దిల్ రాజు వార్నింగ్.. నాని కవరింగ్

Tollywood-Hero-Nani-Handling-Warangal-Crowd-At-MCA-Pre-Release-Event-Andhra-Talkies-Telugu.
స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఆడియో వేడుకలు - ప్రి రిలీజ్ ఈవెంట్లూ జరిగితే అభిమానుల్ని కంట్రోల్  చేయడం అంత సులువు కాదు. కొన్నిసార్లు ఫ్యాన్స్ శ్రుతి మించి ప్రవర్తిస్తుంటారు. స్టార్ ఇమేజ్ వైపు వడివడిగా దూసుకొస్తున్న నాని నటించిన సినిమా వేడుకకు కూడా ఇప్పుడు ఇలాంటి ఇబ్బందే తలెత్తింది. వరంగల్లోని హన్మకొండలో శనివారం రాత్రి జరిగిన ‘ఎంసీఏ’ ప్రి రిలీజ్ ఈవెంట్ కొంచెం రసాభాసగా మారింది. ఈ వేడుకకు 30 వేలమందికి పైగా హాజరయ్యారు. అందులో చాలా వరకు యువతే. వరంగల్ లాంటి చోట ఇలాంటి వేడుకలు జరగడం అరుదు కదా. ఇక నాని.. సాయిపల్లవి.. దిల్ రాజు లాంటి వాళ్లను చూసేసరికి ఇక్కడి జనాలు ఆగలేదు. వేదిక పైకి దూసుకొస్తూ పోలీసులకు చుక్కలు చూపించారు. వాళ్లను కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది.

నిర్మాత దిల్ రాజు ఒకటికి మూడుసార్లు వాళ్లను హెచ్చరించాడు. ఒక దశలో ఆయన సహనం కోల్పోయి.. ‘‘ఏరా బై చెబితే అర్థం కాదా..’’ అంటూ అరిచారు. ‘‘మీరిలా చేస్తే ఇకపై వరంగల్లో ఇలాంటి ఫంక్షన్లుండవు. షూటింగులు కూడా ఉండవు. ఎవ్వరూ ఇక్కడికి రావడానికి ఇష్టపడరు’’ అని హెచ్చరించారు. ఇలా అన్న తర్వాత కూడా వరంగల్ యూత్ తగ్గలేదు. ఐతే రాజు మరీ తీవ్ర స్థాయిలో హెచ్చరించిన నేపథ్యంలో ఇక్కడి జనాలు హర్టవుతారని అనుకున్నాడో ఏమో.. తర్వాత మైక్ అందుకున్న నాని ఈ విషయాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ‘‘రాజు గారు అలా అంటారు కానీ.. హైదరాబాద్ నుంచి మేం ఇక్కడికి వచ్చింది మీరు సైలెంటుగా ఉంటే చూడటానికా.. మీరు కానివ్వండి’’ అనడంతో ఆడిటోరియం హోరెత్తిపోయింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...