గారాల చెల్లిని ఫిలిం స్కూల్ కి పంపిన అక్క జాన్వీ కపూర్

Sridevi-Janhvi-Kapoor-sets-sibling-goals-with-an-endearing-goodbye-post-for-Khushi-Kapoor-Andhra-Talkies.jpg
అక్క చెల్లెళ్ల అనుబంధం గురించి చెప్పాలంటే.. బాలీవుడ్ లో జాన్వీ - ఖుషీ కపూర్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళుతుంటారు. ఫ్యామిలీ ఫంక్షన్లకే కాదు.. డిన్నర్ పార్టీలు.. నైట్ పార్టీలకు కలిసి వెళ్లడం అలవాటు. చాలాసార్లు నగరంలో కలిసి షికార్లు చేస్తూ కెమెరాల కంటికి చిక్కారు. అలాగే ఇన్ స్టాగ్రమ్ లోనూ రెగ్యులర్ గా తమ బాండింగ్ కి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేస్తూ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తుంటారు.

అయితే ఆ సిస్టర్స్ మధ్య ఊహించని ఎడబాటు తప్పడం లేదు. ఇన్నాళ్లు జాన్వీ కపూర్ కెరీర్ గురించే ముచ్చటించుకున్న అభిమానులు ఇకపై ఖుషీ కపూర్ సినీ ఎంట్రీ గురించి ముచ్చటించుకునే టైమ్ వచ్చేసింది. అందుకే ఖుషీ నట శిక్షణ కోసం న్యూయార్క్ బయల్దేరింది. అయితే తనకు గుడ్ బాయ్ చెప్పడానికి జాన్వీ విమానాశ్రయానికి వెళ్లలేకపోయింది. అందువల్ల గారాల చెల్లి ఖుషీతో తాను కలిసి ఉన్నప్పటి ఓ ఫోటోని షేర్ చేసిన స్వీట్ మెసేజ్ ని పెట్టింది. ఆ ఫోటోలో అక్క చెల్లెళ్ల మధ్య  లవ్ లీ బాండింగ్ ఆకట్టుకుంటోంది. జాన్వీ తన చిట్టి చెల్లెలు నుదిటిపై ముద్దాడుతోంది. ఆ ఫోటోకి క్యాప్షన్ అదిరిపోయింది.

300 కోట్ల సాహో సినిమాలో ఇలాంటి పాటలా?

No-Buzz-To-Prabhas-Movie-Saaho-Songs-Andhra-Talkies
సాహో మొత్తానికి స్క్రీన్ పైకి వచ్చేసింది. డివైడ్ టాక్ ఖంగారు పెడుతున్నా మూడు రోజులకు అడ్వాన్స్ బుకింగ్ దాదాపుగా పూర్తయ్యింది కాబట్టి సోమవారం నుంచి ఎలాంటి రన్ ఉంటుందనే దాన్ని బట్టి ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంది. ఇలాంటి రిపోర్ట్ రావడానికి సాహోలో ప్రతికూలాంశాలు చాలా ఉన్నాయి కానీ ముఖ్యంగా సంగీతం గురించిన నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. 300 కోట్ల బడ్జెట్ సినిమాకు సరైన రీతిలో సంగీత దర్శకులను సెట్ చేసుకోకపోవడం ఎంత ఖరీదైన తప్పో ఇవాళ అర్థమవుతోంది.

ఉన్న నాలుగు పాటలూ ఎవరికీ కనెక్ట్ కాలేక కేవలం విజువల్స్ కారణంగా మాత్రమే చూడబుద్ది అవుతున్నాయంటే మ్యూజిక్ విషయంలో సాహో చేసిన బ్లండర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో ట్యూన్ ఒక్కో సంగీత దర్శకుడు కంపోజ్ చేయడం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం పక్కరాష్ట్రం నుంచి జిబ్రాన్ ను ప్రత్యేకంగా తీసుకోవడం ఇవేవి అంతగా ప్లస్ కాలేకపోయాయి. ఏ ట్యూనూ పది కాలాల పాటు గుర్తుపెట్టుకునేలా లేకపోవడం సాహో మ్యూజిక్ లోని అతి పెద్ద ట్రాజెడీ.

ప్రభాస్ కు మళ్లీ జక్కన్న సెంటిమెంట్ దెబ్బ పడింది

Saho-hero-Prabhas-Continuous-Rajamouli-Sentiment-Andhra-Talkies
ప్రభాస్ 'సాహో' చిత్రం భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన విషయం తెల్సిందే. విడుదలైన ప్రతి చోట కూడా నెగటివ్ టాక్ నే మూట కట్టుకుంది. 350 కోట్ల బడ్జెట్ అంటూ భారీగా ప్రచారం చేయడంతో సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. మరో బాహుబలి ఖాయమని అంతా భావించారు. కాని టాక్ బ్యాడ్ గా వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఏ హీరో అయినా కెరీర్ బిగ్గెస్ట్ సక్సెస్ దక్కించుకోవడం ఆ తర్వాత అట్టర్ ఫ్లాప్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.

ఎన్టీఆర్.. నితిన్.. రవితేజ.. ప్రభాస్.. రామ్ చరణ్... సునీల్ ఇలా ప్రతి ఒక్కరు కూడా రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ లు చవిచూసిన వారే. ప్రభాస్ కు ఛత్రపతి చిత్రం తర్వాత చాలా కాలం వరకు సరైన సక్సెస్ రాలేదు. మళ్లీ ఇప్పుడు 'బాహుబలి' రెండు పార్ట్ లు చేసిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన 'సాహో' చిత్రం కూడా నిరాశ పర్చింది. రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలనుకున్న ప్రభాస్ కు సాధ్య పడలేదు.

యంగ్ టైగర్ జోడి దొరికిందా

Is-She-NTR-Love-Interest-In-RRR-Andhra-Talkies
టాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలై ఆరు నెలలు దాటినా ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ కి జోడి  సెట్ కాకపోవడం అభిమానులను టెన్షన్ లో పెడుతూ వచ్చింది.ప్రకటించినప్పుడు ఉన్న డైసీ ఎడ్గార్ జోన్స్ తర్వాత హ్యాండ్ ఇవ్వడంతో కథ మళ్ళి మొదటికి వచ్చింది. కథ ప్రకారం జూనియర్ పోషిస్తున్న పాత్ర బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించేలా ఉండటంతో దాన్ని మార్చే అవకాశం లేక తగిన బ్యూటీ కోసం రాజమౌళి వేట సాగిస్తూ వచ్చాడు.

ఫైనల్ గా హాలీవుడ్ నటి ఏమ్మా రాబర్ట్స్ దగ్గర బాల్ ఆగిందని కొద్దిరోజుల క్రితమే లీక్స్ వచ్చాయి. కాని అధికారిక ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. కాని అంతర్గత సమాచారం మేరకు పైకి ఇంకా చెప్పకపోయినా ఏమ్మా రాబర్ట్స్ ఫిక్స్ అయినట్టు తెలిసింది. త్వరలోనే సెట్ లో జాయిన్ అవుతుందని ఆలోగా చిన్న ప్రెస్ మీట్ లాంటిది పెట్టి కొన్ని అప్ డేట్స్ తో పాటు ఏమ్మా రాబర్ట్స్ కు సంబంధించిన ప్రకటన ఇవ్వొచ్చని తెలిసింది.

ఫోటో స్టొరీ: సెగలు రేపుతున్న శ్రీలంక బ్యూటీ

Hitest-Heroin-Jacqueline-Fernandez-Glamorous-Still-Andhra-Talkies
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు తెలియని హిందీ సినిమా ప్రియులు దాదాపుగా ఉండరు. ఇక హిందీ సినిమాలే చూడని తెలుగు ప్రేక్షకులకు జాక్వెలిన్ పేరు త్వరలోనే  తెలిసిపోతుంది. ఎందుకంటే సాహో లో 'బ్యాడ్ బాయ్' పాటకు ప్రభాస్ తో కలిసి స్టెప్పులు వేసింది.  బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాల్లో నటించిన ఈ భామ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్. ఇన్స్టా గ్రామ్ లో జాక్వెలిన్ కు 31.4  మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. హాట్ ఫోటోలతో వారిని రెగ్యులర్ గా థ్రిల్ చేయడం జాక్వెలిన్ హాబీ.

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ హాటు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటుంది.  తాజాగా జాక్వెలిన్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ స్టిల్ 'సాహో' బ్యాడ్ బాయ్ పాట లోనిదని వెల్లడించింది.  ఈ ఫోటోకు "ప్రభాస్ తో నా మొదటి తెలుగు పాట #బ్యాడ్ బాయ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ పాట చిత్రీకరణ జరిపిన ప్రదేశం అద్భుతంగా ఉంది. ఆ లొకేషన్ కు మించి అన్నట్టుగా జాక్వెలిన్ తన మోడరన్ డ్రెస్ తో చూపరుల మతి పోగొడుతోంది.  వైట్ టాప్.. పైన జిగేల్ మనే సిల్వర్ కాయిన్స్ డిజైన్.. నానో మీటర్ సైజ్ లో ఉండే డెనిమ్ షార్ట్ తో ఒక సెక్సీ పోజులో అలా పడుకుంది.  ఇయర్ రింగ్స్.. కాళ్ళకు కడియాలు.. చేతికి వాచ్.. ఇలా అన్ని యాక్సెసరీస్ జాక్వెలిన్ డ్రెస్ కు పర్ఫెక్ట్ గా సూటయ్యాయి. ఫ్లాట్ యాబ్స్.. కాళ్ళ అందాలు చూస్తే.. లోకల్ బ్యూటీలకు ఇంటర్నేషనల్ బ్యూటీలకు ఉండే తేడా ఇదే కదా అనిపిస్తుంది.

రాములమ్మ రెమ్యునరేషన్ ఎంత ?

Popular-Heroin-Vijayashanthi-Remuneration-For-Sarileru-Neekevvaru-Movie-Andhra-Talkies
హీరోయిన్ గా సెలవు తీసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించాక 13 ఏళ్ళు గ్యాప్ తీసుకున్న విజయశాంతి నిన్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో అడుగు పెట్టి మళ్ళీ తన అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. కనిపించీ కనిపించకుండా దర్శకుడు అనిల్ రావిపూడి తన లుక్ ని షేర్ చేయడం ఇప్పటికే వైరల్ అయ్యింది. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా ఇంకా చెప్పాలంటే ఒకరిద్దరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుని రికార్డు సృష్టించిన విజయశాంతి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుకు ఎంత తీసుకుంటున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

సినిమా సర్కిల్స్ లో పిఆర్ ఓ గ్రూప్స్ మధ్య జరుగుతున్న చర్చల ప్రకారం ఇందులో పాత్రకు విజయశాంతి సుమారుగా రెండు నుంచి నాలుగు కోట్ల రూపాయలు మధ్య తీసుకుంటున్నారట. ఇది షాకింగ్ ఫిగరే. మాంచి డిమాండ్ ఉన్న గ్లామర్ హీరోయిన్లకె మహా అయితే రెండు లేదా రెండున్నర ముట్టజెబుతున్న తరుణంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఇంత ఆఫర్ చేయడం షాకే  కాని ఇవన్ని గాసిప్స్ రూపంలో చక్కర్లు కొడుతున్నవే.

జాతీయ అవార్డ్ వెనక అంత లాబీయింగ్ ఉందా?

