That power star apologized | ఆ పవర్ స్టార్ క్షమాపణ చెప్పాల్సిందే

Lawyers-Demand-Apology-From-Puneeth-Rajkumar-Andhra-Talkies-Telugu
ఇక్కడ అన్నది మన పవన్ కళ్యాణ్ ని కాదు లేండి. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో అక్కడి ఫాన్స్ ముద్దుగా పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ గురించి. గత వారం విడుదలైన అంజని పుత్ర అనే సినిమాలో ఇతనే హీరో. ఇందులో తమను కించపరిచేలా తీవ్రమైన పదజాలం - సన్నివేశాలు ఉన్నాయని లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు ఫైల్ చేస్తే ప్రదర్శన నిలిపివేయమని కోర్ట్ స్టే ఇచ్చింది. కాని విచిత్రంగా కోర్ట్ ఆర్డర్ లెక్క చేయకుండా షోలు కంటిన్యూ చేయటం ఇప్పుడు వివాదంగా మారింది. తాజాగా బెంగుళూరులో ప్రెస్ తో సమావేశం జరిపిన లాయర్లు పునీత్ రాజ్ కుమార్ కనక క్షమాపణ చెప్పకపోతే ఉద్యమం చేపడతామని అల్టిమేటం జారీ చేసారు. రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఇలాంటి మరక గతంలో ఎన్నడూ లేదు. ఇలా జరగడం పట్ల అన్నయ్య శివ రాజ్ కుమార్ కూడా సీరియస్ గా ఉన్నారు.

ఇంతా చేసి అంజని పుత్ర అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు. భారీ ఓపెనింగ్స్ వచ్చినా నెగటివ్ టాక్ తో ఫైనల్ గా ఫ్లాప్ గా మిగిలేలా ఉంది. అందుకే అందినకాడికి ఓపెనింగ్స్ రూపంలో సాధ్యమైనంత వెనక్కు రాబట్టుకుందాం అని ట్రై చేస్తున్న నిర్మాతకు కోర్ట్ ఆర్డర్స్ అడ్డంకిగా మారాయి. ఈ అంజని పుత్ర కథలో ఏముంది అనుకుంటున్నారా. ఓ మూడేళ్ళ క్రితం విశాల్ హీరోగా పూజా అనే సినిమా ఒకటి వచ్చింది. గుర్తుందిగా. దాని రీమేకే ఈ అంజని పుత్ర. అందులో రాధిక చేసిన పాత్ర ఇందులో రమ్యకృష్ణ చేసింది. రష్మిక మండన్న హీరొయిన్. ఫుల్ మాస్ మసాలా సినిమాగా తీసిన ఈ మూవీలో అనవసరంగా లా సిస్టం పై విసుర్లు వేసారని వివాదం స్టార్ట్ అయ్యింది. ఇప్పటికైతే పునీత్ సైలెంట్ గా ఉన్నాడు. లాయర్లు డిమాండ్ చేసినట్టు సారీ చెబుతాడో లేదో చూడాలి.
That power star apologized

Why is Sunil missing in Agnyaathavaasi Movie | అజ్ఞాతవాసిలో సునీల్ లేకపోవడానికి కారణం?

Sunil-Reveals-Reason-Behind-He-is-not-Part-of-Agnyaathavaasi
స్టార్ కమెడియన్ హోదా అనుభవించే టైంలోనే హీరోగా మారి అదృష్టం పరీక్షించుకున్న సునీల్.. మొదట్లో బాగానే సక్సెస్ అయ్యాడు. కానీ కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఈ హీరో.. మళ్లీ కమెడియన్ గా మారాలని భావిస్తున్నాడనే టాక్ కొన్ని నెలలుగా వినిపిస్తోంది. అయితే.. రీఎంట్రీలో తన పాత్రతో సెన్సేషన్ సృష్టించాలన్నది సునీల్ ఆలోచన.

ఇందుకు తన స్నేహితుడు అయిన త్రివిక్రమ్ అయితేనే కరెక్ట్ అన్నది సునీల్ నమ్మకం. అందుకే త్రివిక్రమ్ మూవీలో ఓ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తాడని అంతా భావించారు. ఇప్పటివరకూ ఇది రూమర్ మాత్రమే కానీ.. ఇప్పుడిది నిజమే అని చెప్పేశాడు సునీల్. త్వరలో రూపొందనున్న ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో మూవీలోనే కాదు.. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసిలోనే ఓ సూపర్బ్ క్యామియో చేశాడనే టాక్ కూడా వినిపించింది. ఈ మాటలు కూడా నిజమే అని ఒప్పుకున్నాడు సునీల్. ప్రస్తుతం తను హీరోగా రూపొందిన 2కంట్రీస్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సునీల్.. త్రివిక్రమ్ మూవీ సంగతులపై పెదవి విప్పాడు.

స్టోరీ సిట్టింగ్స్ సమయంలోనే ఈ డిస్కషన్ వచ్చినా.. తన కోసం అనుకున్న పాత్రకి.. ఆశించిన స్థాయి ఇంపార్టెన్స్ లభించలేదని ఫీలయ్యాడట సునీల్. అందుకే పవన్ కళ్యాణ్ మూవీ నుంచి తప్పుకున్నానని చెప్పేశాడు. అజ్ఞాతవాసిలో తను నటించాల్సి ఉన్నా.. చివరకు ఆ ఆఫర్ ను వదిలేశానని అన్న సునీల్.. తనకు మళ్లీ కమెడియన్ గానో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో గ్రాండ్ రీఎంట్రీ ఇప్పించగల బాధ్యత త్రివిక్రమ్ కే ఇచ్చేసినట్లు చెప్పకనే చెప్పాడు.
Why is Sunil missing in Agnyaathavaasi Movie

Megastar Chiranjeevi and Pawan Kalyan Viral Video | మెగా స్టార్ చిరంజీవి.. భలే చిలిపి గురూ

Megastar-Chiranjeevi-and-Pawan-Kalyan-Viral-Video-Andhra-Talkies
మెగా స్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వేదికపై కలిసి కనిపించడం అభిమానులకు ఎప్పుడూ పండగే. ఎప్పుడో అరుదుగా వీళ్లిద్దరూ ఒకచోట కనిపించే సందర్భంలో వాళ్లిద్దరి మధ్య ప్రతి మూమెంట్ ను అభిమానులు వెయ్యికళ్లతో వాచ్ చేస్తుంటారు. అందులో ప్రత్యేకంగా ఏ చిన్న అంశం కనిపించినా వారి దృష్టి దాటిపోదు. ఇలాంటి సంఘటనే తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజ్భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రాజకీయ ప్రముఖులందరితో పాటు మెగా బ్రదర్స్ కూడా హాజరయ్యారు. పవన్ వేరేవాళ్లతో మాట్లాడుతున్న టైంలో వెనుక నుంచి వచ్చిన చిరంజీవి చాటుగా తమ్ముడి నడుమును తట్టారు. తనను ఎవరో పిలిచారని భావించిన పవన్ వెనుక్కు తిరిగి చూసేసరికి అక్కడెవరూ లేరు. పక్కన అన్నగారేమో ఏం ఎరగనట్టుగా వేరొకళ్లతో బిజీగా మాట్లాడుతూ కనిపించారు. ఈ చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి ‘చిలిపి చిరంజీవి’ అని టైటిల్ పెట్టి మరీ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేమరి.. అభిప్రాయ బేధాలు వచ్చినంత మాత్రాన అన్నదమ్ముల మధ్య సరదా లేకుండా పోతుందా ఏంటి..

మరోవైపు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అజ్ఞాతవాసి తాలూకూ షూటింగ్ పనులు మొత్తం పూర్తి చేసి ఫ్రీ అయిపోయాడు. ఇదేటైంలో చిరంజీవి ఏమో తన 151వ సినిమా సైరా.. నరసింహారెడ్డి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
Megastar-Chiranjeevi-and-Pawan-Kalyan-Viral-Video-Andhra-Talkies

Poonam Pandey Dirty Scenes | క్రిస్మస్ పేరుతో పూనం పాండే డర్టీ వేషాలు

Bollywood-Sexy-Actress-Dirty-Scenes-During-Christmass-Andhra-talkies-telugu
దేశంలో ఏదన్నా ఈవెంట్ ఉంటే చాలు.. వెంటనే అక్కడ రిజల్ట్ జనరంజకంగా వస్తే నేను విప్పేస్తా అంటూ రెడీ అయిపోతోంది పూనం పాండే. అదిగో ఇప్పుడు మరోసారి అదే పని చేసింది. ఎంఎస్ ధోని వరల్డ్ కప్ గెలిస్తే స్టేడియంలో నగ్నంగా నడుస్తాను అంటూ ట్విట్టర్ ద్వారా రచ్చ చేస్తూ పాపులర్ అయిన డర్టీ సుందరి పూనం పాండే.. ఈసారి ఎవరూ అడగకుండానే అలాంటి వేషాలు వేస్తోంది.

మన దేశంలో మతాలతో సంబంధం లేకుండా జరుపుకునే పండగలు కొన్ని ఉన్నాయి. దీపావళికి టపాసులు కాల్చడం.. రంజాన్ కు బిర్యానీ తినడం.. క్రిస్మస్ కు కేకులు తెచ్చుకుని అందరికీ పార్టీ ఇవ్వడం.. కులమతాలకు సంబంధం లేకుండా జరుగుతుంటుంది. కాని ఇలాంటి ఓ పర్వదినాన్ని కూడా తనకు అనుకూలంగా క్యాష్ చేసుకోవాలని చూసిందీ డర్టీ భామ. లోదుస్తుల్లో తన అవయవ సౌష్టవాన్ని ఆరబోస్తూ ఒక క్రిస్మస్ సాంగ్ వీడియోతో వచ్చింది. అదేమంటే ఎరోటిక్ క్రిస్మస్ అంటోంది. అసలు ఏ పండుగకు ఏం చేయాలో కూడా ఈమెకు తెలియదా అంటూ ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు.

అయితే ఈమె డర్టీ వేషాలను బాలీవుడ్ వాసులు మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఒక ప్రక్కన మాజీ పోర్న్ స్టార్ అయినప్పటికీ.. తన నటనతో డ్యాన్సులతో ఆకట్టుకుంటున్న సన్నీ లియోని వరుస సినిమాలతో దూసుకుపోతోంది కాని.. పూనం పాండే మాత్రం ఒక్క సినిమాకే బిషానా ఎత్తేసిన  పరిస్థితి . అసలు ఈమెతో సినిమాలు చేయడానికే ఎవ్వరూ ముందుకురావట్లేదు. అది సంగతి.
Bollywood-Sexy-Actress-Dirty-Scenes-During-Christmass-Andhra-talkies-telugu

మరో సినిమాపై వివాదం

Hindu-outfit-protests-against-Bengali-film-for-naming-characters-Ram--Sita
సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం ఇటీవల సాధారణమైపోయింది. అసలు... వివాదాస్పందగా సినిమా తీయడం కూడా ఒక స్ర్టాటజీయా అన్న వాదానా వినిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా ఈ వివాదాస్పద సినిమాల జాబితాలో మరో మూవీ కూడా చేరింది.  తాజాగా ఓ బెంగాలీ చిత్రం వివాదంలో చిక్కుకుంది. అందులో ప్రధాన పాత్రధారుల పేర్లు రామ - సీత అని ఉండడమే దీనికి కారణం.
   
హిందూ జాగరణ మంచ్ ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సెన్సార్ కార్యాలయం ముందు నిరసనకు దిగింది. సినిమాలో ప్రధాన పాత్రధారుల పేర్లు మార్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.  దీనిపై హిందూ జాగరణ్ మంచ్ కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి స్మృతి ఇరానీకి  లేఖ కూడా రాసింది. రాముడు - సీత పేర్లు పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆ లేఖలో  రాశారు.
   
మరోవైపు కోర్టును సంప్రదించేందుకు కూడా హిందూ జాగరణ్ మంచ్ సిద్ధమవుతోంది. సెన్సార్ బోర్డ్ తమ డిమాండ్లను పట్టించుకోకుంటే న్యాయపోరాటానికి దిగుతామని  హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా హిందూ జాగరణ్ మంచ్ సభ్యులకు మద్దతు పలుకుతున్నారు. పురాణ పురుషుల పేర్లను సినిమాల్లో వాడుకోవడం హిందువుల మనోభావాలను కించపరిచినట్లేనంటున్నారు. అయితే... సినిమా దర్శకుడు రజన్ ఘోష్ మాత్రం సమాజంలో చాలా మంది పేర్లు రాముడు - సీత అని ఉన్నపుడు సినిమాలో ఉంటే తప్పేంటని తన వాదన వినిపిస్తున్నారు. కాగా రోంగ్ బెరంగేర్ కోర్ పేరుతో తీస్తున్న ఈ సినిమాలో చిరంజీత్ చక్రవర్తి రీతూ పర్ణా సేన్ గుప్తా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

రాజమౌళి వంద సార్లు చూసిన సినిమా అదేనట

Director-Rajamouli-Inspired-By-Braveheart-Andhra-Talkies-Telugu
బాహుబలి సినిమాతో టాలీవుడ్ ని బాలీవుడ్ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి గురించి ఎంత పొగిడినా కూడా చాలా తక్కువే. ఓటమెరుగని దర్శకుడు ఎలాంటి సినిమా చేసినా ప్రేక్షకులు ఆదరించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇచ్చే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడని దర్శక దిగ్గజాలు ప్రశంసలను అందించిన సంగతి తెలిసిందే.

