‘భాగమతి’ సినిమా రివ్యూ | Bhagamati Movie Review

‘భాగమతి’ సినిమా  రివ్యూ | Bhagamati Movie Review

చిత్రం : ‘భాగమతి’

నటీనటులు: అనుష్క- ఉన్ని ముకుందన్ - జయరాం - మురళీ శర్మ- ఆశా శరత్ - ప్రభాస్ శీను - ధన్ రాజ్ - విద్యుల్లేఖ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: మధి
నిర్మాతలు: వంశీ - ప్రమోద్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జి.అశోక్

తెలుగులో ‘అరుంధతి’.. ‘రుద్రమదేవి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో గొప్ప పేరు సంపాదించిన కథానాయిక అనుష్క. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త సినిమా ‘భాగమతి’. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ జి.అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆసక్తికర ప్రోమోలతో జనాల దృష్టిని ఆకర్షించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

చంచల (అనుష్క) ఒక ఐఏఎస్ అధికారి. ఆమె తనకు కాబోయే భర్తను చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తుంటుంది. ఐతే చంచల ఒకప్పుడు పీఏగా పని చేసిన మంత్రి అవినీతిని నిరూపించేందుకు సీబీఐ అధికారులు.. చంచల నుంచి సమాచారం రాబట్టాలని అనుకుంటారు. అందుకోసం ఆమెను జైలు నుంచి అటవీ ప్రాంతంలో ఉండే పాడుబడ్డ బంగ్లాకు తరలిస్తారు. ఆ బంగ్లాకు వెళ్లాక అనూహ్య పరిణామాలు జరుగుతాయి. అవేంటి.. భాగమతి బంగ్లాగా పేరున్న దాని వెనుక కథేంటి..? ఇంతకీ చంచల తనకు కాబోయే భర్తను ఎందుకు చంపింది.. మంత్రి నిజంగా అవినీతి పరుడా.. చివరికి చంచల కేసు నుంచి బయటి పడిందా.. అన్న అనేక ప్రశ్నలకు తెరమీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

ఒక సినిమా ఎలా ఉండబోతోందన్న విషయంలో స్పష్టత ఇవ్వడానికి ఉద్దేశించిందే థియేట్రికల్ ట్రైలర్. ‘భాగమతి’ ట్రైలర్ చూస్తే ఇదొక హార్రర్ థ్రిల్లర్ అనే అనుకుంటాం. ఆ విషయంలో అంచనాలు పెట్టుకుని వెళ్తాం. ముఖ్యంగా ‘ఇది భాగమతి అడ్డా..’ అంటూ ట్రైలర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన డైలాగ్ చూశాక.. సినిమాపై ఏర్పడ్డ అంచనాలే వేరు. ‘భాగమతి’లో సగం సినిమా చూస్తున్నంతసేపూ ఇది అంచనాలకు తగ్గ సినిమానే అనిపిస్తుంది. భయపెడుతుంది.. ఉత్కంఠ రేకెత్తిస్తుంది.. ప్రేక్షకుల్ని గెస్సింగ్ లోనే ఉంచుతుంది. కానీ రెండో సగంలో మాత్రం మనకు భిన్నమైన సినిమా చూపిస్తారు.

మనం ఏదో అనుకుంటే అక్కడేదో జరుగుతుంది. అది ఆసక్తికరంగా లేదని కాదు.. ‘భాగమతి’ రంజింపజేయలేదనీ కాదు.. కానీ ఒక దశ వరకు ప్రత్యేకమైన సినిమాలాగా నడిచే ‘భాగమతి’కి చివరికి మామూలుగానే ముగుస్తుంది. చివరికొచ్చేసరికి సినిమాలోని పాత్రల్లాగే మనం కూడా ఫూల్స్ అయిపోయామే అన్న భావన కలుగుతుంది ప్రేక్షకుడికి. చివర్లో ఒక ట్విస్టు ఇచ్చి ప్రేక్షకుల్ని ఏమార్చడం కొత్తేమీ కాదు. కానీ ఆ ట్విస్టు ప్రేక్షకులు మరీ అఫెండ్ అయ్యే స్థాయిలో ఉండకూడదు. ‘భాగమతి’ కొంచెం అలాంటి భావనే కలిగిస్తుంది. కాకపోతే కథాకథనాల విషయంలో దర్శకుడి ప్రయత్నం వల్ల.. చక్కటి నిర్మాణ విలువలు.. సాంకేతిక హంగులతో దీనికి నిర్మాణ సంస్థ బలంగా నిలవడం వల్ల.. ‘భాగమతి’ చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది. అక్కడక్కడా ఒడుదొడుకులు ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఓకే అనిపిస్తుందీ చిత్రం.