Big-Gambling-Behind-National-Awards-Andhra-Talkies
66వ జాతీయ అవార్డులు ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే. ఈ పురస్కారాల్లో `రంగస్థలం` చిత్రానికి అన్యాయం జరిగిందని.. ముఖ్యంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉత్తమ నటుడు అవార్డు రావాల్సింది కాస్తా లాబీయింగ్ వల్ల బాలీవుడ్ హీరోలకు ఆ ఛాయిస్ వెళ్లిపోయిందని ప్రచారమవుతోంది. అయితే అంతగా లాబీయింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అంటే బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ ఇదంతా చేశారని తెలుగు సినీమీడియాలో చర్చ సాగుతోంది.

చిట్టిబాబు పాత్రలో చెవిటి కుర్రాడిగా రఫ్ అండ్ రగ్గ్ డ్ లుక్ తో రామ్ చరణ్ గొప్పగా నటించారు. గోదారి యాస కట్టుబాట్లు ఉన్న కుర్రాడిగా అద్భుతంగా నటించి మెప్పించాడు. దాంతో పోలిస్తే బాలీవుడ్ స్టార్లు అంత గొప్పగా ఏం నటించారు.. అంటూ మెగాభిమానుల్లోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే రామ్ చరణ్ ఎంత చేసినా సీనియర్ నటుడు పరేష్ రావల్ అవార్డు రాకుండా అడ్డుకున్నాడట..!

కింగ్ ఖాన్ డాటర్ టైమొచ్చినట్టేనా?

Suhana-Khan-all-set-to-make-her-acting-debut-Andhra-Talkies
బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ వెల్లువపై నిరంతరం వాడి వేడిగా చర్చ సాగుతోంది. 2019లో ఇప్పటికే ఓ అరడజను స్టార్ కిడ్స్ తెరకు పరిచయం అయ్యారు. మరో నలుగురైదుగురు రెడీ అవుతున్నారన్న సమాచారం ఉంది. ఇందులో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ వారసులు ఇద్దరూ జాబితాలో ఉన్నారు.  సుహానాఖాన్- ఆర్యన్ ఖాన్ వెండితెరకు పరిచయం అయ్యే సమయం ఆసన్నమైందన్న ప్రచారం సాగుతోంది.

ముందుగా సుహానా ఖాన్ ఎంట్రీ ఉంటుంది. ఇప్పటికే సుహానా లండన్ లోని ఆర్డింగ్లి కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసింది. అక్కడే సోదరుడు ఆర్యన్ తో కలిసి నటనలో సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసిందని తెలుస్తోంది. ఇక ఎలానూ చదువు పూర్తయింది కాబట్టి ఇక బరిలో దిగడమే ఆలస్యం. కథానాయికగా ఆరంగేట్రానికి డాడ్ షారూక్ నుంచి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మామ్ గౌరీ ఖాన్ ఎంతో ఎగ్జయిటింగ్ గా ఆ క్షణం కోసం వేచి చూస్తోంది. ఇలాంటి వేళ ముందుగా ప్రీప్రాక్టికల్స్ లో భాగంగా సుహానా ఏం చేసిందో తెలుసా?

బ్యూటీలంతా బెల్లీ డ్యాన్స్ మీద పడ్డారే!

Heroines-Crazy-About-Belly-Dance-Andhra-Talkies
ప్రెజెంట్ జెనరేషన్ లో గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న భామలందరూ ఫిట్ నెస్ పై ఫోకస్ చేస్తున్నారు.  ఈ విషయం అందరికీ తెలిసిందే. తిండైనా మానుకుంటారు.. మేకప్పైనా వేసుకోకుండా కనిపిస్తారు కానీ కసరత్తులు చేయకపోతే రోజు గడవదు అన్నట్టుగా ఉంది పరిస్థితి.  యోగానో.. వెయిట్ ట్రైనింగో.. ఏరోబిక్సో.. జుంబా డ్యాన్సో.. ఏదో ఒకటి తప్పకుండా చేయడం భామలకు అలవాటుగా మారింది.  అయితే ఈమధ్య మరో ట్రెండ్ కూడా మొదలైంది. అదే బెల్లీ డ్యాన్స్.. అదేదో సినిమాలో 'నాకు బెల్లం అంటే ఇష్టం' అన్నట్టుగా ఈ పాపలందరూ 'నాకు బెల్లీ డ్యాన్స్ అంటే ఇష్టం అంటున్నారు.

ఇప్పటికే ఈ బెల్లీ డ్యాన్స్ నేర్చుకుంటున్న భామల లిస్టు చాలా పెద్దది.  శ్రీదేవి డాటర్ జాహ్నవి కపూర్.. అనన్య పాండే.. షారూఖ్ డాటర్ సుహానా లాంటివారు బెల్లీ డ్యాన్స్ లో మెళకువలు నేర్చుకోవడంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు.  ఈ లిస్టు చెప్పుకుంటూ పోతే చేంతాడంత అవుతుంది.  ఈ లిస్టులో తాజాగా బ్యూటిఫుల్ రకుల్ కూడా జాయిన్ అయింది.  రకుల్ ప్రస్తుతం హిందీ లో 'మర్జావా' అనే చిత్రంలో నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా.. రితేష్ దేశ్ ముఖ్ ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్.  ఈ సినిమాలో ఒక పాట కోసం బెల్లీ డ్యాన్సింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టిందట.  అంతే కాదు తను రెగ్యులర్ గా చేసే ఎక్సర్ సైజులకు లిస్టులో ఇది మరో ఎక్సర్ సైజ్ అని చెప్పుకొచ్చింది.  ఫ్లాట్ యాబ్స్.. బెటర్ డ్యాన్సింగ్ స్కిల్స్  కోసం ఈ బెల్లీ డ్యాన్స్ ను ఇకపై కంటిన్యూ చేస్తానని చెప్తోంది.

నటుడిని అయితే నేను నాలా ఉండకూడదా? - విజయ్ దేవరకొండ

Arjunreddy-Hero-Vijay-Devarakonda-About-His-Personal-Behavior-Andhra-Talkies
విజయ్ దేవరకొండ తన నటనతో పాటు యాటిటూడ్ తో కూడా యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అందరు హీరోల మాదిరిగా కాకుండా విజయ్ దేవరకొండ విభిన్నంగా ఆలోచిస్తాడని.. విభిన్నంగా ఉంటాడని ఆయన అభిమానులు అనుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి అందరు హీరోలకు తాను డిఫరెంట్ అంటూ చెప్పకనే చెప్పాడు. నేడు 'డియర్ కామ్రేడ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత ప్రవర్తన గురించి స్పందించాడు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ నేను హీరో అయిన తర్వాత నన్ను కొందరు ఇలా చేయవద్దు.. అలా ప్రవర్తించవద్దు.. ఇలా మాట్లాడాలి అంటూ నాకు కొన్ని బౌండరీస్ పెట్టే ప్రయత్నం చేశారు. కాని నేను వాటిని పట్టించుకోదల్చుకోలేదు. నటుడిని అయినంత మాత్రాన నేను నాలా ఉండకుండా ఎలా ఉంటాను. ఎప్పుడైనా నేను నాలాగే ఉండాలనుకుంటాను. ఇతరుల మాదిరిగా ఎందుకు ఉండాలి. అందరు కూడా ఎవరికి వారు యునిక్ గా ఉంటారు. కాని చిన్నప్పటి నుండి కూడా ఒకే తరహా యూనిఫామ్.. ఒకే తరహా సమాధానాలు అంటూ అందరిని ఒకేటే మాదిరిగా చేస్తున్నారు.

జయలలితగా క్వీన్ కంగన రంగ ప్రవేశం

Bollywood-hot-heroin-Kangana-Ranaut-to-prep-for-Jayalalithaa-biopic-in-Manali-Andhra-Talkies
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలితపై వరుసగా బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. అయితే వీటిలో క్వీన్ కంగన నటించనున్న బయోపిక్ సెప్టెంబర్ లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఏ.ఎల్.విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగు.. తమిళ భాషల్లో తలైవి పేరుతో హిందీలో జయ పేరుతో త్రిభాషా చిత్రంగా రూపొందనుంది. `జడ్జిమెంటల్ హై క్యా` నిర్మాత ఆర్.శైలేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్- రజత్ అరోరా సంయుక్తంగా స్క్రిప్టు పనులు చేస్తున్నారు.

సెప్టెంబర్ లో సినిమా ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్న ఈ టీమ్ ఇప్పటికే కంగనకు లుక్ టెస్టులు చేసేందుకు రెడీ అవుతోంది. అందుకోసం కంగన స్వస్థలం మనాలి వెళ్లనున్నారు. అక్కడ లుక్ టెస్టులతో పాటు పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్ క్లాసులు ఉంటాయట. అలాగే కంగన ఇప్పటికే తమిళ భాషను నేర్చుకుంది. ఈ బయోపిక్ లో కంగన విభిన్నమైన గెటప్పుల్లో కనిపించాల్సి ఉంటుంది. జయలలిత యుక్తవయసులో ఉన్నప్పుడు.. కథానాయిక అయ్యాక.. నాయకురాలు అయ్యాక ఇలా రకరకాల లుక్ లలోకి మారాల్సి ఉంటుంది. అయితే అందుకోసం ప్రోస్థటిక్స్ మేకప్ ని ప్లాన్ చేశారు. హాలీవుడ్ మేకప్ స్పెషలిస్ట్ గ్యారీ ఓల్డ్ మన్ (డార్కెస్ట్ హవర్ 2017 మూవీ) ని ఈ సినిమా కోసం బరిలో దించుతారట. పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తారని తెలుస్తోంది.

కోడలిని తెగ ప్రమోట్ చేస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

RGV-Niece-Continuing-His-Legacy-Andhra-Talkies
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కుటుంబ బంధాలకు పెద్దగా విలువ ఇవ్వడని అంతా అనుకుంటూ ఉంటారు. ఎప్పుడో భార్య నుండి విడిపోయిన వర్మ తన కూతురుతో కూడా చాలా లైట్ గానే ఉంటాడని అంతా అనుకుంటూ ఉంటారు. అయితే తాజాగా వర్మ తన మేనకోడలు అయిన శ్రావ్య వర్మను సినిమాల్లో తెగ ప్రమోట్ చేస్తున్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ను ప్రారంభించిన శ్రావ్య వర్మ తాజాగా నిర్మాతగా కూడా మారింది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని శ్రావ్య వర్మ మరో నిర్మాతతో కలిసి నిర్మించింది. నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. తమ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నట్లుగా శ్రావ్య వర్మ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్బంగా ఆమె చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను అంటూ పేర్కొంది. దిల్ రాజు ఈ సినిమా నచ్చి సమర్పించేందుకు ముందుకు రావడంతో శ్రావ్య సంతోషాన్ని వ్యక్తం చేసింది.

నోరు పారేసుకుని అడ్డంగా బుక్కయిన కంగన!

Press-Club-of-India-Supports-Boycott-of-Heroin-Kangana-Ranaut-Andhra-Talkies
అయినదానికి కాని దానికి నోరు పారేసుకుంటే ఆ పరిణామం ఎలా ఉంటుందో ఇన్నాళ్టికి తెలిసొచ్చింది కంగనకు. తొందరపాటుతో నోరు జారింది. అది కూడా తనకు ప్రచారం చేసి ఇంతటి దానిని చేసిన మీడియానే తూలనాడింది. ఎదురు కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడింది. జర్నలిస్టులు ద్రోహులు.. సంఘంలో చెదలు.. సూడో సెక్యులరిస్టులు.. అంటూ ఒంటి కాలిపై చిందులేసింది. జర్నలిస్టుల్ని నేరస్తులు అని ప్రచారం చేస్తూ.. నేర పూరిత ప్రవర్తనతో బెదిరింపులకు పాల్పడ్డారంటూ కోర్టుల పరిధిలో పోరాటానికి సిద్ధమైంది. తనని బహిష్కరించడం నేరపూరితమైన చర్య.. అందుకు జర్నలిస్టులు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సవాల్ విసిరింది.

