That power star apologized | ఆ పవర్ స్టార్ క్షమాపణ చెప్పాల్సిందే

Lawyers-Demand-Apology-From-Puneeth-Rajkumar-Andhra-Talkies-Telugu
ఇక్కడ అన్నది మన పవన్ కళ్యాణ్ ని కాదు లేండి. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో అక్కడి ఫాన్స్ ముద్దుగా పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ గురించి. గత వారం విడుదలైన అంజని పుత్ర అనే సినిమాలో ఇతనే హీరో. ఇందులో తమను కించపరిచేలా తీవ్రమైన పదజాలం - సన్నివేశాలు ఉన్నాయని లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు ఫైల్ చేస్తే ప్రదర్శన నిలిపివేయమని కోర్ట్ స్టే ఇచ్చింది. కాని విచిత్రంగా కోర్ట్ ఆర్డర్ లెక్క చేయకుండా షోలు కంటిన్యూ చేయటం ఇప్పుడు వివాదంగా మారింది. తాజాగా బెంగుళూరులో ప్రెస్ తో సమావేశం జరిపిన లాయర్లు పునీత్ రాజ్ కుమార్ కనక క్షమాపణ చెప్పకపోతే ఉద్యమం చేపడతామని అల్టిమేటం జారీ చేసారు. రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఇలాంటి మరక గతంలో ఎన్నడూ లేదు. ఇలా జరగడం పట్ల అన్నయ్య శివ రాజ్ కుమార్ కూడా సీరియస్ గా ఉన్నారు.

ఇంతా చేసి అంజని పుత్ర అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు. భారీ ఓపెనింగ్స్ వచ్చినా నెగటివ్ టాక్ తో ఫైనల్ గా ఫ్లాప్ గా మిగిలేలా ఉంది. అందుకే అందినకాడికి ఓపెనింగ్స్ రూపంలో సాధ్యమైనంత వెనక్కు రాబట్టుకుందాం అని ట్రై చేస్తున్న నిర్మాతకు కోర్ట్ ఆర్డర్స్ అడ్డంకిగా మారాయి. ఈ అంజని పుత్ర కథలో ఏముంది అనుకుంటున్నారా. ఓ మూడేళ్ళ క్రితం విశాల్ హీరోగా పూజా అనే సినిమా ఒకటి వచ్చింది. గుర్తుందిగా. దాని రీమేకే ఈ అంజని పుత్ర. అందులో రాధిక చేసిన పాత్ర ఇందులో రమ్యకృష్ణ చేసింది. రష్మిక మండన్న హీరొయిన్. ఫుల్ మాస్ మసాలా సినిమాగా తీసిన ఈ మూవీలో అనవసరంగా లా సిస్టం పై విసుర్లు వేసారని వివాదం స్టార్ట్ అయ్యింది. ఇప్పటికైతే పునీత్ సైలెంట్ గా ఉన్నాడు. లాయర్లు డిమాండ్ చేసినట్టు సారీ చెబుతాడో లేదో చూడాలి.
That power star apologized

Why is Sunil missing in Agnyaathavaasi Movie | అజ్ఞాతవాసిలో సునీల్ లేకపోవడానికి కారణం?

Sunil-Reveals-Reason-Behind-He-is-not-Part-of-Agnyaathavaasi
స్టార్ కమెడియన్ హోదా అనుభవించే టైంలోనే హీరోగా మారి అదృష్టం పరీక్షించుకున్న సునీల్.. మొదట్లో బాగానే సక్సెస్ అయ్యాడు. కానీ కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఈ హీరో.. మళ్లీ కమెడియన్ గా మారాలని భావిస్తున్నాడనే టాక్ కొన్ని నెలలుగా వినిపిస్తోంది. అయితే.. రీఎంట్రీలో తన పాత్రతో సెన్సేషన్ సృష్టించాలన్నది సునీల్ ఆలోచన.

ఇందుకు తన స్నేహితుడు అయిన త్రివిక్రమ్ అయితేనే కరెక్ట్ అన్నది సునీల్ నమ్మకం. అందుకే త్రివిక్రమ్ మూవీలో ఓ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తాడని అంతా భావించారు. ఇప్పటివరకూ ఇది రూమర్ మాత్రమే కానీ.. ఇప్పుడిది నిజమే అని చెప్పేశాడు సునీల్. త్వరలో రూపొందనున్న ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో మూవీలోనే కాదు.. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసిలోనే ఓ సూపర్బ్ క్యామియో చేశాడనే టాక్ కూడా వినిపించింది. ఈ మాటలు కూడా నిజమే అని ఒప్పుకున్నాడు సునీల్. ప్రస్తుతం తను హీరోగా రూపొందిన 2కంట్రీస్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సునీల్.. త్రివిక్రమ్ మూవీ సంగతులపై పెదవి విప్పాడు.

