మహానటి లీకులతో డైరక్టర్ అప్సెట్

Tollywood-Hero-Nagarjuna-Upset-With-Mahanati-Leaks-Andhra-Talkies
ఇండస్ట్రీలో ఇప్పుడు బయో పిక్స్ హవా నడుస్తోంది. స్పోర్ట్స్ పర్సనాలిటీలపై బయోపిక్స్ తీయడం తేలిక. అందుకే బాలీవుడ్ లో భాగ్ మిల్కా భాగ్ సుల్తాన్ చక్ దే ఇండియా ఎం.ఎస్.ధోనీ రీసెంట్ గా దంగల్ వంటి సినిమాలు తీశారు. ఇవన్నీ హిట్ అయ్యాయి. అయితే సినిమా ఇండస్ట్రీపై బయో పిక్స్ వచ్చింది తక్కువే. కొన్నేళ్ల క్రితం సిల్క్ స్మిత జీవితంపై 'డర్టీ పిక్చర్' తీసి హిట్ కొట్టారు. సినిమా వాళ్ల జీవితంపై పుస్తకాలు బాగానే వస్తాయి తప్ప సినిమాలు రావు. ఈ ట్రెండ్ కు భిన్నంగా నాగ్ అశ్విన్ తెలుగులో బయో పిక్ కు శ్రీకారం చుట్టాడు.

తెలుగు వారికి సుపరిచితురాలైన మహానటి సావిత్రి జీవిత గాథను ఆధారంగా తీసుకుని ‘మహానటి’ పేరుతో సినిమా తీయడానికి నాగ్ అశ్విన్ సిద్ధమయ్యాడు. లీడ్ రోల్ లో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాలో సమంత కూడా నటించనుంది. ఈ సినిమాకు ఇటీవల క్లాప్ కూడా కొట్టేసి షూటింగ్ మొదలెట్టేశారు. ఇలా షూటింగ్ మొదలయ్యీ అవక ముందే ఇందులో సమంత కీర్తి సురేష్ గెటప్ లతో పిక్చర్స్ లీకైపోయాయి. దీంతో షాకైపోవడం డైరెక్టర్ నాగ్ అశ్విన్ వంతయింది. సావిత్రిగా కీర్తిసురేష్ ఎలా ఉంటుందో వెండితెరపైనే చూపించాలనుకున్న నాగ్ అశ్విన్ కు ఇలా గెటప్ రివీల్ అయిపోవడం ఏ మాత్రం నచ్చలేదు. దీనికితోడు జర్నలిస్టు పాత్రలో కనిపించే సమంత లీకయిన పిక్చర్స్ లో మహారాణి గెటప్ లో కనిపిస్తోంది.

సినిమా రిలీజవ్వక ముందే అందుకు సంబంధించిన విషయాలు అన్నీ బయటకు వచ్చేస్తే థ్రిల్ పోతుందన్నది దర్శకుడి బాధ. బాహుబలి-1 సినిమాకు కూడా కొన్ని యుద్ధం సీన్లు షూటింగ్ కు ముందు బయటకొచ్చాయి. అప్పటి నుంచి మేకర్స్ సినిమాకు సంబంధించి  ప్రతి విషయం పకడ్బందీగా ఉండేలా చూసుకున్నారు. దీంతో బాహుబలి-2 కు సంబంధించి చిన్న విషయమూ బయటకు రాలేదు. ఇక నుంచి నాగ్ అశ్విన్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అయిపోవడమే. Read More

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...