మలైకా అందుకు పనికి రానంటోందిగా

Malaika-Arora-Khan-on-Item-Songs-Andhra-Talkies
Malaika-Arora-Khan-on-Item-Songs-Andhra-Talkies
మలైకా అరోరా.. ఈ పేరు వినగానే సెన్సేషనల్ ఐటెం సాంగ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. 20 ఏళ్ల క్రితం దిల్ సే మూవీలో షారూక్ ఖాన్ తో కలిసి 'ఛయ్య ఛయ్య' పాటలో నర్తించినప్పటి నుంచి ఇప్పటివరకూ.. ఐటెం సాంగ్స్ తోనే ఫుల్ ఫేమస్ అయిపోయింది.

దబాంగ్ మూవీలో 'మున్నీ బద్నాం హుయి' అంటూ చేసిన స్పెషల్ సాంగ్ తర్వాత విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇదే సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ మూవీ గబ్బర్ సింగ్ అని తీస్తే.. 'కెవ్వు కేక'లు పెట్టించేసింది. దీనికంటే ముందే తెలుగులో మహేష్ బాబుతో అతిథి మూవీలో 'రాత్రయిన నాకు ఓకే' అంటూ చిందులేసింది. ఇలా మలైకా పేరు చెబితే పాటలు తప్ప గుర్తుకొచ్చే సినిమా రోల్ ఏదీ ఉండదు. మరి ఈ విషయంలో మలైకా ఏమనుకుంటోందో అడిగితే.. దిమ్మదిరిగి బొమ్మ కనిపించే ఆన్సర్ చెప్పింది మలైకా అరోరా.'సినిమాల్లో ఫుల్ ప్లెడ్జెడ్ రోల్స్ చేయాలని నేను అసలెప్పుడూ అనుకోలేదు. సిల్వర్ స్క్రీన్ కి నాకు ఉన్న లింక్ కేవలం స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ లు వేయడం.. గెస్ట్ రోల్స్ చేయడమే. సినిమాల్లో పూర్తిస్థాయి యాక్ట్రెస్ గా నన్ను నేనే చూసుకోలేను' అనేసి షాక్ ఇచ్చేసింది మలైకా. ఐటెం సాంగ్స్ లో డ్యాన్సులకు తప్ప.. నటిగా పనికి రాను అని పైకి చెప్పగలిగే డేరింగ్.. కెవ్వుకేక బ్యూటీకి తప్ప మరెవరికీ ఉండదంటే ఉండదంతే!
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...