ఇక అసలు విషయానికి వస్తే జక్కన్న ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఎదో ఒక కొత్త ధనంతో వచ్చినవే. అయితే అందులో మెయిన్ గా ఎమోషన్ యాక్షన్ ని మాత్రం ఎప్పుడు మిస్ చేయలేదు. ప్రతి దర్శకుడికి ఎదో ఒక సినిమా బాగా ఇన్స్పైర్ చేసి ఉంటుంది. అలాగే రాజమౌళి ని బాగా ఇన్ స్పైర్ చేసిన ఒక సినిమా ఉందట. రీసెంట్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకదీరుడు ఆ విషయాన్ని వివరంగా చెప్పాడు.

1994లో హాలీవుడ్ లో తెరకెక్కిన బ్రేవ్ హార్ట్ సినిమా ఎంత ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ప్రతి సిన్ జక్కన్నని ఇన్స్పైర్ చేసిందని చెబుతాడు. మెల్ గిబ్సన్ డైరక్షన్లో.. తనే హీరోగా తీసిన ఈ సినిమాను.. దాదాపు 100 సార్లు చూశాడట జక్కన్న. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఓ లెవెల్ లో ఉంటాయని అందుకే ఆ సినిమా నన్ను ఆకర్షించిందని ఇప్పటికి చూస్తానని చెప్పాడు. 

దిల్ రాజు వార్నింగ్.. నాని కవరింగ్

Tollywood-Hero-Nani-Handling-Warangal-Crowd-At-MCA-Pre-Release-Event-Andhra-Talkies-Telugu.
స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఆడియో వేడుకలు - ప్రి రిలీజ్ ఈవెంట్లూ జరిగితే అభిమానుల్ని కంట్రోల్  చేయడం అంత సులువు కాదు. కొన్నిసార్లు ఫ్యాన్స్ శ్రుతి మించి ప్రవర్తిస్తుంటారు. స్టార్ ఇమేజ్ వైపు వడివడిగా దూసుకొస్తున్న నాని నటించిన సినిమా వేడుకకు కూడా ఇప్పుడు ఇలాంటి ఇబ్బందే తలెత్తింది. వరంగల్లోని హన్మకొండలో శనివారం రాత్రి జరిగిన ‘ఎంసీఏ’ ప్రి రిలీజ్ ఈవెంట్ కొంచెం రసాభాసగా మారింది. ఈ వేడుకకు 30 వేలమందికి పైగా హాజరయ్యారు. అందులో చాలా వరకు యువతే. వరంగల్ లాంటి చోట ఇలాంటి వేడుకలు జరగడం అరుదు కదా. ఇక నాని.. సాయిపల్లవి.. దిల్ రాజు లాంటి వాళ్లను చూసేసరికి ఇక్కడి జనాలు ఆగలేదు. వేదిక పైకి దూసుకొస్తూ పోలీసులకు చుక్కలు చూపించారు. వాళ్లను కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది.

నిర్మాత దిల్ రాజు ఒకటికి మూడుసార్లు వాళ్లను హెచ్చరించాడు. ఒక దశలో ఆయన సహనం కోల్పోయి.. ‘‘ఏరా బై చెబితే అర్థం కాదా..’’ అంటూ అరిచారు. ‘‘మీరిలా చేస్తే ఇకపై వరంగల్లో ఇలాంటి ఫంక్షన్లుండవు. షూటింగులు కూడా ఉండవు. ఎవ్వరూ ఇక్కడికి రావడానికి ఇష్టపడరు’’ అని హెచ్చరించారు. ఇలా అన్న తర్వాత కూడా వరంగల్ యూత్ తగ్గలేదు. ఐతే రాజు మరీ తీవ్ర స్థాయిలో హెచ్చరించిన నేపథ్యంలో ఇక్కడి జనాలు హర్టవుతారని అనుకున్నాడో ఏమో.. తర్వాత మైక్ అందుకున్న నాని ఈ విషయాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ‘‘రాజు గారు అలా అంటారు కానీ.. హైదరాబాద్ నుంచి మేం ఇక్కడికి వచ్చింది మీరు సైలెంటుగా ఉంటే చూడటానికా.. మీరు కానివ్వండి’’ అనడంతో ఆడిటోరియం హోరెత్తిపోయింది.

తెలుగు మహాసభల్లో నిర్వహించనున్న మహాకవి వార్షికోత్సవం

Telangana-govt-honors-Tollywood-first-lyricist-chandala-kesavadasu-Andhra-Talkies-Telugu
ఎన్నడు ఎవ్వరు జరపని విధంగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారి ఘనంగా తెలుగు మహా సభలు జరగబోతున్నాయి. కొన్ని నెలల ముందు నుంచే కేసీఆర్ కార్యక్రమాల గురించి ప్రత్యేక చర్చలు జరిపి అంతా సెట్ చేశారు. అందరికి గుర్తుండిపోయేలా వేడుకలను జరపాలని కేసీఆర్ అధికారులకు సూచనలను ఇచ్చారు. ఇక ఈ రోజు నుంచి వేడుకలు మొదలు కానున్నాయి. తెలుగు బాషా కోసం పాటుపడుతున్న సాహితివేత్తలందరి సమక్షంలో సభను నిర్వహించనున్నారు.

అయితే ఈ వేడుకలో ప్రముఖ కవి చందాల కేశవదాసు జన్మ వార్షికోత్సవాన్ని కూడా తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా జరపనుంది. కేశవదాసు మొదటి సారిగా పూర్తి నిడివి గల ఒక తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద'కు పాటలను రాశారు. అందులోని పద్యాలను కూడా ఆయనే రాశారు. 1932లో విడుదలైన ఆ సినిమా ఎంతగటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  తెలుగు జనాలు ఇప్పటికి ఆ సినిమాలోని పాటలను వింటుంటారు. 

తరువాత ఈ ఐకానిక్ లిరిసిస్ట్ తెలుగులో అనేక హిట్ సినిమాలకు పాటలు రాశారు. అయన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కుసుమంచి మండల్లోని జక్కేపల్లి గ్రామంలో జన్మించాడు. అయితే అయన మొదటి తెలుగు పాట 'తనయా  ఇతులన్ తగదురా పలుకా' రచనకు గాను ఈ కవికి గౌరవం దక్కనుంది. ప్రముఖులు వేడుకలో కేశవదాసు పద్యాలను సినీ సాహిత్య కళా కారులు ప్రధానంగా గుర్తు చేసుకోనున్నారు.

ఆ తెలుగమ్మాయి ఎంత స్లిమ్ అయ్యిందో

Sexy-Heroin-Anjali-Silm-Look-Andhra-Talkies.jpg
సౌత్ లో తెలుగు భామలు వెండితెరపై అంత ఎక్కువగా ప్రభావం చూపించారు అనేది అందరికి తెలిసిన విషయమే. అంతే కాకుండా ఎక్కువగా గ్లామర్ గా కనిపించినా అంతగా సెట్ అవ్వరనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. అయితే చాలా రోజుల తర్వాత ఒక హీరోయిన్ మాత్రం సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది.

తమిళ్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అంజలి తెలుగులో అంతగా రాణించకపోయినా కూడా కోలీవుడ్ లో మాత్రం మంచి గుర్తింపును అందుకుంది. సంప్రదాయంగా కనిపిస్తూనే గ్లామర్ రోల్స్ ని కూడా టచ్ చేస్తోంది. అయితే గీతాంజలి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ నంది అవార్డును కూడా అందుకుంది. ఇక ప్రస్తుతం తమిళ్ తెలుగులో తెరకెక్కుతోన్న బెలూన్ అనే మరో హారర్ థ్రిల్లర్ లో కూడా అమ్మడి నటన అందరికి నచ్చుతుందట. ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే రీసెంట్ గా ప్రమోషన్స్ లో పాల్గొన్న అంజలిని  చూసిన అందరు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె చాలా స్లిమ్ గా రెడీ అయ్యిందిలే.

అయితే ఆ గ్లామర్ కోసం ఆమె చాలా కష్టపడిందట. మూడు నెలలు చాలా క్రమశిక్షణ తో వర్కౌట్స్ చేయడం వల్ల మూడు నెలల్లో దాదాపు 7 కిలోల బరువు తగ్గిందట. అంతే కాకుండా ఆమె ఎక్కువగా హైదరాబాద్ లోనే జిమ్ వర్కౌట్స్ చేశారట. ఈ సినిమాలో తన పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందని అంజలి వివరించింది. మరి సినిమాకు అమ్మడి ఆకృతి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.

అభిమానినంటూ వచ్చి షూటింగ్ స్పాట్ లోనే హీరోను కొట్టేసాడు

Drunk-man-assaults-Arjun-Kapoor-on-Sandeep-Aur-Pinky-Faraar-sets-Andhra-Talkies-Telugu
బాలీవుడ్ యువ కథానాయకుడు అర్జున్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ‘సందీప్ ఔర్ పింకీ పరార్’ షూటింగ్ స్పాట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓ అపరిచిత వ్యక్తి అర్జున్ మీద దాడికి తెగబడ్డాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో షూటింగ్ జరుగుతుండగా.. హీరో అభిమానినంటూ వచ్చి.. ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దీంతో అర్జున్ స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. దాడి చేసిన వ్యక్తిన పోలీసులు అరెస్టు చేశారు.

సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కమల్ కుమార్ అనే వ్యక్తి అర్జున్ అభిమానినంటూ వచ్చి అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయి అర్జున్ చేయి చాపగానే అతడి చేతిని మెలిపెట్టాడు. తర్వాత అతడిపై దాడి చేశాడు. ఆ సమయంలో అర్జున్ వ్యానిటీ వ్యాన్ దగ్గర ఉన్నట్లు తెలిసింది. దాడికి పాల్పడిన వ్యక్తి ఓ కారు డ్రైవర్ అని గుర్తించారు.

అర్జున్ మీద దాడి చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. యూనిట్ సభ్యులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా.. వారు అతడి కారును కూడా స్వాధీనం చేసుకొన్నారు. మోటార్ వెహికిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అతడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని రవాణా విభాగానికి సూచించారు. త్వరలోనే కమల్ లైసెన్స్ ను స్వాధీనం చేసుకొని జప్తు చేస్తామని రవాణా అధికారులు వెల్లడించారు. ‘సందీప్ ఔర్ పింకీ పరార్’లో అర్జున్ ఫెరోషియస్ పోలీస్ పాత్ర చేస్తున్నాడు. ఇందులో పరిణీతి చోప్రా కథానాయిక. వీళ్లిద్దరూ ఇంతకుముందు ‘ఇషాక్ జాదే’ సినిమాలో నటించారు.

