వీళ్ళు సినిమాలు తీయటం ఆపేస్తే బెటర్ అంటున్నారు

నిన్న మణిరత్నం సినిమా చెలియా మొత్తానికి యునానిమస్ గా డిజాస్టర్ టాక్ తో ముందుకు వెళుతోంది. నీరసమైన కథా కథనాలతో రెగ్యులర్ ఆడియన్స్ కి ఓపిక పరీక్ష పెట్టిన మణిరత్నం అందులో మాత్రం తాను ఓడిపోయాడు. అసలు కథ పెద్దగా లేకుండా కేవలం ఎమోషన్స్ ని స్లో మోషన్ లో హై లైట్ చేస్తూ అర్థం కాని డైలాగ్స్ తో సన్నివేశాలను సాగదీస్తూ తీసిన మణిరత్నం టేకింగ్ పట్ల అందరు పెదవి విరుస్తున్నారు. కొందరు అభిమానులు, సినిమా ప్రేమికులు కెమెరా వర్క్ గురించి, మ్యూజిక్ గురించి ఎంత పాజిటివ్ గా మాట్లాడుతున్నా అవి సినిమాను కాపాడే పరిస్థితిలో అయితే లేవు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది కాబట్టి సినిమా చూడొచ్చు అనే కొందరి వెర్షన్ కి ఇంత కన్నా బాగా డిస్కవరీ ఛానల్ లో చూపిస్తారు అని కౌంటర్ వేస్తున్నారు సోషల్ మీడియా లో. సినిమా మొదలు పెట్టడమే కార్గిల్ యుద్ధం, యుద్ధ ఖైది గా కార్తీ పట్టుబడటం లాంటివి చూసి మరో రోజా చూడబోతున్నాం అనే ఫీలింగ్ నిమిషాల్లో మాయం చేసాడు మణిరత్నం.

రామ్ గోపాల్ వర్మ కూడా ఇలాగే సోదిలో లేకుండా పోయాడు కంటెంట్ లేని సినిమాలు తీసి. కొందరు అభిమానులు వీళ్ళు ఎలా తీసినా ఆహా ఓహో అని పొగిడినంత మాత్రాన నిర్మాతకు వసూళ్లు రావు. ఎమోషన్ కనెక్ట్ కాకుండా ఎలాంటి సినిమా తీసినా అది వృధా ప్రయత్నమే అవుతుంది. మణిరత్నం తీసిన సఖి కూడా గొప్ప కథ కాదు. చాలా సింపుల్ కపుల్ స్టొరీ. కాని అంత బాగా ఎలా ఆడింది. స్క్రీన్ ప్లే మేజిక్. గాయం, సత్య, రంగీలా లాంటి క్లాసిక్స్ ఇచ్చిన వర్మ చవకబారు సినిమాలకు ఎలా తగ్గిపోయాడు. అదంతే.

తమ టాలెంట్ మీద తమకే పట్టు కోల్పోయినప్పుడు ఎంతటి వారికైనా ఈ స్టేజి వచ్చేస్తుంది. కాని ఈ దర్శకులకు ఓ బ్రాండ్ వేల్యూ ఉంది.అది తగ్గకుండా ఉండాలి అంటే కంటెంట్ మీదైనా ఫోకస్ పెట్టాలి లేదా సినిమాలు అయినా మానేయాలి. ఫ్యూచర్ లో మణిరత్నం సినిమాలు అంటే ఘర్షణ, నాయకుడు, దళపతి, గీతాంజలి, రోజా, బొంబాయి గుర్తుకువచ్చి గర్వ పడాలి కాని కడలి, విలన్, చెలియా లాంటి గుర్తొచ్చి అబ్బా ఆ సినిమాలా అని ఉసురుమనిపించేలా ఉండకూడదు. మరి రామ్ చరణ్ తో సినిమా ఎలా ఉంటుందో అని ఇప్పుడే బెంగ పడుతున్నారు మెగా ఫాన్స్.
> More Latest Movie News

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...