స్టోరీ సిట్టింగ్స్ సమయంలోనే ఈ డిస్కషన్ వచ్చినా.. తన కోసం అనుకున్న పాత్రకి.. ఆశించిన స్థాయి ఇంపార్టెన్స్ లభించలేదని ఫీలయ్యాడట సునీల్. అందుకే పవన్ కళ్యాణ్ మూవీ నుంచి తప్పుకున్నానని చెప్పేశాడు. అజ్ఞాతవాసిలో తను నటించాల్సి ఉన్నా.. చివరకు ఆ ఆఫర్ ను వదిలేశానని అన్న సునీల్.. తనకు మళ్లీ కమెడియన్ గానో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో గ్రాండ్ రీఎంట్రీ ఇప్పించగల బాధ్యత త్రివిక్రమ్ కే ఇచ్చేసినట్లు చెప్పకనే చెప్పాడు.
Why is Sunil missing in Agnyaathavaasi Movie

Megastar Chiranjeevi and Pawan Kalyan Viral Video | మెగా స్టార్ చిరంజీవి.. భలే చిలిపి గురూ

Megastar-Chiranjeevi-and-Pawan-Kalyan-Viral-Video-Andhra-Talkies
మెగా స్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వేదికపై కలిసి కనిపించడం అభిమానులకు ఎప్పుడూ పండగే. ఎప్పుడో అరుదుగా వీళ్లిద్దరూ ఒకచోట కనిపించే సందర్భంలో వాళ్లిద్దరి మధ్య ప్రతి మూమెంట్ ను అభిమానులు వెయ్యికళ్లతో వాచ్ చేస్తుంటారు. అందులో ప్రత్యేకంగా ఏ చిన్న అంశం కనిపించినా వారి దృష్టి దాటిపోదు. ఇలాంటి సంఘటనే తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజ్భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రాజకీయ ప్రముఖులందరితో పాటు మెగా బ్రదర్స్ కూడా హాజరయ్యారు. పవన్ వేరేవాళ్లతో మాట్లాడుతున్న టైంలో వెనుక నుంచి వచ్చిన చిరంజీవి చాటుగా తమ్ముడి నడుమును తట్టారు. తనను ఎవరో పిలిచారని భావించిన పవన్ వెనుక్కు తిరిగి చూసేసరికి అక్కడెవరూ లేరు. పక్కన అన్నగారేమో ఏం ఎరగనట్టుగా వేరొకళ్లతో బిజీగా మాట్లాడుతూ కనిపించారు. ఈ చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి ‘చిలిపి చిరంజీవి’ అని టైటిల్ పెట్టి మరీ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేమరి.. అభిప్రాయ బేధాలు వచ్చినంత మాత్రాన అన్నదమ్ముల మధ్య సరదా లేకుండా పోతుందా ఏంటి..

మరోవైపు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అజ్ఞాతవాసి తాలూకూ షూటింగ్ పనులు మొత్తం పూర్తి చేసి ఫ్రీ అయిపోయాడు. ఇదేటైంలో చిరంజీవి ఏమో తన 151వ సినిమా సైరా.. నరసింహారెడ్డి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
Megastar-Chiranjeevi-and-Pawan-Kalyan-Viral-Video-Andhra-Talkies

Poonam Pandey Dirty Scenes | క్రిస్మస్ పేరుతో పూనం పాండే డర్టీ వేషాలు

Bollywood-Sexy-Actress-Dirty-Scenes-During-Christmass-Andhra-talkies-telugu
దేశంలో ఏదన్నా ఈవెంట్ ఉంటే చాలు.. వెంటనే అక్కడ రిజల్ట్ జనరంజకంగా వస్తే నేను విప్పేస్తా అంటూ రెడీ అయిపోతోంది పూనం పాండే. అదిగో ఇప్పుడు మరోసారి అదే పని చేసింది. ఎంఎస్ ధోని వరల్డ్ కప్ గెలిస్తే స్టేడియంలో నగ్నంగా నడుస్తాను అంటూ ట్విట్టర్ ద్వారా రచ్చ చేస్తూ పాపులర్ అయిన డర్టీ సుందరి పూనం పాండే.. ఈసారి ఎవరూ అడగకుండానే అలాంటి వేషాలు వేస్తోంది.

