ముంబయ్ లో బాహుబలి సెట్ పీకేశారు

Baahubali-Settings-REmoved-from-Theatres-due-to-Premiers-Cancelled-Andhra-Talkies-Telugu
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బాహుబలి ఫీవర్ పెరిగిపోయింది. ముందు రోజు రాత్రి నుంచే స్పెషల్ షోస్ వేసుకునేందుకు పర్మిషన్ రావడంతో.. హంగామా పీక్ స్టేజ్ కి చేరిపోయింది. అయితే.. మనకి ఇలా ప్రీమియర్లు వేయాలని జస్ట్ 24 గంటల ముందు మాత్రమే డిసైడ్ చేశారు.

అంతకు ముందే హిందీ వెర్షన్ బాహుబలి2కి ప్రీమియర్ ప్రదర్శించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాడు నిర్మాత కరణ్ జోహార్. ప్రీమియర్ ప్రదర్శించే ప్రాంతంలో భారీ సెట్టింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. అయితే.. అనుకోకుండా సీనియర్ నటుడు సూపర్ స్టార్ వినోద్ ఖన్నా మరణించారు. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధ పడుతున్న ఆయన.. ఇవాళ తుది శ్వాస విడిచారు. దీంతో ముంబైలో తలపెట్టిన ప్రీమియర్ షోను రద్దు చేసుకున్నాడు కరణ్ జోహార్. ఆయన స్మృతిగానే ఇలా ప్రీమియర్ ను రద్దు చేస్తున్నామని వెల్లడించాడు.

ఇకపోతే బాలీవుడ్ లో ప్రీమియర్ వేసే ముంబయ్  ధియేటర్ దగ్గర ఏకంగా బాహుబలి కటౌట్లు.. అవీ ఇవీ చాలా పెట్టేశారు. అవన్నీ ప్రీమియర్ కోసం వేసిన సెట్టింగులట. ఎలాగో ప్రీమియర్ రద్దయ్యింది కాబట్టి.. ఆ సెట్టింగులన్నీ కూడా పీకేశారు. రేపు ఎలాగో సాధారణ జనాలు చూస్తారుగా.. వారి కోసం ఉంచేయొచ్చుగా అంటే.. అక్కడి ధియేటర్ యాజమాన్యం అందుకు నో అని చెప్పిందని టాక్.
* బాహుబలి గురించి మరిన్ని విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భర్త సెక్స్ సీన్లు చూసి బోరుమంటున్న భార్య

Neelam-Kothari-Is-Upset-With-Samir-Soni-For-Intimate-Scenes-Andhra-Talkies
బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ టీవీ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. ట్రెండుకు తగ్గట్లుగా బాగానే దూసుకెళ్తూ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ తో సినిమాలు తీయడంలో ఆమె దిట్ట. ఏక్తా నిర్మించిన రాగిని ఎంఎంఎస్.. డర్టీ పిక్చర్.. లాంటి సినిమాల్లో ఇంటిమేట్ సీన్లు ఏ రేంజిలో పేలాయో తెలిసిందే. తాజాగా ఆమె తన బాలాజీ మోషన్ పిక్చర్స్ బేనర్ మీద ‘బేవఫా సి వాఫా’ అనే వెబ్ సిరీస్ ప్లాన్ చేసింది. అందులో సమీర్ సోనీ అనే నటుడు లీడ్ రోల్ చేశాడు. అతడి సరసన డిపాంటియా శర్మ.. అదిత వాసు నటించారు. ఈ వెబ్ సిరీస్.. వివాహేతర సంబంధాల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో భాగంగా హీరోయిన్లిద్దరితోనూ మాంచి ఇంటిమేట్ సీన్లు చేశాడట సమీర్.

ఐతే సమీర్ ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న ముందు నుంచి అతడి భార్య నీలంకు తెలిసినప్పటికీ.. అతను చేసిన సెక్స్ సీన్లలో డోస్ ఆ స్థాయిలో ఉంటుందని ఆమె అనుకోలేదట. ఈ మధ్య భర్త నటించిన సన్నివేశాలు చూసి ఆమె షాక్ తిందట. ట్రైలర్ చూడగానే ఆమె తీవ్ర ఆవేదనకు గురైందట. ఈ విషయమై భర్తతో ఆమె గొడవ పెట్టేసుకుందట. దీంతో వెబ్ సిరీస్ లోని కొన్ని సన్నివేశాల్ని తొలగించాలని ఏక్తా కపూర్ ను అడగ్గా.. సాధ్యం కాదని చెప్పేశారట. ఆల్రెడీ షో రన్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కోతలేమీ పెట్టడానికి లేదని.. ఇవన్నీ ముందు ఆలోచించుకోవాల్సిందని ఆమె స్పష్టం చేసిందట. దీంతో సమీర్ భార్యకు ఎలా సర్దిచెప్పాలో తెలియక తల పట్టుకుంటున్నాడు.

