మెగాస్టార్ చిరంజీవి కోసం సల్మాన్ సాయం?

Will-Salman-Khan-do-Cameo-Role-in-Megastar-Movie-Uyyalawada-Narasimha-Reddy-Andhra-Talkies
‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా విషయంలో అధికారిక ప్రకటన ఏదీ లేదేంటి అనుకుంటుండగా. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఓపెన్ అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు పని చేసే టెక్నీషియన్ల వివరాలు చెప్పాడు. స్క్రిప్ట్ వర్క్ కోసం ఎంత మంది రచయితలు పని చేస్తున్నది వివరించాడు. ఈ సందర్భంగానే ఈ సినిమాలో ఆల్ ఇండియా ఆర్టిస్టులు నటిస్తారని అన్నాడు చిరు. ‘ఉయ్యాలవాడ..’ను తెలుగుతో పాటు తమిళం.. హిందీ భాషల్లోనూ తెరకెక్కించబోతున్న నేపథ్యంలో ఆయా ఇండస్ట్రీలకు చెందిన.. నేషనల్ అప్పీల్ ఉన్న ఆర్టిస్టులతో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్లుగా కచ్చితంగా బాలీవుడ్ భామల్నే తీసుకుంటారని అంటున్నారు.

బాలీవుడ్ హీరోయిన్లే కాదు.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందంటున్నాయి ఈ చిత్ర యూనిట్ వర్గాలు. సల్మాన్ తో ఓ గెస్ట్ రోల్ చేయిస్తే.. హిందీ వెర్షన్ కు నేషనల్ లెవెల్లో మంచి ప్రచారం దక్కుతుందని.. హిందీ ప్రేక్షకులకు ఈ సినిమాను చేరువ చేయడం సులువవుతుందని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నాడట. సల్మాన్ తో తనకు మంచి సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడట. చిన్న క్యామియో రోల్ కావడంతో సల్మాన్ ఒప్పుకునే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. నిజంగా సల్మాన్ నటిస్తే ‘ఉయ్యాలవాడ..’కు అది కచ్చితంగా పెద్ద ప్లస్ అవుతుంది. మరి తమిళం నుంచి ఏ ఆర్టిస్టుల్ని సంప్రదించబోతున్నారో చూడాలి. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈలోపే ఈ సినిమాలో నటించే ఆర్టిస్టులపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...