యాక్టర్ కాబోయి డైరెక్టర్ అయ్యా

Director-Bobby-about-His-Acting-Dream-andhra-talkies-telugu.jpg
సినిమా అనేది అందమైన రంగుల ప్రపంచం. అందులో వెలిగిపోవాలని ఎందరో కలలు కంటుంటారు. సినిమాల్లో నటించాలని ఊరు వదిలి ఫిలిం నగర్ కు వచ్చినవాళ్లు ఎలాగైనా వెండితెరపై కనిపించాలని తాపత్రయపడుతుంటారు. చిన్నాచితకా పాత్రలైనా చేయడానికి రెడీ అవుతారు. కానీ తెరపై కనిపించే ఛాన్స్ వచ్చినా లాగు వేసుకోవాల్సి వస్తుందన్న కారణంతో నటించడానికి ఇష్టపడలేదంటున్నాడు యంగ్ డైరెక్టర్ బాబి.

సినిమా రచయితగా డైరెక్టర్గా కంటే నటించే ఛాన్సే బాబికి ముందు వచ్చిందట. ఆ విషయం అతడే స్వయంగా చెప్పుకొచ్చాడు.  ‘‘రైటర్ చిన్నికృష్ణ వల్ల అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా గంగోత్రిలో యాక్టింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో బన్నీ వెనుక నలుగురైదుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో నేనూ ఒకడ్ని. సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలాసేపు బన్నీ నిక్కరుతోనే ఉంటాడు. అతడి వెనుక ఉండే నన్ను కూడా అదే వేసుకోమన్నారు. మూడో తరగతి నుంచే నేను ఫుల్ ప్యాంట్ వేసుకునే వాడిని. అలాంటిది అంత పెద్దయ్యాక లాగు వేసుకోవడం నా వల్ల కాలేదు. దాంతో ఆ సినిమా వదులుకున్నా’’ అంటూ వెండితెరపై తను నటించే అవకాశం ఎలా తప్పిపోయిందో గుర్తు చేసుకున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డైరెక్ట్ చేసిన బాబి లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జైలవకుశ సినిమా తీశాడు. ఎన్టీఆర్ ను  తొలిసారి ట్రిపుల్ రోల్ లో చూపించి అతడి అభిమానులకు పండగ చేశాడు. ఈ సినిమా డైరరెక్టర్ గా బాబికి మంచి పేరు తెచ్చిపెట్టింది. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...