రెండొందలు సినిమా టిక్కెట్టా? టూ మచ్

Pawan-kalyan-agnathavasi-Movie-Uniform-ticket-Prices-Andhra-Talkies
యూనిఫామ్ టికెట్.. ఈ మధ్య పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఈ పేరు బాగా వినిపిస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకంటే ఎక్కువ స్థాయిలో టికెట్ ను విక్రయించడం మామూలైపోయింది. ఈ రోజుల్లో ఏ సినిమా అయినా మొదటి వారంలోనే ఎక్కువగా కలెక్షన్స్ ని వసూలు చేస్తున్నాయి. ఆ తర్వాత టాక్ ను బట్టి వసూళ్లు అందుతాయి. ఇక పైరసి దెబ్బ ఎంతో కొంత పడుతుంది. దీంతో బారి బడ్జెట్ సినిమాలు నష్టపోతాయి అనే కారణం చేత కొందరు సినిమా టికెట్స్ రేట్ ను పెంచేస్తున్నారు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి నిర్మాతలు బయ్యర్స్ కూడా అదే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. సినిమా ఇప్పటికే 150 కోట్ల బిజినెస్ చేసిందట. బయ్యర్స్ అయితే సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. అయితే సినిమా ఎలాగైనా మొదటి వారంలోనే కొన్న ధరను  అందుకోవాలని  యూనిఫామ్ టికెట్ ను పెట్టనున్నారట. అంటే ఒక్క టికెట్ ధర రూ.200 ఉండనుందట. ఇప్పటికే మల్టిప్లెక్స్ లు రూ.150 నుంచి రూ.250 వరకు లాగుతున్నాయి. అయితే అజ్ఞాతవాసి సినిమాకు ఇప్పుడు అన్ని థియేటర్స్ లో రూ.200 టికెట్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఇది టూ మచ్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఈ రేట్ కోనసాగనుందని తెలుస్తోంది. ఏపీ లో అయితే పవన్ స్టామినాతో క్లారిటీ రావొచ్చు. ఇక దిల్ రాజు కూడా సినిమాలో భాగం కానున్నాడు కాబట్టి ఇక్కడి రాజకీయాల్లో ఆయనకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి నైజాంలో కూడా ఆ రేటును పెట్టించడం పెద్ద కష్టమేం కాదు. మరి వీరు అనుకున్నట్టు జరుగుతుందా లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  

యాక్టర్ కాబోయి డైరెక్టర్ అయ్యా

Director-Bobby-about-His-Acting-Dream-andhra-talkies-telugu.jpg
సినిమా అనేది అందమైన రంగుల ప్రపంచం. అందులో వెలిగిపోవాలని ఎందరో కలలు కంటుంటారు. సినిమాల్లో నటించాలని ఊరు వదిలి ఫిలిం నగర్ కు వచ్చినవాళ్లు ఎలాగైనా వెండితెరపై కనిపించాలని తాపత్రయపడుతుంటారు. చిన్నాచితకా పాత్రలైనా చేయడానికి రెడీ అవుతారు. కానీ తెరపై కనిపించే ఛాన్స్ వచ్చినా లాగు వేసుకోవాల్సి వస్తుందన్న కారణంతో నటించడానికి ఇష్టపడలేదంటున్నాడు యంగ్ డైరెక్టర్ బాబి.

సినిమా రచయితగా డైరెక్టర్గా కంటే నటించే ఛాన్సే బాబికి ముందు వచ్చిందట. ఆ విషయం అతడే స్వయంగా చెప్పుకొచ్చాడు.  ‘‘రైటర్ చిన్నికృష్ణ వల్ల అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా గంగోత్రిలో యాక్టింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో బన్నీ వెనుక నలుగురైదుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో నేనూ ఒకడ్ని. సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలాసేపు బన్నీ నిక్కరుతోనే ఉంటాడు. అతడి వెనుక ఉండే నన్ను కూడా అదే వేసుకోమన్నారు. మూడో తరగతి నుంచే నేను ఫుల్ ప్యాంట్ వేసుకునే వాడిని. అలాంటిది అంత పెద్దయ్యాక లాగు వేసుకోవడం నా వల్ల కాలేదు. దాంతో ఆ సినిమా వదులుకున్నా’’ అంటూ వెండితెరపై తను నటించే అవకాశం ఎలా తప్పిపోయిందో గుర్తు చేసుకున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డైరెక్ట్ చేసిన బాబి లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జైలవకుశ సినిమా తీశాడు. ఎన్టీఆర్ ను  తొలిసారి ట్రిపుల్ రోల్ లో చూపించి అతడి అభిమానులకు పండగ చేశాడు. ఈ సినిమా డైరరెక్టర్ గా బాబికి మంచి పేరు తెచ్చిపెట్టింది. 

టాక్: రాష్ట్ర రాజధాని అమరావతిలో రామానాయుడు స్టూడియో

Suresh-Babu-To-Build-Ramanaidu-Studios-in-amaravati-Andhra-Talkies.jpg
రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్న నగరంగా అందరూ గుర్తించినది విశాఖపట్నం. సినిమా ఇండస్ట్రీకి వైజాగ్ ఎప్పటి నుంచో ఫేవరెట్ సిటీ. సినిమా షూటింగులకు అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం ఇక్కడుంటుంది. అందుకే మూవీ మొఘల్ రామానాయుడు విశాఖలో సినిమా స్టూడియో కూడా నిర్మించారు. తాజాగా ఇండస్ట్రీలో కొంతమంది రాజధాని అమరావతిపై ఫోకస్ పెట్టారు.

అమరావతిని రానున్న రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇక్కడ పట్టు పెంచుకోగలిగితే వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడం తేలికవుతున్నది అమరావతిని ప్రిఫర్ చేస్తున్న వాళ్ల ఆలోచనగా ఉంది. ఇండస్ట్రీలోని పెద్ద నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు అమరావతిలో స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ప్రభుత్వం భూమి ఇస్తే వైజాగ్ లో తన తండ్రి రామానాయుడు కట్టిన విధంగా అమరావతిలోనూ స్టూడియో కడదామని ప్లాన్ చేస్తున్నారనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఆయనతో పాటు మరికొంతమంది సినిమా పెద్దలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి స్టూడియోల నిర్మాణానికి భూములు కావాలని కోరినట్లు తెలుస్తోంది. హీరో - ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం సినిమాపరంగా విశాఖను అభివృద్ధి చేయడమే అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీని ఎక్కడ డెవలప్ చేయాలన్న దానిపై ఇంకా నిర్ణయమేదీ తీసుకోలేదని ఫిలిం డెవలప్ కార్పొరేషన్ ఛైర్మన్ అంబికా కృష్ణ అంటున్నారు. నంది అవార్డుల ప్రకటన తర్వాత వచ్చిన వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి స్పందించడమే మేలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. నంది అవార్డుల ఫంక్షన్ తరవాత దీనిపై నిర్ణయం తీసుకోవచ్చనేది తెలుస్తోంది. 

చేసిన నేరాన్ని ఒప్పుకున్న ప్రముఖ నటుడు

saidapet-court-fine-rs-5200-on-Tamil-Actor-Jai-Andhra-Talkies.jpg
తప్పులు చేయటం.. తమకే పాపం తెలీదన్నట్లుగా వ్యవహరించటం కొందరు ప్రముఖ నటీనటులకు తెలిసిన విద్యనే. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ జీవించే గుణం ఉన్న నటుల ఉదంతాలు అందరికి తెలిసిందే. నేరం చేసి కూడా.. కాదంటే కాదంటూ వాదించి అడ్డంగా దొరికిపోయినోళ్లు కొందరైతే.. మరికొందరు తప్పించుకున్నోళ్లు ఉన్నారు. తాజాగా మాత్రం  చేసిన తప్పును కోర్టు ఎదుట ఒప్పేసుకున్నారో ప్రముఖ నటుడు.

తమిళ యువ నటుడిగా సుపరిచితుడైన జై.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. జర్నీ లాంటి అనువాద సినిమాలతో  తెలుగోళ్లకు దగ్గరైన ఆయన.. ఈ మధ్యన డ్రంక్ అండ్ డ్రై నేరంలో బుక్ అయ్యారు. గత నెల 21న మద్యం తాగేసి కారు నడపటమే కాదు.. చెన్నై మహానగరంలోని అడయారు బ్రిడ్జి సమీపంలోని గోడను ఢీ కొట్టారు.

ఈ ఉదంతంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి.. సైదాబాద్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే.. ఈ కేసు విచారణ గురువారం వచ్చింది. అయితే.. విచారణకు జై హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి జైకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టుకు వచ్చిన జై.. తాను చేసిన నేరాన్ని అంగీకరించారు.

దీంతో అతనికి రూ.5200 జరిమానా విధించటంతో పాటు.. ఆరు నెలల పాటు వాహనాన్ని డ్రైవ్ చేయకూడదన్న ఆదేశాల్ని జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో రానున్న ఆరునెలల పాటు జై.. వాహనం నడిపే అవకాశాన్ని కోల్పోయారు.
saidapet-court-fine-rs-5-200-on-Tamil-Actor-Jai-Andhra-Talkies

ముస్లింతో పెళ్ళి.. డోంట్ కేర్ - Priyamani

Sexy-Heroin-Priyamani-About-Her-Marriage-Andhra-Talkies
జగపతి బాబుతో కలిసి నటించిన పెళ్లయిన కొత్తలో సినిమాతో ప్రియమణి తెలుగులో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్నాళ్లు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ఈమధ్యనే ముస్తఫా రాజ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నా తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదంటోంది  ప్రియమణి.  పెళ్లయిన తర్వాత మొదటి సారిగా మీడియా ముందుకొచ్చిన ఆమె తన ప్రేమ కబుర్లు - వైవాహిక జీవితం గురించి ఎన్నో విశేషాలు చెప్పింది. 

‘‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో మొదటిసారి ముస్తఫాని చూశాను. అప్పటికప్పుడుమా మధ్య ప్రేమ పుట్టేయలేదు. ముందు ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉన్నాం. నా పట్ల ఆయన కేర్ తీసుకునే తీరు నాకెంతో నచ్చింది. అలా ప్రేమలో పడ్డాను. పెళ్లయింది కదాని సినిమాలకు దూరం అవ్వాలని అనుకోవడం లేదు.  నిజం చెప్పాలంటే పెళ్లయిన మూడో రోజే షూటింగ్ కు వెళ్లిపోయాను. అప్పుడు కూడా నా భర్త అర్థం చేసుకున్నారు. ఆడవాళ్లు పెళ్లయ్యాక అన్నీ వదిలేసి వంటింటికే పరిమితమై పోవాలని కోరుకునే టైప్ కాదు మా ఆయన’’ అంటూ ప్రియమణి తన లైఫ్ పార్ట్ నర్ గురించిన విశేషాలు చెప్పుకొచ్చింది.

తాను ఓ ముస్లింని పెళ్లి చేసుకుంటున్న ఓ విషయం మీడియాకు చెప్పినప్పుడు చాలా నెగిటివ్ కామెంట్లు వచ్చాయని చెప్పింది ప్రియమణి. కానీ అవేం తాను లెక్క చేయలేదని అంటోంది. తన పెళ్లికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఎవరమనుకున్నా డోంట్ కేర్ అని.. తనకు సంబంధించినంత వరకు తన భర్త - కుటుంబమే ముఖ్యమంటోంది ప్రియమణి.
Sexy-Heroin-Priyamani-About-Her-Marriage-Andhra-Talkies

దీపావళికి పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఖాయమేనట

Mega-Hero-Pawan-kalyan-25th-movie-First-Look-Teaser-on-Diwali-Andhra-Talkies
స్టార్ హీరోల సినిమాలు మొదలైన దగ్గర నుంచి.. షూటింగ్ ఎండింగ్ వరకు సినిమాకు సంబంధించిన న్యూస్ ఏదో ఒకటి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ తెగ ఉత్సాహం చూపిస్తారు. మధ్యలో పండుగలు వస్తే.. ఫస్ట్ లుక్.. మోషన్ పోస్టర్.. టీజర్.. ప్రోమో.. గ్లింప్స్.. ఇలా రకరకాల పేర్లతో అభిమానులకు గిఫ్ట్ ఇస్తుంటారు. పవన్ కళ్యాణ్ సినిమాను మొదలు పెట్టి నెలలు గడుస్తోన్నా.. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గాని ఫస్ట్ లుక్ గాని పూర్తి స్థాయిలో బయటకు రాలేదు.

రీసెంట్ గా పవన్ పుట్టిన రోజున అనిరుధ్ స్వరపరిచిన ఓ పాట టీజర్ ని విడుదల చేశారంతే. దీంతో పాటు ఇక థీమ్ పోస్టర్ని కూడా చూపించారు. వాటితో అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. అందుకే దసరా నాటికి ఓ టీజర్ ని రిలీజ్ చేద్దామని దర్శకుడు త్రివిక్రమ్ భావించాడట. కానీ షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ లో ఉండడంతో.. చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారని తెలుస్తోంది. అయితే.. దీపావళి కి మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునేలా తప్పకుండా టీజర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం చిత్ర యూనిట్ హాలిడే బ్రేక్ లో ఉంది. రీసెంట్ గా విదేశాల్లో చిత్రీకరణకు పూర్తి చేసుకొని వచ్చింది. మళ్లీ అక్టోబర్ మొదటి వారంలో మరో షెడ్యూల్ నిమిత్తం త్రివిక్రమ్ టీమ్ విదేశాలకు ప్రయాణం కానుండగా.. దీపావళికి టీజర్ విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. .

