన్టీఆర్’ బయోపిక్ కు దర్శకత్వం వహించే అద్భుత అవకాశాన్ని దక్కించుకున్నాడు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఇంత పెద్ద ప్రాజెక్టు తన వల్ల కాదంటూ తప్పుకున్న సంగతి తెలిసిందే.. ఇక అప్పటినుంచి తేజ ఏం సినిమా మొదలు పెడుతాడా అన్న ఆసక్తి నెలకొంది..

తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా  తేజ ఓ సినిమాను మొదలు పెట్టాడు. కాజల్ కథానాయికగా నటిస్తోంది. బెల్లంకొండతో పోలిస్తే కాజల్ సీనియర్ హీరోయిన్. అయినా తేజ ఆమెనే తీసుకోవడం వెనుక పెద్ద కథే ఉందట..

తేజ తాజా సినిమా లేడీ ఓరియెంటెడ్ కథ అట. అందుకే కాజల్ లాంటి సీనియర్ హీరోయిన్ ను తీసుకున్నట్టు తెలిసింది. కథంతా కాజల్ చుట్టూ తిరుగుతుందని.. బెల్లంకొండ పాత్ర ఆమెకు వెన్నుదన్నుగా నిలుస్తాడని సమాచారం.

బిగ్ బాస్ లో త్యాగమూర్తులు.. స్వార్థ పరులు | The Big Bass is the sacrifices-selfish

Bogg-Boss-2-Telugu-Telephone-Nomination-Episode-HighLights-Andhra-Talkies.jpg

బిగ్ బాస్ లో త్యాగమూర్తులు.. స్వార్థ పరులు | The Big Bass is the sacrifices-selfish

బిగ్ బాస్ 2 సోమవారం  ఎపిసోడ్  కేక పుట్టించింది. ఈ ఒక్క రోజు.. మంచోడు.. చెడ్డోడు అయిపోయాడు.. పనికిరారని ముద్రపడ్డ వారు హీరో అయిపోయారు.  త్యాగశీలతను చాటిచెప్పే టాస్క్ ఇచ్చి బిగ్ బాస్ ఇంటిసభ్యులందరిలోని మానవీయతను బయటకు తీశాడు. హౌస్ లో ఇన్నాళ్లు కొట్టుకున్నా.. తిట్టుకున్న ఇంటిసభ్యుల నిజాయితీని ఈ టాస్క్ తో నిరూపించాడు. సోమవారం టెలిఫోన్ బూత్ టాస్క్ లో తమ తోటి స్నేహితుల కోసం ఏమైనా చేయడానికి ముందుకు వచ్చిన ఇంటిసభ్యుల తీరు ప్రశంసలు అందుకుంది.

సోమవారం ఇంటిసభ్యులందరినీ బిగ్ బాస్ ఎలిమినేషన్ జోన్ లోకి పంపాడు. అందులోంచి బయటకు రావాలంటే మరో కంటెస్టెంట్ సాయం తీసుకోవాల్సిందిగా టాస్క్ ఇచ్చాడు. ఒకరి కోసం మరొకరు ఏమైనా త్యాగం చేస్తే ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చన్నమాట. 

గణేష్ ని ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి బాబు గోగినేని రెండు కొత్తిమీర కట్టలను తినాల్సి వచ్చింది. ఇక తేజస్విని కాపాడడానికి సామ్రాట్ క్లీన్ షేవ్ చేసుకున్నాడు. గీతామాధురిని రక్షించడానికి తేజస్వి తనకు ఎంతో ఇష్టమైన తెల్ల దుప్పటిని పనికిరాకుండా ముక్కలుగా కట్ చేసింది.  రోల్ రైడా తన జుట్టుకు ఎరుపురంగు పూసుకున్నాడు. 

వ్యభిచారం చేస్తూ దొరికిన భోజ్ పురి నటి ఎక్కడంటే? | Where is Bhoj Puri actress doing adultery?

Hyderabad-cops-rescue-Bhojpuri-actress-in-high-profile-sex-racket-Andhra-Talkies.jpg

వ్యభిచారం చేస్తూ దొరికిన భోజ్ పురి నటి ఎక్కడంటే?

