కొరటాల మాటలు మనం ఆలోచించాల్సిన విషయమే

Director-Koratala-Siva-Comments-on-Present-Politics-Andhra-Talkies
సమాజానికి ఓ మంచి సందేశం ఇస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సవకుండా సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం  డైరెక్టర్ కొరటాల శివ స్పెషాలిటీ. రైటర్ గా మొదలెట్టి డైరెక్టర్ గా టర్న్ అయిన కొరటాల శివ మొదటి సినిమా మిర్చి నుంచి ప్రతి సినిమాలోనూ సొసైటీకి పనికొచ్చే ఏదో ఒక విషయం చెబుతూనే వచ్చాడు.

‘ఊరి నుంచి ఎంతో తీసుకున్నాం. తిరిగి ఇచ్చేయకపోతే లావైపోతాం’ అంటూ శ్రీమంతుడులో మహేష్ బాబుతో చెప్పించిన డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. సొంత ఊరికి ఎంతో కొంత మేలు చేసేందుకు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. కొరటాల శివ లేటెస్ట్ గా తీసిన జనతా గ్యారేజ్ సినిమా మొత్తం పర్యావరణ పరిరక్షణ చుట్టూ సాగుతోంది. మొక్కలు కాపాడుకోవాలనే సందేశాన్ని ఈ సినిమాలో బలంగానే వినిపించాడు. రీసెంట్ గా కొరటాల శివ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు. ‘రాజకీయాలు రానురాను దారుణాతిదారుణంగా దిగజారిపోతున్నాయి. ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో. దేవుడు కూడా దీని నుంచి కాపాడలేడు. మనం కాపాడుకోగలం.. మనం మాత్రమే కాపాడుకోగలం’ అంటూ బలమైన సందేశాన్ని వినిపించాడు.

రాజకీయ పరిస్థితులను చూసి ఆవేదన చెంది సరిపెట్టుకోకుండా పదిమందిలో ఆలోచన పెంచేలా కొరటాల శివ పెట్టిన ట్వీట్ అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగేది ప్రజలేనన్న నిజం అందరూ గుర్తెరగాలన్న ఆవేదన కొరటాల మాటల్లో కనిపిస్తోంది.  మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం కొరటాల శివ తీస్తున్న భరత్ అనే నేను సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతున్నదే కావడం విశేషం. బాలీవుడ్ భామ కియారీ అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...