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. డిసెంబర్ ప్రారంభాని కల్లా సినిమాను పూర్తి  చెయ్యాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నాడట. డిసెంబర్ లోనే పాటలు.. ట్రైలర్ రిలీజ్ కానుండగా.. జనవరి 10న ఈ చిత్రం విడుదల చేస్తామని ఇఫ్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసేశారు.
Mega-Hero-Pawan-kalyan-25th-movie-First-Look-Teaser-on-Diwali-Andhra-Talkies

మీలో కామోద్రేకాలు తారా స్థాయికి చేరాలంటే


పవన్ కళ్యాణ్ వయస్సు పై అన్నీ సందేహాలే!!

Pawan-Kalyan-s-age-is-all-doubted
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  సినిమా రిలీజ్ అయ్యిందంటే ఆ మ్యానియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన గుణంతో ప్రేక్షకుల ప్రేమను సంపాదించుకున్న ఈ స్టార్ జయాపజయాలను అస్సలు పట్టించుకోడు. ఇన్నేళ్ళలో పవన్ తీసింది 25 సినిమాలే కానీ 100 సినిమాలు తీసిన హీరోలకన్నా ఎక్కువ అభిమానులు సంపాదించుకున్నాడు.

అయితే ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్బంగా మెగా అభిమానులు సంతోషంగా ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. సినీతారలు కూడా పవన్ కి విషెస్ తెలిపారు. చరణ్ కూడా ఎంతో విధేయతతో బాబాయ్ తనకు ఆదర్శమంటూ.. ఫేస్ బుక్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపాడు. అయితే పవన్ పుట్టిన సంవత్సరం గురించి  ఇప్పుడు ఒక రూమర్ తెగ హాల్ చల్ చేస్తోంది. అదేమిటంటే ప్రస్తుతం పవన్ 50 వయసులోకి లోకి వచ్చాడా లేదా 46లోనే ఉన్నాడా అనే సందేహం వెలువడుతోంది.

ఎందుకంటే కొన్ని ప్రముఖ వెబ్ సైట్స్ లలో పవన్ కళ్యాణ్ పుట్టిన సంవత్సరం రెండు విధాలుగా కనిపిస్తున్నాయి. కొన్ని వాటిలో 2 సెప్టెంబర్ 1967  అని ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాదికి పవన్ యాభై ఏళ్ళు వస్తాయి. అలాగే మరొక చోట 1970 లో జన్మించినట్లు ఉంది. దీంతో ఇక్కడ 47 ఏళ్ళే అని కొందరు అంటున్నారు. ఇక ప్రముఖ వెబ్ సైట్ వికీపీడియాలో అయితే కొన్ని రోజుల వరకు ఈ రెండు తేదీలు కనబడేవి కానీ ఆ తర్వాత మార్చారు.

ఇక కొందరు అభిమానులు మాత్రం.. పవన్ పాత ఓటర్ కార్డు ఫోటో ఒకటి చూపిస్తూ ఆన 1968లో పుట్టారని అంటున్నారు. అంటే ఆయనకు 49 ఏళ్ళు వచ్చినట్లు. అయినా వయసు ఎంతైనా పవన్ తన స్టైల్ తో యువ హీరోగా  అభిమానులను ఇంకా అలరిస్తూనే ఉన్నాడు.
Pawan Kalyan's age is all doubted

తల్లిని తిట్టడమేంటి?...‘అర్జున్ రెడ్డి’పై అనసూయ ట్విట్టర్ వార్

What-about-the-mother-Anasuya-Twitter-war-on-Arjun-Reddy
ఇటీవల విడుదలైన 'అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో చాలా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా ఓ వైపు సూపర్ హిట్ టాక్‌తో దూసుకెలుతున్నప్పటికీ, సినిమాపై కొందరు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ చిత్రం యువతను చెడగొట్టే విధంగా ఉందని, బూతు సీన్లు, బూతు పదాలు ఉన్నాయంటూ చాలా గొడవ జరగుతోంది.
ప్రముఖ యాంకర్, నటి అనసూయ కూడా 'అర్జున్ రెడ్డి' సినిమాపై విమర్శలు చేశారు. ఈ సినిమాలో వాడిన కొన్ని బూతు పదాలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో హీరో ఎవరినో తిట్టేక్రమంలో అమ్మను ఉద్దేశించి బూతు పదాలు పయోగించడంపై అనసూయ మండి పడుతున్నారు....Read More

హీరోయిన్ గా మారిన సమంత చెల్లెలు

Samantha-sister-Navika-Kotia-Turns-As-Heroine-andhra-talkies-telugu
జబర్ధస్థ్ కామెడీ షోతో కమీడియన్ గా సినిమాల్లోకి వచ్చిన షకలక శంకర్ తాజాగా హీరోగా కూడా మారాడు. శంకర్ హీరోగా నూతన దర్శకుడు సత్య దర్శకత్వంలో డ్రైవర్ రాముడు అనే  కామెడీ యాక్షన్ సినిమా రెడీ అవుతుంది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నవికా కొటియా హీరోయిన్ గా నటిస్తుందని చిత్ర వర్గాలు తెలిపాయి. అత్తారింటికి దారేది సినిమాలో సమంత - ప్రణిత చెల్లెలుగా నటించింది నవికాకోటియా. కమీడియన్ గా బిజీ అవుతున్న టైమ్ లో శంకర్ హీరోగా కూడా తన లక్ టెస్ట్ చేసుకోడానికి డ్రైవర్ రాముడు ని ట్రై చేస్తున్నాడు. గతంలో సునీల్ హీరో లాంఛింగ్ మూవీ అందాలరాముడు స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కుతుందని సినీజనాలు అంటున్నారు. శంకర్ కి ప్లస్ పాయింట్ గా నిలిచే స్పూఫ్ లతో ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని  వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా మారిన నవికకోటియా గతంలో పలు భారీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. తమిళంలో కూడా ఈ బ్యూటీ నటించింది. గతేడాది విడుదలైన విజయ్ థేరీ సినిమాలో నవికా ఓ కీలక పాత్ర పోషించింది. అలానే బుల్లితెరలో కూడా నటించిన ఎక్స్ పీరియన్స్ నవికాకు ఉంది. టీవీ నుంచి బిగ్ స్క్రీన్ కి ప్రమోట్ అయిన చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంకర్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంటూ తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న నవికా కోటియా కెరీర్ ఎలా ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Read More : Andhra Talkies

Tags : Telugu NewsTelugu Cinema NewsTelugu Movie News, Telugu Film News, Tollywood News, Tollywood Latest News, Latest Tollywood News, Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Tollywood Movie ReviewsTollywood Film Reviews, Andhra News, Telangana News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

వీహెచ్ కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బస్తీ మే సవాల్!

Director-Ram-Gopal-Varma-Challenges-to-V-Hanumantha-Rao-andhra-talkies-telugu
అర్జున్ రెడ్డి సినిమా  పోస్టర్లపై చెలరేగిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా పోస్టర్లు అసభ్యకరంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు వాటిని చించేసిన సంగతి తెలిసిందే. దాంతో వీహెచ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మతన ఫేస్ బుక్ ఖాతాలో వ్యంగ్యాత్మక వ్యాఖ్యలు చేశాడు. వర్మను హైదరాబాద్ లో అడుగుపెట్టనీయమంటూ వీహెచ్ హెచ్చరించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ వర్మ బదులిచ్చాడు.  అంతేకాకుండా తాను రేపు ఈ సినిమా చూడడానికి ప్రసాద్ ఐమ్యాక్స్ కు వెళ్తున్నానని - అక్కడ కలుద్దామని వీహెచ్ కు సవాల్ విసిరాడు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.

అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్ల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. వీహెచ్ పై వర్మ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఈ పోస్టర్ల వివాదంలో తన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు రావాలని వీహెచ్ కు వర్మ సవాల్ విసిరాడు. తనను హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వనని హెచ్చరించిన వీహెచ్ పై వర్మ మండి పడ్డాడు. బస్సులపై తన సినిమా పోస్టర్లను చించేసినందుకు బదులుగా వీహెచ్ బట్టలు చింపేయాలని ఆ చిత్ర హీరో విజయ్ దేవరకొండను కోరాడు. వీహెచ్ గారికి ఆ చిత్ర నిర్మాతలు పబ్లిసిటీ కోసం డబ్బులు చెల్లించినట్లు తనకు అనుమానంగా ఉందని వర్మ సెటైర్ వేశాడు. ఈ డబ్బుల వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ జరపాలన్నాడు.

మీలో శృంగార కళ ఉండాలంటే ఈ 10 లక్షణాలు అవసరం.

గర్భవతి కావడం వల్లనే హడావుడిగా ఆ హీరోయిన్ వివాహం చేసుకుంది?

Is-the-heroine-married-as-she-was-pregnant
బాలీవుడ్ బ్యూటీ రియా సేన్ వివాహం మూడురోజుల క్రితం పుణెలో జరిగిన సంగతి తెలిసిందే. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ శివం తివారీని ఆమె పెళ్లాడారు. పెళ్లి ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. వివాహం జరిగిన విషయం రెండు రోజుల తర్వాత రియా సోదరి రైమా సేన్ సోషల్ మీడియా ద్వారా ఫోటోలు రిలీజ్ చేసే వరకు ఎవరికీ తెలియదు. ఇంత రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? కనీసం సినీ ఇండస్ట్రీ వారిని కూడా పిలవక పోవడాని కాకరణం ఏమిటి అనే సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది...Read More

రెండు తరాలైనా తరగని ఆస్తి మాది: మహానటి సావిత్రి ఆస్తులపై కూతురు హాట్ కామెంట్!

Two-types-of-renewable-property-are-ours-Mahanata-Savitri-is-a-daughter-Hot-comment
మహానటి 'సావిత్రి' గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉ న్నాయి. స్టార్ హీరోయిన్ గా ఉన్నపుడు బాగా సంపాదించిన ఆమె తర్వాత తాగుడుకు బానిసగా మారి జీవితం చివరి దశలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో గడిపిందని, అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బు లేక దీనమైన స్థితిలో మరణించిందని అంటుంటారు. అయితే ఈ ప్రచారం అంతా అబద్ధమని అంటున్నారు సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి. అమ్మ ఏ విధమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొలేదని, ఆమె సంపాదించిన డబ్బుతోనే తాము ఇప్పటికీ సుఖంగా బతుకుతున్నామని తెలిపారు...Read More

దేశం వర్థిల్లాలి... రోమాలు నిక్కబొడుస్తాయ్: ఒక్కడు మిగిలాడు ట్రైలర్

The-country-should-dance-the-hair-nickboodstoy-The-one-left-was-a-trailer
మంచు మనోజ్ కథానాయకుడిగా అజయ్ ఆండ్ర్యూస్ 'ఒక్కడు మిగిలాడు' సినిమాను తెరకెక్కించాడు. "దేశం వర్థిల్లాలి" అంటూ ఆవేశంగా కనిపించబోతున్న మనోజ్ ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్ గా .. ఓ స్టూడెంట్ గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఈ సినిమాలో మనోజ్ జోడీగా అనీషా ఆంబ్రోస్ నటించింది. వివరాలలోకి వెళితే...Read More

వేషాల కోసం పడకగదికి రమ్మన్నారు...నిరాకరించినందుకు అలా చేశారు..శ్రద్దాదాస్ (ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ)

Come to bed for the masculinity ... to refuse to do so .. sraddhadas (exclusive interview)
సినీ పరిశ్రమలో సత్తా ఉన్న యాక్టర్లలో శ్రద్ధా దాస్ ఒకరు. సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన ఆర్య - 2, కరుణాకరన్ దర్శకత్వంలో డార్లింగ్ , దిల్ రాజు మరో చరిత్ర చిత్రాల్లో నటించారు. పదేళ్ల కెరీర్‌లో పలు భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన బాబూ మొషాయ్ బందూక్ బాజ్ చిత్రం సెన్సార్ కోరల్లో ఇరుక్కుంది. పలు సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 48 కట్స్ సూచించింది. దాంతో సెన్సార్ బోర్డుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పిల్మీబీట్ తెలుగు శ్రద్దాదాస్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ వివరాలు....Read More

‘స్పైడర్’ హిందీ రిలీజ్ అడ్డుకుంటున్నది ఎవరో తెలుసా?

Do-you-know-who-spider-hinders-the-Hindi-release
మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'స్పైడర్'. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలో రిలీజ్ చేయాలని ముందే నిర్ణయించారు. అయితే హిందీ రిలీజ్ మీద చిత్ర యూనిట్ కాస్త డౌట్‌ఫుల్‌గా ఉన్నట్లు సమాచారం. ఏఆర్ మురుగదాస్ సినిమాలకు హిందీలో మంచి డిమాండ్ ఉంది. అదే సమయంలో మహేష్ బాబుకు కూడా అక్కడ గుర్తింపు ఉంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నప్పటికీ మహేష్ బాబు అడ్డు చెబుతున్నట్లు తెలుస్తోంది...Read More

వారెవ్వా! సన్నీలియోన్ అంటే ఏమనుకున్నారు?

