నిర్మాత బండ్ల గణేష్ కుక్క...కాదు,కాదు...ఒక తోడేలు!!

Sachin-Joshi-Comments-on-Bandla-Ganesh-Andhra-Talkies-telugu
చిన్న నటుడి స్థాయి నుండి స్టార్ హీరోలతో సినిమాలు తీసే స్థాయికి ఎదిగాడు బండ్ల గణేష్. అయితే అప్పట్లో మనోడిపై హీరో సచిన్ జోషి ఏకంగా కోర్టు కేసు బనాయించాడు. 'టెంపర్' సినిమా కోసం అప్పు తీసుకున్నాడని.. అది తీర్చట్లేదని.. అందుకే కోర్టు నోటీస్ ఇచ్చినట్లు అప్పట్లో సచిన్ జోషి వర్గాలు తెలిపాయి. ఇదే విషయంపై రీసెంటుగా ఒక యుట్యూబ్ ఛానల్ ఇంటర్యూలో బండ్ల గణేష్ ను ప్రశ్నిస్తే.. అసలు సచిన్ జోషి ఎవరు? అంటూ తిరిగి ప్రశ్నించాడు. బండ్ల గణేష్ ను టచ్ చేసే స్థాయి ఎవ్వరికీ లేదని కూడా చెప్పేశాడు.

ఇప్పుడు ఇదే విషయంపై 'వీడెవడు' సినిమా ట్రైలర్ లాంచ్ టైమ్ లో మీడియా అడగటంతో.. సచిన్ జోషి కూడా ఘాటుగానే స్పందించాడు. ''నా దృష్టిలో బండ్ల గణేష్ అనేవాడు నథింగ్. నేను తెలుసా లేదా అనే విషయం అతనికే తెలియాలి. అతను ఒక కుక్క. కుక్క కూడా కాదు.. అవి చాలా విశ్వాసంగా ఉంటాయి. వాటి పేరు పాడు చేయడం నాకు ఇష్టం లేదు. మనోడు ఒక తోడేలు'' అంటూ సచిన్ జోషి చెప్పాడు. అంతేకాదు.. బండ్ల గణేష్ ఈయన దగ్గర తీసుకున్న అప్పులు వివరాలను చెబుతూ.. వాటికి సంబంధించిన బాండ్ పేపర్లను కూడా చూపించింది సచిన్ టీమ్. ''మాకు 27.9 కోట్లు ఇవ్వాలి. 12.5 కోట్లకు ఆయన పత్రాలు కూడా సైన్ చేశాడు. సచిన్ జోషి తెలియదని ఎలా అంటాడు?'' అంటూ సచిన్ టీమ్ కు చెందిన వ్యక్తి ప్రశ్నించారు.

ఇకపోతే మీడియా అనేవారు పోస్ట్ మ్యాన్ లా పనిచేయకూడదని.. వ్యవహారాత్మకంగా ఉండాలని మీడియాకు చురకలు వేశాడు సచిన్ జోషి. రెండువైపల నుండి అన్నీ కనుక్కుని నిజాన్ని రాయాలని.. ఎవరో ఏదో కామెంట్ చేస్తే.. దానిని హెడ్డింగ్ లో పెట్టేసి వేస్తే అది జర్నలిజం కాదంటూ కాస్త ఘాటుగా చెప్పాడు ఈ 'ఉరేయ్ పండు' హీరో.

''మట్టిలోకి వెళ్ళి బురద అంటుకోకూడదు అనుకుంటే ఎలా. నాకు బండ్ల గణేష్ అలా. వాడు ఒక రాహు కేతువు లాంటోడు. వాడిపై 14 కేసులు పెట్టాను. కోర్టు వాడి సంగతి చూసుకుంటుంది. బండ్ల గణేష్ ముఖం మీద అంతా మంచే చెబుతాడు.. కాని మనం వెళ్ళాక మన గురించి చెత్త చెబుతాడు. ఇలా అందరి నటుల గురించీ చెప్పాడు'' అంటూ ఘాటుగా గణేష్ గురించి కామెంట్ చేశాడు సచిన్ జోషి.