ఈ అడ్డగోలు వ్యవహారంతో కంగన ఎరక్కపోయి ఇరుక్కుపోయింది. ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్ - ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా కంగనను బహిష్కరించడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో కంగన అడ్డంగా బుక్కయ్యింది. ఇక కంగనకు.. ఆమె సోదరి రంగోలికి ఇలా అసభ్యంగా అనాగరికంగా మాట్లాడే అలవాటు ఉందని జర్నలిస్టులంతా ఏకమై ఎటాక్ చేయడంతో సీన్ మొత్తం రివర్సులో ఉందిప్పుడు. ఈ నేపథ్యంలో  కంగన నటించిన `జడ్జిమెంటల్ హై క్యా` రిలీజ్ పరిస్థితి ఏంటి?  కంగన వ్యవహారంతో జర్నలిస్టులు ఇప్పుడు ఈ సినిమాపైనా ప్రతీకారం తీర్చుకుంటారా? అన్న కొత్త సందేహాలకు తావిచ్చినట్టయ్యింది.

మరో మగాడిని పెళ్లి చేసుకునేందుకు అమెరికా వెళ్ళిన వైభవ్!

indian-gay-couple-marries-in-greece-andhra-talkies
పెళ్లికి అర్థం - పరమార్థం రెండూ మారిపోతున్నాయి. ఆడామగను సంసార బంధంతో ముడివేసి మానవజాతి మనుగడ కొనసాగేలా చేసేదే పెళ్లి. కానీ.. మారిన కాలంలో మానవజాతి మనుగడకు పెళ్లి అవసరమూ లేదు.. అసలు పెళ్లికి ఆడామగా కూడా అవసరం లేదనేలా ప్రపంచవ్యాప్తంగా విపరీతాలు చోటుచేసుకుంటున్నాయి. ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం.. ఇద్దరు పెళ్లి చేసుకోవడం వంటివి అనేక దేశాల్లో చూస్తున్నాం. అయితే.. ఇదంతా అలాంటి ఆలోచనలున్న మనుషుల మధ్యనో... లేదంటే అందుకు అనుమతించే దేశాల్లో అధికారుల ముందో జరుగుతున్నాయి. కానీ.. అమెరికాలో ఇద్దరు ప్రవాస భారతీయ పురుషులు మాత్రం రెండు కుటుంబాల అంగీకారంతో - బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకున్నారు.

టెక్సాస్ లో ఉంటున్న ఈ ఎన్నారైలు జైన సంప్రదాయంలో చాలా గ్రాండ్ గా తమ వివాహాన్ని జరుపుకున్నారు. ఈ జంటలో వైభవ్ అనే వ్యక్తి గే వివాహం కోసమే అమెరికాకు వెళ్లగా.. మరో భాగస్వామి పరాగ్ మెహతా అమెరికాలోనే పుట్టి పెరిగిన వ్యక్తి. వైభవ్ ఇండియా నుంచి 2011లో అమెరికా వెళ్లాడు. అక్కడి అమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ రీసర్చ్ లో రీసర్చ్ అసోసియేట్ గా పనిచేస్తున్నాడు.

ఏడు గెటప్పులతో సర్ ప్రైజ్ చేయనున్ననాగశౌర్య!

Tollywood-Hero-Naga-Shourya-on-About-His-Role-in-Ashwardhama-Movie-Andhra-Talkies
సినిమా ఒకటే .. కానీ అందులో ఏకంగా ఏడు గెటప్పుల్లో నటించి సర్ ప్రైజ్ చేస్తాడట నాగశౌర్య. ఇటీవలే `ఓ బేబి`లో కామియోలో కనిపించినా చక్కని నటనతో ఆకట్టుకున్న శౌర్య ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఓ బేబి సక్సెస్ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్ లో తాను చేస్తున్న ప్రాజెక్టుల గురించి ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేశారు శౌర్య.

సొంత బ్యానర్ లో `అశ్వర్ధామా` చేస్తున్నా. అలాగే `ఊహలు గుసగుసలాడే` కాంబినేషన్ రిపీటవుతోంది.  అవసరాల దర్శకత్వంలో `ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి`  చిత్రంలో నటిస్తున్నా. ఇందులో  ఏడు గెటప్పుల్లో కనిపిస్తాను. ఒకే పాత్రలో ఏడు షేడ్స్ ని చూపించే ఛాన్స్ దక్కింది.  వీటితో పాటు `పార్థు` అనే వేరొక చిత్రంలోనూ నటిస్తున్నా.. అని సినిమాల క్యూ గురించి చెప్పారు శౌర్య. అలాగే అశ్వత్థామ చిత్రానికి కథ అందించాను. రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. దీనికి నా పేరు టైటిల్స్ లో వేసుకుంటున్నా.. ఇంతకుముందు ఛలో చిత్రానికి కథ అందించినా నా పేరు వేసుకోలేదు.. అని తెలిపారు.

నెట్ ఫ్లిక్స్ కు ఓ బేబీ.. అమెజాన్ నో బేబీ!

Oh-Baby-Becomes-Costly-On-Digital-Space-Andhra-talkies
నందిని రెడ్డి దర్శకత్వంలో సమంతా లీడ్ రోల్ లో నటించిన 'ఓ బేబీ' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ఇప్పటికే హిట్ టాక్ వచ్చింది. అయితే ఎంత పెద్ద హిట్  సినిమా అయినా కొద్ది రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లోకి రావాల్సిందే. 'ఓ బేబీ' కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఈమధ్య మరీ సినిమా రిలీజ్ అయిన ముప్పై రోజులకే స్ట్రీమింగ్ చేయకుండా.. 50 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు ఒక రూల్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  దీంతో ఇంట్లో సినిమా చూడాలనుకునే వారు 50 రోజులు వేచి చూడాల్సిందే.

ఫిలిం మేకర్స్ ఎన్ని ఎత్తులు వేసినా.. ఎన్ని రకాల ప్రమోషన్స్ చేసినా కొందరు కఠిన హృదయులైన ప్రేక్షకులు మాత్రం థియేటర్ కు పోకుండా ఇంట్లోనే చూడాలని మంకుపట్టుతో ఉంటారు. ఇక కొందరేమో తమ అభిమాన నటీనటుల సినిమాలను అమెజాన్ కే ఎక్కువమంది వినియోగదారులు ఉన్నారు. మాటిమాటికీ చూసి మళ్ళీ మళ్ళీ ఆ సినిమాను ఎంజాయ్ చేయ్యాలనుకుంటారు. వారందరూ అమెజాన్ ప్రైమ్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు.  'ఓ బేబీ' విషయంలో కూడా ఇప్పుడు అలాంటి ప్రేక్షకులు కొందరు ఉంటారు కదా. వారికి ఈసారి నిరాశ తప్పదు.

దెయ్యానికి దొరసానికి మధ్యలో బైకు

This-Friday-Movies-At-Tollywood-Box-Office-Andhra-Talkies
ప్రతి శుక్రవారం ఖచ్చితంగా రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ చేయాలని టాలీవుడ్ నిర్మాతలు కంకణం కట్టుకున్నట్టు ఉన్నారు. గత నెల రోజుల నుంచి ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అందులో ఒకటి మాత్రమే పాస్ అవుతూ మిగిలిన వాటి వసూళ్ల మీద ప్రభావం చూపుతుండగా పోటీ విషయంలో నిర్మాతలు మాత్రం వెనక్కు తగ్గుమంటున్నారు. వచ్చే శుక్రవారం జులై 12న ఇదే పరిస్థితి మరోసారి రిపీట్ అయ్యేలా ఉంది.

ఎన్ని వస్తున్నాయనేది పక్కన పెడితే ప్రధానమైన పోటీ మాత్రం మూడింటి మధ్య ఉంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు రాజశేఖర్ రెండో అమ్మాయి శివాత్మికలను జంటగా పరిచయం చేస్తూ రూపొందిన దొరసాని కులాల అంతరాల మధ్య బ్యాక్ డ్రాప్ తో ప్రమోషన్ మొదలైనప్పటి నుంచి బాగానే ఆసక్తి రేపుతోంది

వర్మ నుండి మళ్లీ అలాంటి సినిమాలు చూడలేమా?

Cene-Critics-on-About-Ram-Gopal-Varma-Andhra-Talkies
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసి ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈయన కెరీర్ ఆరంభంలో తీసిన సినిమాలు ఒకొక్కటి అద్బుతాలు.. ఆణిముత్యాలు అని చెప్పుకోవచ్చు. తెలుగులో శివ సినిమా ఒక ట్రెండ్ ను సెట్ చేస్తే హిందీలో 'సత్య' చిత్రం బాలీవుడ్ స్థితినే మార్చేసింది. షోలే స్థాయి సక్సెస్ అంటూ బాలీవుడ్ ప్రముఖులు కూడా సత్యను పొగడ్తలతో ముంచెత్తారు. అంతటి గొప్ప సినిమాలను అందించిన వర్మ ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో చెప్పనక్కర్లేదు.

చెత్త సినిమాలు.. ప్రయోగాత్మక సినిమాలు అంటూ ఏకంగా పోర్న్ సినిమాలను కూడా వర్మ తీస్తున్నాడు. తాజాగా వర్మ తీసిన 'సత్య' సినిమా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆ చిత్ర మధుర గుర్తులను నెమరవేసుకున్నారు. సత్య సినిమా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు కూడా ఇన్సిపిరేషన్ గా నిలిచింది. అలాంటి సినిమాలు తీసిన వర్మ కాస్త శ్రద్ద పెడితే మంచి సినిమాలు తీయగలడు. కాని వర్మ ఎందుకు ఆఫీసర్.. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వంటి చెత్త సినిమాలు తీస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినీ ఛాన్సులు పేరుతో దారుణ మోసం

upcoming-Actress-Trying-For-Movie-Chances-Andhra-Talkies
సినీ ఛాన్సులు .. ఆడిషన్స్ అంటూ హడావుడి చేస్తూ దొరికినంతా దోచేస్తున్నారు కొందరు మోసగాళ్లు. అమాయక యువతీ యువకుల జేబులు ఖాళీ చేస్తున్న దర్జా దొంగలు పోలీసులకు చిక్కుతున్న ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. రీసెంట్ గానే సీరియల్స్ లో ఛాన్సులిప్పిస్తానంటూ తుమ్మల శ్రీదేవి అనే యువతి మోసం బట్టబయలైన సంగతిని మరువక ముందే మరో మోసం వెలుగులోకి వచ్చింది.

సినిమాల్లో  ఛాన్స్ పేరుతో ఓ వ్యక్తి వరుస మోసాలకు పాల్పడి లక్షల్లో సొమ్ములు వసూలు చేస్తున్నాడు. ఇప్పటికే పలువురిని మోసం చేసిన సదరు వ్యక్తిపై తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సదుం మండలం బయారెడ్డిపల్లెకు చెందిన చిట్టి పవన్ కల్యాణ్ డిగ్రీ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని వాట్సాప్ నంబరు ద్వారా హైదరాబాద్ కు చెందిన నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఛైర్మన్ ను అంటూ ఎస్.వి.ఎన్.రావ్ పరిచయం చేసుకున్నాడు. ఆ ఇద్దరూ కలిసి ఓ తెలివైన గేమ్ ప్లాన్ చేశారు.

ఆ హీరోయిన్ భర్త అరెస్ట్!

