వారెవ్వా! సన్నీలియోన్ అంటే ఏమనుకున్నారు?

Sunny-Leone-Receives-a-Jaw-dropping-Welcome-In-Kochi-Andhra-Talkies-telugu
ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక ఫొటో హల్ చల్ చేస్తోంది. ఒక సిటీలోని పెద్ద ఫ్లై ఓవర్ కింద ఒక కారు చుట్టేసి వేలల్లో జనం కనిపిస్తున్నారు. ఇటు అటు చాలా దూరం పాటు ఇసుకేస్తే రాలనంతగా జనాలు మూగి ఉన్నారు. ఆ ఫొటో చూపించి.. కార్లో ఉన్న సెలబ్రెటీ ఎవరో చెప్పుకోండి చూద్దా అంటే. సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. విజయ్.. అజిత్.. మహేష్ బాబు అంటూ పెద్ద పెద్ద స్టార్ల పేర్లు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఆ కార్లో ఉన్న వ్యక్తి సన్నీ లియోన్. ఆమెను చూడ్డానికే కొచ్చి జనాలు అంతగా ఎగబడ్డారు. ఈ ఫొటో ఒక్కటి చాలు సన్నీలియోన్ కు ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో చెప్పడానికి.

గతంలోనూ ఒకసారి కొచ్చికి వెళ్లి సందడి చేసిన సన్నీ.. తాజాగా మరోమారు అక్కడికి వెళ్లింది. ‘ఫోన్ 4 డిజిటల్ హబ్’ అనే షో రూం ఆవిష్కరణ కోసం కొచ్చిలో అడుగుపెట్టిన సన్నీకి అక్కడి జనం బ్రహ్మరథం పట్టారు. వేలాది మంది కారును చుట్టుముట్టేశారు. కారు ముందుకు కదలనివ్వలేనంతగా మూగిపోయారు. ఏరియల్ వ్యూలో ఈ ఫొటో చూస్తే వారెవా అనిపిస్తోంది. సన్నీ లియాన్ ఫాలోయింగ్ మజాకా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు జనాలు. సన్నీ కూడా తన మీద కుర్రాళ్లలోని అభిమానం చూసి మురిసిపోతూ.. థ్యాంక్ యు కొచ్చి అంటూ క్యాప్షన్ పెట్టి ఈ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసుకుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...