Sunny-Leone-Receives-a-Jaw-dropping-Welcome-In-Kochi-Andhra-Talkies-telugu
ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక ఫొటో హల్ చల్ చేస్తోంది. ఒక సిటీలోని పెద్ద ఫ్లై ఓవర్ కింద ఒక కారు చుట్టేసి వేలల్లో జనం కనిపిస్తున్నారు. ఇటు అటు చాలా దూరం పాటు ఇసుకేస్తే రాలనంతగా జనాలు మూగి ఉన్నారు. ఆ ఫొటో చూపించి.. కార్లో ఉన్న సెలబ్రెటీ ఎవరో చెప్పుకోండి చూద్దా అంటే. సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. విజయ్.. అజిత్.. మహేష్ బాబు అంటూ పెద్ద పెద్ద స్టార్ల పేర్లు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఆ కార్లో ఉన్న వ్యక్తి సన్నీ లియోన్. ఆమెను చూడ్డానికే కొచ్చి జనాలు అంతగా ఎగబడ్డారు. ఈ ఫొటో ఒక్కటి చాలు సన్నీలియోన్ కు ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో చెప్పడానికి.

గతంలోనూ ఒకసారి కొచ్చికి వెళ్లి సందడి చేసిన సన్నీ.. తాజాగా మరోమారు అక్కడికి వెళ్లింది. ‘ఫోన్ 4 డిజిటల్ హబ్’ అనే షో రూం ఆవిష్కరణ కోసం కొచ్చిలో అడుగుపెట్టిన సన్నీకి అక్కడి జనం బ్రహ్మరథం పట్టారు. వేలాది మంది కారును చుట్టుముట్టేశారు. కారు ముందుకు కదలనివ్వలేనంతగా మూగిపోయారు. ఏరియల్ వ్యూలో ఈ ఫొటో చూస్తే వారెవా అనిపిస్తోంది. సన్నీ లియాన్ ఫాలోయింగ్ మజాకా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు జనాలు. సన్నీ కూడా తన మీద కుర్రాళ్లలోని అభిమానం చూసి మురిసిపోతూ.. థ్యాంక్ యు కొచ్చి అంటూ క్యాప్షన్ పెట్టి ఈ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసుకుంది.

భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌.. బతికున్నారా లేదా?

Indian freedom fighter Netaji Subhash Chandra Bose...Have you survived?
భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘బోస్‌- డెడ్‌/ఎలైవ్‌’. పుల్కిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రీల్‌ లైఫ్‌ బోస్‌గా బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌ నటిస్తున్నారు.
ఈ చిత్ర టీజర్‌ ఈ రోజు విడుదల చేశారు. రేపు 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ టీజర్‌ను రాజ్‌కుమార్‌ రావ్‌ ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. టీజర్‌లో యువకుడిగా ఉన్నప్పుడు బోస్‌ ఎలా ఉండేవారో చూపిస్తూ ‘బోస్‌..బోస్‌’ అంటూ వస్తున్న బ్యాక్‌గ్రౌండ్‌ పాట ఆకట్టుకుంటోంది. బోస్‌ ఎలా చనిపోయారు? ఆయన మరణం ఎందుకింత చర్చనీయాంశంగా మారింది? అన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్‌ 18న ట్రైలర్‌ విడుదల చేయనున్నారు.
Indian freedom fighter Netaji Subhash Chandra Bose...Have you survived?

స్త్రీలు సిగరెట్ తాగితే తప్పేముంది? అంటున్న భామ

Girls-Who-Smoke-Are-Not-Characterless-Says-Kriti-Sanon-Andhra-Talkies-Telugu
చాలా మంది హీరోయిన్స్ స్టార్ హీరోస్ తో నటించడానికి చాలా ఇష్టపడతారు. అందుకు వారు ఎంతో కష్టపడి చిన్న తరహా సినిమాలతో క్లిక్ అయితేనే స్టార్ హీరోస్ తో ఛాన్సులను దక్కించుకుంటారు. కానీ కొందరు హీరోయిన్లు మొదటి ఛాన్సులలోనే నెంబర్ వన్ లాంటి హీరోలతో జోడి కడతారు. అలా ఛాన్సులు దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు క్రితి సనన్. మొదటి సినిమాతోనే మహేష్ బాబు "1 నేనెక్కడినే" వంటి భారీ సినిమాలో మెరిసింది. అయితే ఆ సినిమా ఈ అమ్మడికి అంతగా కలిసి రాలేదు.

కానీ హిందీలో చిన్న హీరోలతో జోడికట్టి పర్వాలేదనిపించింది. కానీ ఆ సంతోషం కూడా ఎన్నో రోజులు నిలవలేదు ఈ క్రితి సనన్ కి. ఆమె రీసెంట్ గా నటించిన "రాబ్తా" సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు కొత్త తరహాలో ఓ రొమాంటిక్ కామెడీ కథతో కూడిన "బరేలీ కి బార్ఫి" అనే సినిమాతో  రాబోతుంది.  అయితే రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని ఘాటు కామెంట్స్  చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత రోజుల్లో మహిళల పట్ల చూపిస్తున్న ఒక చిన్నచూపు తనకు నచ్చడం లేదట. ముఖ్యంగా అమ్మాయిలు కాస్త మోడెర్న్ గా కనిపించినా తప్పుగా చూస్తున్నారని చెప్పింది. అంతే కాకుండా టాటూలు వేసుకున్న మహిళలను సిగరెట్ - మద్యం అలవాట్లు ఉన్న మహిళలను పూర్తిగా క్యారెక్టర్ లేదని నిర్దారించడం సరైనది కాదని చెబుతోంది. అయితే ఈ అమ్మడు ఇలా మాట్లాడటానికి కారణం "బరేలీ కి బార్ఫి" అనే సినిమాలో అలాంటి పాత్రలోనే నటించిందట. ఆ సినిమాలో సిగరెట్ కూడా తాగిందట. దీంతో మహిళలకు చెడు అలవాట్లు ఉన్నంత మాత్రాన తప్పుగా చూడవద్దని హితబోధ చేస్తోంది.

అయితే ఈ సినిమాపై ఈ అమ్మడు భారీ ఆశలే పెట్టుకుందన్నమాట. కాకపోతే ఇలా సినిమా కోసం ఉద్దేశ్యాలను చెప్పడం బాగానే ఉంది కాని.. అలాంటి ఆదర్శాలే పక్కోళ్ళ ప్రియుళ్లను దొబ్బేసేటప్పుడు కూడా ఉండాలని జనం చెవులు కొరుక్కుంటున్నారు. 

కొరటాల మాటలు మనం ఆలోచించాల్సిన విషయమే

Director-Koratala-Siva-Comments-on-Present-Politics-Andhra-Talkies
సమాజానికి ఓ మంచి సందేశం ఇస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సవకుండా సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం  డైరెక్టర్ కొరటాల శివ స్పెషాలిటీ. రైటర్ గా మొదలెట్టి డైరెక్టర్ గా టర్న్ అయిన కొరటాల శివ మొదటి సినిమా మిర్చి నుంచి ప్రతి సినిమాలోనూ సొసైటీకి పనికొచ్చే ఏదో ఒక విషయం చెబుతూనే వచ్చాడు.

‘ఊరి నుంచి ఎంతో తీసుకున్నాం. తిరిగి ఇచ్చేయకపోతే లావైపోతాం’ అంటూ శ్రీమంతుడులో మహేష్ బాబుతో చెప్పించిన డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. సొంత ఊరికి ఎంతో కొంత మేలు చేసేందుకు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. కొరటాల శివ లేటెస్ట్ గా తీసిన జనతా గ్యారేజ్ సినిమా మొత్తం పర్యావరణ పరిరక్షణ చుట్టూ సాగుతోంది. మొక్కలు కాపాడుకోవాలనే సందేశాన్ని ఈ సినిమాలో బలంగానే వినిపించాడు. రీసెంట్ గా కొరటాల శివ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు. ‘రాజకీయాలు రానురాను దారుణాతిదారుణంగా దిగజారిపోతున్నాయి. ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో. దేవుడు కూడా దీని నుంచి కాపాడలేడు. మనం కాపాడుకోగలం.. మనం మాత్రమే కాపాడుకోగలం’ అంటూ బలమైన సందేశాన్ని వినిపించాడు.

రాజకీయ పరిస్థితులను చూసి ఆవేదన చెంది సరిపెట్టుకోకుండా పదిమందిలో ఆలోచన పెంచేలా కొరటాల శివ పెట్టిన ట్వీట్ అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగేది ప్రజలేనన్న నిజం అందరూ గుర్తెరగాలన్న ఆవేదన కొరటాల మాటల్లో కనిపిస్తోంది.  మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం కొరటాల శివ తీస్తున్న భరత్ అనే నేను సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతున్నదే కావడం విశేషం. బాలీవుడ్ భామ కియారీ అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

మలైకా అందుకు పనికి రానంటోందిగా

Malaika-Arora-Khan-on-Item-Songs-Andhra-Talkies
Malaika-Arora-Khan-on-Item-Songs-Andhra-Talkies
మలైకా అరోరా.. ఈ పేరు వినగానే సెన్సేషనల్ ఐటెం సాంగ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. 20 ఏళ్ల క్రితం దిల్ సే మూవీలో షారూక్ ఖాన్ తో కలిసి 'ఛయ్య ఛయ్య' పాటలో నర్తించినప్పటి నుంచి ఇప్పటివరకూ.. ఐటెం సాంగ్స్ తోనే ఫుల్ ఫేమస్ అయిపోయింది.

దబాంగ్ మూవీలో 'మున్నీ బద్నాం హుయి' అంటూ చేసిన స్పెషల్ సాంగ్ తర్వాత విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇదే సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ మూవీ గబ్బర్ సింగ్ అని తీస్తే.. 'కెవ్వు కేక'లు పెట్టించేసింది. దీనికంటే ముందే తెలుగులో మహేష్ బాబుతో అతిథి మూవీలో 'రాత్రయిన నాకు ఓకే' అంటూ చిందులేసింది. ఇలా మలైకా పేరు చెబితే పాటలు తప్ప గుర్తుకొచ్చే సినిమా రోల్ ఏదీ ఉండదు. మరి ఈ విషయంలో మలైకా ఏమనుకుంటోందో అడిగితే.. దిమ్మదిరిగి బొమ్మ కనిపించే ఆన్సర్ చెప్పింది మలైకా అరోరా.

అనసూయకు టైము లేదు బాసూ

Anasuya-Refuses-For-NTR-Bigg-Boss-Show-Andhra-Talkies-Telugu
వారానికి జూనియర్ ఎన్టీఆర్ కనిపించేది ఓ రెండు రోజులు మాత్రమే. కాని మిగతా రోజులంతా ఆ షోలో ఉన్న కంటెస్టంట్లే నెట్టుకురావాలి. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు వర్షన్ ను మరింత రంజింపచేయడానికి మనోళ్ళు కొత్త కంటెస్టంట్లను వైల్డ్ కార్డ్ ద్వారా లోపలకి పంపిస్తారని టాక్ వచ్చంది. ఇందులో ప్రముఖంగా హాట్ యాంకర్లైన అనసూయ మరియు రష్మి పేర్లు వినిపించాయి.

అయితే ఈ బిగ్ బాస్ అంటేనే కాస్త పేరున్న సెలబ్రిటీలు కంగారుపడుతున్నారు. ఎందుకంటే అక్కడ మేకప్ లేకుండా కనిపించాలి అలాగే ఒరిజినల్ గా ఎలా ఉంటారో కూడా తెలిసిపోతుంది. అందుకే చాలామంది ఈ అవకాశాన్ని వద్దని అంటున్నారట. ఇప్పుడు అనసూయ కూడా నో చెప్పేసింది. ''నాకు నా సినిమా కమిట్మెంట్లు.. యాంకరింగ్ వలన.. చాలా బిజీగా ఉన్నాను. అసలు డేట్లు ఖాళీగా లేవు. కాబట్టి బిగ్ బాస్ చేయలేను'' అంటూ చెప్పేసింది అనసూయ. అయితే బిగ్ బాస్ లో ఉన్నోళ్ళందరూ ఖాళీగా ఉన్నవారేనా అనసూయా? కాదులే బేబి.

ఇకపోతే పోసాని అండ్ రష్మి కూడా ఈ బిగ్ బాస్ కు నో చెప్పేసినట్లు టాక్ వస్తోంది. కాకపోతే మరో ఇద్దరు సెలబ్రిటీలతో ఇప్పుడు బిగ్  బాస్ వారు సంప్రదింపులు జరుపుతున్నారట. కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడి ఒప్పించేందుకు కూడా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి బిగ్ బాస్ షో మాత్రం ధనరాజ్ క్రియేట్ చేస్తున్న కాంట్రోవర్శీలు.. ముమాయత్ ఓవర్ యాక్షన్.. సమీర్ పంచులతో జరిగిపోతోంది. 