Prema-Pavuralu-Heroine-s-Husband-Arrested-Andhra-Talkies
ఒక్క సినిమాతో  భారీ పాపులార్టీని సొంతం చేసుకోవటం మామూలు విషయం కాదు. యావత్ దేశం మొత్తం ఆమెకు ఫిదా అయిపోయినప్పటికీ.. భారీ ఆఫర్లు వరుస పెట్టినప్పటికీ చలించకుండా ఒక్క సినిమాతో దూరమైన ఇమేజ్ ప్రేమపావురాలు ఫేం భాగ్యశ్రీ సొంతం.

అయితే.. తర్వాతి కాలంలో భర్తను హీరోగా పెట్టి సినిమాలు తీస్తానని చెప్పినా.. అదేమీ వర్క్ వుట్ కాలేదు. కాకుంటే మొదట్నించి ఇప్పటివరకూ ఒకటే రూల్ మీద ఉన్న నటిగా ఆమెను చెప్పాలి.ఇదిలా ఉంటే తాజాగా ఆమె భర్త హిమాలయ దాసానీని పోలీసులు అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది.

గ్లాంబ్లింగ్ రాకెట్ కు సంబంధించిన ఆరోపణలతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ మీద విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకురావాల్సి ఉంది. తొలి చిత్రంతోనే టాప్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆమె తన తొలి సినిమాకే ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు.

నాని పేరు చెప్పిన దొరసాని!

Shivatmika-Likes-Nani-andhra-talkies
సాధారణ ప్రేక్షకులైనా స్టార్ కిడ్స్ అయినా ఏదో ఒక హీరోనో హీరోయిన్ నో అభిమానించడం కామన్. ఒక్కోసారి  కొంతమంది సెలబ్రిటీలతో ప్రేమలో కూడా పడిపోతుంటాం.  మరీ ప్రేమ అనే పదం వాడితే పెద్దదైపోతుందేమో కానీ దాన్ని క్రష్ అనుకోవచ్చు.  రీసెంట్ గా తమ క్రష్ గురించి కొత్త హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్ జోడీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

త్వరలో రిలీజ్ కానున్న 'దొరసాని' చిత్రంతో ఆనంద్ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారనే సంగతి తెలిసిందే.  దీంతో ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.  రీసెంట్ గా అలాంటి ఒక ఇంటర్వ్యూలో ఆనంద్ దేవరకొండ ను తన క్రష్ గురించి చెప్పమంటే తడుముకోకుండా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే పేరు చెప్పాడు.  శివాత్మిక మాట్లాడుతూ కనీసం ఒక అరడజను పేర్లు చెప్పింది.  రణబీర్ కపూర్.. విక్కీ కౌశల్.. రణవీర్ సింగ్.. ఆదిత్య కపూర్ అంటే ఇష్టమని చెప్పింది.  టాలీవుడ్ లో దాదాపు అందరూ సెలబ్రిటీలు తనకు పరిచయం ఉండడంతో క్రష్ లేదని తెలిపింది.

సక్సెస్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న బ్యూటీ!

Shalini-Pandey-Not-Responds-on-Kabir-Singh-Movie-Andhra-Talkies
ఈ జెనరేషన్ లో హీరోలకైనా.. హీరోయిన్లకైనా అత్యంత అవసరమైనది పీఆర్.  అది సరిగ్గా ఉంటే కెరీర్ కు ఎంతో హెల్ప్ అవుతుంది.  పీఆర్ సరిగ్గా లేకపోయినా కెరీర్ ఏమీ క్లోజ్ అవ్వదు కానీ కొంత నష్టం అయితే తప్పనిసరిగా జరుగుతుంది.  ప్రస్తుతం హీరోయిన్ షాలిని పాండే అలానే జరుగుతోందనే టాక్ ఉంది.

ఎందుకంటే 'అర్జున్ రెడ్డి' లాంటి సెన్సేషనల్ హిట్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే.  అదేంటో కానీ విజయ్ దేవరకొండ కు మేజర్ క్రెడిట్.. మిగతా క్రెడిట్ సందీప్ వంగాకు పోయింది కానీ షాలిని పాండేకు పెద్దగా క్రెడిట్ రాలేదు. అయినా షాలిని నటన సూపర్ అనే మాట నిజం.  విజయ్ దేవరకొండ కు పోటీగా నటించి అందరినీ మెప్పించింది.  అయినా పెద్దగా క్రెడిట్ దక్కకపోవడం ఆశ్చర్యమే.  ఆ సినిమాతో కొన్ని ఆఫర్లు వచ్చాయి కానీ అవన్నీ క్రేజీ అఫార్లయితే కాదు. ఇదిలా ఉంటే 'అర్జున్ రెడ్డి' హిందీ వెర్షన్ 'కబీర్ సింగ్' ఇప్పుడు సూపర్ హిట్ అయింది. హిందీ వెర్షన్ చూసిన వాళ్ళు కూడా కొందరు ఇప్పటికీ  విజయ్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఒక్కరు కూడా షాలిని పేరెత్తడం  లేదు.

ఈ పరిస్థితుల్లో కృష్ణ గారు మహేష్ వద్ద ఉండటం ఉత్తమం!

Superstar-Krishna-after-Vijaya-Nirmala-Death-Andhra-Talkies
సూపర్ స్టార్ కృష్ణ గారు విజయ నిర్మల మరణంతో ఒంటరి వారు అయ్యారని.. శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా వారిద్దరు ఇన్నాళ్లు బతికారంటూ ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు అన్నారు. కృష్ణ మరియు విజయ నిర్మలను దగ్గర నుండి చూసిన ఇమంది రామారావు తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. బతికినంతకాలం ఇద్దరు కూడా ఒక్కటిగా బతికారు. అందుకే ఆమె మరణంను కృష్ణ జీర్ణించుకోలేక పోతున్నారు.

ఆమె మరణంతో ఖచ్చితంగా కృష్ణ చాలా కోల్పోయారు. ప్రస్తుతం కృష్ణగారి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఆయన టైంకు విశ్రాంతి తీసుకోవాలి.. మందులు వేసుకోవాలి... ఆహారం తీసుకోవాలి. లేదంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం. ఆ విషయం తెలిసి కూడా ఆయన విజయ నిర్మల మరణంతో క్రుంగి పోయి తన రోజు వారి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తన ఆరోగ్యంను కూడా లెక్క చేయకుండా బాధ పడుతున్నారు. ఆయన పరిస్థితి చూస్తుంటే ప్రాణాలపై ఆశను వదిలేసినట్లుగానే అనిపిస్తుంది. ప్రస్తుతం ఆయనకు మంచి తోడు కావాలి. ఆయన్ను కంటికి రెప్పలా చూసుకునే కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆయనకు అవసరం.

సాహో: ఐటెమ్ భామ ఈ ఇద్దరిలో ఒకరేనా?

Star-Heroine-in-Prabhas-Saaho-Movie-Item-Song-Andhra-Talkies
డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా 'సాహో' ఆగష్టు 15 రిలీజ్ కానుంది.  దీంతో ఇప్పటికే కౌంట్ డౌన్ బిగిన్ కూడా అయింది.  ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించుకోనవసరమే లేదు కానీ 'సాహో' లో ఐటెం సాంగ్ గురించి గత కొద్ది రోజులుగా చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.. వాటి గురించి మనం మాట్లాడుకోవల్సిందే.

ఈ సినిమాలో హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులు.. రియలిస్టిక్ ఫీల్ తో ఉండే చేజింగ్ ఎపిసోడ్స్ మాత్రమే కాదు ఒక సిజ్లింగ్ ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారట.  అయితే ఈ ప్రత్యేక గీతానికి నర్తించే భామ ఎవరనేదానిపై జోరుగా కథనాలు వస్తున్నాయి. మొదట ఈ ఐటెం సాంగ్ కు స్టెప్పులు వేసే భామ ఎవరో కాదు.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అన్నారు. కానీ తర్వాత బాలీవుడ్ హాటీ కత్రీనా కైఫ్ పేరు కూడా వినిపించింది.  ఈ లిస్టు ఇంతటితో ఆగలేదు.. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు ఎవరివో తెలుసా? గీత మేడమ్.. లస్టు భామ.  అర్థం కాలేదా.. రష్మిక మందన్న.. కియారా అద్వాని.  వీరిద్దరిని ఈ స్పెషల్ సాంగ్ కోసం 'సాహో' మేకర్స్ సంప్రదించడం జరిగిందని.. కియారా నుంచి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు.

డైరెక్టర్ పనిలో హీరో వైఫ్ ఫింగరింగ్

Star-Hero-Wife-Involvment-in-Direction-Department-Andhra-Talkies
సినిమా 24 శాఖల్లో దర్శకత్వం ఎంతో కీలకమైన శాఖ. క్రియేటివ్ పార్ట్ ని హ్యాండిల్ చేసే డైరెక్టర్ కి కెప్టెన్ హోదానిచ్చి గౌరవిస్తారు. దర్శకుడితో సమానంగా ఇన్వాల్వ్ అయ్యేది కేవలం రచయిత- నిర్మాత- హీరో. కథ దగ్గర నుంచి సన్నివేశాలు సహా కథాగమనం ఎలా ఉంటుంది? అన్నది దర్శకుడు ముందే నిర్మాత- హీరోలకు చెప్పి కన్విన్స్ చేసుకుంటాడు. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయ్యి సెట్స్ కెళ్లాక అన్ని బాధ్యతలు దర్శకుడివే. అయితే సెట్స్ కెళ్లాక కూడా దర్శకుడి పనిలో వేలు పెడితే దానిని ఫింగరింగ్ అంటారు. ప్రీప్రొడక్షన్ వరకూ ఇతరుల సలహాల్ని సూచనల్ని దర్శకుడు తీసుకోవడం కామన్. కానీ సెట్స్ కెళ్లాక కూడా సజెషన్స్ ఇస్తే అది టూమచ్ కిందే లెక్క.

అయితే ఇండస్ట్రీలో సెట్స్ కెళ్లాక కూడా వేలు పెట్టే తత్వం ఉన్న హీరోలున్నారని ఇదివరకూ పలు వివాదాలు తేల్చి చెప్పాయి. తాజాగా ఓ హీరో గారి భార్యామణి కూడా ఓ యంగ్ డైరెక్టర్ పనిలో ఇన్వాల్వ్ అవ్వడం గురించి ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. సినిమా అంటే తనకు ఎంతో ఫ్యాషన్. అందువల్ల ఉత్సాహంలో సదరు హీరో గారి వైఫ్ సీన్స్ విషయంలోనూ ఇన్వాల్వ్ అయ్యారట. అయితే అది ఇన్వాల్వ్ మెంట్ అనాలో లేక ఫింగరింగ్ అనాలో తెలీని కన్ఫ్యూజన్ సదరు యంగ్ డైరెక్టర్ కి తప్పలేదని తెలుస్తోంది. `వీళ్లను ఏడాది భరించగలను` అనుకున్నాకే బరిలో దిగాడట సదరు యంగ్ డైరెక్టర్.

మరో నటి మిస్సింగ్ కలకలం

Actress-missing--plaint-lodged-by-SR-Nagar-police-Andhra-Talkies
అనంతపురం జిల్లా ధర్మవరం యువతి.. టీవీ నటి లలిత అదృశ్యం వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను తీసుకెళ్లారని అమీర్ పేట హాస్టల్ యాజమాన్యం చెప్పడంతో లలిత తల్లి దండ్రులు తమ కూతురు మిస్సయ్యిందని కేసు నమోదు చేయడంతో ఆ వార్త దావానలంలా వ్యాపించింది. ప్రస్తుతం ఈ కేసుపై ఎస్.ఆర్.నగర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే అమీర్ పేట- ఎస్.ఆర్.నగర్ హాస్టల్స్ లో ఇలాంటి మిస్సింగ్ కేసులు మరిన్ని ఉన్నాయని తాజా ఉదంతం చెబుతోంది.

