స్త్రీలు సిగరెట్ తాగితే తప్పేముంది? అంటున్న భామ

Girls-Who-Smoke-Are-Not-Characterless-Says-Kriti-Sanon-Andhra-Talkies-Telugu
చాలా మంది హీరోయిన్స్ స్టార్ హీరోస్ తో నటించడానికి చాలా ఇష్టపడతారు. అందుకు వారు ఎంతో కష్టపడి చిన్న తరహా సినిమాలతో క్లిక్ అయితేనే స్టార్ హీరోస్ తో ఛాన్సులను దక్కించుకుంటారు. కానీ కొందరు హీరోయిన్లు మొదటి ఛాన్సులలోనే నెంబర్ వన్ లాంటి హీరోలతో జోడి కడతారు. అలా ఛాన్సులు దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు క్రితి సనన్. మొదటి సినిమాతోనే మహేష్ బాబు "1 నేనెక్కడినే" వంటి భారీ సినిమాలో మెరిసింది. అయితే ఆ సినిమా ఈ అమ్మడికి అంతగా కలిసి రాలేదు.

కానీ హిందీలో చిన్న హీరోలతో జోడికట్టి పర్వాలేదనిపించింది. కానీ ఆ సంతోషం కూడా ఎన్నో రోజులు నిలవలేదు ఈ క్రితి సనన్ కి. ఆమె రీసెంట్ గా నటించిన "రాబ్తా" సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు కొత్త తరహాలో ఓ రొమాంటిక్ కామెడీ కథతో కూడిన "బరేలీ కి బార్ఫి" అనే సినిమాతో  రాబోతుంది.  అయితే రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని ఘాటు కామెంట్స్  చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత రోజుల్లో మహిళల పట్ల చూపిస్తున్న ఒక చిన్నచూపు తనకు నచ్చడం లేదట. ముఖ్యంగా అమ్మాయిలు కాస్త మోడెర్న్ గా కనిపించినా తప్పుగా చూస్తున్నారని చెప్పింది. అంతే కాకుండా టాటూలు వేసుకున్న మహిళలను సిగరెట్ - మద్యం అలవాట్లు ఉన్న మహిళలను పూర్తిగా క్యారెక్టర్ లేదని నిర్దారించడం సరైనది కాదని చెబుతోంది. అయితే ఈ అమ్మడు ఇలా మాట్లాడటానికి కారణం "బరేలీ కి బార్ఫి" అనే సినిమాలో అలాంటి పాత్రలోనే నటించిందట. ఆ సినిమాలో సిగరెట్ కూడా తాగిందట. దీంతో మహిళలకు చెడు అలవాట్లు ఉన్నంత మాత్రాన తప్పుగా చూడవద్దని హితబోధ చేస్తోంది.

అయితే ఈ సినిమాపై ఈ అమ్మడు భారీ ఆశలే పెట్టుకుందన్నమాట. కాకపోతే ఇలా సినిమా కోసం ఉద్దేశ్యాలను చెప్పడం బాగానే ఉంది కాని.. అలాంటి ఆదర్శాలే పక్కోళ్ళ ప్రియుళ్లను దొబ్బేసేటప్పుడు కూడా ఉండాలని జనం చెవులు కొరుక్కుంటున్నారు. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...