‘భాగమతి’ చాలా లేయర్స్ ఉన్న కథ. ఇందులో మూణ్నాలుగు ఉపకథలుంటాయి. వాటి విషయమేంటో తేలడానికి.. కథపై పూర్తి స్పష్టత రావడానికి దాదాపు రెండు గంటలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొంత అసహనం కూడా కలుగుతుంది. ప్రేక్షకుల్ని చివరిదాకా సస్పెన్సులోనే ఉంచాలన్న ఉద్దేశం దర్శకుడు ఏ కథనూ ఒకేసారి చెప్పేయడు. గతాన్ని.. వర్తమానాన్ని మార్చి మార్చి చూపిస్తూ చూపిస్తూ కొంచెం కొంచెంగా విషయం వెల్లడయ్యేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. సినిమా మొదలైన 20 నిమిషాలకే వ్యవహారం భాగమతి బంగ్లాకు మళ్లుతుంది. అక్కడ ప్రతి హార్రర్ సినిమాలో మాదిరే.. విచిత్రమైన శబ్దాలు.. ఉలిక్కి పడేలా చేసే దృశ్యాలు.. రకరకాల భయాలు.. అనుమానాలతో సన్నివేశాలు నడుస్తాయి. కొన్ని సీన్లు గుండె జల్లుమనేలా చేస్తాయి. హార్రర్ కామెడీ సినిమాల్లో మాదిరి కమెడియన్లతో నవ్వులు పంచే ప్రయత్నం కూడా జరిగింది.

అసలీ కథానాయిక కథేంటి.. ఆమె తనకు కాబోయే భర్తను ఎందుకు చంపింది.. అసలింతకీ భాగమతి వ్యవహారమేంటి.. ఇలా రకరకాల ప్రశ్నలు తొలిచేస్తుండగా.. ప్రథమార్ధంలో కొంచెం రిపిటీటివ్ గా అనిపించే సీన్లు కొంత అసహనం కలిగిస్తాయి. ఇంతలో భాగమతి ఆగమనంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఊపిరి బిగబట్టి చూస్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. భాగమతికి సంబంధించి ఒక భారీ ఫ్లాష్ బ్యాక్ చూడబోతున్న భావన కలుగుతంది. కానీ తెర మీద జరిగేది పూర్తి భిన్నం. కొంచెం ముందుకు వెళ్లాక కథ పూర్తిగా భిన్నమైన ట్రాక్ లోకి మళ్లుతుంది. ఇక్కడ వచ్చే ట్విస్టు ఆసక్తికరమే కానీ.. మనం అంచనాలు పెట్టుకున్న దానికి భిన్నంగా కథ వెళ్తుంది. హార్రర్ థ్రిల్లర్ అనుకున్న ‘భాగమతి కాస్తా.. పొలిటికల్ థ్రిల్లర్ జానర్లోకి వెళ్లిపోతుంది.

