సందీప్ కిషన్ ఈసారి కొత్త ప్రయత్నం

Hero-Sundeep-Kishan-With-Hansika-Andhra-Talkies
Hero Sundeep Kishan With Heroin Hansika-Andhra-Talkies
సందీప్ హీరోగా కెరీర్ ఆరంభించి చాలా కాలం అయ్యింది. కాని ఇప్పటి వరకు అట్టట్ట మాత్రమే ఆకట్టుకుంటూ వస్తున్నాడు. బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ లు ఈయనకు పడటం లేదు. అప్పుడెప్పుడో పడ్డ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం తర్వాత మళ్లీ సందీప్ కిషన్ కు ఏ సినిమా కూడా సక్సెస్ ను తెచ్చి పెట్టలేక పోతున్నాయి. అయినా కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు కోహ్లీ దర్శకత్వంలో ‘నెక్ట్స్ ఏంటీ’ అనే చిత్రాన్ని చేశాడు. అడల్ట్ కంటెంట్ తో ఈ తరం యువకులను టార్గెట్ చేసి తెరకెక్కించిన ఈ చిత్రంపై సందీప్ కిషన్ చాలా నమ్మకంతో ఉన్నాడు. తమన్నా హీరోయిన్ గా నెక్ట్స్ ఏంటీ చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే. తాజాగా సందీప్ కిషన్ మరో సినిమా ప్రకటన వచ్చింది.

కామెడీ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న దర్శకుడు నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ ఒక చిత్రం తెరకెక్కబోతుంది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని టైటిల్ చూస్తుంటేనే అర్థం అవుతుంది. తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ అనే టైటిల్ తో మూవీ తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా హన్సికను ఎంపిక చేసినట్లుగా కూడా తెలుస్తోంది. తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న హన్సికను మళ్లీ ఈ చిత్రంతో సందీప్ కిషన్ తీసుకు వస్తున్నాడు.

స్టార్ హీరో కూతురి నైనా నాకు అవి తప్పలేదు : వరలక్ష్మి

Heroin-Varalakshmi-About-Bad-Incidents-Andhra-Talkies
Heroin Varalakshmi About Bad Incidents-Andhra Talkies
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లైంగిక వేదింపులు అనేవి స్వరసాదారణమైన విషయం. మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పు మాదిరిగా ఉన్న ఈ వ్యవహారం తాజాగా మీటూ ఉద్యమం నేపథ్యంలో ఒక్కసారిగా భగ్గుమంది. ఇన్నాళ్లు మౌనంగా ఉంటూ వచ్చిన వారు ఎందరో మీటూ అంటూ తమపై జరిగి జరుగుతున్న లైంగిక దాడి గురించి బయటకు చెబుతున్నారు. అయితే ఎంతో మంది లైంగిక వేదింపుల ఆరోపణలు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్నా కూడా వారసులు మాత్రం అందుకు మినహాయింపు అనుకున్నారు. వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ కు కాస్టింగ్ కౌచ్ బాధ లేదు లైంగిక వేదింపులు అసలే ఉండవని అనుకుంటాం. కాని స్టార్ హీరో శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మి శరత్ కుమార్ కు కూడా లైంగిక వేదింపులు తప్పలేదట.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వరలక్ష్మి తనకు ఎదురైన లైంగిక వేదింపులను చెప్పుకొచ్చింది. చిన్నతనంలో తాను కొన్ని సార్లు లైంగిక వేదింపులకు పాల్పడ్డట్లుగా పేర్కొంది. చిన్నప్పటి విషయాన్ని పక్కకు పెడితే హీరోయిన్ అయిన తర్వాత ఒక టీవీ ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత యాంకర్ మిగతా విషయాలు బయట మాట్లాడుకుందామా అంటూ ప్రశ్నించాడు. మిగిలిన విషయాలు అంటే ఏంటో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు బయట మాట్లాడుకుందా అన్నాడంటే అతడి ఉద్దశ్యం ఏంటో చెప్పనక్కర్లేదు. ఆ వ్యక్తి నాతో మాట్లాడిన ఆ మాటకు తీవ్ర ఆగ్రహం కలిగింది. కాని తాను ఆ సమయంకు కాస్త సంయమనం పాటించి అక్కడ నుండి వచ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది.

రాజమౌళికి బై.. బై చెప్పేసిన చరణ్!!

Ram-Charan-for--RRR-Movie-Andhra-Talkies
Charan told BYE to Rajamouli !!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. గత నెలలో హైదరాబాద్ శివారులోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో ప్రారంభం అయిన ఈ మల్టీస్టారర్ మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ మరియు చరణ్ లు ఇద్దరు కూడా పాల్గొన్న విషయం తెల్సిందే. షూటింగ్ ప్రారంభం రోజే జక్కన్న ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు చరణ్ దర్శకుడు రాజమౌళికి షార్ట్ బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకుని ఉన్న విషయం తెల్సిందే. దీక్ష ముగింపుకు చరణ్ ఈనెల 7న శబరిమల వెళ్లనున్నాడు. అక్కడ నుండి 9వ తారీకు వరకు వచ్చేయనున్నాడు. 10వ తారీకు నుండి వెంటనే ‘వినయ విధేయ రామ’ చిత్రంలో బ్యాలన్స్ ఉన్న ఆ చివరి పాటను చేయబోతున్నాడు. ఆ పాట చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో పాల్గొనబోతున్నాడు. ఆ లోపు సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తుంది. దాంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాడు.

మరో 'గీత గోవిందం' కు ఛాన్స్ ఉందా? | Is there another chance for 'Geeta Govindam'?

