చేసిన నేరాన్ని ఒప్పుకున్న ప్రముఖ నటుడు

saidapet-court-fine-rs-5200-on-Tamil-Actor-Jai-Andhra-Talkies.jpg
తప్పులు చేయటం.. తమకే పాపం తెలీదన్నట్లుగా వ్యవహరించటం కొందరు ప్రముఖ నటీనటులకు తెలిసిన విద్యనే. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ జీవించే గుణం ఉన్న నటుల ఉదంతాలు అందరికి తెలిసిందే. నేరం చేసి కూడా.. కాదంటే కాదంటూ వాదించి అడ్డంగా దొరికిపోయినోళ్లు కొందరైతే.. మరికొందరు తప్పించుకున్నోళ్లు ఉన్నారు. తాజాగా మాత్రం  చేసిన తప్పును కోర్టు ఎదుట ఒప్పేసుకున్నారో ప్రముఖ నటుడు.

తమిళ యువ నటుడిగా సుపరిచితుడైన జై.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. జర్నీ లాంటి అనువాద సినిమాలతో  తెలుగోళ్లకు దగ్గరైన ఆయన.. ఈ మధ్యన డ్రంక్ అండ్ డ్రై నేరంలో బుక్ అయ్యారు. గత నెల 21న మద్యం తాగేసి కారు నడపటమే కాదు.. చెన్నై మహానగరంలోని అడయారు బ్రిడ్జి సమీపంలోని గోడను ఢీ కొట్టారు.

ఈ ఉదంతంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి.. సైదాబాద్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే.. ఈ కేసు విచారణ గురువారం వచ్చింది. అయితే.. విచారణకు జై హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి జైకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టుకు వచ్చిన జై.. తాను చేసిన నేరాన్ని అంగీకరించారు.

దీంతో అతనికి రూ.5200 జరిమానా విధించటంతో పాటు.. ఆరు నెలల పాటు వాహనాన్ని డ్రైవ్ చేయకూడదన్న ఆదేశాల్ని జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో రానున్న ఆరునెలల పాటు జై.. వాహనం నడిపే అవకాశాన్ని కోల్పోయారు.
saidapet-court-fine-rs-5-200-on-Tamil-Actor-Jai-Andhra-Talkies

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...