తరచూ హైటెక్ వ్యభిచార రాకెట్లు బయటపడే హైదరాబాద్ లో శనివారం రాత్రి చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడే పరిణామం చోటు చేసుకోవటం తెలిసిందే. తెలుగు నేలకు దగ్గర్లోని మహారాష్ట్రకు చెందిన భోజ్ పురికి చెందిన ప్రముఖ నటీమణుల్లో ఒకరిగా పేరున్న ఒక నటి హైదరాబాద్ లోని స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన వైనం తెలిసిందే.

బంజారాహిల్స్ లోని స్టార్ హోటల్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో టాస్క్ ఫోర్సు పోలీసులు హోటల్ పై దాడి చేసి.. నటితో పాటు విటుడ్ని.. సంధానకర్తగా వ్యవహరించిన బ్రోకర్ జనార్దన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరి నుంచి మొబైల్ ఫోన్స్.. రూ.40వేలమొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కత్తి మహేశ్ పై నగర బహిష్కరణ వేటు | City boycotts on the Katthi Mahesh

Hyderabad-Police-Expelled-Kathi-Mahesh-From-Hyderabad-Andhra-Talkies.jpg

కత్తి మహేశ్ పై నగర బహిష్కరణ వేటు

సినీ విమర్శకుడిగా తనకు తానే ప్రకటించుకొని.. సోషల్ మీడియాలో చెలరేగిపోయే కత్తి మహేష్ కుఊహించని షాక్ తగిలింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నచ్చినట్లుగా మాట్లాడే గుణం ఉన్న కత్తి మహేశ్.. ఈ మధ్యన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ ఛానల్ లో నిర్వహించిన చర్చలో భాగంగా ఫోన్ ఇన్ లో శ్రీరాముడిపై తనకు తోచినట్లుగా చెప్పే క్రమంలో కోట్లాదిమంది మనోభావాలు దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. కత్తి మహేశ్ వ్యాఖ్యలు సరికావంటూ సినీ.. రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖులు మొదలు సామాన్యుల వరకూ పెద్ద ఎత్తున ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు కోరుతున్న పరిస్థితి. హిందుత్వ సంస్థలు ఆయనపై ఫిర్యాదు చేశాయి కూడా.

పవన్ కల్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడను: మాజీ భార్య రేణు దేశాయ్ | Pawan Kalyan does not speak against: ex-wife Reun Desai

పవన్ కల్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడను: మాజీ భార్య రేణు దేశాయ్ |
Renu-Desai-Never-Speak-Bad-About-Pawan-Kalyan-Andhra-Talkies.jpg
Pawan Kalyan does not speak against: ex-wife Reun Desai

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్ళి చేసుకోబోతోన్న సంగతి తెలిసిందే. ఆమె ఈ విషయాన్ని వెల్లడించినప్పటి నుంచి ట్విట్టర్ లో పవన్ ఫ్యాన్స్  - నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. వారి టార్చర్ తట్టుకోలేక ట్విట్టర్ ను వదిలేశారు. అయితే తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కూడా తనను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదంటూ రేణు తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ ను కించపరుస్తూ సోషల్ మీడియలో సర్క్యులేట్ అవుతోన్న ఓ ఫొటోపై రేణు స్పందించాలని కొందరు కోరుతున్నారని గత ఐదేళ్లుగా తనపై ట్రోలింగ్ జరుగుతున్న సమయంలో వీరంతా తనను సైలెంట్ గా ఉండమని సలహా ఇచ్చారని రేణు ఘాటుగా స్పందించారు. తనకో న్యాయం...పవన్ కో న్యాయమా అంటూ రేణు ఆ పోస్ట్ పెట్టిన వారిని ఉద్దేశించి ప్రశ్నించారు. తన ఇన్ స్టా గ్రామ్ ఇన్ బాక్స్ లో పెట్టిన ఫొటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం రేణు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఏడో క్లాసులో పవన్ ఎలా ఉన్నాడో చూడండి | See how Pawan is in the seventh class

