నువ్వే ఆ క్లిప్ పెడితే ఎలా నాని?? ఫిలిం నగర్లో తెగ చర్చలు

Tollywood-Hero-Nani-Shared-Piracy-Clip-Andhra-Talkies
తనకు 2017 ఎంత కిక్కిచ్చిందో చెబుతూ.. హీరో నాని నిన్న ఒక ట్వీట్ వేశాడు. అయితే ఇప్పుడు సదరు ట్వీట్ గురించి ఫిలిం నగర్లో తెగ చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఆ ట్వట్లో మనోడు షేర్ చేసుకున్న వీడియో మామూలుగా లేదులే. అసలు ఇంతకీ ఆ ట్వీటు చేసి నాని ఎలాంటి మెసేజ్ ఇచ్చాడబ్బా అంటూ అప్పుడే అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. పదండి చూద్దాం.

2017 తనకు చాలా స్పెషల్ అంటూ.. 2018లో ఇంకా బాగా ఇంకా గొప్పగా సినిమాలను చేస్తాను అంటూ నాని ఒక ట్వీటేశాడు. దానితో పాటు షేర్ చేసిన వీడియోలో.. గత ఏడాది నాని సినిమాలు ధియేటర్లో రిలీజ్ అయినప్పుడు.. అక్కడ ఫ్యాన్స్ ఎలా గగ్గోలు పెట్టేశారు అనేది చూపించడానికి పెట్టిన వీడియో. అయితే ఆ వీడియోలన్నీ కూడా సదరు సినిమాల పైరసీ ప్రింట్లలో నుండి కట్ చేసినట్లే ఉన్నాయి. ఒకవేళ అవి ఫ్యాన్స్ తీసిన వీడియోలు అయినా కూడా.. సినిమా ప్రదర్శితం అవుతున్నప్పుడు అలా వీడియో తీయడం అనేది నేరం. మరి స్వయంగా ఒక స్టార్ హీరో అలాంటి క్లిప్ షేర్ చేస్తే ఎలా?

నిజానికి నాని ఎక్సయిట్ అవ్వడంతో తప్పులేదు కాని.. ఆ ఫ్యాన్స్ తాలూకు ఎక్సయిట్మెంట్ ను ఇలా డైరక్టుగా చూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాని మనోడు మాత్రం ఏకంగా పైరసీ క్లిప్ తో సహా తన ఆనందం పంచుకున్నాడు. ప్చ్.. వాటీజ్ దిస్ నాని?
Tollywood-Hero-Nani-Shared-Piracy-Clip-Andhra-Talkies

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...