Click Here : Latest Movie News

సంచలన విషయం చెప్పిన భావన

Bhavana-disclosed-that-Pulsar-Suni-kept-receiving-instructions-from-a-Woman
భావన నటిగా ఉన్నప్పటి కంటే కూడా.. రెండు నెలల కిందటి కిడ్నాప్ కేసుతో ఎక్కువగా మీడియాలో ఆమె పేరు చర్చనీయాంశమైంది. మొత్తం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఆమె కిడ్నాప్ వ్యవహారం. ఈ కేసులో కీలక నిందితుడైన పల్సర్ సుని.. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే పోలీసులకు చిక్కాడు. కిడ్నాప్ గ్యాంగ్ మొత్తం కూడా పోలీసులకు దొరికింది. అయినప్పటికీ రెండు నెలలుగా ఈ కేసులో పెద్దగా పురోగతి లేదు. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దల ప్రమేయం ఇందులో ఉన్నట్లుగా అనుమానాలు వచ్చినప్పటికీ.. ఇప్పటిదాకా విచారణలో ఎవరి పేర్లూ బయటికి రాలేదు. పోలీసులు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి.

ఐతే భావన మాత్రం ఈ కేసు విషయంలో చాలా పట్టుదలగా ఉంది. అసలు నిందితులకు శిక్ష పడేదాకా తన పోరాటం ఆగదని ఆమె అంటోంది. తాజాగా ఒక మలయాళ పత్రికకు ఆమె ఓ సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె వెల్లడించిన ఓ విషయం సంచలనం రేపుతోంది. తనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డ సమయంలో పల్సర్ సుని క్రమం తప్పకుండా ఒక ఫోన్ కాల్ మాట్లాడాడని.. అవతలి వాళ్ల ఆదేశాల మేరకే అతను తనను వేధించాడని ఆమె తెలిపింది. అవతలి వ్యక్తి ఒక మహిళ అని భావన చెప్పడం విశేషం. ఒక మహిళ అయి ఉండి భావన మీద ఇలాంటి అఘాయిత్యం చేయించడానికి పూనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ ఆ మహిళ ఎవరై ఉంటారనే విషయంలో ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

ఇంకో బాహుబలి..లక్ష కోట్లిచ్చినా చేయడట

Prabhas-Not-Ready-for-Like-Baahubali-Projects-For-Next-Four-years
ప్రభాస్ కెరీర్ ను బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత అని విభజించాల్సి ఉంటుంది. ఆ సినిమాకు ముందు అతను కేవలం తెలుగు హీరో మాత్రమే. కానీ ఈ సినిమా అయ్యేసరికి నేషనల్ స్టార్ అయిపోయాడు. అన్ని భాషల్లోనూ తిరుగులేని గుర్తింపు సంపాదించాడు. అతడి రేంజే మారిపోయింది.

మరి ‘బాహుబలి’తో ఇంత గుర్తింపు సంపాదించారు కదా.. ఇలాంటి సినిమా ఇంకోటి చేయాల్సి వస్తే చేస్తారా అని ప్రభాస్ ను ప్రశ్నిస్తే.. వామ్మో నా వల్ల కాదంటున్నాడు. లక్ష కోట్లిచ్చినా.. వెంటనే ‘బాహుబలి’ లాంటి సినిమా ఇంకోటి చేయనని అతను తేల్చి చెప్పాడు. ‘‘బాహుబలి కోసం పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదు. లక్ష కోట్లు ఇస్తానని చెప్పి ఎవరైనా బాహుబలి లాంటి ఇంకో సినిమా చేయమని అడిగినా చేయను. కనీసం నాలుగేళ్ల పాటు ఇలాంటి ఆలోచన చేయను. ఆ తర్వాత ఏమైనా చూడాలి’’ అని ప్రభాస్ అన్నాడు.

‘బాహుబలి’ కోసం చూపించిన కమిట్మెంట్ ఇంకే సినిమాకూ తాను చూపించే అవకాశం లేదని కూడా ప్రభాస్ అన్నాడు. ‘‘స్కూలుకెళ్లే పిల్లాడి లాగా ‘బాహుబలి’ షూటింగుకి వెళ్లాను. షూటింగ్ సందర్భంగా రీటేక్ అడగడానికి కూడా భయమేసేది. ఎందుకంటే వార్ సీక్వెన్స్ తీసేటపుడు ఒక రీటేక్ అంటే.. మళ్లీ ఆ సెటప్ అంతా చేయడానికి 3-4 గంటలు పట్టేది. ఒక షాట్ తీయడానికి 30-40 లక్షలు ఖర్చవుతున్నట్లు చెప్పేవాళ్లు. దీంతో చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. ఈ సినిమాకు ముందు చేసిన ‘మిర్చి’కి నిర్మాతలు నా స్నేహితులే. అప్పుడు నా ఇష్టం వచ్చిన సమయానికి వచ్చేవాడిని. ఏ ఇబ్బందీ ఉండేది కాదు. కానీ ‘బాహుబలి’ విషయంలో మాత్రం అలా కాదు’’ అని ప్రభాస్ అన్నాడు.
More Movie News : Andhra Talkies