తాజాగా మరో మిస్సింగ్ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో.. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా ప్రచారం సాగుతోంది. సినిమా ఛాన్స్ వచ్చిందని ఇంట్లో నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఖ్యాతి సుమ అనే యువతి మిస్సయ్యిందంటూ నేడు ఓ టీవీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వాట్సాప్ లో సాగిన ప్రచారం కలకలం రేపింది. సుమ వయసు 22. ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్ కి నటిగా అవకాశాలు వెతుక్కుంటూ విచ్చేసింది. ఆమె ఫోన్.నం.9121922374 కూడా వాట్సాప్ గ్రూపుల్లో దర్శనమిస్తోంది. ఈ కేసు కూడా ధర్మవరం లలిత తరహాలోనే సస్పెన్స్ లో ఉందని అర్థమవుతోంది. ప్రస్తుతం ఆ నోటా ఈనోటా సుమ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించిన వార్త వినిపిస్తుండడం కలకలం రేపుతోంది. సుమ ప్రస్తుతం ఏఏ సినిమాలు.. సీరియల్స్ చేస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఇక వాట్సాప్ లో ఇచ్చిన నంబర్ కి కాల్ చేస్తుంటే రింగ్ అవుతున్నా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మెగా మేనేజర్ పై ఉయ్యాలవాడ ఫ్యామిలీ ఆరోపణ

Uyyalavada-Narasimha-Reddy-Family-Protest-Andhra-Talkies
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా `సైరా- నరసింహారెడ్డి` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టాకీ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. అయితే ఈలోగానే ఉయ్యాలవాడ వంశానికి చెందిన పలువురు ఫ్యామిలీ మెంబర్స్ మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ఆందోళనకు దిగడం చర్చకొచ్చింది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో `సైరా` సినిమా ప్రారంభానికి ముందు రామ్ చరణ్ సహా యూనిట్ సభ్యులు మా ఇంటికి వచ్చారు. ఈ కథను వేరొకరు తీయకుండా మాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ సమయంలో రామ్ చరణ్ సొంత బిడ్డలా మాట్లాడారు. నాతో గంటసేపు మాట్లాడారు. మా కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు. అంతేకాదు షూటింగ్ కోసం మా ఇంటిని ప్రాపర్టీలను వాడుకున్నారు. కానీ నిన్న చరణ్ మేనేజర్ ఫోన్ చేసి మమ్మల్ని కలవాల్సిన అవసరం లేదని బెదిరించారు! అంటూ ఓ మహిళ మెగాస్టార్ ఇంటిముందు గొడవకు దిగడం కలకలం రేపింది.

టాలీవుడ్ రిలీజ్ లపై వరల్డ్ కప్ ఎఫెక్ట్ పడుతుందా?

World-Cup-Effect-On-Tollywood-Release-Movies-Andhra-Talkies
14 -07-2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే తేదీ ఇది. ఇంగ్లండ్ లో జరుగుతున్న టోర్న మెంట్ లో టీమిండియా దూకుడు చూస్తుంటే ఈసారి ఫైనల్ మ్యాచ్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. లీగ్ దశలో టీమిండియా అజేయంగా దూసుకెళుతోంది. ఇప్పటికే ఐదు మ్యాచుల్లో ఒకటి క్యాన్సిల్ కాగా ఆడిన నాలుగు మ్యాచ్ లలో గెలిచింది. దక్షిణాఫ్రికా- పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్- వెస్టిండీస్ లపై నెగ్గింది. న్యూజిల్యాండ్ తో మ్యాచ్ రద్దయి ఒక పాయింట్ గెలుచుకుంది. అపజయం లేకుండా వెళితే టీమిండియా జూలై 14న ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. సరిగ్గా ఆ మ్యాచ్ కి అటూ ఇటూ రెండు శుక్రవారాలు నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి.

వరల్డ్ కప్ మ్యాచ్ ల జోరు మీదున్నప్పుడు పలు తెలుగు సినిమాలు రిలీజవుతున్నాయి. జూలై 12న దొరసాని .. నిను వీడని నీడను నేను చిత్రాలు రిలీజవుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ కి రెండ్రోజుల తర్వాత జూలై 18న రాక్షసుడు.. ఐస్మార్ట్ శంకర్ చిత్రాలు రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. అయితే వీటిలో వరల్డ్ కప్ సెగ ఏ సినిమాలకు ఉంటుంది? అంటే అది ఇండియా అజేయమైన విక్టరీపై ఆధారపడి ఉంటుంది. టీమిండియా లీగ్ దశ నుంచి సెమీస్ కి చేరుకుని.. సెమీ ఫైనల్స్ లోనూ నెగ్గి ఫైనల్ మ్యాచ్ ఆడితే  ఆ మ్యాచ్ లన్నిటినీ జనాలు టీవీలకు కళ్లప్పగించి చూస్తారు. ఆ మేరకు ఆ మ్యాచ్ లు జరిగేప్పుడు థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపరు. అంటే ఆ మేరకు రిలీజవుతున్న సినిమాల వసూళ్ల పై ప్రభావం పడుతున్నట్టే. ఓవరాల్ గా వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై అంతో ఇంతో ఉంటుందన్నది ఊహించేదే.

నటన విరమించాక ఫుల్ టైమ్ డాక్టర్!-సాయిపల్లవి

Tollywood-Heroin-Sai-Pallavi-wanted-To-be-Doctor-Andhra-Talkies
నటన విరమించాక ఫుల్ టైమ్ డాక్టర్!-సాయిపల్లవి
గతం.. వర్తమానం.. భవిష్యత్ ఈ మూడింటిపై పూర్తి క్లారిటీతో ఉంది ఫిద్యా బ్యూటీ సాయిపల్లవి. చేసే ప్రతి పనిపై పూర్తి క్లారిటీ తో వ్యవహరిస్తోంది ఈ రౌడీ పిల్ల. చిన్న తనం నుంచి డాక్టర్ కావాలని కలలు కంది. పేరెంట్ కోరిక కూడా అదే. అందుకు తగ్గట్టే అకడమిక్ స్టడీస్ లో ఎక్కడా ర్యాంకుల్లో తగ్గలేదు. అయితే అనూహ్యంగా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యింది కాబట్టి చేసే వృత్తికి అంకితమై పని చేస్తోందట.

హీరోయిన్ అయ్యి ఓ వెలుగు వెలిగింది కాబట్టి ఇక నటనలోనే కొనసాగాలని పూర్తిగా నిర్ణయించుకుందట. ఆసక్తి రేకెత్తించే పాత్రలు ఏవి వచ్చినా నటించేస్తాను. ఎంత కాలం ఉండాలనిపిస్తే అంత కాలం ఇదే వృత్తిలో కొనసాగుతాను. నటనలో ఉన్నంత మాత్రాన వైద్య వృత్తిని వదిలిపెట్టను. అలాగని నటిస్తూ వైద్యం చేయను. నటన నుంచి పూర్తిగా విరమించుకున్న తర్వాత మాత్రం పూర్తి స్థాయి డాక్టర్ గా మారి ప్రజలకు వైద్యం అందిస్తాను. మన దేహాన్ని మనం గౌరవించాలి. ఆరోగ్యం విషయంలో ఎవరికి వారు పూర్తి బాధ్యత తీసుకుని  కాపాడుకోవాలి!! అన్న ధ్యాసను ప్రజల్లో పెంపొందిస్తుందట. భవిష్యత్ లో గుండె వైద్య నిపుణురాలు కావాలని భావిస్తున్నానని తెలిపింది.

ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నా తప్పని తిప్పలు!

These-Actress-Are-Not-Gets-More-Offers-After-Getting-Success-Andhra-Talkies
ఇండస్ట్రీలో ఛాన్స్ రావడమే కష్టం.. ఒకవేళ వచ్చినా సక్సెస్ సాధించడం ఇంకా కష్టం. అదృష్టం కలిసొచ్చి అది కూడా జరిగినా ఆ తర్వాత ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడం చాలా కష్టం.  ఈమధ్య ఇద్దరు ముగ్గురు హీరోయిన్లకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ లిస్టులో ప్రియాంక జవాల్కర్.. రుహాని శర్మ.. పాయల్ రాజ్ పుత్ లాంటి హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

విజయ్ దేవరకొండ లాస్ట్ సినిమా 'టాక్సీవాలా' సూపర్ హిట్ అయిందనే సంగతి తెలిసిందే. షూటింగ్ డిలే అయినా.. పైరసీ బారిన పడినా వాటితో సంబంధం లేదన్నట్టుగా నిర్మాతలకు.. డిస్ట్రిబ్యూటర్లకు 'టాక్సీవాలా' భారీ లాభాలు తీసుకొచ్చింది.  అయితే ఈ సినిమాలో నటించిన ప్రియాంకకు ఇప్పటివరకూ ఒక్క ఆఫర్ కూడా రాలేదు.  ఇక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా తెరకెక్కిన 'చిలసౌ' బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించలేదు కానీ మంచి పేరు తెచ్చుకుంది.  రాహుల్ రవీంద్రన్ కు 'మన్మథుడు 2'  ఛాన్స్ రావడానికి కారణం ఆ సినిమానే.  'చిలసౌ' లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రుహాని శర్మ.  మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్ర కావడంతో గ్లామర్ కు స్కోప్ లేదు కానీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క ఛాన్సు రాలేదు.

కబీర్ సింగ్ రివ్యూస్..టాలీవుడ్ హీరో కౌంటర్!

Tollywood-Hero-Sundeep-Kishan-Defends-Audiences-Tastes-On-Kabir-Singh-Movie-Andhra-Talkies
'అర్జున్ రెడ్డి' రెడ్డి హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' బాలీవుడ్ లో ఇప్పుడొక హాట్ టాపిక్.  ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ లో దుమ్ము దులిపింది కానీ క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూస్ లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా కొందరు క్రిటిక్స్ నెగెటివ్ రేటింగ్స్ ఇవ్వడమే కాకుండా ఈ సినిమాలో చాలా లోపాలు ఉన్నాయని హీరో క్యారెక్టర్ లో నెగెటివ్ షేడ్స్ సమాజంపై ప్రభావం చూపిస్తుందని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒక బాలీవుడ్ క్రిటిక్ సినిమాను తీవ్రంగా విమర్శించడమే కాకుండా అసలు 'అర్జున్ రెడ్డి'ని బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ఆడియన్స్ పై కూడా విరుచుకుపడింది.  దీంతో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కు చిర్రెత్తుకొచ్చి ట్విట్టర్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

"ఒక సినిమాను మీ వ్యక్తిగత అభిరుచిని బట్టి ఎలా ఉందో నిర్ణయించడం ఒక ఎత్తు.. కానీ ఆ సినిమాను ఇష్టపడిన ప్రేక్షకులను ఎలాంటివారో నిర్ణయించడం మాత్రం ఓ పైత్యం.  నాకు అర్జున్ రెడ్డి సినిమా చాలా నచ్చింది. ఇప్పటికీ నాది అదే అభిప్రాయం.  ఈ విషయంలో నేను ఒక్కడినే కాదు.. తెలుగు ఆడియన్స్ అందరూ ఒకటే" అంటూ ట్వీట్ చేశాడు.  దీంతో పాటు తెలుగు నుండి హిందీ కి రీమేక్ చేసి బ్లాక్ బస్టర్స్ అయిన చిత్రాల లిస్టును కూడా జత చేశాడు.

