ఆ కథలు వినీవిని అలసిపోయాను -రష్మీ | I'm tired of those stories -Rashmi

I'm tired of those stories -Rashmi
ఎవరైనా ఒక యాక్టర్ ఒక సినిమా చేసి హిట్ అయితే అదే జోనర్ లో స్క్రిప్టులు ఉన్న ప్రొడ్యూసర్లు అందరి ఆ యాక్టర్ ను అలాంటి ఆఫర్లతో చుట్టుముట్టేస్తారు. కానీ ఒకవేళ ఆ యాక్టర్ కి అలాంటి సినిమాలు బోర్ కొట్టేస్తే? హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఇప్పుడు అదే సిట్యుయేషన్ లో ఉంది.

ఈమధ్య తనకి అన్నీ హారర్ కామెడీ స్క్రిప్టులే వస్తున్నాయి అంట. "ఇంతకుముందు ఒకటి రెండు సినిమాలు చేశాను హారర్ జోనర్ లో. అప్పటినుండి అన్ని స్క్రిప్టులు అలాంటివి వస్తున్నాయి. హారర్ కథలు వినీవిని అలసిపోయాను కానీ ఎందుకు వాళ్లంతా నన్ను అలాంటి రోల్స్ కి అడుగుతారో అర్థం కావట్లేదు. హారర్ లేక థ్రిల్లర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. అది ఆసక్తికరమైన కథ కావచ్చు - స్పెషల్ ఎఫ్ఫెక్టులు అవ్వచ్చు లేదా నెర్రెట్ చేసే పద్దతి కావచ్చు. కాని ఎదో చేయాలి కదా అని నేను సినిమాలు చేసుకుంటూ పోలేను' అంటూ తేల్చి చెప్పేసింది రష్మీ.

తనకు లైఫ్ ఇచ్చింది టీవీ అని అలాంటి టీవీ షోలను ఎప్పటికి మర్చిపోను అంటోంది జబర్దస్త్ మరియు అనుభవించు రాజా ఆమె కామెడీ షోలతో బిజీగా ఉన్న రష్మీ. అంతేకాదు తనకు వెబ్ సిరీస్ లో నటించాలని ఉందంట. పెద్ద పెద్ద స్టార్లు కూడా చేసేస్తున్నారు కదా తాను కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి ఓపెన్ గా ఉంది అని చెప్తోంది. 

ప్రియ వారియర్.. ఆ వార్తల్లో నిజం లేదట | Priya Warrior .. the news is not true

Priya Warrior .. the news is not true
కేవలం ఒకే ఒక్క చిన్న వీడియోతో భారతదేశం మొత్తంలో ఒక స్టార్ అయిపోయింది ఆమె. తనే ప్రియ ప్రకాష్ వరియర్ ఒకే ఒక్కసారి కన్ను గీటి కుర్రకారును ఉర్రూతలూగించింది. ప్రియ గురించి వచ్చిన ఎలాంటి వార్త అయినా వైరల్ అవ్వాల్సిందే. అందుకే కొందరు అబద్ధపు వార్తలు కూడా రాసేస్తున్నారు అంటున్నారు ఆమె మేనేజర్. పదండి ఈ కథేంటో చూద్దాం.

ఈమధ్యనే ప్రియ గురించి కొన్ని తప్పుడు వార్తలు బయటికి వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ లో కొన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడానికి ప్రియ ఏకంగా 8 లక్షలు తీసుకుంటోందని కొన్ని రూమర్లు ఇండస్ట్రీలో హల్ చల్ చేశాయి. కానీ అవన్నీ ఎవరో కల్పించినవి అని నిజం అది కాదు అని ఈ సెన్సేషన్ గర్ల్ మేనేజర్ చెప్పుకొచ్చారు. ఇలా బ్రాండ్స్ తరపు నుండి బోలెడు ఆఫర్లు ప్రియకు వస్తున్నాయి కానీ తను మాత్రం సినిమా విడుదల అయ్యేవరకు ఆగాలనుకుంటుంది అని చెప్పారు ఈ మలయాళం పిల్ల మేనేజర్.