కథానాయిక పాత్రకు సంబంధించిన గతం పూర్తిగా రివీలయ్యాక నిరాశ తప్పదు. మొత్తంగా రీ కలెక్ట్ చేసుకుని చూస్తే ఆ ఎపిసోడ్ ఏమంత ప్రభావవంతంగా ఉండదు. జయరాం పోషించిన మంత్రి పాత్ర.. ఆయన నటన భిన్నంగా ఉండి ఆసక్తి రేకెత్తిస్తాయి. ‘భాగమతి’లోని మలుపులు కొత్తగా అనిపిస్తాయి. కానీ ఆ మలుపులే ఈ సినిమాకు బలం.. బలహీనత లాగా అనిపిస్తాయి. భాగమతి అనే పాత్రకు ఒక ఫ్లాష్ బ్యాక్ అదీ పెట్టి ప్రేక్షకుడి అంచనాకు తగ్గట్లుగా నడిపించి ఉంటే సినిమా రొటీన్ అయ్యేదేమో. కానీ అంచనాలకు భిన్నంగా మరో రకంగా ఈ కథను నడిపించారు. అదే ఇందులో కొత్తదనం. కానీ ఆ మలుపు తర్వాత నడిచే వ్యవహారం మాత్రం రొటీన్ అనిపిస్తుంది. ఇది ఒక మామూలు సినిమానే కదా.. దీనికి మధ్యలో ఆ వేరే కలర్ ఎందుకో అన్న భావన కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే ‘భాగమతి’ అంచనాలకు తగ్గ స్థాయిలో లేదు కానీ.. ఇందులో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే అంశాలూ ఉన్నాయి.

నటీనటులు:

‘అరుంధతి’.. ‘రుద్రమదేవి’ తరహాలోనే ‘భాగమతి’ కూడా అనుష్కకు ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనుష్కే. ఇలాంటి పాత్రలకు తనకు మించిన ఛాయిస్ లేదు అనిపించేలా అనుష్క తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటుంది. ఆమె నటన కూడా మెప్పిస్తుంది. భాగమతిగా రౌద్రం చూపించే సన్నివేశంలో అనుష్క బాగా ఆకట్టుకుంటుంది. కథలో కీలకమైన పాత్రలో మలయాళ నటుడు జయరాం తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఉన్ని ముకుందన్ పాత్ర చిన్నదే అయినా చక్కటి నటనతో తన పాత్రను గుర్తుంచుకునేలా చేశాడు. ఆశా శరత్ నటన కూడా బాగుంది. మురళీ శర్మ పాత్రకు తగ్గట్లు నటించాడు. విద్యుల్లేఖ.. ప్రభాస్ శీను.. ధన్ రాజ్ కొంత మేర నవ్వించారు.

సాంకేతికవర్గం:

‘భాగమతి’కి నిర్మాణ విలువలు.. సాంకేతిక హంగులు పెద్ద బలంగా నిలిచాయి. యువి క్రియేషన్స్ స్థాయికి తగ్గట్లుగా సినిమా రిచ్ గా తెరకెక్కింది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తన కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అనదగ్గ పనితనం చూపించాడు. భాగమతి బంగ్లాను తీర్చిదిద్దిన తీరు అమోఘం. సగానికి పైగా కథ ఈ బంగ్లాలోనే నడిచినా.. మొనాటనీ రాకుండా చేయడంలో ఆర్ట్ డైరెక్టర్.. సినిమాటోగ్రాఫర్ పనితనం కనిపిస్తుంది. ఛాయాగ్రాహకుడు మధి హార్రర్ సినిమాల్లో ఇంతకుముందు చూడని లైటింగ్స్.. థీమ్స్ తో సినిమాకు డిఫరెంట్ లుక్ తీసుకొచ్చాడు. తమన్ నేపథ్య సంగీతం కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర.. ద్వితీయార్ధంలో బ్యాగ్రౌండ్ స్కోర్ ఎఫెక్టివ్ గా అనిపిస్తాయి. సినిమాలో ఉన్న ఒక్క పాట ‘మందార మందార..’ పర్వాలేదు. సాంకేతికంగా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ మరో అంశం.. సౌండ్ డిజైన్. ఇక దర్శకుడు జి.అశోక్.. ఇప్పటిదాకా తీసిన మూడు సినిమాలతో పోలిస్తే పూర్తి భిన్నంగా కనిపిస్తాడు ఈ సినిమాలో. చాలా లేయర్స్ ఉన్న కథను ఎంచుకుని.. భిన్నమైన  స్క్రీన్ ప్లేతో చెప్పే ప్రయత్నం చేశాడు. ఐతే కథనంలో ఉండాల్సింతన బిగి లేకపోయింది. మరింత ఆసక్తికరమైన సన్నివేశాలు రాసుకోవాల్సింది. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచాలనే ఉద్దేశం ఓకే కానీ.. మరీ ఫ్రీ హ్యాండ్ తీసుకున్నాడనిపిస్తుంది. ‘భాగమతి’కి సంబంధించిన సెటప్ మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోవాల్సింది. ఓవరాల్ గా అశోక్ పనితనం ఓకే అనిపిస్తుంది.