ఉన్నపలంగా బట్టలిప్పేస్తానని కాదు...అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి

Lavanya-Tripati-on-about-Glamour-Roles-Andhra-Talkies
ఉన్నపలంగా బట్టలిప్పేస్తానని కాదు...అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి

వరుసగా హ్యాపెనింగ్ సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. ఇప్పుడు ''మిష్టర్'' సినిమాతో దూసుకొస్తోంది. అయితే ఈ సినిమాలో కూడా ఓణి పరికిణీ లుక్ లోనే కనిపిస్తన్నారేంటి అంటే.. అసలు నా మోడలింగ్ కెరియర్లో ఒక్కసారి కూడా కనీసం సాల్వార్ కమీజ్ వేసుకునే షూట్ అనేది చేయలేదు.. అంటోంది ఈ బికినీ మోడల్. కాని తెలుగులో అందాల రాక్షసి సినిమా కారణంగా తనకు అందరూ అదే ముద్రను వేస్తున్నారు అని చెప్పింది.

''నేను రియల్ లైఫ్ లో అందాల రాక్షసి క్యారక్టర్ కు ఇసుమంత దగ్గరగా కూడా ఉండను. అంతా కూడా మోడ్రన్ గానే ఉంటాను. అలాగే మోడలింగ్ సమయంలో కూడా గ్లామర్ నే ఒలకబోశాను. అందుకే నేను చాలాసార్లు నా డైరక్టర్లకు చెప్పాను.. నాకు గ్లామర్ రోల్స్ ఇవ్వండి అని. గ్లామర్ అంటే ఉన్నపలంగా బట్టలిప్పేస్తానని కాదు.. రోల్ కు కావల్సినట్లు మోడ్రన్ కాస్ట్యూమ్స్ లో గ్లామరస్ గా కనిపిస్తానని అర్ధం. పూర్వం పూర్తిగా కప్పుకుని కూడా గ్లామర్ అనేవారు. ఇప్పుడు పద్దతులు మారాయి. చూద్దాం ఎవరు ఎటువంటి రోల్స్ ఆఫర్ చేస్తారో'' అంటోంది లావణ్య.

ఇకపోతే త్వరలో రానున్న శర్వానంద్ ''రాధ'' సినిమాలో గ్లామర్ ఒలకబోయడం తప్పించి పెద్దగా రోల్ ఏమీ లేదని.. కాకపోతే నాగచైతన్య తో చేస్తున్న సినిమాలో మాత్రం ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు చెప్పింది. ''మిష్టర్'' ఈమెకు ఎటువంటి సక్సెస్ ను ఇస్తుందో చూడాలి.
More Movie News : Andhra Talkies

ప్రెస్ మీట్లో హీరోయిన్ని ఇరికించేసిన చేతన్ భగత్!

Chetan-Bhagat-passes-loose-remark-on-Shraddha-Kapoor-Andhra-Talkies
ప్రెస్ మీట్లో హీరోయిన్ని ఇరికించేసిన చేతన్ భగత్!

అసలే శ్రద్ధా కపూర్ పేరు కొన్ని రోజులుగా మీడియాలో బాగా నానుతూ ఉంది. ఆమె కోసం ఫర్హాన్ అక్తర్.. సిద్దార్థ్ రాయ్ కపూర్ కొట్టేసుకున్నారంటూ మీడియాలో రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై మీడియా వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతోంది శ్రద్ధా. అలాంటిది ఆమెను విలేకరుల సమావేశంలో అడ్డంగా ఇరికించేశాడు రైటర్ చేతన్ భగత్.

భగత్ రాసిన ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ నవల ఆధారంగా అదే పేరుతో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అందులో అర్జున్ కపూర్.. శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. మోహిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 19న విడుదలకు సిద్ధమవుతోంది. దీని ట్రైలర్ లాంచ్ సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్లో చేతన్ భగత్ మాట్లాడుతుండగా.. విలేకరులు బాయ్ ఫ్రెండ్ అనే మాట ఎత్తగానే అతను శ్రద్ధా వైపు చూపించాడు.

