రంగస్థలం సినిమా ఎవర్ గ్రీన్ హీరోయిన్ సమంత ఇప్పట్లో తగ్గేలా లేదే

Heroin-Samantha-At-Rangasthalam-Success-Meet-Andhra-Talkies
టాలీవుడ్ లో నిజంగా చాలా పెద్ద మార్పులే వస్తున్నాయి. ఓ విధంగా అందుకు కారణం ఆడియెన్స్ మైండ్ సెట్ చేంజ్ అవడమే. పెళ్లైన హీరోయిన్ ను ఎవడు చూస్తాడు అనుకునే రోజులు పోయాయి మనసులో నటన పై ఆసక్తి ఉంటే ఎవ్వరైనా ఎవర్ గ్రీన్ హీరోయిన్ అవుతారని సమంత చెప్పకనే చెప్పేసింది. రంగస్థలం సినిమాలో ఆమె కనిపించిన తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. పెళ్లి అయిన సమంత పెళ్లి కానీ సమంత అనే కోణంలో ఎవరు ఆలోచించలేదు.

సినిమా విజయంలో ఆమె పాత్ర చాలానే ఉందని చెప్పవచ్చు. ఇక నిన్న జరిగిన రంగస్థలం విజయోత్సవంలో కూడా సమంత కనిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది. అందరికి చేతులెత్తి నమస్కరం పెట్టి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆమెను పొగిడిన ప్రతి గెస్ట్ కి దండం పెట్టడం చూసిన తరువాత ఆమె నిబద్దత భావం ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చు. చూస్తుంటే సమంత తన కెరీర్ కు ఇప్పట్లొ ఎండ్ చెప్పేలా లేదు అనిపిస్తోంది.

ఇక సినిమా ప్రముఖులు కూడా ఆమెకు పెళ్లి అయ్యింది అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆమెకు నటనపై ఆసక్తి ఉన్నంత వరకు హీరోయిన్ గా కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రంగస్థలం ఈవెంట్ లో బాబాయ్ అబ్బాయ్ లు మెగా ఫ్యాన్స్ ను కనువిందు చేశారు. ఇద్దరు ప్రేమగా ముద్దు పెట్టుకోవడం అందరు ఎంతగానో మురిసిపోయారు. ఇక రంగస్థలం సినిమా 100 కోట్ల (షేర్స్) మార్క్ ను ఇటీవల క్రాస్ చేసిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...