చివరగా:  భాగమతి.. కొంచెం భయం.. కొంచెం థ్రిల్!

రేటింగ్- 3/5

కుండ బద్దలు కొట్టిన హీరో నాని | Hero Nani Speech at Anushka Bhaagamathie Movie Pre Release event-Andhra Talkies Telugu

Hero Nani Speech at Anushka Bhaagamathie Movie Pre Release event-Andhra Talkies Telugu
సంక్రాంతి విన్నర్ ఎవరు అనే దాని గురించి ఇప్పటికీ కంక్లూజన్ రానే లేదు. అజ్ఞాతవాసి మొదటి రోజే అవుట్ రైట్ గా డిజాస్టర్ అని డిక్లేర్ కాగా గ్యాంగ్ - జైసింహ మధ్య కొంత పోటీ నడిచింది. గ్యాంగ్ డబ్బింగ్ మూవీ కావడం తమిళ ఫ్లేవర్ ఎక్కువగా ఉండటంతో పాటు కాన్సెప్ట్ సామాన్య ప్రేక్షకులకు అంత కనెక్ట్ అయ్యేది కాకపోవడం లాంటి కారణాలు సినిమా ఫైనల్ రిజల్ట్ పై బాగానే ప్రభావం చూపాయి. ఉన్నంతలో జైసింహ నయం అనే మాట తప్ప నిజంగా బాలకృష్ణ స్థాయి హిట్ అయితే ఇది కాదు. రెండేళ్ళ క్రితం యావరేజ్ అన్న డిక్టేటర్ కూడా అటుఇటుగా ఇంతే వసూళ్లు తెచ్చింది.రంగుల రాట్నం గురించి ఆ యూనిట్ కూడా మాట్లాడడం లేదు. ఇక ఇందులో చర్చ కొనసాగించదానికి ఏమి లేదు అనుకుంటున్న తరుణంలో ఇండస్ట్రీలో ఎవరు కూడా సంక్రాంతి సినిమాల గురించి  బయట మాట్లడే ధైర్యం చేయలేకపోయారు. గాయాన్ని రేపడం ఎందుకులే అని గమ్మునున్నారు.

కాని న్యాచురల్ స్టార్ నాని మాత్రం అలా మొహమాటం ఏమి పెట్టుకోకుండా నిన్న భాగమతి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఓపెన్ గా ఈ సంవత్సరం ఇంతవరకు సాలిడ్ హిట్ లేదు అని స్టేజి మీద చెప్పేయటం కొద్దిగా షాక్ కలిగించింది. అంటే మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ఒక డబ్బింగ్ సినిమా వచ్చినా ఒక్కటి కూడా గట్టిగా హిట్ అని చెప్పే ఛాన్స్ లేదు అని నాని డైరెక్ట్ గానే చెప్పేసాడు. అది భాగమతి బ్రేక్ చేసి స్వీటీ ద్వారా పరిశ్రమకు మొదటి బ్లాక్ బస్టర్ హిట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసాడు నాని. తను చెప్పింది నిజమే కాని బయటికి ఇలా ఓపెన్ గా చెప్పడం ద్వారా పేరు లోనే కాదు ప్రవర్తన కూడా న్యాచురల్ గానే ఉంటుందని ఋజువు చేసాడు నాని.

నాని సినిమా రావడానికి మాత్రం ఇంకా మూడు నెలల టైం ఉంది. కృష్ణార్జున యుద్ధం ఏప్రిల్ 12న విడుదల చేయటం దాదాపు ఖాయం అయినట్టే. 20 ఒకవేళ ముందు చెప్పిన తేదీకే కట్టుబడి ఉంటె మాత్రం ఇందులో ఏదైనా మార్పు జరగవచ్చు నాని స్వీటీని సూపర్ స్టార్ అని పొగుడుతున్నంత సేపు తన నుంచి ముసిముసినవ్వులు మాత్రమే సమాధానంగా వచ్చాయి. 