Pawan-kalyan-Was-In-7th-Class-Andhra-Talkies.jpg

ఏడో క్లాసులో పవన్ ఎలా ఉన్నాడో చూడండి | See how Pawan is in the seventh class

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంటును ప్రధానంగా రాజకీయాల కోసమే ఉపయోగిస్తుంటాడు. వ్యక్తిగత విశేషాలు.. సినిమాల సంగతుల గురించి ఇందులో పంచుకోవడం చాలా అరుదు. ఐతే ఈ రోజు పవన్ నోస్టాల్జిక్ గా అనిపించే వ్యక్తిగత ఫొటో ఒకటి ట్విట్టర్ లో పంచుకుని ఆశ్చర్యపరిచాడు. అందులో పవన్ అన్నయ్యలు చిరంజీవి.. నాగబాబులతో పాటు అతడి ఇద్దరు సోదరీమణులు కూడా ఉండటం విశేషం. అది ఈనాటి ఫొటో కాదు. దాదాపు నాలుగు దశాబ్దాల కిందటిది. పవన్ అప్పటికి ఏడో క్లాసులో ఉన్నాడు. నెల్లూరులో ఏడో తరగతి చదువుకుంటున్నపుడు తీసిన ఫొటో అదని పవన్ వెల్లడించాడు. చిరు నలుపు చొక్కాలో.. నాగబాబు తెలుపు చొక్కాలో మెరిసిపోతున్నారందులో. చిరు అప్పటికే హీరోగా రాణిస్తున్నాడు.

ఈ నగరానికి ఏమైంది.. టికెట్లు దొరకట్లేదా? |

Vishwaksen-Naidu-on-About-Ee-Nagaraniki-Emaindi-Andhra-Talkies.jpg

ఈ నగరానికి ఏమైంది.. టికెట్లు దొరకట్లేదా? | 

గత శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘ఈ నగరానికి ఏమైంది’. ‘పెళ్ళిచూపులు’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ తర్వాత తరుణ్ భాస్కర్ రూపొందించిన సినిమా కావడం.. పైగా సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బేనర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం.. ప్రోమోలు కూడా ఆసక్తికరంగా ఉండటంతో దీనికి మంచి హైపే వచ్చింది. కానీ ఆ అంచనాల్ని ఈ సినిమా అందుకోలేకపోయింది. ‘పెళ్ళిచూపులు’తో పోలిస్తే ఇందులో చాలా లోపాలు కనిపించాయి. బలహీన కథాకథనాలపై ఒకింత నిరాశ వ్యక్తం చేశారు ప్రేక్షకులు. అలాగని సినిమా తీసిపడేసేలా ఏమీ లేదు. ఇందులోని ఎంటర్టైన్మెంట్ యూత్ ఆడియన్స్ ను మెప్పిస్తోంది. సినిమా ఓ మోస్తరుగా ఆడుతోంది. కానీ ఈ చిత్ర హీరో మాత్రం సినిమా కలెక్షన్ల గురించి మరీ అతిగా చెప్పేశాడు.

ఎప్పుడూ అలాంటి పాత్రలేనా.. | Always have such a character ..

Hansika-Wants-Challenging-ROles-Andhra-Talkies.jpg

ఎప్పుడూ అలాంటి పాత్రలేనా.. | Always have such a character ..

అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది పాలబుగ్గల సుందరి హన్సికా మోత్వానీ. కాశ్మీర్ యాపిల్ లా ఉండే ఈ బ్యూటీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. కొన్నాళ్లు తెలుగులోనే నటించినా పెద్దగా హిట్లేమీ రాలేదు. అదే టైంలో కాస్త బొద్దుగా మారింది. దాంతో రూటు మార్చి కోలీవుడ్ కు షిఫ్టయిపోయింది. అక్కడ వరస ఆఫర్లు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ అయింది.

ఈ మధ్య కాస్త సినిమాలకు విరామమిచ్చి బొద్దుగుమ్మ కాస్తా కష్టపడి ముద్దుగుమ్మలా తయారైంది. సినిమాలకు ఎందుకు గ్యాఫిచ్చింది అంటే ఒకే తరహా పాత్రలు చేసిచేసి బోర్ కొట్టేసింది అంటోంది హన్సిక. క్యూట్ గా.. బబ్లీగా కనిపిస్తూ చెట్ల చుట్టూ తిరుగుతూ డ్యాన్సులు వేసే పాత్రలతో విసిగిపోయిందట. కెరీర్ లో ముందుకెళ్లాలంటే చేసే పాత్రల్లో మార్పు తప్పనిసరి అనిపించింది. అందుకే పాత్రలు ఛాలెంజింగ్ ఉంటేనే నటించడానికి ఒప్పుకుంటున్నా అంటోంది హన్సిక.