మన దేశంలో మతాలతో సంబంధం లేకుండా జరుపుకునే పండగలు కొన్ని ఉన్నాయి. దీపావళికి టపాసులు కాల్చడం.. రంజాన్ కు బిర్యానీ తినడం.. క్రిస్మస్ కు కేకులు తెచ్చుకుని అందరికీ పార్టీ ఇవ్వడం.. కులమతాలకు సంబంధం లేకుండా జరుగుతుంటుంది. కాని ఇలాంటి ఓ పర్వదినాన్ని కూడా తనకు అనుకూలంగా క్యాష్ చేసుకోవాలని చూసిందీ డర్టీ భామ. లోదుస్తుల్లో తన అవయవ సౌష్టవాన్ని ఆరబోస్తూ ఒక క్రిస్మస్ సాంగ్ వీడియోతో వచ్చింది. అదేమంటే ఎరోటిక్ క్రిస్మస్ అంటోంది. అసలు ఏ పండుగకు ఏం చేయాలో కూడా ఈమెకు తెలియదా అంటూ ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు.

అయితే ఈమె డర్టీ వేషాలను బాలీవుడ్ వాసులు మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఒక ప్రక్కన మాజీ పోర్న్ స్టార్ అయినప్పటికీ.. తన నటనతో డ్యాన్సులతో ఆకట్టుకుంటున్న సన్నీ లియోని వరుస సినిమాలతో దూసుకుపోతోంది కాని.. పూనం పాండే మాత్రం ఒక్క సినిమాకే బిషానా ఎత్తేసిన  పరిస్థితి . అసలు ఈమెతో సినిమాలు చేయడానికే ఎవ్వరూ ముందుకురావట్లేదు. అది సంగతి.
Bollywood-Sexy-Actress-Dirty-Scenes-During-Christmass-Andhra-talkies-telugu

మరో సినిమాపై వివాదం

Hindu-outfit-protests-against-Bengali-film-for-naming-characters-Ram--Sita
సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం ఇటీవల సాధారణమైపోయింది. అసలు... వివాదాస్పందగా సినిమా తీయడం కూడా ఒక స్ర్టాటజీయా అన్న వాదానా వినిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా ఈ వివాదాస్పద సినిమాల జాబితాలో మరో మూవీ కూడా చేరింది.  తాజాగా ఓ బెంగాలీ చిత్రం వివాదంలో చిక్కుకుంది. అందులో ప్రధాన పాత్రధారుల పేర్లు రామ - సీత అని ఉండడమే దీనికి కారణం.
   
హిందూ జాగరణ మంచ్ ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సెన్సార్ కార్యాలయం ముందు నిరసనకు దిగింది. సినిమాలో ప్రధాన పాత్రధారుల పేర్లు మార్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.  దీనిపై హిందూ జాగరణ్ మంచ్ కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి స్మృతి ఇరానీకి  లేఖ కూడా రాసింది. రాముడు - సీత పేర్లు పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆ లేఖలో  రాశారు.
   
మరోవైపు కోర్టును సంప్రదించేందుకు కూడా హిందూ జాగరణ్ మంచ్ సిద్ధమవుతోంది. సెన్సార్ బోర్డ్ తమ డిమాండ్లను పట్టించుకోకుంటే న్యాయపోరాటానికి దిగుతామని  హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా హిందూ జాగరణ్ మంచ్ సభ్యులకు మద్దతు పలుకుతున్నారు. పురాణ పురుషుల పేర్లను సినిమాల్లో వాడుకోవడం హిందువుల మనోభావాలను కించపరిచినట్లేనంటున్నారు. అయితే... సినిమా దర్శకుడు రజన్ ఘోష్ మాత్రం సమాజంలో చాలా మంది పేర్లు రాముడు - సీత అని ఉన్నపుడు సినిమాలో ఉంటే తప్పేంటని తన వాదన వినిపిస్తున్నారు. కాగా రోంగ్ బెరంగేర్ కోర్ పేరుతో తీస్తున్న ఈ సినిమాలో చిరంజీత్ చక్రవర్తి రీతూ పర్ణా సేన్ గుప్తా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

రాజమౌళి వంద సార్లు చూసిన సినిమా అదేనట

Director-Rajamouli-Inspired-By-Braveheart-Andhra-Talkies-Telugu
బాహుబలి సినిమాతో టాలీవుడ్ ని బాలీవుడ్ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి గురించి ఎంత పొగిడినా కూడా చాలా తక్కువే. ఓటమెరుగని దర్శకుడు ఎలాంటి సినిమా చేసినా ప్రేక్షకులు ఆదరించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇచ్చే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడని దర్శక దిగ్గజాలు ప్రశంసలను అందించిన సంగతి తెలిసిందే.