అంతే కాదు. కేరళలో సోషల్ మీడియాను వేదిక చేసుకుని బ్రాండ్స్ ప్రమోట్ చేయడం లాంటివి అంత ఎక్కువగా జరగదని ఆ ట్రెండ్ బాలీవుడ్లో ఉన్నంత ఎక్కువగా అక్కడ అంత వ్యాపించలేదు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రియా ఇండియా అంతటా పాపులర్ అయినప్పుడు.. కేవలం కేరళలో బ్రాండ్స్ ను ప్రమోట్ చేసే అలవాటు లేదు అని చెప్పడం కామెడీగా ఉంది కదూ. 

విలన్ గా మారిన కుర్ర హీరో | Youth hero who turned into a villain

Youth hero who turned into a villain

విలన్ గా మారిన కుర్ర హీరో | Youth hero who turned into a villain

ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవడం అంత సులభమైన విషయమేం కాదు. కనీసం వరసగా రెండు హిట్లు పడనిదే పెద్దగా హీరో ఆఫర్లు అందుకోవడం కష్టమైన పనే. మరి అలాంటిది మొదటి సినిమానే ప్లాప్ అయితే పాపం అప్పుడు పరిస్థితి ఏంటి? నవీన్ చంద్ర కూడా ఇప్పుడు అదే ప్లేస్ లో ఉన్నాడు.

అందాల రాక్షసి సినిమా ప్లాప్ అయినప్పటికీ నవీన్ చంద్ర - లావణ్య త్రిపాఠి లాంటి నటులను మరియు హను రాఘవపూడి లాంటి మంచి డైరెక్టర్ ను కూడా టాలీవుడ్ కు పరిచయం చేసింది. కానీ అందాల రాక్షసి ప్లాప్ నవీన్ చంద్ర కెరీర్ కు ఒక పెద్ద లోటే చేసింది. పైగా తర్వాతి సినిమాలు లచ్చిందేవికి ఒక లెక్కుంది లాంటి సినిమాలు చేసినా ఏవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అందుకే పాపం సపోర్టింగ్ ఆర్టిస్ట్ రోల్స్ - విలన్ పాత్రలు వేసుకోవాల్సి వస్తోంది. నవీన్ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో కృరాతి క్రూరమైన విలన్ గా మన ముందుకు రాబోతున్నాడు.

ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటిస్టున్నారు. కాథరిన్ థెరిసా కూడా రెండో హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ఇంతకు ముందు కూడా నేను లోకల్ లో విలన్ గా చేసిన నవీన్ - రామ్ చరణ్-బోయపాటి సినీమాలో కూడా ఒక చిన్న పాత్ర పోషిస్తున్నాడు. 

షకీలా బయోపిక్.. హీరోయిన్ దొరికేసింది | Shikila Biopic .. The heroine is found

Shikila Biopic .. The heroine is found

షకీలా బయోపిక్.. హీరోయిన్ దొరికేసింది | Shikila Biopic .. The heroine is found

బాలీవుడ్ లో బయోపిక్ ల హవా బాగానే నడుస్తోంది. ఒక వైపు ఇప్పటికే సైనా నెహ్వాల్ సంజయ్ దత్ మరి కొందరి జీవితాల ఆధారంగా కొన్ని సినిమాలు రూపు దిద్దుకుంటున్న విషయం తెల్సిందే. ఇప్పుడు హీరోయిన్ రిచా చద్దా కూడా ఒకరి బయోపిక్ లో నటించబోతోంది. ఈ బయోపిక్ అన్నిటికంటే కాస్త విరుద్ధం ఎందుకంటే ఈ సినిమా బేస్ అవ్వబోయేది ఒక మాములు సెలబ్రిటీ మీద కాదు ఒక పోర్న్ స్టార్ జీవితం మీద.