అతని వలనే అర్జున్ రెడ్డికి నో అనేసింది | Arjun Reddy did not know him

Janhvi-Kapoor-Was-First-Choice-For-Arjun-Reddy-Bollywood-Remake-Andhra-Talkies.jpg

అతని వలనే అర్జున్ రెడ్డికి నో అనేసింది | Arjun Reddy did not know him

అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో బోల్డ్ సినిమాల ఒరవడి సృష్టించిన చిత్రం. సందీప్ వంగ దర్శకత్వం వహించిన మొదటి సినిమా గా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవేరుకోండ - షాలిని పాండే ముఖ్య పత్రాలు పోషించారు. బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు అని తెలిసిన విషయమే. హిందీ వెర్షన్ ను కూడా సందీప్ దర్శకత్వం వహించటం విశేషమయితే - ఇందులో షాహిద్ కపూర్ - తార సుతారియా దీనిలో నటిస్తున్నారు.

ఈ సినిమా గురించి తొలుత శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ను అనుకున్నారు అనే ఒక వార్త ఇప్పుడు మీడియా లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం జాన్వీ ను అడగగా - శ్రీ దేవి కుటుంబానికి క్లోజ్ అయినా బాలీవుడ్ లో పేరు మోసిన డైరెక్టర్ కారం జోహార్ మొదట్లోనే బోల్డ్ సినిమాలు చేయొద్దని ఝాన్విను వారించాడట. బోల్డ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెడితే - అలాంటి ఇంప్రెషన్ వస్తుందని - అందుకని అది ఎంతమాత్రం మంచి ఆప్షన్ కాదని కరణ్ సూచించాడట. కరణ్ జోహార్ చెప్పటంతో జాన్వీ కూడా నో చెప్పిందంట. ఈమె కుదరదు అనేసరికి ఆ సినిమా దర్శకనిర్మాతలు తార సుతారియా ను తీసుకున్నారు.

బిగ్ బాస్ లో శృతి హంగామా.. | Shruti Hungama in Big Boss

Shruti-Haasan-Joins-With-Kamal-Haasan-in-Bigg-Boss-2-Tamil-Andhra-Talkies.jpg

బిగ్ బాస్ లో శృతి హంగామా.. | Shruti Hungama in Big Boss

బాలీవుడ్ బిగ్ బాస్ ఇప్పటికే అన్ని భాషల వారికి చాలా దగ్గరైపోయింది. నార్త్ జనాలతో పాటు ఈ రియాలిటీ షోకి సౌత్ జనాలు కూడా అడిక్ట్ అయిపోతున్నారు. ఇకపోతే తెలుగులో ఓ లెవెల్లో ఉంటే కోలీవుడ్ లో మాత్రం మరో లెవెల్లో ఉంది. ఏకంగా కంటెస్టెంట్స్ మధ్య లిప్ లాక్ లు సాగుతున్నాయి అంటే డోస్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ తమిళ్ బిగ్ బాస్ షోకి కమల్ హాసన్ హోస్ట్ గా బాగానే రాణిస్తున్నారు.

అసలు విషయంలోకి వస్తే.. బిగ్ బాస్ రీసెంట్ ఎపిసోడ్ లో లోకనాయకుడి కూతురు కూడా శ్రుతిహాసన్ హసన్ కూడా మెరిసింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన విశ్వరూపం 2 సినిమా యొక్క పాటలను షోలో రిలీజ్ చేసి మంచి హైప్ క్రియేట్ చేశారు. అంతే కాకుండా కమల్ శృతిహాసన్ తో కలిసి నానగియా అనే పాటను పాడారు. వారితో పాటు ఆడియెన్స్ కంటెస్టెంట్స్ విజిల్స్  అండ్ క్లాప్స్ తో షోకి ఉపునుతెచ్చారు. పాటల గురించి వివరించిన అనంతరం శ్రుతిహాసన్ తండ్రి గురించి మాట్లాడారు.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...