Agnyaathavaasi .. will that target get? అజ్ఞాతవాసి.. ఆ టార్గెట్ అందుకుంటుందా?

Chances-to-Agnyaathavaasi-Movie-Enter-in-200-Crores-Club-Andhra-Talkies-Telugu
ప్రతి ఏడాది ఎదో ఒక సినిమా ద్వారా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వాల్యూ చాలా పెరిగిపోతోంది. బాక్స్ ఆఫీస్ లెక్కల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి అలాగే దంగల్ సినిమాలు ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో సత్తా చాటాయి. ఆ తరువాత నార్త్ లో ఇతర సినిమాలు కూడా మంచి వసూళ్లను రాబట్టాయి. ఒక కాన్సప్ట్ విజువల్ వండర్ ని మొన్నటి వరకు మన వాళ్లు చూపించాలంటే చాలా భయపడేవారు. కానీ ఫైనల్ గా బాహుబలి స్ఫూర్తి ఆ భయాన్నితొలగించి భారీ స్థాయిలో రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ బద్దలు అని తేలిపోతోంది.

మొత్తంగా ఇండియాలో ఉన్న 6 సౌత్ ఇండియన్ అలాగే నార్త్ ఇండియన్ సినిమాలతో కలిపి దాదాపు 39 సినిమాలు 200 కోట్ల బాక్స్ ఆఫీస్ ని ఈజీగా అందుకున్నాయి. ప్రస్తుత రోజుల్లో స్టార్ హీరో సినిమా అంటే ఆ మార్క్ ను అందుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. సౌత్ బాహుబలి రెండు భాగాలు అలాగే కబాలి - మెర్సల్- ఐ- రోబో సినిమాలు మాత్రమే 200 మార్క్ ను అందుకున్నాయి. ఇక తెలుగులో ఇంకా పూర్తి స్థాయిలో ఎవరు అందుకోలేకపోతున్నారు. బాహుబలి తప్ప. ఇటీవల మహేష్ స్పైడర్ ఆ మార్క్ ను అందుకుంటాడు అనుకున్నారు.

కానీ సినిమా చూశాక అంత సిన్ లేదు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా 200 మార్కును అందుకుంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. సినిమా హడావుడి చూస్తుంటే 100 కోట్లను ఈజీగా దాటేయగలదు అని చెప్పవచ్చు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబో ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అవ్వడంతో డబుల్ సెంచరీ దాటగలదు అనే టాక్ వస్తోంది. ఏ మాత్రం పాజిటవ్ టాక్ వచ్చినా సినిమా రూ.200 కోట్లను ఈజీగా దాటగలదు అని సినీ విశ్లేషకులు కూడా అంచనాలు వేస్తున్నారు. మరి అజ్ఞాతవాసి ఏం చేస్తాడో చూడాలి.