ఇక అసలు విషయానికి వస్తే జక్కన్న ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఎదో ఒక కొత్త ధనంతో వచ్చినవే. అయితే అందులో మెయిన్ గా ఎమోషన్ యాక్షన్ ని మాత్రం ఎప్పుడు మిస్ చేయలేదు. ప్రతి దర్శకుడికి ఎదో ఒక సినిమా బాగా ఇన్స్పైర్ చేసి ఉంటుంది. అలాగే రాజమౌళి ని బాగా ఇన్ స్పైర్ చేసిన ఒక సినిమా ఉందట. రీసెంట్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకదీరుడు ఆ విషయాన్ని వివరంగా చెప్పాడు.

1994లో హాలీవుడ్ లో తెరకెక్కిన బ్రేవ్ హార్ట్ సినిమా ఎంత ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ప్రతి సిన్ జక్కన్నని ఇన్స్పైర్ చేసిందని చెబుతాడు. మెల్ గిబ్సన్ డైరక్షన్లో.. తనే హీరోగా తీసిన ఈ సినిమాను.. దాదాపు 100 సార్లు చూశాడట జక్కన్న. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఓ లెవెల్ లో ఉంటాయని అందుకే ఆ సినిమా నన్ను ఆకర్షించిందని ఇప్పటికి చూస్తానని చెప్పాడు. 

దిల్ రాజు వార్నింగ్.. నాని కవరింగ్

Tollywood-Hero-Nani-Handling-Warangal-Crowd-At-MCA-Pre-Release-Event-Andhra-Talkies-Telugu.
స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఆడియో వేడుకలు - ప్రి రిలీజ్ ఈవెంట్లూ జరిగితే అభిమానుల్ని కంట్రోల్  చేయడం అంత సులువు కాదు. కొన్నిసార్లు ఫ్యాన్స్ శ్రుతి మించి ప్రవర్తిస్తుంటారు. స్టార్ ఇమేజ్ వైపు వడివడిగా దూసుకొస్తున్న నాని నటించిన సినిమా వేడుకకు కూడా ఇప్పుడు ఇలాంటి ఇబ్బందే తలెత్తింది. వరంగల్లోని హన్మకొండలో శనివారం రాత్రి జరిగిన ‘ఎంసీఏ’ ప్రి రిలీజ్ ఈవెంట్ కొంచెం రసాభాసగా మారింది. ఈ వేడుకకు 30 వేలమందికి పైగా హాజరయ్యారు. అందులో చాలా వరకు యువతే. వరంగల్ లాంటి చోట ఇలాంటి వేడుకలు జరగడం అరుదు కదా. ఇక నాని.. సాయిపల్లవి.. దిల్ రాజు లాంటి వాళ్లను చూసేసరికి ఇక్కడి జనాలు ఆగలేదు. వేదిక పైకి దూసుకొస్తూ పోలీసులకు చుక్కలు చూపించారు. వాళ్లను కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది.

నిర్మాత దిల్ రాజు ఒకటికి మూడుసార్లు వాళ్లను హెచ్చరించాడు. ఒక దశలో ఆయన సహనం కోల్పోయి.. ‘‘ఏరా బై చెబితే అర్థం కాదా..’’ అంటూ అరిచారు. ‘‘మీరిలా చేస్తే ఇకపై వరంగల్లో ఇలాంటి ఫంక్షన్లుండవు. షూటింగులు కూడా ఉండవు. ఎవ్వరూ ఇక్కడికి రావడానికి ఇష్టపడరు’’ అని హెచ్చరించారు. ఇలా అన్న తర్వాత కూడా వరంగల్ యూత్ తగ్గలేదు. ఐతే రాజు మరీ తీవ్ర స్థాయిలో హెచ్చరించిన నేపథ్యంలో ఇక్కడి జనాలు హర్టవుతారని అనుకున్నాడో ఏమో.. తర్వాత మైక్ అందుకున్న నాని ఈ విషయాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ‘‘రాజు గారు అలా అంటారు కానీ.. హైదరాబాద్ నుంచి మేం ఇక్కడికి వచ్చింది మీరు సైలెంటుగా ఉంటే చూడటానికా.. మీరు కానివ్వండి’’ అనడంతో ఆడిటోరియం హోరెత్తిపోయింది.

