వీహెచ్ కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బస్తీ మే సవాల్!

Director-Ram-Gopal-Varma-Challenges-to-V-Hanumantha-Rao-andhra-talkies-telugu
అర్జున్ రెడ్డి సినిమా  పోస్టర్లపై చెలరేగిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా పోస్టర్లు అసభ్యకరంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు వాటిని చించేసిన సంగతి తెలిసిందే. దాంతో వీహెచ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మతన ఫేస్ బుక్ ఖాతాలో వ్యంగ్యాత్మక వ్యాఖ్యలు చేశాడు. వర్మను హైదరాబాద్ లో అడుగుపెట్టనీయమంటూ వీహెచ్ హెచ్చరించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ వర్మ బదులిచ్చాడు.  అంతేకాకుండా తాను రేపు ఈ సినిమా చూడడానికి ప్రసాద్ ఐమ్యాక్స్ కు వెళ్తున్నానని - అక్కడ కలుద్దామని వీహెచ్ కు సవాల్ విసిరాడు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.

అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్ల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. వీహెచ్ పై వర్మ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఈ పోస్టర్ల వివాదంలో తన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు రావాలని వీహెచ్ కు వర్మ సవాల్ విసిరాడు. తనను హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వనని హెచ్చరించిన వీహెచ్ పై వర్మ మండి పడ్డాడు. బస్సులపై తన సినిమా పోస్టర్లను చించేసినందుకు బదులుగా వీహెచ్ బట్టలు చింపేయాలని ఆ చిత్ర హీరో విజయ్ దేవరకొండను కోరాడు. వీహెచ్ గారికి ఆ చిత్ర నిర్మాతలు పబ్లిసిటీ కోసం డబ్బులు చెల్లించినట్లు తనకు అనుమానంగా ఉందని వర్మ సెటైర్ వేశాడు. ఈ డబ్బుల వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ జరపాలన్నాడు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...