ఇప్పటికే సిల్క్ స్మిత పాత్రలో విద్య బాలన్ అదరగొట్టేసింది. ఇప్పుడు ఆమె ఫ్యాన్ గా ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అటు తెలుగు - తమిళ్ - మలయాళం - కన్నడ అంటే సౌత్ లో ఉన్న అన్ని భాషల్లోనూ పాపులర్ అయిపోయిన సాఫ్ట్ పోర్న్ స్టార్ ఈమె. ఆమె బి-గ్రేడ్ సినిమా కలెక్షన్ల ముందు మమ్మూటీ - మొహన్ లాల్ సినిమాల కలెక్షన్లు వెలవెలబోయేవి. ఆమే షకీలా. 16 ఏళ్ల వయసులోనే పోర్న్ స్టార్ గా మారి సౌత్ భాషల్లో కొన్ని వందల సినిమాలలో నటించింది. ఈమధ్యనే మళ్ళీ తెలుగులో ఆమెతో శీలవతి అనే సినిమా కూడా తెరకెక్కింది. ఇప్పుడు ఆమె పేరు మీద బయోపిక్ రాబోతోంది. కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

90లలో సిల్క్ స్మిత ఒక రేంజ్ పాపులారిటీ లో ఉండగానే షకీలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎలా స్టార్ అయిపోయిందో ప్రేక్షకులకు ఈ సినిమా తెలియచేస్తుంది. రిచా చద్దా కు కథ చెప్పగానే ఆ రోల్ ఎంత పవర్ఫులో అర్థమయ్యి వెంటనే ఓకే చెప్పేసిందంట. షకీలా లైఫ్ లో ఫ్యాన్స్ కి చెప్పదగిన బోలెడన్ని ఆసక్తికరమైన కథలు ఉన్నాయి అంటున్నారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు టాక్.

శ్రీదేవి సంతాపంలో ఆ హీరోయిన్ కి నవ్వెలా వచ్చిందో... | Sridevi is in mourning That heroine came to laugh ...

Sridevi is in mourning That heroine came to laugh ...
రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో బ్రహ్మానందం పాత్ర భలే కామెడీగా ఉంటుంది. ఏదైనా దుర్వార్త చెప్పాల్సి వచ్చినా నవ్వుతూ చెబుతూ యజమాని రావు గోపాల్ రావు చేతిలో తిట్లు తింటూ ఉంటాడు. ఎందుకయ్యా అంటే దూరదర్శన్ లో నవ్వుతు వార్తలు చదివి చదివి అలా అలవాటు అయ్యిందని చెప్పడం భలేగా పేలింది.

ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే నిన్న శ్రీదేవి పార్ధీవ దేహానికి నివాళి అర్పించడానికి వచ్చిన ఒక హీరొయిన్ సందర్భం మర్చిపోయి చాలా క్యాజువల్ గా నవ్వుతూ తుళ్ళుతూ తిరగడం మీడియా కన్ను దాటి పోలేదు. ఎక్కడికి వచ్చాం అన్న స్పృహ కూడా లేకుండా తను ప్రవర్తించిన తీరు కో యాక్టర్స్ కు సైతం ఆశ్చర్యం కలిగించింది.

గత ఏడాది వరుణ్ ధావన్ తో నటించిన జుడ్వా 2తో మంచి సక్సెస్ అందుకున్న హీరొయిన్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఇలా చేసి నవ్వుల పాలైంది. నివాళి అర్పించడం కోసం సెలబ్రేషన్ క్లబ్ కు అందరితో పాటే వచ్చిన జాక్వెలిన్ ఏమి పట్టనట్టు ఏదో ఫంక్షన్ కు వచ్చినట్టు ఉండటం ఎవరి దృష్టిని దాటిపోలేదు. వచ్చిన ప్రతి ఒక్కరు విషన్న వదనంతో కన్నీళ్ళు ఆపుకుని శ్రీదేవి దర్శనం కోసం వస్తుంటే ఈ శ్రీలంక సుందరి మాత్రం ఇలా చేయటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిఖరం అంత ఎత్తున్న శ్రీదేవి ఇమేజ్ ముందు పట్టుమని ఓ ఐదు ఘనమైన హిట్లు కూడా లేని అప్ కమింగ్ హీరొయిన్ ఇలా ప్రవర్తించడం పట్ల సోషల్ మీడియాలో భారీగా కామెంట్స్ పడుతున్నాయి. అయినా తెల్ల చీర కట్టుకొచ్చినంత మాత్రాన సరిపోదు కదా అలాంటి మనసు ఉన్నప్పుడే తప్పేదో ఒప్పేదో తెలుస్తుంది.
Sridevi is in mourning That heroine came to laugh ...