Rashmika-Mandanna-on-About-Dear-Camrade-Movie-Andhra-Talkies
 Is there another chance for 'Geeta Govindam'?
సూపర్ హిట్ మూవీస్ సీక్వెల్స్ రావడం అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితని చెప్పనక్కర్లేదు. అదే దారిలో ‘గీత గోవిందం’ చిత్రం సీక్వెల్ కూడా వస్తుందంటూ సోషల్ మీడియాలో ఈమద్య తెగ ప్రచారం జరుగుతుంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఆ చిత్రంతో విజయ్ దేవరకొండ - రష్మికలు ఓవర్ నైట్ లో స్టార్స్ అయ్యారు. ఇలాంటి సూపర్ హిట్ మూవీకి సీక్వెల్స్ కావాలని ప్రేక్షకులు ఆశించడం చాలా కామన్. సక్సెస్ అయినంత మాత్రాన సీక్వెల్ కావాలంటే కుదరదు. సీక్వెల్ కు స్కోప్ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం.

‘గీత గోవిదం’ చిత్రం కథ ఆరంభం అంతం కూడా సాఫీగా సాగిపోయింది. గీత గోవిందంలు పెళ్లి చేసుకోవడంతో సినిమా పూర్తి అయ్యింది. ఇంకా సీక్వెల్ కు కథ ఎక్కడ మిగిలి ఉంది. ఏదో క్రియేట్ చేసి సీక్వెల్ చేద్దామని ప్రయత్నిస్తే మొత్తం కంపు అయ్యే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ అలాంటి ప్రయత్నాలకు అస్సలు సపోర్ట్ చేయడని కొందరు అభిప్రాయం. అంటే ‘గీత గోవిందం’ చిత్రానికి సీక్వెల్ వచ్చే ఛాన్సే లేదు.

కొత్త జంట సరస సల్లాపం

Sexy-Heroin-Priyanka-Chopra-and-Nick-Jonas-Sizzles-on-Vogue-Magazine-Coverpage-Andhra-Talkies
Priyanka-Chopra-and-Nick-Jonas-Sizzles-on-Vogue-Magazine-Coverpage
ఏడాది కాలంగా పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా ప్రేమాయణం కల్లోలం రేపిన సంగతి తెలిసిందే. బ్రిటీష్ మహారాణి ఎలిజబెత్ టేలర్ కి రానంత ప్రచారం.. ఏంజెలినా విడాకుల వ్యవహారానికి సైతం రానంత పాపులారిటీ వచ్చింది ఈ వ్యవహారంతో. విదేశీ గాయకుడు - నటుడు నిక్ జోనాస్ ని ప్రేమించిన ఈ భామకు యూట్యూబ్ - సామాజిక మాధ్యమాల్లో అసాధారణ ప్రచారం దక్కింది. నిన్న గాక మొన్ననే ప్రియుడు నిక్ జోనాస్ ని పీసీ మనువాడింది.

పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత అని విభజిస్తే .. ఈ జంట లైఫ్ లో ప్రతి మూవ్ మెంట్ లో రొమాన్స్ ని పీక్స్ లో ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ కి ఇచ్చిన కవర్ ఫోటోషూట్ లో కొత్త జంట విన్యాసాలు ప్రస్తుతం యువతరాన్ని మైమరిపిస్తున్నాయి. నిక్ జోనాస్ తో పీసీ హాట్ ఫోటోషూట్ ప్రస్తుతం వేడెక్కిస్తోంది.

టాలెంటుకు తగ్గ హిట్ కొడతాడా?

Bluff-Master-Movie-in-Telugu-Film-Industry-Andhra-Talkies
Bluff-Master-Movie-in-Telugu-Film-Industry-Andhra-Talkies
ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో సత్యదేవ్ ఒకడు. ‘జ్యోతిలక్ష్మీ’ సినిమాలో ఛార్మికి జంటగా నటించిన అతను తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ‘క్షణం’.. ‘ఘాజీ’ లాంటి సినిమాలతో సత్తా చాటాడు. లుక్స్ పరంగానే కాక యాక్టింగ్ లోనూ ఆకట్టుకున్న సత్యదేవ్ కు మంచి సినిమా పడితే అతడి కెరీరే మారిపోతుందన్న అంచనాలున్నాయి. ‘బ్లఫ్ మాస్టర్’ అలాంటి సినిమానే అవుతుందేమో అనిపించింది దీని టీజర్ చూస్తే. తమిళ సూపర్ హిట్ ‘శతురంగ వేట్టై’కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం టీజర్ తో బాగానే ఆకట్టుకుంది.

అందులో సత్యదేవ్ స్క్రీన్ ప్రెజెన్స్ - యాక్టింగ్ - డైలాగ్ డెలివరీ.. అన్నీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబరు 28న ‘బ్లఫ్ మాస్టర్’ రిలీజవుతున్నట్లు ప్రకటించారు. అదే రోజు నిఖిల్ మూవీ ‘ముద్ర’ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో ఏది పైచేయి సాధిస్తుందో.. సత్యదేవ్ తన టాలెంటుకు తగ్గ హిట్ కొడతాడేమో చూడాలి. ఇంతకుముందు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ తో ‘రోమియో’ అనే సినిమా తీసిన గోపీ గణేష్ ‘బ్లఫ్ మాస్టర్’కు దర్శకత్వం వహించాయి. శ్రీదేవి మూవీస్ - అభిషేక్ పిక్చర్స్ బేనర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందిత శ్వేత సత్యదేవ్ కు జోడీగా నటించిందీ చిత్రంలో. రకరకాల ఆర్థిక మోసాలు చేసే బతికే మాయల మరాఠీ పాత్రలో సత్యదేవ్ నటించాడిందులో. తమిళంలో ‘ఖాకి’ దర్శకుడు వినోద్ వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. అతడికదే తొలి సినిమా.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...