బండ్ల గణేష్ పదేపదే వెనుకపడటంతో.. చరణ్ మరియు ఎన్టీఆర్ తో సినిమాలు చేస్తున్నా అని చెప్పడంతో.. తన కంపెనీ (వైకింగ్ ఎంటర్టయిన్మెంట్) గణేష్ కు అప్పు ఇచ్చిందని చెప్పాడు. ''అసలు మనోడు ఏదీ నిజం చెప్పడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్నా అంటున్నాడు. పవన్ అంటే ఒక శక్తి. ఇండియాలోనే గొప్ప నటుడు. అతని పేరు కూడా వీడు నాశనం చేస్తున్నాడు. అసలు ఒకసారి మనోడితో జూ.ఎన్టీఆర్ ఇంటికి వెళితే.. వాడ్ని ఎందుకు తీసుకొచ్చావ్.. వాడ్ని లోపలకు తేవొద్దు.. అన్నాడు ఎన్టీఆర్. వీడికి ఉన్న గౌరవం అది'' అని చెప్పాడు సచిన్. పైగా గణేష్ రాసిన ప్రామిసరీ నోట్లన్నీ కూడా మీడియాకు చూపిస్తూ.. వీటి కాపీస్ ఇవ్వలేం.. ఎందుకంటే కోర్టులో ఉంది కేసు అంటూ సచిన్ టీమ్ తెలియజేశారు.

ఇకపోతే ఒకసారి గణేష్ విషయంలో సెటిల్మంట్ జరిగిందని.. ఆ సమయంలోనే మనోడు అరెస్టయ్యేవాడని.. కాని వాళ్ళ నాన్న గారు కన్నీరు పెట్టుకోవడం వలన సేవ్ అయ్యాడని చెప్పాడు సచిన్. ''అసలు గణేష్ లాంటి కొడుకు కోసం ఆయన తండ్రి కన్నీరు పెట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం. అప్పుడే అరెస్టయ్యేవాడు. అందుకే అప్పుడు 14 కోర్టు కేసులు పెట్టాం. ఇప్పుడు మనోడి సంగతి కోర్టు చూసుకుంటుంది'' అంటూ చెప్పాడు సచిన్ జోషి. దీనిపై మరోసారి గణేష్ ఏమన్నా స్పందిస్తాడేమో చూడాలి.


రాజకీయాల్లో లాగా చేయకు పవన్

Pawan-Kalyan-Not-Responds-on-Sardaar-Gabbar-singh-Buyers-Issue-Andhra-Talkies
ఆ మధ్య ఒక రాజకీయ సభలో పాచిపోయిన లడ్డూలిచ్చారంటూ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కేంద్రం మీద విమర్శలు గుప్పించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఐతే ఎప్పుడో ముగిసిపోయిన అంశాలకు సంబంధించి చాలా ఆలస్యంగా స్పందిస్తూ.. పవన్ కూడా పాచిపోయిన రాజకీయాలు చేస్తున్నాడంటూ ఆయన మీద విమర్శలు కూడా వచ్చాయి. రోహిత్ వేముల మరణం లాంటి కొన్ని సంచలన అంశాలకు సంబంధించి పవన్ చాలా ఆలస్యంగా స్పందించడం తెలిసిందే. ఇలా చాలా రాజకీయ అంశాలపై ముందు మౌనం వహించి.. ఆ తర్వాత చాలా ఆలస్యంగా పవన్ స్పందిస్తున్నాడన్న విమర్శలు అతడిపై ఉన్నాయి. ఇప్పుడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వివాదంపైనా పవన్ సైలెంటుగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

