అవును.. అయితే తప్పేంటీ? | Yes .. but wrong?

అవును.. అయితే తప్పేంటీ? | Yes .. but wrong?

Akshara-hassan-Selfies-Andhra-Talkies
అవును.. అయితే తప్పేంటీ? | Yes .. but wrong?
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూతుర్లు ఇద్దరు కూడా చాలా స్వాతంత్య్రంగా తండ్రి హెల్ప్ లేకుండా సినిమా ఇండ్రస్టీలో ఎంట్రీ ఇచ్చారు. శృతిహాసన్ ఇప్పటికే హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. చిన్నమ్మాయి అక్షర హాసన్ దర్శకత్వ శాఖలో చేస్తూ హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అక్షర హాసన్ కు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫొటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేశాయి. లో దస్తుల్లో ఆమె తీసుకున్న సెల్ఫీ లు వివాదాస్పదం అయ్యాయి. ఆ ఫొటోలు ఎలా లీక్ అయ్యాయి ఫొటోలపై అక్షర రియాక్షన్ ఏంటా అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకున్నారు.

తాజాగా అక్షర హాసన్ ఆ విషయమై స్పందించింది. ఆ ఫొటోలు లీక్ అవ్వడం నాకు ఆశ్చర్యంను కలిగించింది. నేను చేయాల్సిన ఒక సినిమా కోసం తీసుకున్న స్టిల్స్ అవి. వాటిని నేను ప్రొఫెషనల్ గానే తీశాను తప్ప మరే ఉద్దేశ్యం లేదు. లీక్ అయిన ఫొటోల గురించి మరీ ఇంతగా ఎందుకు చర్చ జరుపుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ ఫొటోల్లో ఉన్న తప్పేంటీ అంటూ అక్షర ప్రశ్నించింది. మళ్లీ అవసరమైతే అలాంటి ఫొటోలు నేను తీసుకుంటాను అందుకు నేను ఏమాత్రం వెనుకాడను అంది.

పిల్లల ఫిలిం డెబ్యూ పై ఓపెన్ అయిన అమీర్ | Amir, who is open on a children's film debut

పిల్లల ఫిలిం డెబ్యూ పై ఓపెన్ అయిన అమీర్ | Amir, who is open on a children's film debut

Aamir-Khan-Son-and-Daughter-Debut-Andhra-Talkies
అమీర్ ఖాన్ కు బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పేరు. సినిమాల విషయంలో అమీర్ పడే తపన సంగతి అందరికీ తెలిసిందే. కానీ తన కుటుంబసభ్యుల గురించి చాలా అరుదుగా మాత్రమే మాట్లాడతాడు. రీసెంట్ గా అమీర్ ఖాన్ కాఫీ విత్ కరణ్ చాట్ షో లో పాల్గొన్నాడు.  తన పిల్లల సినిమా ఎంట్రీ గురించి ఓపెన్ అయ్యాడు.

కొడుకు జునైద్..కూతురు ఐరా కు సినిమాల్లోకి రావాలనే ఉందని వెల్లడించాడు. జునైద్ కి యాక్టర్ కావాలని.. డైరెక్షన్ కూడా చేయాలని ఉందని చెప్పుకొచ్చాడు. కానీ తను ఎంచుకున్న మార్గం పూలబాట ఏమీ కాదని ఒక క్లిష్టమైన దారి అని ముందే హెచ్చరించాడట. అమీర్ ఖాన్ కొడుగ్గా తనకు పోలికలు ఎదురవుతాయని వాటన్నిటికి సిద్దంగా ఉండాల్సిందే అని చెప్పేశాడట.   కుమారుడికి తనవైపు నుండి ఎటువంటి సపోర్ట్ ఇవ్వనని తేల్చేశాడు. కూతురి విషయంలో కూడా తన వైఖరి ఏమీ మారదని అన్నాడు.  వాళ్ళే కష్టపడి తమకు కావాల్సింది సాధించుకోవాలని.. నేను వారికి సపోర్ట్ ఇవ్వడం సినిమాకు.. ప్రేక్షకులకు అన్యాయం చేయడమే అన్నాడు.

తన కూతురు సినిమాలో ఏ డిపార్ట్మెంట్ అంటే ఇష్టపడుతుందో తనకు ఇంకా తెలియదని అన్నాడు. ఇక వాళ్ళిద్దరికీ ఫీడ్ బ్యాక్ ఇచ్చే విషయంలో కూడా నిక్కచ్చిగా ఉంటానని చెప్పాడు. తన కొడుక్కి అర్హత లేదు అంటే ఆ విషయంలో తను సపోర్ట్ ఇవ్వడం జరగదని అన్నాడు.  చూస్తుంటే.. మరీ కఠినాత్ముడైన తండ్రిలా ఉన్నాడే..!
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...