నాగబాబు... కెల్విన్ అయిపోయాడే!

Naga-Babu-seems-to-have-appealed-Media-not-to-circulate-his-photograph-as-that-of-Calvin-Andhra-talkies-telugu
తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకించి తెలుగు సినీ ఇండస్ట్రీ టాలీవుడ్ ను అతలాకుతలం చేసేస్తున్న డ్రగ్స్ దందాలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఈ విషయాలన్నీ నిజమో - కాదో తెలియదు గానీ... తెరపైకి వచ్చిన ప్రతి అంశంపైనా పెద్ద చర్చే జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ - ఆయన బృందం సభ్యులను ఊటంకిస్తూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఈ విషయాల్లో కొన్నింటినీ స్వయంగా దర్యాప్తు బృందమే విడుదల చేసిందన్న వాదన కూడా లేకపోలేదు. అయితే పూర్తి వివరాలను అందించకుండా... ఆయా విషయాలకు సంబంధించిన క్లూలు విడుదల చేస్తూ దర్యాప్తు అధికారులు కేసుకు ఉన్న ప్రాధాన్యాన్ని అటు జనానికి ఇటు ప్రభుత్వానికి తెలిసేలా చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది.

ఈ క్రమంలో ఈ దందాతో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఇప్పటికే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సినిమాటోగ్రాఫర్ శ్యాం కే. నాయుడులను సిట్ అధికారులు విచారించారు. ఈ విచారణ సందర్భంగా పోలీసులు ఓ వ్యక్తి ఫొటోను పూరీ జగన్నాథ్ ముందు పెట్టినట్లుగా వార్తలు వినిపించాయి. సదరు ఫొటో ఇటీవల జరిగిన జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్కు చెందినదని అందులో కెల్విన్ ఉన్నాడని ప్రచారం జరిగింది. ఇదే అదనుగా సదరు ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఇతడేనంటూ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. అసలు పోలీసులు ఏ ఫొటోను పూరీ ముందు పెట్టారో అసలు అలాంటి ఘటన విచారణలో జరిగిందో లేదో కూడా ఒక్క సిట్ సభ్యులతో పాటు పూరీకి మాత్రమే తెలుసు. అలాంటిది తమ సమక్షంలోనే విచారణ జరిగిందన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి కెల్వినేనని ఇతడే కెల్విన్ అంటూ ఓ ఫొటోను ప్రసారం చేశాయి.

అయితే ఆ ఫొటో కెల్విన్ ది కాకపోగా... బెంగళూరుకు చెందిన నాగబాబు అనే వ్యక్తిదట. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబే మీడియా ఛానెళ్లకు ఫోన్ చేసి మరీ వివరిస్తే గానీ జరిగిన పొరపాటు తెలియలేదట. తెలుగు న్యూస్ ఛానెళ్లలో తన ఫొటో వస్తున్న విషయాన్ని తెలుసుకున్న నాగబాబు... దానిని నిర్ధారించుకుని అక్కడి నుంచే ఆయా మీడియా సంస్థలకు ఫోన్ చేశాడట. మీరు చూపిస్తున్న ఫొటో కెల్విన్ ది కాదు.. ఆ ఫొటో తనదేనని  కావాలంటే... మెయిల్ ఐడీ - బ్యాంక్ ఖాతా - ఫేస్ బుక్ ఖాతాలను పరిశీలించాలని కూడా నాగబాబు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. నాగబాబు ఫోన్ నేపథ్యంలో.. ఇప్పుడదంతా వట్టిదే అని తేలిపోయింది. నిజనిజాలు నిర్దారించుకోకుండా మీడియా మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రోడ్లపైనే పలు మార్లు ఆ పని చేసిన ఆలియా భట్!

Alia-Bhatt-had-to-PEE-in-public-because-of-Imtiaz-Ali-Andhra-Talkies-telugu
సినిమాల కోసం ఈ మధ్య మరీ రియలిస్టిక్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి. నటీనటులు కూడా వాస్తవ ప్రపంచంలో ఉన్న సీన్స్ ను సినిమాల్లో చూపేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు. యాక్టర్స్ నుంచి వస్తున్న సపోర్ట్ ను చూసి.. ఫిలిం మేకర్స్ కూడా వాస్తవికతను తెరపై ఆవిష్కరించేస్తున్నారు.

ఇప్పటికే వాస్తవ సంఘటనలు.. వాటి ఆధారంగా రూపుదిద్దుకునే సినిమాల కౌంట్ తెగ పెరిగిపోతే.. ఇప్పుడు బాలీవుడ్ కుర్ర బ్యూటీ ఆలియా భట్ మరీ ధైర్యం చేసేసింది. ఓ సినిమా కోసం పబ్లిక్ ప్లేస్  లలో మూత్ర విసర్జన చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా చెబుతోంది ఆలియా. ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో రూపొందుతున్న హైవే చిత్రంలో నటిస్తోంది ఆలియా భట్. ఇది రోడ్ జర్నీ మూవీ కావడంతో.. ముందుగా ఫలానా ప్లేస్ లో షూటింగ్ చేయాలనే డెసిషన్స్ ఏమీ లేవని చెప్పిన ఆలియా.. అలా హైవే మీద వెళుతుండగా.. ఎక్కడ లొకేషన్.. లైటింగ్ బాగుంటే.. అక్కడ షూటింగ్ చేశామని చెప్పింది.

'ఇది ఓ గొరిల్లా టైపు షూటింగ్. నేను పబ్లిక్ ప్లేస్ లలోనే మూత్ర విసర్జన చేయాల్సి వచ్చేది. రోడ్లపైనే పలు మార్లు ఆ పని చేశాను. జోక్ ఏంటంటే.. జనాలకు నా వెనుక భాగం తప్ప మరేమీ కనిపించదు' అంటూ తన మీద తానే జోకులు వేసుకుంటోంది ఆలియా భట్.

More Read : Andhra Talkies information latest

Tags : Telugu NewsTelugu Cinema NewsTelugu Movie News, Telugu Film News, Tollywood News, Tollywood Latest News, Latest Tollywood News, Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Tollywood Movie ReviewsTollywood Film Reviews, Andhra News, Telangana News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

ముమైత్ ఖాన్ విచారణకు రావట్లేదు: అకున్ సబర్వాల్

Sexy-Actor-Mumaith-Khan-Enquiry-date-not-Confirmed-Akun-Sabarwal-Andhra-Talkies-Telugu
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల విచారణ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 19  నుంచి  27 వరకు ఒక్కొక్కరిని సిట్ అధికారులు విచారించనున్నారు. మొదటగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రేపు ఉదయం 10.30 నిమిషాలకు సిట్ విచారణకు హాజరు కానున్నారు. అయితే ఈ విచారణ నుంచి ముమైత్ ఖాన్ కు మినహాయింపు లభించిందని ఎక్సైజ్ (ఎన్ ఫోర్స్ మెంట్) డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పారు.  ముమైత్ ఖాన్ మినహా అందరూ విచారణకు హాజరు అవుతారన్నారు. డ్రగ్స్ మాఫియాపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

నోటీసులు తీసుకున్న వారిలో ముమైత్ఖాన్ మినహా అందరూ హాజరవుతారని ముమైత్ ఖాన్ ఓ షోలో ఉన్నందున ఆమె విచారణ తేదీని ఇంకా నిర్ణయించలేదని సబర్వాల్ తెలిపారు. ఒక్కో రోజు ఒక్కొకరిని విచారిస్తామని అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని అకున్ చెప్పారు. డ్రగ్స్ కేసులో కొత్తవాళ్లకు నోటీసులు ఇవ్వలేదని ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఓ టీవీ చానల్లో బిగ్ బాస్ కార్యక్రమంలో  ముమైత్ ఖాన్ పాల్గొనడం వల్లే స్వయంగా సిట్ ఎదుట హాజరు అయ్యేందుకు మినహాయింపు లభించినట్లు తెలుస్తోంది.

కాగా డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఈ నెల 19 నుంచి 27 మధ్య సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకానున్న సంగతి తెలిసిందే. కెల్విన్ కాల్ లిస్ట్ ఆధారంగా వీరికి తెలంగాణ ఎక్సైజ్శాఖ నోటీసులు జారీచేసింది. ఈ నెల 19న పూరీ జగన్నాథ్ - 20న హీరోయిన్ ఛార్మి - 22న సుబ్బరాజు - 23న శ్యాం కే నాయుడు సిట్ ఎదుట హాజరుకాబోతున్నారు. ఇక హీరో రవితేజ ఈ నెల 24న సిట్ ముందు హాజరు కాబోతున్నారు. ఈ నెల 25న చిన్నాను - 26న నవదీప్ - 27న తరుణ్ - 28న తనీష్ - నందులను సిట్ విచారించనుంది.
More Read : Andhra Talkies information latest

Tags : Telugu NewsTelugu Cinema NewsTelugu Movie News, Telugu Film News, Tollywood News, Tollywood Latest News, Latest Tollywood News, Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Tollywood Movie ReviewsTollywood Film Reviews, Andhra News, Telangana News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

డ్రగ్స్ మత్తులో తూగుతున్న తెలుగు ఇండస్ట్రీ నటీనటులు! ముందువరసలో రవితేజ్ - పూరి జగన్ - ఛార్మి??

Tollywood-Celebs-involved-In-Drug-Mafia-Andhra-Talkies-telugu
అసలు స్కూల్ పిల్లలు.. కాలేజీ యువత మాత్రమే హైదరాబాదులో ఈ డ్రగ్స్ మత్తులో తూగుతున్నారు అనుకుంటే.. ఇప్పుడు ఈ డ్రగ్స్ వాడకంలో వీరందరినీ మించి టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా పెద్ద ఎత్తులో మత్తులో తూగుతున్నారని ఎక్సయిజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు చెబుతున్నారు. ఈరోజు ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ వీరందరి పేర్లనూ బట్టబయలు చేసింది.

ఆ ఛానల్ రిపోర్టు ప్రకారం.. కెల్విన్.. కుదూస్.. వాహెద్ అనే ముగ్గురు డ్రగ్ పెడ్లర్లు అరెస్టయిన తరువాత.. వారి ఫోన్ కాల్స్ వాట్సాప్ మెసేజస్ ఆధారంగా చాలా వివరాలు ఆధారాలు సేకరించి.. ఇప్పుడు టాలీవుడ్ లో ఏకంగా 19 మంది ప్రముఖులను లిస్ట్ అవుట్ చేశారట. హీరో రవితేజ.. డైరక్టర్ పూరి జగన్.. హీరోయిన్ ఛార్మి.. ఐటం బాంబ్ ముమాయత్.. కెమెరామ్యాన్ శామ్.కె.నాయుడు.. యాక్టర్ సుబ్బరాజు.. ఆర్ట్ డైరక్టర్ చిన్నా.. హీరోలు తరుణ్.. నవదీప్.. తనీష్.. నందు.. లకు ఇప్పుడు ఎక్సయిజ్ శాఖ నోటీసులు కూడా అందించినట్లు సదరు ఛానల్ పేర్కొంది.

ఇప్పుడు ఈ సెలబ్రిటీలు తమ డ్రైవర్ల ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్న సిసి టివి ఫుటేజీలూ.. అలాగే ఈ సెలబ్రిటీలు డ్రగ్ పెడ్లర్లతో సాగించిన వాట్సాప్ సంభాషణలు.. వగైరా వగైరా సాక్ష్యాలు ఉన్నాయట. అంతేకాదు.. వీరిలో కొంతమంది సెలబ్రిటీలు బ్యాంకాక్ వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంటే.. కొందరు విచారణకు తాము హాజరు కాకుండా లాయర్ ను పంపిస్తామని చెబుతున్నారట. అయితే ఎక్సయిజ్ శాఖ మాత్రం.. పర్సనల్ గా విచారణకు రావల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది.

వీరందరూ 19వ తారీఖు నుండి 27వ తారీఖు మధ్యన నాంపల్లి ఎక్సయిజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులో అధికారుల సమక్షంలో విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వీరు హాజరుకాకపోతే మాత్రం అరెస్టు చేసే అవకాశం కూడా ఉందట. ఇప్పటివరకు 12 మంది తెలుగు సెలబ్రటీలు నోటీసులు అందుకోగా.. వారిలో 10 మంది నోటీస్ తీసుకున్నట్లు ఎక్నాలెడ్జమెంట్ కూడా అందిందంట.