పవన్ కళ్యాణ్ తనకు తెలిసిన వాళ్లెవరికైనా కష్టం అంటే తట్టుకోలేడని.. ఎవరైనా కష్టం అని తన దగ్గరికి వస్తే కచ్చితంగా ఆదుకుంటాడని ఇండస్ట్రీలో ఒక పేరుంది. ఐతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వల్ల నష్టపోయిన బయ్యర్ల విషయంపై  మాత్రం పవన్ మౌనం పాటిస్తుండటం ఆశ్చర్యమే. ముందు కృష్ణా జిల్లా బయ్యర్ ప్రెస్ మీట్ పెడితే.. తాజాగా ‘నైజాం’ డిస్ట్రిబ్యూటర్లతో పాటు మరికొందరు వారికి తోడయ్యారు. ‘సర్దార్..’ వల్ల తమకు జరిగిన నష్టంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేపు ఇంకొందరు బయ్యర్లు వీరికి తోడవ్వచ్చేమో. ఇప్పటిదాకా ఈ వ్యవహారంపై నిర్మాత శరత్ మరార్ కానీ.. మరొకరు కానీ స్పందించనే లేదు. ఇలా మౌనం వహిస్తుంటే తమవైపు తప్పు ఉందని అంగీకరించినట్లే.

వాళ్ల సంగతెలా ఉన్నా.. పవన్ సైలెన్సే చర్చనీయాంశమవుతోంది. బహుశా పవన్ దీని గురించి ఆలోచిస్తుండొచ్చు. తర్వాత స్పందిద్దామని.. సమస్యను పరిష్కరించాలని భావిస్తుండొచ్చు. ఐతే అలా నాన్చుతూ పోతే సమస్య జఠిలమవుతుంది. పవన్ గురించి ప్రతికూల ప్రచారం పెరుగుతుంది. కాబట్టి రాజకీయాల్లో లాగా మీనమేషాలు లెక్కించకుండా.. సాధ్యమైనంత త్వరగా స్పందిస్తే బెటర్. లేకుండా తనవైపు నుంచి వివరణ ఇచ్చే ప్రయత్నం అయినా చేయాలి. లేకుంటే తర్వాత డ్యామేజ్ కంట్రోల్ కష్టమవుతుంది.

అందుకేనా ముగ్గురు హీరోయిన్లు జంప్!!

Reason-Behind-Three-Heroined-Rejects-Rogue-Movie-Andhra-Talkies
'రోగ్'' సినిమా ట్రైలర్ చూశాక ఒక విషయంపై పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సినిమాలోని హీరోయిన్లు ఇద్దరూ మామూలు హాటుగా ఘాటుగా నటించలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మన్నారా చోప్రా.. అలాగే ఏంజెలా క్రిసిలింజ్కిలూ రెచ్చిపోయారు అంతే. పెదాల ముద్దులు నుండి.. హాటుగా ఎక్స్ పోజింగ్ చేయడం వరకు.. అలాగే హీరో బిగి కౌగిట్లో నలిగిపోవడం నుండి అతను చేసే కొంటె పనులకు సహకరించడం వరకు చాలా డేర్ చేసేశారు. ఇప్పుడు సరిగ్గా ఒక విషయం గుర్తొచ్చిందండోయ్.

ముందుగా ఈ సినిమాలో చిరుత హీరోయిన్ నేహా శర్మ చెల్లెలు అయేషా చేసింది. వారం రోజులపాటు షూటింగ్ చేసిన తరువాత జంప్ అయ్యింది. తరువాత అమైరా దస్తూర్ కూడా షూట్ చేసింది. ఆమె కూడా మిడిల్ డ్రాప్. ఆ తరువాత పూజా జవేరి (ఇవాళ రిలీజైన ద్వారక సినిమాలో హీరోయిన్) హీరోయిన్ గా అంగీకరించి.. తరువాత బయటకు వచ్చేసింది. ఫైనల్ గా మన్నారా చోప్రా ఆ రోల్ లోకి దిగింది. ఇప్పుడు ట్రైలర్ చూశాక ఈ అమ్మాయిలందరూ అసలు ఎందుకు రోగ్ సినిమా నుండి ఎస్కేప్ అయ్యారో అర్ధమవుతోందిగా. మరీ ఇంత ఘాటుగా అంటే ఎలా పూరి?

చూద్దాం ఈ ఫీట్లన్నీ వెండితెరపై పండితే బాగానే ఉంటుంది. లేదంటే మాత్రం కాస్త ఇబ్బందే. 
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...