ప్రెస్ మీట్లో హీరోయిన్ని ఇరికించేసిన చేతన్ భగత్!

Chetan-Bhagat-passes-loose-remark-on-Shraddha-Kapoor-Andhra-Talkies
ప్రెస్ మీట్లో హీరోయిన్ని ఇరికించేసిన చేతన్ భగత్!

అసలే శ్రద్ధా కపూర్ పేరు కొన్ని రోజులుగా మీడియాలో బాగా నానుతూ ఉంది. ఆమె కోసం ఫర్హాన్ అక్తర్.. సిద్దార్థ్ రాయ్ కపూర్ కొట్టేసుకున్నారంటూ మీడియాలో రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై మీడియా వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతోంది శ్రద్ధా. అలాంటిది ఆమెను విలేకరుల సమావేశంలో అడ్డంగా ఇరికించేశాడు రైటర్ చేతన్ భగత్.

భగత్ రాసిన ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ నవల ఆధారంగా అదే పేరుతో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అందులో అర్జున్ కపూర్.. శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. మోహిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 19న విడుదలకు సిద్ధమవుతోంది. దీని ట్రైలర్ లాంచ్ సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్లో చేతన్ భగత్ మాట్లాడుతుండగా.. విలేకరులు బాయ్ ఫ్రెండ్ అనే మాట ఎత్తగానే అతను శ్రద్ధా వైపు చూపించాడు.

‘‘ఈ ప్రశ్నకు నువ్వైతేనేం బాగా సమాధానం చెప్పగలవు.. ఈ మధ్య నీ ఎఫైర్లకు సంబంధించి మీడియాలో చాలా వార్తలొస్తున్నాయి’’.. అంటూ ఆమెకు మైక్ ఇచ్చేశాడు చేతన్. హఠాత్తుగా తననుద్దేశించి చేతన్ అంత మాట అనేసరికి శ్రద్ధా ముఖ కవళికలే మారిపోయాయి. ఆమె చాలా ఇబ్బంది పడిపోయింది. ఏదో మాట దాటవేసే ప్రయత్నం చేసింది. అంతలో హీరో అర్జున్ కపూర్ జోక్యం చేసుకుని టాపిక్ మళ్లించే ప్రయత్నం చేశాడు. శ్రద్ధాను కొంత వరకు కాపాడాడు. చేతన్ భగత్ ఇలా మాట్లాడాల్సింది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...