ఇప్పుడు ఈ సెలబ్రిటీల్లో ఎంతమంది విచారణకు హాజరు అవుతారు.. ఎంతమంది పలుకుబడిని వాడుకుని తప్పించుకుంటారు.. చూడాల్సి ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు వీరి పేర్లను ఎక్సయిజ్ ఎన్ఫోర్స్ మెంట్ శాఖ అఫీషియల్ గా ప్రకటించే ఛాన్సున్నట్లు ఆ ఛానల్ కథనం తెలిపింది.
Tollywood-Celebs-involved-In-Drug-Mafia-Andhra-Talkies-telugu

Tags : Telugu NewsTelugu Cinema NewsTelugu Movie News, Telugu Film News, Tollywood News, Tollywood Latest News, Latest Tollywood News, Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Tollywood Movie ReviewsTollywood Film Reviews, Andhra News, Telangana News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

రచ్చబండ, బ్రతుకు జట్కాబండిలాంటి TV షోలపై విరుచుకుపడిన యండమూరి

Yandamuri-veerendranath-comments-on-TV-Shows-Andhra-Talkies-Telugu
ఈ మధ్య టీఆర్పీల కోసం టీవీషోలను భ్రష్ఠు పట్టించేస్తున్నారు. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలను నలుగురికి తెలిసేలా బహిరంగ చర్చకు తెస్తున్నారు. ఆ షో నిర్వహించే వ్యాఖ్యాతలు వారికి  నచ్చినట్లు పంచాయితీలు చేసేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో వస్తున్న అటువంటి షో లు ప్రేక్షకాదరణ పొందడం విచారకరమని ప్రముఖ రచయిత మానసిక వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు.

ఈ తరహా కార్యక్రమాల్లో వాస్తవాల గురించి ఓ న్యూస్ ఛానెల్ ఆయనను ప్రశ్నించింది. మానసికంగా ఆనందంగా ఉండే వాళ్లెవ్వరూ ఇలాంటి షోలు చూడాల్సిన అవసరం లేదని యండమూరి సమాధానమిచ్చారు. మానస వికాస నిపుణుడిగా తనకున్న అనుభవంతో టీవీ ఛానెల్స్ కు ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నా ఇలాంటి టీవీ షోలను ప్రసారం చేయవద్దని సూచిస్తున్నానని చెప్పారు. అదే సమయంలో ప్రేక్షకులు కూడా ఇటువంటి చెత్త  ప్రోగ్రామ్ లను చూడకుండా ఉంటే ట్యామ్ రేటింగ్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.


ఈ కుటుంబ కలహాల  షోలలో పాల్గొనే వారికి తాము తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ కూడా ఉండదని కేవలం పాపులారిటీ కోసం చేస్తుంటారని అన్నారు. ఆ టీవీ షోలలో తీర్పులిచ్చే వాళ్లు తమను మేథావులుగా భావించుకుంటారని విమర్శించారు. తీర్పులిచ్చేవాళ్ల  సీక్రెట్లన్నీ తనకు తెలుసన్నారు. హైదరాబాద్ లో వారు సంప్రదించే  సైకియాట్రిస్ట్ లందరూ తనకు ఫ్రెండ్సేనని చెప్పారు. టీవీ షోలలో తీర్పు ఇచ్చే స్థానంలో ఓ కుక్కను కూర్చోపెట్టినా అది తీర్పిచ్చేస్తూ ఉంటుందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ షో ల ఉద్దేశం ‘శవాల మీద డబ్బులు ఏరుకోవడమే’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Yandamuri-veerendranath-comments-on-TV-Shows-Andhra-Talkies-Telugu

More Read : Andhra Talkies information latest

Tags : Telugu News, Telugu Cinema News, Telugu Movie News, Telugu Film News, Tollywood News, Tollywood Latest News, Latest Tollywood News, Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Tollywood Movie Reviews, Tollywood Film Reviews, Andhra News, Telangana News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

కాజల్ తన అందానికి సర్జరీ చేయించిందా?

Kajal-Agarwal-Nose-Surgery-Andhra-Talkies-Telugu
ఒక హీరోయిన్ మొదటి సినిమాలో కనిపించే తీరు ఒకలా ఉంటుంది. పదేళ్ళు నటించిన తరువాత వాళ్ళు కనిపించే తీరు వేరేలా ఉంటుంది. నటనలో కావచ్చు అందంలో కావచ్చు ఫ్యాషన్లో కావచ్చు అన్నీ స్టార్ తరహాలోనే ఉంటాయి అలానే అవుతారు. సౌత్ సినిమాలో దశాబ్ధం నుండి ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తన మొదటి సినిమాకు ఇప్పటి సినిమాలకు చాలా మారింది. అయితే ఇప్పుడు మరింత అందంగా కనిపించేందుకు ఆమె సర్జరీని ఆశ్రయించింది అంటున్నారు నెటిజన్లు.

తెలుగులో మరీ ఎక్కువ సినిమాలు లేకపోయినా తమిళ్ సినిమాలలో మంచి అవకాశాలే వస్తున్నాయి ఈ చందమమామకు. కాకపోతే ఇక్కడ ఈ మధ్య ఓ రెండు పెద్ద సినిమాలు చేసింది కాబట్టి.. వరుసగా రానాతో కళ్యాణ్ రామ్ తో చిన్న సినిమాలు బాగానే పడ్డాయ్. అయితే మళ్ళీ తన కెరియర్  స్పీడ్ ని పెంచాలి అంటే ఏదో తెలియని మ్యాజిక్ చేయాలి అని అనుకోని తన ముక్కు కొంచం మార్చుకుంది అంట. ఈ విషయం ఆమె బయటకు చెప్పకపోయినా కాజల్ ను ఈ మధ్యకాలంలో చూసిన ప్రతివారికి ఆమె ముక్కు కొత్తరకంగా ఉందనే అనిపిస్తోందని టాక్. మొన్న ఆమె షేర్లో చేసిన కళ్యాణ్ రామ్ ని ఎమ్మెల్యే సినిమా షూటింగ్ స్పాట్ స్టిల్స్ లో కూడా ముక్కు తేడాగా ఉందని అంటున్నారు నెటిజన్లు.

కాస్మటిక్ సర్జరీలు చేయించుకునే సౌత్ హీరోయిన్లు ఒకప్పుడు అరుదే కాని.. ఈ మధ్య చాలామంది ఈ కోవలోకి వచ్చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత కూడా వచ్చిన కొత్తలో ఒక రకం ముక్కుతో కనిపిస్తే ఇప్పుడు మరో రకం ముక్కుతో దర్శనమిస్తోంది. కాని వీళ్ళను సర్జరీ చేయించారా అంటే మాత్రం.. ఎస్ అని ఎందుకు చెబుతారులే.

Tags : Telugu News, Telugu Cinema News, Telugu Movie News, Telugu Film News, Tollywood News, Tollywood Latest News, Latest Tollywood News, Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Tollywood Movie Reviews, Tollywood Film Reviews, Andhra News, Telangana News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

ధనుష్ కు మంచి భార్యనవుతాః అమలా పాల్

Heroin-Amala-Paul-Crush-on-Dhanush-Andhra-Talkies
దర్శకుడు విజయ్ ను అమలా పాల్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం తదనంతరం విడాకులు తీసుకోవడం తెలిసిన విషయమే. అయితే తనకు అవకాశమిస్తే మంచి భార్యనని నిరూపించుకుంటుందట. అందుకు హీరో ధనుష్ అవకాశమిస్తే బాగుంటుందని తన మనసులో మాట బయటపెట్టిందీ అమ్మడు. చక్కగా కాపురం చేసుకుంటున్న ధనుష్ను అమలా పాల్ పెళ్లి చేసుకోవడం ఏమిటి? అనుకుంటున్నారా?

ఏమీ లేదండీ - త్వరలో విడుదల కాబోతున్న వీఐపీ-2లో ధనుష్ భార్యగా అమలాపాల్ నటిస్తోంది. గతంలో వచ్చిన వేలై ఇల్లా పట్టాదారి(వీఐపీ- తెలుగులో రఘువరన్.బీటెక్) సినిమాలో వీళ్లిద్దరి కెమెస్ట్రీ అద్భుతంగా పండటంతో రెండో భాగానికి కూడా అమలానే ఎంపికచేసుకున్నారు. ఒకవేళ వీఐపీ-3 నిర్మిస్తే అందులో ధనుష్ కు మంచి భార్యగా ఉంటా అని చమత్కరించింది అమలాపాల్. ఈ రకంగా ఇంకా వస్తుందోరాదో తెలియని సినిమాలో తన పాత్రను కన్ఫార్మ్చేసుకుందీ ముద్దుగుమ్మ!

వీఐపీ-1లో హీరో ధనుష్ ని ఆటపట్టించి ఏడిపించే ప్రియురాలిగా అమలాపాల్ నటించింది. వీఐపీ-2లో హీరో భార్యగా చేస్తోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడినపుడు పై వ్యాఖ్యలు చేసింది. ''వీఐపీ-1లో నా పాత్రను చంపేయనందుకు థ్యాంక్స్. వీఐపీ-2లో సతాయించే భార్యగా నటిస్తున్నా. ఫస్ట్ పార్ట్ లో ప్రియురాలిగా సెకండ్ పార్ట్ లో హింసించే అర్ధాంగిగా చేశాను. అవకాశం వస్తే వీఐపీ-3లో కచ్చితంగా ధనుష్ కు మంచి భార్యగా నటిస్తా'' అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది అమలా పాల్.
Heroin-Amala-Paul-Crush-on-Dhanush-Andhra-Talkies...Read More

కేసులు పెట్టడానికి చంద్రబాబు ఎవరి కాళ్లలయినా పట్టేసుకుంటాడు.- రోజా సంచలన వ్యాఖ్యలు

ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో YCP MLA రోజా మునుపటి మాదిరిగా రెచ్చిపోయింది. చంద్రబాబును, అతని తనయుడు లోకేష్ ను తిడుతూ అనేక రకాలుగా విరుచుకు పడిపోయింది. కేసులు పెట్టడానికి చంద్రబాబు ఎవరి కాళ్లలయినా పట్టేసుకుంటాడని, అతని కొడుకుకి ఏమీ రాని దద్దమ్మ అంటూ తిట్టిపోసింది. ఆమె నోటి దురుసు మాటి.మాటికీ పెరుగుతూ ఉంటుంటే TDP పార్టీ వాళ్ళు ఎందుకు మిన్నకుండి పోతున్నారో ఆంధ్రా ప్రజలకు అర్ధమై చావడం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు...Read More
Chandrababu takes anybody's legs to get the cases. Rosa sensational comments

'దువ్వాడ జగన్నాథం' మూవీ రివ్యూ

Duvvada-Jagannadham-Movie-Review-Andhra-Talkies
చిత్రం : ‘దువ్వాడ జగన్నాథం’ 

నటీనటుల: అల్లు అర్జున్ - పూజా హెగ్డే - రావు రమేష్ - మురళీ శర్మ - సుబ్బరాజు - పోసాని కృష్ణమురళి - తనికెళ్ల భరణి - చంద్రమోహన్ - వెన్నెల కిషోర్ - శశాంక్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: అయానంక బోస్
స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి - దీపక్ రాజు
నిర్మాత: దిల్ రాజు
కథ - మాటలు - దర్శకత్వం: హరీష్ శంకర్

హీరో అల్లు అర్జున్.. దర్శకుడు హరీష్ శంకర్.. నిర్మాత దిల్ రాజుల క్రేజీ కాంబినేషన్లో  తెరకెక్కిన సినిమా ‘దువ్వాడ జగన్నాథం’. మొదలైన నాటి నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ: 
చిన్నతనం నుంచే అన్యాయం అంటే సహించని బ్రాహ్మణ కుర్రాడు దువ్వాడ జగన్నాథం అలియాస్ డీజే (అల్లు అర్జున్). ఓవైపు తండ్రితో కలిసి క్యాటరింగ్ నడుపుతూనే.. మరోవైపు ఒక పోలీస్ సహకారంతో అక్రమార్కుల భరతం పడుతుంటాడు. తన ఐడెంటిటీ తెలియకుండా డీజే పనులు చక్కబెడుతున్న సమయంలో ఒక భారీ కుంభకోణం బయటికి వస్తుంది. దాని వల్ల తన ఆత్మీయుడు చనిపోవడంతో డీజే రంగంలోకి దిగుతాడు. ఈ కుంభకోణం వెనుక ఉన్న రొయ్యల నాయుడు (రావు రమేష్).. డీజే మీద దృష్టిసారిస్తాడు. తన డొంక కదిలిస్తున్న డీజే గుట్టు మొత్తం తెలుసుకుని అతడి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాడు రొయ్యల నాయుడు. మరి డీజే.. అతణ్ని ఎలా ఎదుర్కొన్నాడు.. తన మిషన్ ఎలా కొనసాగించాడు.. ఈ కుంభకోణం వల్ల బాధితులైన కుటుంబాల్ని ఎలా ఆదుకున్నాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: 
హీరో అరంగేట్రాన్ని చిన్నతనం నుంచి చూపిస్తూ అక్కడి నుంచే హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం తెలుగు సినిమాల్లో మామూలే. ‘దువ్వాడ జగన్నాథం’లో కూడా హరీష్ శంకర్ కథను అలాగే మొదలుపెట్టాడు. కాలేజీలో తన అక్కయ్యను అల్లరి పెడుతున్న కుర్రాళ్ల మీదికి పది పన్నెండేళ్ల వయసున్న చిన్న పిల్లాడు దూసుకెళ్తాడు. వాళ్లను ఉతికారేసేస్తాడు. పిల్లాడేంటి.. అంత పెద్దోళ్లను కొట్టేయడమేంటి అనిపించినా.. కమర్షియల్ సినిమాల్లో ఈమాత్రం హీరోయిజం అర్థం చేసుకోదగ్గదే అని సర్దుకుపోవచ్చు. కానీ ఆ పిల్లాడు అంతటితో ఆగడు. మార్కెట్లో ఓ పోలీసోడిని రౌడీ గ్యాంగ్ చంపేయబోతుంటే.. తనే గన్ను తీసుకుని ఆ బ్యాచ్ మొత్తాన్ని టపాటపా కాల్చి అవతల పారేస్తాడు. అంతటితో ఆగినా బావుణ్ను. ఆ తర్వాత పోలీస్ స్టేషనుకెళ్తే అక్కడ ఓ రౌడీని చూసి ఊగిపోయి మళ్లీ గన్ను తీసి ఠపీమని కాల్చేస్తాడు.