మన్మథుడు ముందుజాగ్రత్తలో ఉన్నాడు

Nagarjuna-Play-Safe-Game-About-Manmadhudu-2-Movie-Copyright-Issues-Andhra-Talkies
గత కొద్దిరోజులుగా మన్మథుడు 2 సినిమా అప్పుడెప్పుడో 13 ఏళ్ళ క్రితం వచ్చిన ఫ్రెంచ్ మూవీ ప్రెతె మోయితా మైను ఆధారంగా చేసుకున్నదంటూ వచ్చిన వార్తలు ఫ్యాన్స్ ని కొంత టెన్షన్ కు గురి చేశాయి. గత ఏడాది పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి టైంలో ఇలాంటి వివాదాల వల్లే త్రివిక్రమ్ అనవసరమైన అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి వచ్చింది. అది నిజమో కాదో తేలేలోపే చాలా డ్యామేజ్ జరిగిపోయింది.

ఇప్పుడు తమ హీరో సినిమాకూ అదే రిపీట్ అవుతుందా అని టెన్షన్ పడ్డారు అభిమానులు. అయితే దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నుంచి కానీ నాగ్ నుంచి కానీ ఎలాంటి ఖండన రాకపోవడం అనుమానాలు ఇంకా బలపరిచింది. ఒకేవేళ స్పందించినా ఒరిజినల్ మూవీకి అనవసర ప్రచారం కలిగించి దాన్ని జనం ఆన్ లైన్ చూసేందుకు ప్రేరేపించినట్టు అవుతుంది కాబట్టి సైలెంట్ గా ఉండటమే మంచిది

క్రేజీ టీజర్..నగ్నంగా నటించిన సౌత్ హీరోయిన్!

Aame-Teaser-Andhra-Talkies
సౌత్ లో ఉన్న హాట్ హీరోయిన్లలో అమలా పాల్ ఒకరు.  బోల్డ్ గా ఉండడం.. ఘాటుగా నటించడం.. వివాదాలలో చిక్కుకోవడం ఆమెకు కొత్త కాదు.  తాజాగా అమలా పాల్ తన కొత్త సినిమా 'ఆమె' టీజర్ తో మరోసారి సంచలనం సృష్టించింది.  ఈ సినిమా టీజర్ ను ఈరోజు సాయంత్రం బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ విడుదల చేశారు.

టీజర్ ఓపెన్ చెయ్యగానే ఒక  అమ్మతో పోలీస్ "ఇంకో రోజు వెతికి ఉండాల్సింది కదా?  మీ అమ్మాయి కనిపించడం లేదు.. నువ్వు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చేయడమేనా? ఆసలు అమ్మయికోసం వెతికారా?" అని అడుగుతాడు. దీనికి సమాధానంగా ఆవిడ "అమ్మాయితో నేను చివరిసారిగా ఫోన్ లో  మాట్లాడినపుడు అమ్మాయి మద్యం మత్తులో ఉంది" అని సమాధానం చెప్తుంది.  ఈ సీన్ తర్వాత సస్పెన్స్ పెంచుతూ స్లోగా..  ఖాళీగా ఉండే ఒక పెద్ద బిల్డింగ్ లో చూపిస్తారు.  అక్కడ ఒకరు రక్తపు మడుగులో పడి ఉంటారు.  నెక్స్ట్ సీన్ లో నగ్నంగా ఉన్న అమలా పాల్ ను చూపిస్తారు.

ఇండియా పాక్ మ్యాచ్ లో సెలబ్స్ రచ్చ

Celebs-at-Pakistan-And-India-Match-Andhra-Talkies
వరల్డ్ కప్ ఫీవర్ అంతకంతకు రాజుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ మాంచెస్టర్ లో నేడు ఇండియా - పాక్ మ్యాచ్ కి విపరీతమైన క్రేజు నెలకొంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు పలువురు బాలీవుడ్ స్టార్లు ఎటెండ్ అయ్యారు. మ్యాచ్ కోసం మాంచెస్టర్ లో అడుగుపెట్టిన వాళ్లలో అనుష్క శర్మ.. రణవీర్ సింగ్.. సైఫ్ అలీఖాన్ .. చేసిన సందడి అంతా ఇంతా కాదు.

ఈ మ్యాచ్ లో సునీల్ గవాస్కర్- జతిన్ సప్రు లాంటి దిగ్గజాలతో కలిసి రణవీర్ సింగ్ కామెంట్రీ చెప్పాడు. రణవీర్ కి ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి. మ్యాచ్ జరగడానికి ముందే రణవీర్ స్టేడియంలో చేసిన సందడికి సంబంధించిన ఫోటోల్ని వైరల్ భయానీ ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేశారు. సినిమాల ప్రమోషన్స్ లో ఏ రేంజులో ఎనర్జీ చూపిస్తాడో అంతకుమించి చెలరేగిపోయాడు. ఈ వేదిక వద్దకు రణవీర్ కాస్తంత వింతైన గెటప్ తోనే దిగడంతో జనాల దృష్టి అటువైపు మరలింది.

రేణు కడుపు మండింది..అమ్మ పేరు తెచ్చి మరీ తిట్టేశారు!

Pawan-ex-wife-Renu-Desai-on-about-her-Marriage-Andhra-Talkies
సీనియర్ నటి కమ్ తరచూ వార్తల్లో ఉండే వ్యక్తుల్లో ఒకరిగా రేణు దేశాయ్ సుపరిచితురాలు. తాజాగా ఆమెకు వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. ఎప్పుడూ లేనంతగా బరస్ట్ అయిన ఆమె సంచలన వ్యాఖ్య చేశారు. తన వ్యక్తిగత ఫోటోకు ఒక వెబ్ సైట్ పెట్టిన శీర్షికతో ఆమె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కదలించుకొని మరీ గుచ్చినట్లుగా ఉన్న సదరు శీర్షికపై ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇదే అంశాన్ని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. తరచూ తనకు నచ్చిన విషయాల్ని పంచుకుంటూ ఉంటారు. పిల్లలతో కలిసిన ఫోటోల్ని పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆమె కొడుకు అకీరా.. కుమార్తెతో కలిసి దిగిన ఒక ఫోటోను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.

సింగిల్ గా ఉన్నా.. హ్యాపీగా ఉన్నా: శృతి

Sexy-Heroin-Shruti-Haasan-on-about-Her-Break-Up-Andhra-Talkies
స్టార్ హీరోయిన్ గా శృతి హాసన్ ఎదగడం.. కెరీర్ చక్కగా సాగుతున్న దశలో లండన్ బేస్డ్ థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలేతో ప్రేమలో పడడం.. ఆ తర్వాత తన యాక్టింగ్ కెరీర్ పై ఫోకస్ తగ్గడం అందరికీ తెలిసిందే.   సినిమాలు తగ్గించుకొని ఇంటర్నేషనల్ సింగర్ కావాలనే ధ్యేయంతో లండన్ కు మకాం మార్చింది శృతి. అయితే కొద్ది రోజుల తర్వాత మైఖేల్ తో బ్రేకప్ అయింది.  సింగర్ గా కెరీర్ కూడా ఆశించినంత గొప్పగా సాగలేదు. దీంతో ఇండియాకు వెనక్కు వచ్చి సినిమాలలో నటించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా.. హిందీలో ఒక సినిమా చేస్తోంది.

ఇదిలా ఉంటే రీసెంట్ గా శృతి తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ పై స్పందించింది.  ఇద్దరూ కూర్చుని చర్చించుకున్న తర్వాతే విడిపోదామని నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. తను సంతోషంగా ఉండడమే తనకు ముఖ్యమని.. ప్రస్తుతం సింగిల్ గా హ్యాపీగా ఉన్నానని తెలిపింది. అయితే తన బ్రేకప్ గురించి తెలిసిన స్నేహితులు మాత్రం షాక్ అయ్యారని చెప్పింది. బ్రేకప్ గురించి వేదాంత ధోరణిలో స్పందిస్తూ అన్నీ మనం అనుకున్నట్టు జరగవని చెప్పింది.

ఫోకస్: అన్ లిమిటెడ్ బికినీ ట్రీట్

Bollywood-Actress-Bikini-Treat-Andhra-Talkies
ఇండస్ట్రీ బెస్ట్ బికినీ ఏది? బికినీల యందు బెస్ట్ బికినీ ట్రీట్ ఎక్కడ? అంటే ఇదిగో ఇక్కడ లలనల బికినీ సెలబ్రేషన్స్ పై ఓ లుక్కేసి తీరాల్సిందే. బెస్ట్ టోన్డ్ బాడీని ఎలివేట్ చేస్తూ బికినీలో యూత్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వడంలో రెగ్యులర్ గా పోటీ పడుతున్న భామలపై ఫోకస్ ఇది..

బికినీ అనగానే కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది దిశా పటానీ. సీకే (కెల్విన్ క్లెయిన్) బ్రాండ్ ప్రమోటర్ గా దిశా పటానీ బికినీ వయ్యారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఈ అమ్మడు సీకే బ్రాండ్ కోసమే పుట్టిందా.. అన్నంతగా ఒదిగిపోయి యూత్ కి అన్ లిమిటెడ్ గా స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా దిశా టోన్డ్ బాడీ.. బికినీ ఫోటోలు జోరుగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. శృంగార తార సన్నీలియోన్ సోషల్ మీడియా ప్రెజెంటేషన్ గురించి చెప్పాల్సిన పనేలేదు. సన్నీ ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఎలివేట్ చేసుకునేందుకు బికినీలో దర్శనమిస్తూనే ఉంటుంది. ఇటీవల భర్త డేనియల్ తో కలిసి స్టార్ స్టక్ సౌందర్య ఉత్పత్తుల వ్యాపారంలోకి దిగిన సన్నీ పూర్తిగా కార్పొరెట్ అవతార్ లో కనిపిస్తోంది. సన్నీ ట్రీట్ బోయ్స్ కి ఇప్పుడే కొత్తేమీ కాదు.

Alpha Telugu Dubbed Movie ఫ్రీగా Download చేసుకోండి.

ఆ ముగ్గురు స్టార్ల వల్ల కానిది ప్రభాస్ చేస్తాడా?

Bahubali-Hero-Prabhas-Lends-Own-Voice-in-Saaho-Teaser-For-Hindi-Version-Andhra-Talkies
ఇవాళ విడుదలైన సాహో టీజర్ మీద అటు బాలీవుడ్ లోనూ ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ అంటూ నార్త్ ప్రేక్షకులు సైతం ముక్తకంఠంతో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హిందీ వెర్షన్ టీజర్ లో ప్రభాస్ స్వయంగా డబ్బింగ్ చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. కేవలం ఇది టీజర్ కే పరిమితమా లేక సినిమా మొత్తం స్వంతంగా గొంతు అరువిస్తాడా అనేది ఇప్పుడు చర్చకు వస్తోంది.

హింది స్ట్రెయిట్ మూవీస్ మన స్టార్లు చేయడం కొత్తేమి కాదు. చిరంజీవి 3 వెంకటేష్ 2 నాగార్జున 6 చొప్పున నటించారు. కాని ఈ ముగ్గురు ఏనాడూ స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోలేదు. వేరే వాళ్ళు గాత్రం ఇచ్చారు. రామ్ చరణ్ జంజీర్ లో కూడా ఇదే రిపీట్ అయ్యింది. నేటివిటీ కారణంగా హింది పదాలు పలికేటప్పుడు స్లాంగ్ లో వచ్చే తప్పులు ఇబ్బంది పెడతాయనే ఉద్దేశంతో డబ్బింగ్ చెప్పే సాహసం చేయలేదు

గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా దుస్తులకేమైంది?