హాలీవుడ్ సినిమాలో మంచు లక్ష్మి

Manchu-Lakshmi-Hollywood-Debut-Movie-Basmati-Blues-Andhra-Talkies

హాలీవుడ్ సినిమాలో మంచు లక్ష్మి

ఏమో అనుకుంటాం కాని మంచు లక్ష్మి ఘటికురాలే. టాలెంట్ పుష్కలంగా ఉన్నా టైం కలిసి రాక సినిమాల పరంగా వర్క్ అవుట్ చేసుకోలేకపోతున్న లక్ష్మి టీవీలో మాత్రం గ్రాండ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తన తెలుగు మాండలికం గురించి చిన్న చిన్న కామెంట్స్ వచ్చినా వాటిని పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకువెళ్తున్న మంచు లక్ష్మి ఏకంగా హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. బాస్మతి బ్లూస్ అనే హాలీవుడ్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 9న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో తానొక కీలక పాత్ర పోషించిన్నట్టు చెప్పిన లక్ష్మి ఆ మూవీ ట్రైలర్ ను షేర్ చేసుకుని చూడండంటూ కోరింది. డాన్ బారన్ దర్శకత్వం వహించిన ఈ బాస్మతి బ్లూస్ లో బ్రీ లార్సన్ - ఉత్కర్ష్ అమ్బుద్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఒక లేడీ సైంటిస్ట్ జన్యు మార్పులతో చేసిన ప్రయోగాలతో కొత్తగా కనుకున్న ధాన్యాన్ని ఇక్కడి రైతులకు  పరిచయం చేసి ఎక్కువ దిగుబడులు వచ్చేలా వాళ్ళను ప్రోత్సహించే దిశగా ఇండియాకు వస్తుంది. ఆ క్రమంలో ఒక భారతీయుడితో ప్రేమలో పడుతుంది. ఈ లోపు తను కనుకున్న ధాన్యం మార్కెటింగ్ చేయటంలో సమస్యలు ఎదురవుతాయి. స్థానిక శక్తులు దాన్ని వ్యతిరేకిస్తూ తనకు ఇబ్బందులు సృష్టిస్తారు. వీటిని దాటుకుని తన ధాన్యాన్ని అమ్మి తన ప్రేమను ఎలా గెలిపించుకుంది అనేదే బాస్మతి బ్లూస్ కథ. ఈ సినిమాలో హీరొయిన్ ఫ్రెండ్ గా మంచు లక్ష్మి అచ్చమైన భారతీయ మహిళగా నటిస్తోంది. సో హాలీవుడ్ లో మొదటి అడుగు పెట్టేసిన మంచు లక్ష్మి బాస్మతి బ్లూస్ చూడాలంటే మరో నెల రోజులు వెయిట్ చేయాలి. 

చెయ్యనంటే చెయ్యనన్న నయనతార..

Balakrishna-Reveals-When-Nayanthara-Refuse-for-Seetha-Role-in-Srirama-Rajyam-Movie-Andhra-Talkies

చెయ్యనంటే చెయ్యనన్న నయనతార..

కెరీర్ ఆరంభంలో చాలా వరకు గ్లామర్ రోల్సే చేసింది నయనతార. ముఖ్యంగా ‘వల్లభ’ లాంటి సినిమాల్లో ఆమె ఎంత హాట్ హాట్ గా కనిపించిందో తెలిసిందే. అలాంటి కథానాయికతో ‘శ్రీరామరాజ్యం’లో సీత పాత్ర వేయించడం పెద్ద సాహసమే. వ్యక్తిగత జీవితంలోనూ నయనతారకు కొంతమేర బ్యాడ్ ఇమేజ్ ఉండటంతో సీత పాత్రకు ఆమె కరెక్ట్ కాదన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. కానీ బాపు-బాలయ్య కలిసి నయనతో ఆ పాత్ర చేయించడానికే సిద్ధపడ్డారు. ఐతే నిజానికి ఈ పాత్ర చేయమన్నపుడు నయనతార చెయ్యనంటే చెయ్యనందట. బాలయ్య ఎంత చెప్పినా ఆమె ఓకే చెప్పలేదట. కానీ కుదరదని ఫోన్ పెట్టేసిన నయనతార.. తన మాటలకు ప్రభావితమై తర్వాత సీత పాత్రకు ఓకే అన్నట్లుగా బాలయ్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీత పాత్ర ఎవరు చేస్తారు అన్న ఆలోచన రాగానే తాను ఫోన్ తీసుకుని నయనతారతో మాట్లాడినట్లు బాలయ్య చెప్పాడు. ఐతే తాను సినిమాలు మానేయాలన్న నిర్ణయానికి వచ్చానని.. క్షమించమని నయనతార హుందాగా చెప్పిందని.. ఐతే ఈ సినిమా చేస్తే చరిత్రలో నిలిచిపోతావని.. కుటుంబ సభ్యులు ఈ చిత్రంలో తనను చూసి గర్వపడతారని తాను చెప్పానని బాలయ్య తెలిపారట. అయినప్పటికీ నయనతార సినిమా చేయనంటూ ఫోన్ పెట్టేసిందని.. కానీ ఆమె మరుసటి రోజు అదే సమయానికి ఫోన్ చేసి ఓకే చెబుతుందని తాను దర్శకుడు బాపుతో అన్నానని.. అన్నట్లుగానే తర్వాతి రోజు ఫోన్ చేసిన నయనతార తాను ఈ సినిమా చేస్తున్నట్లు చెప్పిందని బాలయ్య వెల్లడించారు. ఇక ఈ సినిమాలో తన తండ్రి చేసిన పాత్రను చేయడానికి తాను కొంచెం భయపడ్డప్పటికీ బాపు గారున్నారనే ధైర్యంతో ముందుకెళ్లిపోయినట్లు బాలయ్య చెప్పాడు.