తెలుగు మహాసభల్లో నిర్వహించనున్న మహాకవి వార్షికోత్సవం

Telangana-govt-honors-Tollywood-first-lyricist-chandala-kesavadasu-Andhra-Talkies-Telugu
ఎన్నడు ఎవ్వరు జరపని విధంగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారి ఘనంగా తెలుగు మహా సభలు జరగబోతున్నాయి. కొన్ని నెలల ముందు నుంచే కేసీఆర్ కార్యక్రమాల గురించి ప్రత్యేక చర్చలు జరిపి అంతా సెట్ చేశారు. అందరికి గుర్తుండిపోయేలా వేడుకలను జరపాలని కేసీఆర్ అధికారులకు సూచనలను ఇచ్చారు. ఇక ఈ రోజు నుంచి వేడుకలు మొదలు కానున్నాయి. తెలుగు బాషా కోసం పాటుపడుతున్న సాహితివేత్తలందరి సమక్షంలో సభను నిర్వహించనున్నారు.

అయితే ఈ వేడుకలో ప్రముఖ కవి చందాల కేశవదాసు జన్మ వార్షికోత్సవాన్ని కూడా తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా జరపనుంది. కేశవదాసు మొదటి సారిగా పూర్తి నిడివి గల ఒక తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద'కు పాటలను రాశారు. అందులోని పద్యాలను కూడా ఆయనే రాశారు. 1932లో విడుదలైన ఆ సినిమా ఎంతగటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  తెలుగు జనాలు ఇప్పటికి ఆ సినిమాలోని పాటలను వింటుంటారు. 

తరువాత ఈ ఐకానిక్ లిరిసిస్ట్ తెలుగులో అనేక హిట్ సినిమాలకు పాటలు రాశారు. అయన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కుసుమంచి మండల్లోని జక్కేపల్లి గ్రామంలో జన్మించాడు. అయితే అయన మొదటి తెలుగు పాట 'తనయా  ఇతులన్ తగదురా పలుకా' రచనకు గాను ఈ కవికి గౌరవం దక్కనుంది. ప్రముఖులు వేడుకలో కేశవదాసు పద్యాలను సినీ సాహిత్య కళా కారులు ప్రధానంగా గుర్తు చేసుకోనున్నారు.

ఆ తెలుగమ్మాయి ఎంత స్లిమ్ అయ్యిందో

Sexy-Heroin-Anjali-Silm-Look-Andhra-Talkies.jpg
సౌత్ లో తెలుగు భామలు వెండితెరపై అంత ఎక్కువగా ప్రభావం చూపించారు అనేది అందరికి తెలిసిన విషయమే. అంతే కాకుండా ఎక్కువగా గ్లామర్ గా కనిపించినా అంతగా సెట్ అవ్వరనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. అయితే చాలా రోజుల తర్వాత ఒక హీరోయిన్ మాత్రం సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది.

తమిళ్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అంజలి తెలుగులో అంతగా రాణించకపోయినా కూడా కోలీవుడ్ లో మాత్రం మంచి గుర్తింపును అందుకుంది. సంప్రదాయంగా కనిపిస్తూనే గ్లామర్ రోల్స్ ని కూడా టచ్ చేస్తోంది. అయితే గీతాంజలి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ నంది అవార్డును కూడా అందుకుంది. ఇక ప్రస్తుతం తమిళ్ తెలుగులో తెరకెక్కుతోన్న బెలూన్ అనే మరో హారర్ థ్రిల్లర్ లో కూడా అమ్మడి నటన అందరికి నచ్చుతుందట. ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే రీసెంట్ గా ప్రమోషన్స్ లో పాల్గొన్న అంజలిని  చూసిన అందరు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె చాలా స్లిమ్ గా రెడీ అయ్యిందిలే.

అయితే ఆ గ్లామర్ కోసం ఆమె చాలా కష్టపడిందట. మూడు నెలలు చాలా క్రమశిక్షణ తో వర్కౌట్స్ చేయడం వల్ల మూడు నెలల్లో దాదాపు 7 కిలోల బరువు తగ్గిందట. అంతే కాకుండా ఆమె ఎక్కువగా హైదరాబాద్ లోనే జిమ్ వర్కౌట్స్ చేశారట. ఈ సినిమాలో తన పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందని అంజలి వివరించింది. మరి సినిమాకు అమ్మడి ఆకృతి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.