ప్రియాంక చోప్రాకు గ్లోబల్ సుందరి అని పేరు.  తన గ్లోబల్ ట్యాగ్ కు తగ్గట్టే ఎంతో ఫ్యాషనబుల్ దుస్తులు ధరిస్తుంది.  అన్నీ డిజైనర్ దుస్తులే. ఫ్యాషన్ రంగ నేపథ్యం నుంచి వచ్చిన భామ కావడంతో స్టైల్ పీక్స్ లో ఉంటుంది. కానీ ఎందుకో ఈమధ్య ప్రియాంక ఫ్యాషన్ అప్పుడప్పుడూ వికటిస్తోంది.  పెద్ద చదువులు చదివితే ఉన్న తెలివి కాస్తా పోయిందని అప్పుడప్పుడూ పాత కాలం వాళ్ళు నెక్స్ట్ జెన్ కిడ్స్ పై సెటైర్ వేస్తుంటారు. అలానే ఫ్యాషన్ ఎక్కువై ప్రియాంకకు డ్రెస్ సెన్స్ తగ్గినట్టుందని  ఈమధ్య సెటైర్లు పడుతున్నాయి.

కొద్దిరోజుల క్రితం మెట్ గాలా లో ఒక దిక్కుమాలిన డ్రెస్ వేసుకోవడంతో ట్రోలింగ్ భారీగా జరిగింది.  ఆ డ్రెస్ థీమ్ కు తగ్గట్టు వేసుకుందని కొందరు వెనకేసుకొచ్చారు కానీ అంత పిచ్చి డ్రెస్ మరే ఇతర సెలబ్రిటీ కూడా వేసుకోకపోవడం గమనార్హం.  థీమ్ పేరుతో సెన్స్ లెస్ డ్రెస్ వేసుకోవడాన్ని చాలామంది తప్పుపట్టారు. మందిరా బేడి ప్రియాంక మెట్ గాలా డ్రెస్ పై గట్టిగా సెటైర్ వేసింది.  ఇక మరో సందర్భంలో భారతీయ చీరకట్టును ప్రపంచానికి మరోసారి పరిచయం చేస్తానంటూ ఈమధ్య చీరతో ఫోటో షూట్ చేసింది.  అది కూడా అంతంతమాత్రంగానే ఏడ్చింది.  బ్లౌజ్ లేకుండా ఫోటో షూట్ చేసింది.. కొన్ని ఫోటోల్లో బ్లౌజ్ కు బదులుగా ఇన్నర్ మాత్రమే ధరించింది.  హాటు అందాలు చూసి చప్పరించే ఇన్స్టా బ్యాచ్ తప్ప మిగతా జనాలు ప్రియాంకను గట్టిగా ట్రోలింగ్ చేశారు.  నువ్వు హాట్ షో చెయ్యాలనుకుంటే వేరే డ్రెస్సులు వేసుకొని చెయ్.. మాకేమీ అభ్యంతరం లేదు కానీ ఇది ఇండియన్ డ్రెస్ అంటూ చీర పరువు  తీయకు అంటూ గడ్డిపెట్టారు.

అయితే ఈ ట్రోలింగ్ తో సంబంధం లేకుండా ఈ జఫ్ఫా డ్రెస్సింగ్ ఉద్యమాన్ని ఆపకుండా కొనసాగిస్తోంది ప్రియాంక.  తాజాగా ప్రియాంక 'చేజింగ్ హ్యాపీనెస్' అనే డాక్యుమెంటరీ ప్రీమియర్ కు తన భర్త నిక్ జోనాస్ తో కలిసి హాజరయింది.  జోనాస్ బ్రదర్స్ ముగ్గురిపై తెరకెక్కించిన డాక్యుమెంటరీ కావడంతో జోనాస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరయ్యారు.  ఈ ఈవెంట్ లో ప్రియాంక ధరించిన డ్రెస్ ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి.  ఫ్రంట్ వీ నెక్ తో పాటుగా థై స్లిట్ కూడా ఉంది.  కాకపోతే ఆ థై స్లిట్ మరింత ఎక్కువగా ఉండడంతో ఎబ్బెట్టుగా కనిపిస్తోంది.  ఈ డ్రెస్ ను కూడా మెచ్చుకునే జనాలు లేకపోలేదు కానీ ట్రోలింగ్ మాత్రం వెంటనే స్టార్ట్ అయింది.

ఏదో ఒక డ్రెస్ ను జనాలు ట్రోలింగ్ చేస్తే.. ఆ డ్రెస్ మాత్రమే నచ్చలేదేమో ప్రియాంక ఫ్యాషన్ సెన్స్ కరెక్ట్ గానే ఉంది అని సరిపెట్టుకోవచ్చు. వారంలో ఒకసారి ఆమె వేసుకున్న ఏదో ఒక డ్రెస్ ట్రోలింగ్ కు గురవుతోంది అంటే ఆమె ఫ్యాషన్  సెన్స్ సరిగా లేనట్టు.. లేకపోతే ఆమె స్టైలిస్ట్ ను మార్చాల్సిన అవసరం ఉన్నట్టు!


సాహో ప్రభా దుమ్ము దుమారం

Latest-Poster-From-Saaho-Movie-Andhra-Talkies
టిప్పర్ లారీ ఎళ్లి స్కూటర్ ని గుద్దేస్తే ఎట్టా ఉంటది! ఎట్టా ఉండబోతోందో రేప్పొద్దున్న 11.23 కి తెలుస్తుంది. బుజ్జిగాడు ఆరోజు ఎందుకు అన్నాడో కానీ ఆ మాటకు మీనింగ్ రేపు తేల్తుంది! డార్లింగ్ ప్రభాస్ ఇంతింతై అన్న చందంగా ఎదిగేస్తున్నాడు. ఈసారి `సాహో` అంటూ దూసుకొస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత తనపై పెరిగిన అంచనాల్ని అందుకునేందుకు ప్రభాస్ ఈసారి అహోరాత్రులు కంటి మీద కునుకు అన్నదే లేకుండా శ్రమిస్తున్నాడు. ఈ భారీ యాక్షన్ చిత్రంతో ఇంటర్నేషనల్ లెవల్ మార్కెట్ ని తన ఖాతాలోకి మళ్లించే పనిలో ఉన్నాడు. ఆసక్తికరంగా సాహో లాంటి భీకరమైన యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఎంపిక చేసుకోవడంలోనే అతడి ఎత్తుగడ అర్థమైంది. ఈ సినిమాకి సరిహద్దులతో పనేలేదు. ఇది యూనివర్శల్ మార్కెట్ ని ఢీకొట్టే సినిమా అని ఇప్పటికే మేకింగ్ వీడియోలు సహా రిలీజైన పోస్టర్లు విజువల్స్ చెప్పాయి.

ఇప్పుడు ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో మరో టీజర్ ని రిలీజ్ కి సిద్ధం చేసింది యు.వి.క్రియేషన్స్ బృందం. టీజర్ రాక కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో 16 గంటల సమయం ఉండగానే ఈలోగా డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే పోస్టర్ ని రివీల్ చేశారు. ఈసారి కొత్త పోస్టర్ ని ప్రభాస్ స్వయంగా ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేయడంతో ఇది అభిమానుల్లోకి సునామీ వేగంతో దూసుకుపోతోంది.

RRRలో ప్రభాస్ - అనుష్క జోడీ?

Bahubali-Hero-Prabhas-and-Anushka-in--RRR-Andhra-Talkies
తెలుగు సినిమా మార్కెటింగ్ స్ట్రాటజీ పూర్తిగా అప్ గ్రేడ్ అయిన సంగతి తెలిసిందే. బాహుబలి సక్సెస్ తర్వాత అనూహ్య పరిణామమిది. బహుభాషా నటుల్ని ఎంపిక చేసుకుని భారీ కాన్వాసుపై మల్టీస్టారర్లు తీసి ఇరుగు పొరుగు మార్కెట్లలోనూ క్యాష్ చేసుకునే ఎత్తుగడ వేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ ని ఛేజిక్కించుకునే దిశాగా టాలీవుడ్ పరుగులు పెడుతోంది.

ఇందులో మరో నూతన ఒరవడికి RRR శ్రీకారం చుట్టనుందా? అంటే రాజమౌళి ప్లానింగ్ అలానే ఉందని అర్థమవుతోంది. ఈ సినిమాని తెలుగు- తమిళం తో పాటు హిందీలోనూ ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేయనున్నారు. అయితే బాలీవుడ్ మార్కెట్ ని  ఛేజిక్కించుకోవడం అంటే అదో సవాల్ తో కూడుకున్నది. ఎంతో తెలివిగా  హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అందుకే అతడు ఓ మాస్టర్ ప్లాన్ వేశారట. ఆర్.ఆర్.ఆర్ లోకి ప్రభాస్ - అనుష్క జోడీని అతిధి పాత్రలతో ఆహ్వానించడం ద్వారా మార్కెట్ రేంజ్ పెంచాలని ఆలోచిస్తున్నారట. బాహుబలి స్టార్స్ గా ఈ జంటకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఆర్.ఆర్.ఆర్ కి మార్కెట్ పరమైన ఇమేజ్ పెరుగుతుంది. అలాగే ప్రభాస్ కి జపాన్ సహా ఎన్నిచోట్ల అభిమానులున్నారో అన్నిచోట్లా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు కాబట్టి అక్కడా మార్కెటింగ్ పరంగా ప్లస్ కానుంది.

నటి అంటే అద్దెకిచ్చేవారు కాదు!

Sexy-Heroin-Taapsee-Pannu-reveals-that-when-she-first-came-to-Mumbai-andhra-talkies
కృష్ణానగర్ కష్టాలపై కథలు కథలుగా చెప్పుకుంటారు ఫిలిం జనం. సినిమావోళ్లు అంటేనే అందరికీ లోకువ.  అద్దెకిచ్చేందుకు ఎవరూ ముందుకు రారని.. అప్పు అసలే పుట్టదని వాపోయేవాళ్లెందరో. పిల్లనిచ్చేవాళ్లు అయితే అసలే దరికి చేరనివ్వరు! అయితే ఈ తరహా కృష్ణానగర్ కష్టాలు ఎవరో అనామకులకే అనుకుంటే పొరపాటే. అలాంటి ఇబ్బందులెన్నో ఎదుర్కొని ఢక్కా మొక్కీలు తిని ఏదోలా మొత్తానికి ఇన్నాళ్టికి సెటిలైందట అందాల తాప్సీ.

తాను ముంబై పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో అద్దె గది కోసం నానా ఇబ్బందులు ఎదుర్కొందిట తాప్సీ(31). `నటిని అని చెబితే చాలు` ఎవరూ అపార్ట్ మెంట్ అద్దెకిచ్చేవారు కాదట. అసలు ఆ ఉద్యోగాన్నే ఎవరూ నమ్మేవారే కాదని చెప్పుకుని గతం ఎంత దుర్భరమో గుర్తు చేసుకుంది పాపం. ప్రస్తుతం తాను నటించిన `గేమ్ ఓవర్` సినిమా ప్రచార కార్యక్రమంలో తాప్సీ ఇలా పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతోంది. ఈ సినిమాని తెలుగు - తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ చేసేందుకు తాప్సీ చాలా సీరియస్ గానే ప్రమోట్ చేస్తోంది.

రానా ఎందుకు క్రికెటర్ కాలేదంటే..

