ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసేయాలన్న ప్రముఖ నటి

Shabana-Azmi-on-Triple-Talaq
దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతున్న ట్రిఫుల్ తలాక్ మీద ప్రముఖ బాలీవుడ్ నటి..హైదరాబాద్ మూలాలున్న షబానా ఆజ్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్ అమానవీయమైనది అభివర్ణించారు. ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు జరిగిన విషయం తెలిసిందే. తలాక్ విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే పలు కీలక వ్యాఖ్యలు చేయగా.. ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం తలాక్ ను కొనసాగించాల్సిందేనంటూ బలంగా వాదిస్తున్న సంగతి తెలిసిందే.

తన తుది తీర్పును సుప్రీం వెల్లడించాల్సి ఉన్న సమయంలో.. తాజాగా షబానా ఆజ్మీ ట్రిపుల్తలాక్ గురించి తన వైఖరిని స్పస్టం చేశారు. ట్రిఫుల్ తలాక్ మీద బాలీవుడ్ ప్రముఖులు పెద్దగా స్పందించని వేళ.. షబానా ఆజ్మీ అందుకు భిన్నంగా ఓపెన్ గా గళం విప్పటం ఒక కొత్త పరిణామంగా చెప్పొచ్చు. ట్రిఫుల్ తలాక్ను వ్యతిరేకించటమేకాదు.. పవిత్ర ఖురాన్ సైతం ఎక్కడా ట్రిపుల్ తలాక్ను అనుమతించలేదని మీడియాలో మాట్లాడిన సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

తలాక్ కారణంగా ముస్లిం మహిళల సాధికారత.. సమానత్వం హక్కుల్ని కాలరాస్తుందని విమర్శించిన ఆమె.. ట్రిపుల్ తలాక్ మహిళ ప్రాధమిక హక్కులకు భంగకరమన్నారు. ఇంత ఓపెన్ గా ఒక ముస్లిం మహిళా ప్రముఖురాలు ట్రిపుల్ తలాక్ మీద చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది
More Latest Movie News & Videos

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...