హాలీవుడ్ సినిమాలో మంచు లక్ష్మి

Manchu-Lakshmi-Hollywood-Debut-Movie-Basmati-Blues-Andhra-Talkies

హాలీవుడ్ సినిమాలో మంచు లక్ష్మి

ఏమో అనుకుంటాం కాని మంచు లక్ష్మి ఘటికురాలే. టాలెంట్ పుష్కలంగా ఉన్నా టైం కలిసి రాక సినిమాల పరంగా వర్క్ అవుట్ చేసుకోలేకపోతున్న లక్ష్మి టీవీలో మాత్రం గ్రాండ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తన తెలుగు మాండలికం గురించి చిన్న చిన్న కామెంట్స్ వచ్చినా వాటిని పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకువెళ్తున్న మంచు లక్ష్మి ఏకంగా హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. బాస్మతి బ్లూస్ అనే హాలీవుడ్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 9న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో తానొక కీలక పాత్ర పోషించిన్నట్టు చెప్పిన లక్ష్మి ఆ మూవీ ట్రైలర్ ను షేర్ చేసుకుని చూడండంటూ కోరింది. డాన్ బారన్ దర్శకత్వం వహించిన ఈ బాస్మతి బ్లూస్ లో బ్రీ లార్సన్ - ఉత్కర్ష్ అమ్బుద్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఒక లేడీ సైంటిస్ట్ జన్యు మార్పులతో చేసిన ప్రయోగాలతో కొత్తగా కనుకున్న ధాన్యాన్ని ఇక్కడి రైతులకు  పరిచయం చేసి ఎక్కువ దిగుబడులు వచ్చేలా వాళ్ళను ప్రోత్సహించే దిశగా ఇండియాకు వస్తుంది. ఆ క్రమంలో ఒక భారతీయుడితో ప్రేమలో పడుతుంది. ఈ లోపు తను కనుకున్న ధాన్యం మార్కెటింగ్ చేయటంలో సమస్యలు ఎదురవుతాయి. స్థానిక శక్తులు దాన్ని వ్యతిరేకిస్తూ తనకు ఇబ్బందులు సృష్టిస్తారు. వీటిని దాటుకుని తన ధాన్యాన్ని అమ్మి తన ప్రేమను ఎలా గెలిపించుకుంది అనేదే బాస్మతి బ్లూస్ కథ. ఈ సినిమాలో హీరొయిన్ ఫ్రెండ్ గా మంచు లక్ష్మి అచ్చమైన భారతీయ మహిళగా నటిస్తోంది. సో హాలీవుడ్ లో మొదటి అడుగు పెట్టేసిన మంచు లక్ష్మి బాస్మతి బ్లూస్ చూడాలంటే మరో నెల రోజులు వెయిట్ చేయాలి. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...