Tollywood-Hero-Rana-Daggubati-Dream-Girl-Broke-His-Heart-Andhra-Talkies
బాహుబలి సినిమాలతో దేశవ్యాప్తంగా ఇమేజ్ తెచ్చుకున్న తెలుగు నటుడు రానా ఏ రంగంలో అడుగుపెట్టినా దుమ్ముదులుపుతాడన్నది ఆయన అభిమానుల మాట. మరి.. ఆయన తండ్రి దగ్గుబాటి సురేశ్ బాబ రానాను క్రికెటర్ ను చేయాలని కలలు కన్నా అది నెరవేరలేదు. అందుకు కారణమేంటో సురేశ్ బాబే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రానాకు చిన్నప్పటి నుంచి ఒక కన్ను కనిపించదని.. ఆ కారణంగానే ఆయన క్రికెటర్ కాలేకపోయారని చెప్పారు.

రానా రెండు కళ్లలో ఒకదానికి సమస్య ఉన్నప్పడు చిన్నతనంలో గుర్తించారు. ఆ కన్ను పనిచేయకపోవడంతో దాని స్థానంలో మరో కన్ను అమర్చారు. కానీ ఆ కంటికీ చూపు లేదు. అలా ఒక కన్ను పనిచేయకపోవడంతో కొడుకును స్పోర్ట్స్ మన్ ని చేయాలన్న సురేశ్ బాబు ఆశ నెరవేరలేదు.

ఒకరంటే ఒకరికి ఇష్టం.. ప్రస్తుతానికి అంతే!

Hero-Vishnu-Vishal-on-his-relationship-with-Jwala-Gutta-Andhra-Talkies
ఈమధ్యే తమిళ హీరో విష్ణు విశాల్.. మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తాల మధ్య ఫ్రెండ్షిప్ కాస్త ఇంటెన్స్ గా సాగుతోందని.. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని గుసగుసలు గుప్పుమన్నాయి.  ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో ఈ గుసగుసలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి విష్ణు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటో షేర్ చేశాడు.  దీంతో కొందరు నెటిజనులు ఇదేదో ముదిరి పాకాన పడుతోందని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

ఇదే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో విష్ణు విశాల్ ను ప్రశ్నిస్తే సగం క్లారిటీ ఇస్తూ సగం కన్ఫ్యూజన్ లో ఉంచుతూ ఆన్సర్ ఇచ్చాడు.  "ఒకరంటే ఒకరికి దాదాపుగా ఏడాది నుంచి తెలుసు.  మాకు చాలామంది కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందుకే ఫ్రెండ్స్ త కలిసి సమయం గడుపుతూ ఉంటాం" అన్నాడు.  మరి ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారుగా అని డైరెక్ట్ గా ప్రశ్నిస్తే "వ్యక్తులుగా ఒకరంటే ఒకరికి ఇష్టం. అంతకు మించి ఈ సమయంలో ఇంతకంటే నేనేం కామెంట్ చెయ్యలేను. ఇద్దరికీ ఇష్టమే కానీ ఎవరి ప్రొఫెషనల్ కమిట్మెంట్స్  వారికి ఉన్నాయి.. అందుకే రిలేషన్ షిప్ గురించి ఆలోచించడం లేదు" అన్నాడు.

భర్త చూస్తుండగానే నటికి ముద్దు పెట్టిన ఫ్యాన్

Miley-Cyrus-Grabbed--Forcibly-Kissed-by-Male-Fan-While-Walking-to-Her-Car-With-Husband-Andhra-Talkies
సెలబ్రెటీల ప్రైవేట్ లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. వారు రోడ్డు మీద కనిపిస్తే చాలు జనాలు గుమ్మ గూడి ఇబ్బందికి గురి చేస్తారు. అభిమానం పేరుతో కొందరు చేసే పనికి సెలబ్రెటీలు చాలా సార్లు చిరాకు పడ్డ సందర్బాలు ఉన్నాయి. సినిమా స్టార్స్ మాత్రమే కాకుండా పాప్ సింగర్స్.. డాన్సర్స్ కూడా అభిమానుల వల్ల ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా హీరోయిన్స్ జనాల్లో దొరికితే కొందరు ఆకతాయిలు నీచంగా ప్రవర్తించేందుకు సైతం వెనకాడరు. తాజాగా అమెరికన్ పాప్ సింగర్ మిల్లీ సైరస్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు ఒక అభిమాని బాడీ గార్డ్స్ భర్త ఉండగానే ముద్దు పెట్టేశాడు.

కోటి నుండి 20 లక్షలకు దిగజారిన క్రేజీ బ్యూటీ

Priya-Prakash-Varrier-Gets-Less-Remuneration-For-Nithin-Movie-Andhra-Talkies
ప్రియా వారియర్.. ఈ పేరు సౌత్ ఇండియాలోనే కాదు యావత్ భారత దేశంలో కూడా ఫేమస్ అయ్యింది. ఓవర్ నైట్ స్టార్ అంటే ప్రత్యక్ష సాక్ష్యంగా ప్రియా వారియర్ నిలిచింది. ఒక చిన్న సినిమాలోని పాటకు చెందిన చిన్న బిట్ అయిన ముద్దు గన్ పేల్చే సన్నివేశంతో ప్రియా వారియర్ ఒక్కసారిగా టాప్ ఆఫ్ ది ఇండియా అయ్యింది. ఆ సమయంలోనే ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు పలు భాషల నిర్మాతలు.. హీరోలు వెంట పడ్డారు. కాని ఆ సమయంలో యాడ్స్ అయితే ఒప్పుకుంది కాని ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు.

ప్రియా వారియర్ హీరోయిన్ గా నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి ఒక సినిమా అనుకున్నారు. ఆ సినిమా కోసం ప్రియా వారియర్ కు ఏకంగా కోటి పారితోషికం మాట్లాడుకుని పాతిక లక్షల అడ్వాన్స్ ను కూడా ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. అయితే ప్రియా వారియర్ తన మొదటి సినిమా విడుదలైన తర్వాతే ఏ సినిమాకైనా ఓకే చెప్తాను అంటూ చాలా సినిమాలకు నో చెప్పింది. సీన్ కట్ చేస్తే పరిస్థితి తలకిందులు అయ్యింది. లవర్స్ డే సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆ సినిమాలోని ప్రియా వారియర్ నటనకు చెత్త మార్కులు పడ్డాయి. దాంతో ఒక్కసారిగా ప్రియావారియర్ జీరో అయ్యింది.

ఆమె పోస్ట్ చూస్తే.. దే దే ప్యార్ దే సినిమా గుర్తుకొస్తుంది!

Ankita-Konwar-account-of-how-she-met-the-love-of-her-life-Milind-Soman-Andhra-Talkies
ప్రేమకు వయసుకు సంబంధం లేదంటారు కానీ.. అదేమంత చిన్న విషయం కాదు.  ఈ మధ్యన విడుదలైన దే దే ప్యార్ దే సినిమా చూశారా? అజయ్ దేవగన్.. మన రకుల్.. టబూ నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది. తన కూతురు వయసున్న అమ్మాయితో ప్రేమలో పడిన వ్యక్తిగా అజయ్ దేవగణ్ నటించారు. ఈ సినిమా చూస్తే.. ఇవాల్టి రోజుల్లో ఇలాంటివి సినిమాల్లోనే కానీ రియల్ గా కాదన్న మాట వినిపిస్తుంది.

అయితే.. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ మిలింద్ సోమన్ పెళ్లి వ్యవహారం చూస్తే.. ఇది తప్పనిపిస్తుంది. తన కంటే 26 ఏళ్లు చిన్నదైన అంకితా కొన్వార్ ను పెళ్లాడిన మిలింద్ సోమన్ ను పలువురు విమర్శలు చేయటమే కాదు.. నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే.. పెళ్లికి ప్రేమకు వయసుతో సంబంధం లేదన్న విషయాన్ని అంకితా తన తాజా పోస్ట్ తో ప్రస్తావించింది. తమ పెళ్లి జరిగిన వైనాన్ని ప్రస్తావిస్తూ ఆమె పెట్టిన డిటైల్డ్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

'సాహో' చుట్టూ ఉచ్చు పన్నారా?!

Tollywood-Hero-Prabhas-Sahoo-Movie-Faces-Other-Movies-Threat-At-box-office-Andhra-Talkies
2019 మోస్ట్ అవైటెడ్ మూవీస్ జాబితాలో నంబర్ వన్ క్రేజుతో వెలిగిపోతోంది `సాహో`. బాహుబలి ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాగా `సాహో` చిత్రానికి వచ్చిన క్రేజు అంతా ఇంతా కాదు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ రాకకోసం ప్రపంచం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్- కోలీవుడ్- మాలీవుడ్- శాండల్వుడ్ లోనూ భారీ అంచనాల నడుమ బాక్సాఫీస్ వార్ కి తెరతీయబోతున్న మూవీ ఇది. అందుకే యువి క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేసేందుకు సన్నాహకాల్లో ఉంది. ఆగస్టు 15న రిలీజ్ కాబట్టి అంతకంటే ముందే ప్రచారంలో వేగం పెంచేందుకు తెలివైన ఎత్తుగడలు వేస్తోంది. ఇక సాహో టీజర్ ని ఈద్ కానుకగా జూన్ 5న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న సల్మాన్- `భారత్` సినిమాతో రిలీజ్ చేస్తోంది కాబట్టి హిందీలో ప్రచారం మొదలైనట్టే. తెలుగు- తమిళంలోనూ ప్రచారం పరంగా దూసుకుపోయే ప్లాన్ రెడీ గా ఉందిట.

ఆమె జీన్స్ వేసుకొని కత్రినా జంప్ అంట!

Bollywood-Heroin-Katrina-Kaif-Tells-About-Her-Personal-Life-Incidents-Andhra-Talkies
బాలీవుడ్లో ఉండే క్రేజీ బ్యూటీలలో కత్రినా కైఫ్ ఒకరు.  ఇప్పటికి ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేనేళ్ళు దాటినా ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగడం ఒక గొప్ప విషయమే.  కత్రినా తర్వాత హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన చాలామంది ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యారు. కానీ కత్రినా మాత్రం తన క్రేజ్ ను కొనసాగిస్తోంది. రీసెంట్ గా అనైతా ష్రాఫ్ అదజానియాతో కలిసి కత్రినా కైఫ్ 'బీఎఫ్ ఎఫ్స్ విత్ వోగ్- సీజన్ 3' చాట్ షో కు హాజరైంది.  నేహా ధూపియా ఈ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఈ షోలో కత్రినా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పలు విషయాలను పంచుకుంది.

'రాజ్ నీతి'..'జిందగీ న మిలేగి దొబారా' .. 'న్యూయార్క్' లాంటి సినిమాలకు పనిచేసిన సమయంలో తన ఫోకస్ చాలా ఎక్కువగా ఉండేదని.. ఎంతో హార్డ్ వర్క్ చేసేదాన్నని.. తను పోషించే  క్యారెక్టర్లను చూసే విధానం కూడా డిఫరెంట్ గా ఉండేదని తెలిపింది.  కానీ ఒక ఫేజ్ లో సినిమాలపై తన ఫోకస్ కొంత తగ్గిందని అంగీకరించింది.  ఆ సమయంలో వర్క్ కాకుండా మరో అంశం తన లైఫ్ లో నిండిపోయిందని.. ఆ రిలేషన్ షిప్ లో లైఫ్ ఎంతో సంతోషంగా ఉండేదని తెలిపింది. అయితే దాని గురించి ఇప్పుడు తానేమీ చింతించడం లేదని చెప్పుకొచ్చింది.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...