అభిమానినంటూ వచ్చి షూటింగ్ స్పాట్ లోనే హీరోను కొట్టేసాడు

Drunk-man-assaults-Arjun-Kapoor-on-Sandeep-Aur-Pinky-Faraar-sets-Andhra-Talkies-Telugu
బాలీవుడ్ యువ కథానాయకుడు అర్జున్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ‘సందీప్ ఔర్ పింకీ పరార్’ షూటింగ్ స్పాట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓ అపరిచిత వ్యక్తి అర్జున్ మీద దాడికి తెగబడ్డాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో షూటింగ్ జరుగుతుండగా.. హీరో అభిమానినంటూ వచ్చి.. ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దీంతో అర్జున్ స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. దాడి చేసిన వ్యక్తిన పోలీసులు అరెస్టు చేశారు.

సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కమల్ కుమార్ అనే వ్యక్తి అర్జున్ అభిమానినంటూ వచ్చి అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయి అర్జున్ చేయి చాపగానే అతడి చేతిని మెలిపెట్టాడు. తర్వాత అతడిపై దాడి చేశాడు. ఆ సమయంలో అర్జున్ వ్యానిటీ వ్యాన్ దగ్గర ఉన్నట్లు తెలిసింది. దాడికి పాల్పడిన వ్యక్తి ఓ కారు డ్రైవర్ అని గుర్తించారు.

అర్జున్ మీద దాడి చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. యూనిట్ సభ్యులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా.. వారు అతడి కారును కూడా స్వాధీనం చేసుకొన్నారు. మోటార్ వెహికిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అతడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని రవాణా విభాగానికి సూచించారు. త్వరలోనే కమల్ లైసెన్స్ ను స్వాధీనం చేసుకొని జప్తు చేస్తామని రవాణా అధికారులు వెల్లడించారు. ‘సందీప్ ఔర్ పింకీ పరార్’లో అర్జున్ ఫెరోషియస్ పోలీస్ పాత్ర చేస్తున్నాడు. ఇందులో పరిణీతి చోప్రా కథానాయిక. వీళ్లిద్దరూ ఇంతకుముందు ‘ఇషాక్ జాదే’ సినిమాలో నటించారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...