అభిమానినంటూ వచ్చి షూటింగ్ స్పాట్ లోనే హీరోను కొట్టేసాడు

Drunk-man-assaults-Arjun-Kapoor-on-Sandeep-Aur-Pinky-Faraar-sets-Andhra-Talkies-Telugu
బాలీవుడ్ యువ కథానాయకుడు అర్జున్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ‘సందీప్ ఔర్ పింకీ పరార్’ షూటింగ్ స్పాట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓ అపరిచిత వ్యక్తి అర్జున్ మీద దాడికి తెగబడ్డాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో షూటింగ్ జరుగుతుండగా.. హీరో అభిమానినంటూ వచ్చి.. ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దీంతో అర్జున్ స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. దాడి చేసిన వ్యక్తిన పోలీసులు అరెస్టు చేశారు.

సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కమల్ కుమార్ అనే వ్యక్తి అర్జున్ అభిమానినంటూ వచ్చి అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయి అర్జున్ చేయి చాపగానే అతడి చేతిని మెలిపెట్టాడు. తర్వాత అతడిపై దాడి చేశాడు. ఆ సమయంలో అర్జున్ వ్యానిటీ వ్యాన్ దగ్గర ఉన్నట్లు తెలిసింది. దాడికి పాల్పడిన వ్యక్తి ఓ కారు డ్రైవర్ అని గుర్తించారు.

అర్జున్ మీద దాడి చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. యూనిట్ సభ్యులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా.. వారు అతడి కారును కూడా స్వాధీనం చేసుకొన్నారు. మోటార్ వెహికిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అతడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని రవాణా విభాగానికి సూచించారు. త్వరలోనే కమల్ లైసెన్స్ ను స్వాధీనం చేసుకొని జప్తు చేస్తామని రవాణా అధికారులు వెల్లడించారు. ‘సందీప్ ఔర్ పింకీ పరార్’లో అర్జున్ ఫెరోషియస్ పోలీస్ పాత్ర చేస్తున్నాడు. ఇందులో పరిణీతి చోప్రా కథానాయిక. వీళ్లిద్దరూ ఇంతకుముందు ‘ఇషాక్ జాదే’ సినిమాలో నటించారు.

రెండొందలు సినిమా టిక్కెట్టా? టూ మచ్

Pawan-kalyan-agnathavasi-Movie-Uniform-ticket-Prices-Andhra-Talkies
యూనిఫామ్ టికెట్.. ఈ మధ్య పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఈ పేరు బాగా వినిపిస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకంటే ఎక్కువ స్థాయిలో టికెట్ ను విక్రయించడం మామూలైపోయింది. ఈ రోజుల్లో ఏ సినిమా అయినా మొదటి వారంలోనే ఎక్కువగా కలెక్షన్స్ ని వసూలు చేస్తున్నాయి. ఆ తర్వాత టాక్ ను బట్టి వసూళ్లు అందుతాయి. ఇక పైరసి దెబ్బ ఎంతో కొంత పడుతుంది. దీంతో బారి బడ్జెట్ సినిమాలు నష్టపోతాయి అనే కారణం చేత కొందరు సినిమా టికెట్స్ రేట్ ను పెంచేస్తున్నారు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి నిర్మాతలు బయ్యర్స్ కూడా అదే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. సినిమా ఇప్పటికే 150 కోట్ల బిజినెస్ చేసిందట. బయ్యర్స్ అయితే సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. అయితే సినిమా ఎలాగైనా మొదటి వారంలోనే కొన్న ధరను  అందుకోవాలని  యూనిఫామ్ టికెట్ ను పెట్టనున్నారట. అంటే ఒక్క టికెట్ ధర రూ.200 ఉండనుందట. ఇప్పటికే మల్టిప్లెక్స్ లు రూ.150 నుంచి రూ.250 వరకు లాగుతున్నాయి. అయితే అజ్ఞాతవాసి సినిమాకు ఇప్పుడు అన్ని థియేటర్స్ లో రూ.200 టికెట్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఇది టూ మచ్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఈ రేట్ కోనసాగనుందని తెలుస్తోంది. ఏపీ లో అయితే పవన్ స్టామినాతో క్లారిటీ రావొచ్చు. ఇక దిల్ రాజు కూడా సినిమాలో భాగం కానున్నాడు కాబట్టి ఇక్కడి రాజకీయాల్లో ఆయనకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి నైజాంలో కూడా ఆ రేటును పెట్టించడం పెద్ద కష్టమేం కాదు. మరి వీరు అనుకున్నట్టు జరుగుతుందా లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...