Ramcharan is a hybrid piece | రాంచరణ్ ఓ హైబ్రిడ్ పీస్

Ramcharan is a hybrid pieceఅభిమానులు లేనిదే హీరోలు లేరు అనే పదం నిజంగా చాలా గొప్పది. ఏ సంబంధం లేని ఒక సినిమా నటుడిని ఎంతో ఇష్టంగా కొలిచే అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ అభిమానులు ఇష్టాన్ని అర్థం చేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక్కోసారి అభిమానుల ఆప్యాయత అగ్రహన్నీ తెప్పిస్తాయి. దీంతో హలో ఇవ్వాల్సిన చేతులు ఒక్కసారిగా పైకి లేస్తాయి. అర్థం చేసుకునే హీరోలు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు.

అలాంటి వారిలో మెగా స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఈ మధ్య ఈ హీరో అభిమానులను తెగ కలుసుకుంటున్నాడు. రంగస్థలం సెట్స్ కి ఎంత మంది వచ్చినా సరే బ్రేక్ తీసుకొని మరి కలుస్తున్నాడు. తన చిన్నాన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తండ్రి మెగా స్టార్ చిరు కూడా ఎవరు కలవడానికి వచ్చినా నో అనకుండా కలుస్తుంటారు. అభిమానులకు రెస్పెక్ట్ ఇవ్వడంలో పవర్ స్టార్ మంచితనమే వేరు. ఇక అదే హైబ్రిడ్ క్వాలిటీతో వచ్చాడు రామ్ చరణ్.  మంచితనంలో మనోడు కూడా సుపర్బ్ అనిపించుకుంటున్నాడు.

డబ్బు అలాగే ఎవరికన్నా వైద్యానికి సంబంధించిన సహాయల్లో కూడా తండ్రి బాబాయి బాటలో నడుస్తున్నాడు. అప్పట్లో కోనసీమలో రంగస్థలం షూటింగ్ లో ఉండగానే చెర్రీ  ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారులకు సొంత ఖర్చులతో వైద్యం చేయించాడు. అప్పటి నుంచి చరణ్ పై అందరికి ఎక్కువ ఇష్టం ఏర్పడింది. ఇక రీసెంట్ గా రాజమండ్రిలో షూటింగ్ మొదలవ్వడంతో మరికొంత మంది అభిమానులను కూడా ఈ మెగా హీరో కలిశాడు. ఇక రంగస్థలం షూటింగ్ దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Ramcharan is a hybrid piece

Is the mid-link between drugs for Tollywood beauty Regina Cassandra? | టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్రాకు డ్రగ్స్ కు మధ్య లింకేంటి?

Regina-As-Drug-Adict-in-Awe-Movie-Andhra-Talkies-Telugu
టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్రా కెరీర్ ఇప్పుడేమంత గొప్పగా లేదు. స్టార్ హీరోయిన్ అయిపోతుందని అప్పట్లో అంతా అనుకున్నారు కానీ.. గ్లామర్ షో.. పక్క భాషల్లో ఎంట్రీ వంటి వాటి విషయాల్లో ఈమె టైమింగ్ తేడా కొట్టేసింది. అందుకే హిట్స్ ఉన్నా.. ఆ స్థాయిలో అమ్మడి రేంజ్ మాత్రం పెరగలేదు.

గతేడాది నక్షత్రం మూవీతో ఎదురుదెబ్బ తిన్న రెజీనా.. ఇప్పుడు అ! అంటూ నాని నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తోంది. రీసెంట్ గా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేయగా.. మూవీలోని పాత్రలను పరిచయం చేశారు. టీజర్ ప్రకారం అయితే.. ఎవరి పాత్రకు సంబంధించిన డీటైలింగ్ ఇవ్వలేదు. అయితే.. ఇతర క్యారెక్టర్స్ తో పోల్చితే రెజీనా గెటప్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. వెస్ట్రన్ ఔట్ ఫిట్స్.. స్టైలింగ్ తో రెజీనా కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటుంది. ఈమె డ్రగ్ ఎడిక్ట్ గా కనిపించనుందా అనే డౌట్స్ రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ పాత్రను చూస్తే.. 'ది గాళ్ విత్ ది డ్రాగన్ టాటూ' మూవీలో రూనీ మారా పోషించిన పాత్ర గుర్తుకు వస్తుంది. క్యారెక్టరైజేషన్ ను లిజబెత్ సలెండర్ పాత్ర ఆధారంగా డిజైన్ చేసినట్లుగా కనిపిస్తుంది.

