ఇన్నాళ్లు కంగనాను వెనకేసుకు వచ్చిన వాళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నారు

 ఇన్నాళ్లు కంగనాను వెనకేసుకు వచ్చిన వాళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నారు

Netizens-Fires-On-Kangana-Ranaut-Andhra-Talkies-telugu
కంగనా అంటే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ సూపర్ స్టార్స్ నుండి చిన్న స్టార్స్ వరకు అందరితో ఆమె విభేదాలు పెట్టుకుంది. తన గురించి ఎవరైనా విమర్శలు చేస్తే విరుచుకు పడే తత్వం ఉన్న కంగనా ముక్కు సూటి తనంకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటూ కంగనా ప్రశంసలు దక్కించుకుంది. అలాంటి కంగనా రనౌత్ ఇప్పుడు విమర్శల పాలవుతోంది. ఇటీవల రైతు ఉద్యమంను అవహేళ చేస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయిన కంగనా ఇప్పుడు మళ్లీ విమర్శలు మూట కట్టుకుంది.


నిన్న కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్ పై కంగనా విమర్శలు చేసింది. రైతుల ఆందోళను మరోసారి తప్పుబట్టే విధంగా ఆమె ట్వీట్ చేసింది. బంద్ నేపథ్యంలో కంగనా సోషల్ మీడియాలో.. భారత్ ను బంద్ చేద్దాం రండి.. ఇప్పటికే ఈ పడవకు తుఫాన్ వెనుక తుఫాన్ వస్తూనే ఉంది. ఇప్పుడు మీరు గొడ్డలితో పడవకు రంద్రం చేస్తున్నారంటూ రైతులను ఉద్దేశించి కంగనా ట్వీట్ చేసింది. కంగనా ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Villa (Pizza 2) Telugu Full Movie | చూస్తున్నంతసేపు సస్పెన్స్ ను రగిలించే మూవీ "విల్లా"

Villa (Pizza 2) - Telugu Full Movie
హీరో ఒక క్రైమ్ రచయితగా పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. అయితే తండ్రి కోరిక మేరకు బిజినెస్ ప్రారంభించి.. నష్టపోయి ఆస్తులన్నీ కోల్పోయే పరిస్థితి వస్తుంది. అప్పటికే హీరో తల్లి కారు యాక్సిడెంట్ లో చనిపోవడం, అతని తండ్రి కోమాలోకి పోయి చనిపోవడం జరిగిపోతుంది. 

ఆర్ధిక ఇబ్బందులలో సతమతమవుతున్న హీరోకి ఫ్యామిలీ లాయర్ వచ్చి మీకు వైజాగ్ లైట్ హౌస్ దగ్గర ఒక విల్లా ఉండేదని మీ నాన్నగారు అక్కడే గడిపేవారని, తరువాత ఆ విల్లాలో ఏం జరిగిందో తెలియదని.. మీ నాన్నగారు మాత్రం ఆ విల్లాకు వెళ్ళడం మానివేశారని చెప్తాడు. అంతే కాకుండా ఆ విల్లా అమ్మేస్తే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయని సలహా ఇస్తాడు.

థియేటర్లు తెరవడంపై తెలుగు రాష్ట్రాల్లో అనిశ్చితి

 థియేటర్లు తెరవడంపై తెలుగు రాష్ట్రాల్లో అనిశ్చితి

Uncertainty-in-Telugu-states-over-opening-of-theaters-andhra-talkies
రాష్ట్రాలు థియేటర్లు తెరిచేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నాయా? లేవా? జనం థియేటర్లు తెరిస్తే సినిమాలు చూసేందుకు బయటకు వస్తారా రారా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. రేపటి నుంచి సస్పెన్స్ కి తెర దించేస్తారేమోనన్న చర్చ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు ఏపీలో రేపటి నుంచి థియేటర్లు తెరవరు. తెలంగాణలో తెరుస్తారా లేదా? అన్నదానిపై సమాచారం రాలేదు.


అన్ లాక్ 5.0 లో భాగంగా అక్టోబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తిరిగి తెరవడానికి కేంద్రం అనుమతించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి తెరవడంపై ఇంకా చాలా అనిశ్చితి నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుండి థియేటర్లు తెరుచుకోవడం లేదు. దీనిని థియేటర్ యాజమాన్యాలు అధికారికంగా ధృవీకరించనున్నాయట.

లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన హాజరైన ప్రముఖ దర్శకుడు..!

bollywood-director-Anurag-Kashyap-issued-summons-to-be-present-for-questioning-in-rape-case
తెలుగులో 'ప్రయాణం' 'ఊసరవెల్లి' వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ పాయల్ అగర్వాల్.. ఇటీవల బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని.. తనను రూమ్ లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడని ముంబైలోని వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనురాగ్ కశ్యప్ పై ఐపీసీ సెక్షన్లు 376 (ఐ) (అత్యాచారం) - 354 (మహిళపై దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) - 341 మరియు 342 (నిర్బంధం) కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేయబడింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1న ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని పోలీసులు దర్శకుడికి సమన్లు జారీ చేశారు.

27 ఏళ్ల కుర్రాడు అరెస్ట్.. కేసు బుక్ చేసిన సోనాక్షి

Bollywood Breaking-Sonakshi-Sinha-files-FIR-against-cyber-bullies--One-Arrested
27 ఏళ్ల కుర్రాడు అరెస్ట్.. కేసు బుక్ చేసిన సోనాక్షి
సోషల్ మీడియాల్లో ఇష్టానుసారం బూతులు మాట్లాడేస్తూ నచ్చిన భాషను ఉపయోగించేస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ చూస్తూ ఊరుకోదు. దూషణలు .. పరాచికాలకు దిగినా .. వేధింపులకు పాల్పడినా ఫిర్యాదు మేరకు వెంటనే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ తరహాలో ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అరెస్టులు చేసి జైల్లో వేశారు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పైనా బూతు పదజాలంతో వల్గర్ పోస్టులు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు ఈ 27 ఏళ్ల కుర్రాడు.

సోనాక్షిని ఇష్టానుసారం దూషిస్తూ ఇష్టానుసారం పోస్టింగులతో చెలరేగిన ఆయువకుడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందినవాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.  తనపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నాడని ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు శశికాంత్ గులాబ్ జాదవ్.

భర్తలు అంతా రాత్రి 30 నిమిషాల పాటు భార్యల కాళ్లు నొక్కాలంటున్న స్టార్ హీరోయిన్

Sexy-Heroin-Bipasha-made-some-interesting-comments-on-a-talk-show-andhra-talkies
భర్తలు అంతా రాత్రి 30 నిమిషాల పాటు భార్యల కాళ్లు నొక్కాలంటున్న స్టార్ హీరోయిన్
బాలీవుడ్ లో సుదీర్ఘ కాలం ఒక ఊపు ఊపేసి స్టార్ హాట్ హీరోయిన్ గా కొనసాగిన ముద్దుగుమ్మ బిపాస బస్సు ప్రస్తుతం వైవాహిక జీవితంలో పడిపోయింది. ఈ సమయంలో కూడా ఆమె సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపడంతో పాటు రెగ్యులర్ గా ఏదో ఒక షోలో కనిపిస్తూనే ఉంది. గత కొంతకాలం నుంచి వెబ్ సిరీస్సుల్లో కూడా తన మార్క్ చూపెడుతూ పేక్షకులను ఉర్రూతలూగిస్తూనే ఉంది.. నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకున్న బిపాస బస్సు తన భర్తతో కలిసి పలు చిత్రాల్లో నటించింది. భర్తతో నటించడం అనేది తనకు చాలా ఇష్టమైన విషయం అంది. ఆయనతో కలిసి నటించడం చాలా సులభంగా అనిపిస్తుంది.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై తీర్పు వాయిదా

Judgment-on-Ramgopal-Varma-Movie-Murder-postponed-Andhra-Talkies
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై తీర్పు వాయిదా
మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ పేరుతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తన జీవితంపై సినిమా చేస్తున్న నిర్మాతలకు ప్రణయ్ భార్య అమృత గతంలోనే కోర్టు ద్వారా నోటీసులు పంపింది. అనుమతులు లేకుండా తన కథ ఆధారంగా సినిమా తీస్తున్నారంటూ ఆమె నల్లగొండ జిల్లా కోర్టులో పిటీషన్ వేశారు. మర్డర్ సినిమా విడుదల ఆపాలని.. పబ్లిసిటీ ఆపమని కోరుతూ కోర్టును అమృత కోరారు. ఈ మేరకు కోర్టు ద్వారా మర్డర్ సినిమా నిర్మాతలు నట్టి క్రాంతి నట్టి కరుణలకు నోటీసులు పంపారు.

ఈనెల 6న నిర్మాతలు కోర్టుకు హాజరై వారి వాదనను తెలుపాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. ‘మర్డర్’ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే వర్మ విడుదల చేయగా.. అది వైరల్ అయ్యింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు వర్మ ప్లాన్ చేయగా అమృత కోర్టుకు వెళ్లి అడ్డుకుంటోంది.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...