పోలీసోడికి పిల్లాడిలో ఉన్న ఫైర్ నచ్చేస్తుంది. అతడితో చెయ్యి కలిపేస్తాడు. తన దగ్గరికి వచ్చే కంప్లైంట్లన్నింటినీ ఈ పిల్లాడికి ఫార్వర్డ్ చేస్తాడు. అతనెళ్లి రౌడీలు.. గూండాల భరతం పట్టేస్తూ ఉంటాడు. అవతలున్నది ఎంతటి బిగ్ షాట్ అయినా సరే.. దువ్వాడ జగన్నాథం దగ్గరికి కంప్లైంట్ వచ్చిందంటే అతను డీజే అవతారంలోకి వచ్చేసి మ్యాటర్ ముగించేస్తాడంతే. ఇక్కడ పరిచయ సన్నివేశంలో హీరోను కనీసం నూనూగు మీసాల కుర్రాడిగా అయినా చూపిస్తే కాస్తయినా వాస్తవికంగా అనిపించునేమో. కానీ ఓ చిన్న పిల్లాడు అలా హత్యలు చేయడం.. అతడితో పోలీస్ మిషన్ మొదలుపెట్టడమే విడ్డూరంగా అనిపిస్తుంది. అప్పుడే అనిపిస్తుంది.. ఇలాంటి సన్నివేశాలతో సభ్య సమాజానికి దర్శకుడు హరీష్ శంకర్ ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడా అని. తొలి సన్నివేశంతోనే దారి తప్పిపోయిన ‘డీజే’. తర్వాత కూడా ఎక్కడా సరైన దారిలో సాగుతున్నట్లుగా అనిపించడు. కమర్షియల్ సినిమాలంటే ఏం చేసినా చెల్లిపోతుంది అనే ‘పాత’ ఆలోచనతో హరీష్ శంకర్ తీసిన రొటీన్ సినిమా ‘డీజే’.

రొటీన్ అనిపించినా ఎంటర్టైన్మెంట్ తో మ్యాజిక్ చేసి  పైసా వసూల్ అనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘డీజే’ ట్రైలర్ పోస్టర్ చూస్తే.. ఇది ఆ కోవలోని సినిమాలాగే అనిపించింది. అల్లు అర్జున్ బ్రాహ్మణ కుర్రాడి పాత్ర భలేగా ఎంటర్టైన్ చేసేస్తుందని.. ఆ మాయలో కథ ఎంత రొటీన్ గా ఉన్నా చెల్లిపోతుందని అనుకున్నారు అందరూ. కానీ ‘అదుర్స్’ సినిమాను చారి పాత్ర నిలబెట్టినట్లుగా.. ‘డీజే’కు బ్రాహ్మణ కుర్రాడి పాత్ర బలం కాలేకపోయింది. ప్రోమోల్లో మెరిసినట్లుగా సినిమాలో మెరవలేకపోయింది ఈ పాత్ర. ఆరంభ మెరుపులు తప్పితే.. ఈ పాత్రలో విషయం లేదు. రెండు మూడు సన్నివేశాలకే ఈ క్యారెక్టర్ తేలిపోతుంది. ఇందులో ఏ ప్రత్యేకతా లేదనిపిస్తుంది. దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు పెద్దగా వినోదాన్ని పంచకపోవడంతో కాసేపటికే ‘డీజే’ బోర్ కొట్టించడం మొదలుపెడతాడు.

ఏ కొత్తదనం లేని ఈ కథనంలో రొమాన్స్ కూడా ఆసక్తి రేకెత్తించదు. పొగరుబోతు హీరోయిన్... హీరోతో సయ్యాటలాడి అతడిని ముగ్గులోకి దించడం.. తర్వాత అతణ్ని అవమానించి వెళ్లిపోవడం.. తర్వాత హీరో మీద ఆమెకు కలవరం పుట్టడం.. ఇలా 90ల నాటి రొమాంటిక్ ట్రాక్స్ ను గుర్తుకు తెస్తుంది ‘డీజే’లో లవ్ స్టోరీ. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టే సరైన సీన్ కూడా చూపించకుండా.. హోం మంత్రి కూతురు వంటవాడైన హీరో కోసం వెతుక్కుంటూ వచ్చేయడం మరీ విడ్డూరంగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ను సైతం దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. హీరో హీరోయిన్ల పాత్రలు తేలిపోయాక ఇక రొయ్యల నాయుడిగా రావు రమేష్ క్యారెక్టర్ మీద ఆశలు పెట్టుకుంటాం. కానీ ఆ పాత్రదీ ఆరంభ శూరత్వమే అయింది. ఎంటర్టైన్మెంట్ మీద ఆశలు పోవడంతో ఇక యాక్షన్ మీద.. కథ మీద ఫోకస్ పెడతాం. అవి మరింతగా నిరాశకు గురి చేస్తాయి. అక్కడక్కడా కొన్ని కామెడీ మెరుపులు.. పూజా హెగ్డే గ్లామర్.. పాటలతో ప్రథమార్ధమైనా ఓ మాదిరిగా అనిపిస్తుంది కానీ.. ద్వితీయార్ధమైతే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.

అగ్రి గోల్డ్ కుంభకోణం నేపథ్యంలో కథను అల్లుకోవడం కంటెంపరరీగా అనిపించొచ్చు కానీ.. ఆ పాయింట్ మినహాయిస్తే ఇంకేదీ ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా అనిపించదు. రావు రమేష్ ది ముందు సహాయ పాత్రలా అనుకుంటాం కానీ.. అతడిదే లీడ్ విలన్ రోల్ అని తెలియడానికి చాలా సమయం పట్టేస్తుంది. హీరో-విలన్ డైరెక్ట్ వార్ మొదలయ్యే సమయానికి పుణ్యకాలం గడిచిపోతుంది. ఇంకా సినిమా అయిపోలేదా అన్న ఫీలింగ్ కలుగుతన్న సమయంలో అబుదాబి నేపథ్యంలో సా...గే ప్రి క్లైమాక్స్ ‘డీజే’ వాయింపుడుకు పరాకాష్ట. అందులో ఓ సన్నివేశంలో సుబ్బరాజు క్యారెక్టర్.. నువ్వు నన్ను పిచ్చోడిని చేద్దామనుకుంటున్నావా అంటూ ఆవేశపడతాడు. ఈ ఎపిసోడ్.. ఆ తర్వాత వచ్చే ‘సర్ప్రైజింగ్’ క్లైమాక్స్ చూశాక ప్రేక్షకుల ఫీలింగ్ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది. హరీష్ అన్నట్లుగా నిజంగా ఇలాంటి క్లైమాక్సును ప్రేక్షకులు ఊహించి ఉండరు. రెండున్నర గంటలకు పైగా నిడివి ఉండటం కూడా ‘డీజే’కు పెద్ద మైనస్. సినిమా అంతా అయ్యాక కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండే అల్లు అర్జున్.. దిల్ రాజు ఈ కథకు ఎలా ఓటేశారన్న సందేహం కలుగుతుంది. ఐతే బన్నీ ‘బద్రీనాథ్’ చేసిన సంగతి.. ఇదే హరీష్ శంకర్ తో దిల్ రాజు ‘రామయ్యా వస్తావయ్యా’ తీసిన విషయం గుర్తుతెచ్చుకుంటాం!

నటీనటులు: 
అల్లు అర్జున్ నటన ఓకే అనిపిస్తుంది. బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో తనవంతుగా ఏదో చేశాడు కానీ.. ‘ముగ్గురు మొనగాళ్లు’లో చిరంజీవి.. అదుర్స్’లో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ తో పోలిస్తే ఇది సోసో. ఈ పాత్ర వాటిలా అంత ఎంటర్టైనింగ్ గా లేదు. బన్నీ లుక్ మాత్రం బాగుంది. రెండు అవతారాల్లోనూ ఆకట్టుకున్నాడు. అతడి డ్యాన్సులు.. ఫైట్ల గురించి చెప్పేదేముంది. ఎప్పట్లాగే బాగా చేశాడు. పూజా హెగ్డే సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో ఒకటి. ఆమెలోని గ్లామర్ యాంగిల్ ను హరీష్ బాగా ఎలివేట్ చేశాడు. తెలుగులో ఇంతకుముందు చేసిన రెండు సినిమాలతో పోలిస్తే చాలా భిన్నంగా కనిపించింది పూజ. అందాల ప్రదర్శనలో ఏమాత్రం మొహమాటం చూపించకుండా రెచ్చిపోయింది. అందంగా.. సెక్సీగా కనిపించిన పూజ నటన పరంగా పెద్దగా చేసిందేమీ లేదు. రావు రమేష్ కొన్ని సన్నివేశాల్లో తనదైన శైలిలో అలరించాడు కానీ.. లీడ్ విలన్ రోల్ కు ఆయన సరిపోలేదు. మురళీ శర్మ పాత్ర.. నటన మామూలే. ఈ మధ్య కామెడీలో మాంచి రైజింగ్ లో ఉన్న వెన్నెల కిషోర్ ను ఇందులో సరిగా వాడుకోలేదు. పోసాని.. భరణి.. చంద్రమోహన్.. వీళ్లంతా మామూలే. నటీనటులు చాలామంది ఉన్నా.. చాలామంది ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు.

సాంకేతికవర్గం: 
దేవిశ్రీ ప్రసాద్ ఓ కమర్షియల్ సినిమాకు సరిపోయే ఊపున్న మ్యూజిక్ ఇచ్చాడు. అస్మైక యోగ తస్మైక భోగ.. వీనుల విందే కాదు.. కనువిందు కూడా. మిగతా పాటలు మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఊపుతో సాగుతాయి. అయానంక బోస్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ రిచ్ గా అనిపిస్తాయి. దిల్ రాజు సినిమా.. పైగా ఆయన బేనర్లో 25వది.. కాబట్టి నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎటొచ్చీ కథాకథనాలే తేడా కొట్టేశాయి. తాను ప్రేక్షకుల అంచనాలకు అందనని హరీష్ శంకర్ మరోసారి రుజువు చేశాడు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత కెరీర్ కు అత్యంత కీలకమైన పెద్ద అవకాశాన్ని అతను వృథా చేసుకున్నాడు. రొటీన్ కథను ఎంచుకోవడంతోనే నిరాశ పరిచిన హరీష్.. ఇక కథనం విషయంలోనూ ఏ ప్రత్యేకతను చూపించలేకపోయాడు. రైటర్ గా తన మీద పెట్టుకున్న ఆశల్ని అతను నీరుగార్చేశాడు. అక్కడక్కడా కొన్ని డైలాగులేవో పేలాయి కానీ.. ఓవరాల్ గా హరీష్ మార్కు వేగం.. ఎంటర్టైన్మెంట్ ఇందులో మిస్సయింది.
చివరగా: డీజే.. బోరో బోరస్య బోరభ్యహ..
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...