ఇదే పాత్రతో బెస్ట్ యాక్ట్రెస్ గా ఆస్కార్ కు నామినేట్ అయింది రూనీ. ఇలాంటి పాత్ర హాలీవుడ్ లో కనిపించడం సహజమే కానీ.. ఒక డ్రగ్ ఎడిక్ట్ పాత్రను తెలుగు ఆడియన్స్ కు చూపించేందుకు సిద్ధమవుతున్న రెజీనాను అభినందించాల్సిందే అంటున్నారు సినీ జనాలు. నాని ప్రొడ్యూసర్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన అ చిత్రం ఆరంభం నుంచి ఆకట్టుకుంటూనే ఉంది.

ఆద్యంతం ఆసక్తికరం | The Four Warriors (2017) Full Movie In Telugu

The Four Warriors (2017) Full Movie In Telugu ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. మీరూ చూడాలనుకుంటే క్రింది లింక్ ద్వారా వెళ్ళవచ్చు.

The Four Warriors (2017) Full Movie In Telugu

నువ్వే ఆ క్లిప్ పెడితే ఎలా నాని?? ఫిలిం నగర్లో తెగ చర్చలు

Tollywood-Hero-Nani-Shared-Piracy-Clip-Andhra-Talkies
తనకు 2017 ఎంత కిక్కిచ్చిందో చెబుతూ.. హీరో నాని నిన్న ఒక ట్వీట్ వేశాడు. అయితే ఇప్పుడు సదరు ట్వీట్ గురించి ఫిలిం నగర్లో తెగ చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఆ ట్వట్లో మనోడు షేర్ చేసుకున్న వీడియో మామూలుగా లేదులే. అసలు ఇంతకీ ఆ ట్వీటు చేసి నాని ఎలాంటి మెసేజ్ ఇచ్చాడబ్బా అంటూ అప్పుడే అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. పదండి చూద్దాం.

2017 తనకు చాలా స్పెషల్ అంటూ.. 2018లో ఇంకా బాగా ఇంకా గొప్పగా సినిమాలను చేస్తాను అంటూ నాని ఒక ట్వీటేశాడు. దానితో పాటు షేర్ చేసిన వీడియోలో.. గత ఏడాది నాని సినిమాలు ధియేటర్లో రిలీజ్ అయినప్పుడు.. అక్కడ ఫ్యాన్స్ ఎలా గగ్గోలు పెట్టేశారు అనేది చూపించడానికి పెట్టిన వీడియో. అయితే ఆ వీడియోలన్నీ కూడా సదరు సినిమాల పైరసీ ప్రింట్లలో నుండి కట్ చేసినట్లే ఉన్నాయి. ఒకవేళ అవి ఫ్యాన్స్ తీసిన వీడియోలు అయినా కూడా.. సినిమా ప్రదర్శితం అవుతున్నప్పుడు అలా వీడియో తీయడం అనేది నేరం. మరి స్వయంగా ఒక స్టార్ హీరో అలాంటి క్లిప్ షేర్ చేస్తే ఎలా?

నిజానికి నాని ఎక్సయిట్ అవ్వడంతో తప్పులేదు కాని.. ఆ ఫ్యాన్స్ తాలూకు ఎక్సయిట్మెంట్ ను ఇలా డైరక్టుగా చూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాని మనోడు మాత్రం ఏకంగా పైరసీ క్లిప్ తో సహా తన ఆనందం పంచుకున్నాడు. ప్చ్.. వాటీజ్ దిస్ నాని?
Tollywood-Hero-Nani-Shared-Piracy-Clip-Andhra-Talkies
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...