ఆఖరికి మన బాలయ్య కూడా పాడేసాడు!

Tollywood-Top-Hero-Balakrishna-Sings-For-His-101st-Movie-Andhra-Talkies
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విజయం తరువాత బాలయ్య నిర్ణయం అందరినీ ఒక్కసారి షాక్ కు గురిచేసింది. ఎందుకంటే బాలయ్య ఓకే చెప్పింది బి గోపాల్ సినిమా బోయపాటి శ్రీనివాస్ సినిమా కాదు. పచ్చిగా మాటలు.. పోకిరి పనులు.. పొగరున్న హీరో సినిమాలు.. తీసిన పూరీ జగన్నాధ్ డైరక్షన్ లో సినిమా. ఈ కాంబినేషన్ చాలు ఆ సినిమా కథ కన్నా వారి కలయికకు ఎంతటి క్రేజ్ ఉందో చెప్పడానికి. ఔను పోకిరి లాంటి  మాటలు బాలయ్య పలికితే ఎలా ఉంటుంది. మరి అదే ఇప్పుడు అందరిలో ఉన్న ఉత్కంఠ.

ఇప్పుడు అలాంటి సినిమాకి మరో కొత్త సొగసు వచ్చింది. నందమూరి బాలకృష్ణ ఈ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఒక పాట పాడుతున్నాడు. ఈ సినిమా సంగీత దర్శకుడు అనూప్ రుబెన్స్ కొంపోజ్ చేసిన ఒక పాటకు బాలయ్య గాత్రం అందించేశాడు కూడా. ఈ సినిమాలో బాలయ్య డైలాగ్ కన్నా అతని పాటకు చాలా పవర్ ఉంటుంది అని చెపుతున్నారు. ఇంతకు ముందు పూరీ హీరోలు మహేశ్ రవితేజ కొన్ని సంధర్భాలలో పాడారు. ఇప్పుడు మళ్ళీ సినిమాకి ఆయువుపట్టు అయిన పాత్రచే మళ్ళీ పాడిస్తునాడు ఈ డ్యాషింగ్ డైరక్టర్.

ఈ సినిమా లో బాలయ్యకు జోడీగా అతని లక్కీ చార్మ్ శ్రేయ సరన్ నటిస్తోంది. బాలయ్య ఈ సినిమాలో పక్క బ్యాడ్ బోయ్ లా కనిపిస్తాడు అని అందరూ చెప్పుకుంటున్నారు. పూరీ డోస్ మాటలు బాలకృష్ణ యాక్షన్ తో సెప్టెంబర్ లో విడుదల చేయడానికి అన్ని కసరత్తులు చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమిని టివి 6.5 కోట్లకు కొనేసిందని కూడా టాక్ వినిపిస్తోంది. అది సంగతి.
More News : Andhra Talkies Info

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...