సినిమా థియేటర్ల బంద్ ప్రకటించడానికి నిర్మాతల అసలు కారణం ఇదీ

This-is-the-original-reason-for-producers-to-announce-band-theater-theaters
దక్షిణాది సినీ నిర్మాతలకు.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు (డీఎస్పీలు) మధ్య చర్చలు ఫలించలేదు. డీఎస్పీలు వర్చువల్ ప్రింట్ ఫీజు భారీగా దండుకుంటూ నిర్మాతలకు భారీ నష్టం చేకూరుస్తున్నారని ఆరోపిస్తున్న నిర్మాతలు ఈ శుక్రవారం నుంచి సమ్మెకు దిగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లు మూత పడబోతున్నాయి. మళ్లీ అవి ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. ఈ సమస్య ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియదు. తాము తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగుతున్నామని అంటోంది నిర్మాతల మండలి. సమ్మె విషయంలో వారి వెర్షన్ ఏంటంటే..

‘‘2007–2008 కాలం నుంచి సినిమా ప్రింట్ నుంచి డిజిటల్ లోకి మారుతూ వచ్చింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ముందు ఉచితంగానే థియేటర్లలో డిజిటల్ ప్రొజెక్టర్లు ఏర్పాటు చేశారు. ఐతే పెట్టుబడి వెనక్కి రాబట్టుకునేందుకు వర్చువల్ ప్రింట్ ఫీజు రోజుకు ఇంత అని నామమాత్రంగానే చెల్లించమని.. ఐదేళ్ల తర్వాత చెల్లించాల్సిన అవసరం లేదని.. ప్రకటనల రూపంలో మేం ఆదాయం సమకూర్చుకుంటామంటూ చెప్పారు. కానీ పదేళ్లు గడిచినా ఫీజులు మాఫీ చేయలేదు. భారీ రేట్లు పెడుతున్నారు. రేటూ తగ్గించట్లేదు. ప్రకటనల ద్వారా అధిక ఆదాయం పొందడంతో పాటు వీపీఎఫ్ అధికంగా వసూలు చేస్తున్నాయి. ఇది సినిమా వర్గాలకు భారంగా మారుతోంది. కొన్ని సినిమాలకు వీపీఎఫ్ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది.

ఈ సమస్య పరిష్కారం కోసం దక్షిణాది నిర్మాతలందరూ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ అధ్యక్షతన ఫిబ్రవరి 16న చెన్నైలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించాం. ప్రస్తుతం వసూలు చేస్తున్న వీపీఎఫ్ ని 25 శాతానికి తగ్గించి.. ఏడాది తర్వాత ఆ ఫీజు మొత్తం వసూలు చేయకూడదనీ.. రెండు సినిమా యాడ్స్ స్లాట్స్ మాకు ఇవ్వాలనీ.. వాణిజ్య ప్రకటనలు 8 నిమిషాలకు మించి ప్రదర్శించరాదని చెప్పాం. ఐతే వాళ్లు ఫీజును 10 శాతమే తగ్గిస్తామన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బతికే ఆ వర్గం వ్యక్తి ‘ఆల్ ది బెస్ట్ టు ఇండస్ట్రీ’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడి సమావేశం నుంచి వెళ్లిపోయాడు.  మా సమ్మెకు ఇండస్ట్రీ నుంచి పూర్తి సహకారం ఉంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని యాదవ్ కూడా అండగా నిలిచారు. అవసరమైతే కొత్త డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను మార్కెట్ లోకి తీసుకొస్తాం. మా డిమాండ్లు ఒప్పుకునే వరకు సినిమా ప్రదర్శన ఉండదు’’ అని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ కమిటీ ఛైర్మన్ దామోదర్ ప్రసాద్ అన్నారు.

This is the original reason for producers to announce band theater theaters

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...