‘‘ఈ ప్రశ్నకు నువ్వైతేనేం బాగా సమాధానం చెప్పగలవు.. ఈ మధ్య నీ ఎఫైర్లకు సంబంధించి మీడియాలో చాలా వార్తలొస్తున్నాయి’’.. అంటూ ఆమెకు మైక్ ఇచ్చేశాడు చేతన్. హఠాత్తుగా తననుద్దేశించి చేతన్ అంత మాట అనేసరికి శ్రద్ధా ముఖ కవళికలే మారిపోయాయి. ఆమె చాలా ఇబ్బంది పడిపోయింది. ఏదో మాట దాటవేసే ప్రయత్నం చేసింది. అంతలో హీరో అర్జున్ కపూర్ జోక్యం చేసుకుని టాపిక్ మళ్లించే ప్రయత్నం చేశాడు. శ్రద్ధాను కొంత వరకు కాపాడాడు. చేతన్ భగత్ ఇలా మాట్లాడాల్సింది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వీళ్ళు సినిమాలు తీయటం ఆపేస్తే బెటర్ అంటున్నారు

నిన్న మణిరత్నం సినిమా చెలియా మొత్తానికి యునానిమస్ గా డిజాస్టర్ టాక్ తో ముందుకు వెళుతోంది. నీరసమైన కథా కథనాలతో రెగ్యులర్ ఆడియన్స్ కి ఓపిక పరీక్ష పెట్టిన మణిరత్నం అందులో మాత్రం తాను ఓడిపోయాడు. అసలు కథ పెద్దగా లేకుండా కేవలం ఎమోషన్స్ ని స్లో మోషన్ లో హై లైట్ చేస్తూ అర్థం కాని డైలాగ్స్ తో సన్నివేశాలను సాగదీస్తూ తీసిన మణిరత్నం టేకింగ్ పట్ల అందరు పెదవి విరుస్తున్నారు. కొందరు అభిమానులు, సినిమా ప్రేమికులు కెమెరా వర్క్ గురించి, మ్యూజిక్ గురించి ఎంత పాజిటివ్ గా మాట్లాడుతున్నా అవి సినిమాను కాపాడే పరిస్థితిలో అయితే లేవు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది కాబట్టి సినిమా చూడొచ్చు అనే కొందరి వెర్షన్ కి ఇంత కన్నా బాగా డిస్కవరీ ఛానల్ లో చూపిస్తారు అని కౌంటర్ వేస్తున్నారు సోషల్ మీడియా లో. సినిమా మొదలు పెట్టడమే కార్గిల్ యుద్ధం, యుద్ధ ఖైది గా కార్తీ పట్టుబడటం లాంటివి చూసి మరో రోజా చూడబోతున్నాం అనే ఫీలింగ్ నిమిషాల్లో మాయం చేసాడు మణిరత్నం.

రామ్ గోపాల్ వర్మ కూడా ఇలాగే సోదిలో లేకుండా పోయాడు కంటెంట్ లేని సినిమాలు తీసి. కొందరు అభిమానులు వీళ్ళు ఎలా తీసినా ఆహా ఓహో అని పొగిడినంత మాత్రాన నిర్మాతకు వసూళ్లు రావు. ఎమోషన్ కనెక్ట్ కాకుండా ఎలాంటి సినిమా తీసినా అది వృధా ప్రయత్నమే అవుతుంది. మణిరత్నం తీసిన సఖి కూడా గొప్ప కథ కాదు. చాలా సింపుల్ కపుల్ స్టొరీ. కాని అంత బాగా ఎలా ఆడింది. స్క్రీన్ ప్లే మేజిక్. గాయం, సత్య, రంగీలా లాంటి క్లాసిక్స్ ఇచ్చిన వర్మ చవకబారు సినిమాలకు ఎలా తగ్గిపోయాడు. అదంతే.

తమ టాలెంట్ మీద తమకే పట్టు కోల్పోయినప్పుడు ఎంతటి వారికైనా ఈ స్టేజి వచ్చేస్తుంది. కాని ఈ దర్శకులకు ఓ బ్రాండ్ వేల్యూ ఉంది.అది తగ్గకుండా ఉండాలి అంటే కంటెంట్ మీదైనా ఫోకస్ పెట్టాలి లేదా సినిమాలు అయినా మానేయాలి. ఫ్యూచర్ లో మణిరత్నం సినిమాలు అంటే ఘర్షణ, నాయకుడు, దళపతి, గీతాంజలి, రోజా, బొంబాయి గుర్తుకువచ్చి గర్వ పడాలి కాని కడలి, విలన్, చెలియా లాంటి గుర్తొచ్చి అబ్బా ఆ సినిమాలా అని ఉసురుమనిపించేలా ఉండకూడదు. మరి రామ్ చరణ్ తో సినిమా ఎలా ఉంటుందో అని ఇప్పుడే బెంగ పడుతున్నారు మెగా ఫాన్స్.
> More Latest Movie News
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...