మొగుడి షర్ట్ వేసుకుని వచ్చేసిన అనుష్క | Anushka who was wearing Husbend shirt

Anushka-Sharma-spotted-wearing-hubby-Virat-Kohli-tank-top-Andhra-Talkies.jpg
సహజంగా ఒక ఇంట్లో నివసిస్తున్న వాళ్లంటే.. ఒకే డ్రెస్ ను వేసుకోవడంలో పెద్దగా ఆశ్చర్యం అనిపించదు. కానీ భార్యాభర్తలు ఇద్దరూ ఒకే తరహా డ్రెస్సింగ్ వేసుకోవడం వేరు.. భర్త వేసుకున్న షర్ట్ నే భార్య కూడా ధరించడం వేరు. ఎంత ఒక కంచంలో తిన్నా.. పబ్లిక్ లో సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవారు ఇలాంటివి చేయడం దాదాపుగా కనిపించదు.

కానీ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ మాత్రం ట్రెండ్ బ్రేక్ చేసేస్తోంది. ఎంచక్కా తన భర్త.. ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ షర్టులను విచ్చలవిడిగా వాడేస్తోంది. ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా విరాట్ తెగ బిజీగా ఉంటే.. ఈ భామ మాత్రం విరాట్ చొక్కాలను వేసుకుని చక్కర్లు కొట్టేస్తుండడం.. టాక్ ఆఫ్ ది కంట్రీ అయిపోతోంది. రీసెంట్ గా ఓ బ్లాక్ కలర్ టాప్ లో కనిపించింది అనుష్క శర్మ. నిజానికి కొన్ని రోజుల క్రితం జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ.. విరాట్ వేసుకున్నదే ఈ టాప్. ఆ సంగతి వెంటనే అర్ధమయిపోతోంది. ఫ్యాషన్ లవర్స్ అండ్ వీరిద్దరి ఫాలోయర్స్ వెంటనే ఈ విషయాన్ని కనిపెట్టేశారు. విరాట్ ధరించిన ట్యాంక్ టాప్ తో అనుష్క ఉన్న లుక్ ను కంపేర్ చేస్తూ వైరల్ గా షేర్ చేసిపారేశారు.

ఇలా తన భర్త షర్టుతో అనుష్క కనిపించడం మొదటిసారి కాదు. గతంలో వైట్ కలర్ షర్ట్ ను కూడా ఇలాగే వాడేసింది అనుష్క. ఎలాగూ ఇద్దరూ స్లిమ్ అండ్ ఫిట్ గానే ఉంటారు కాబట్టి.. సైజుల విషయంలో కూడా పెద్దగా ప్రాబ్లెం ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఏమైనా మొగుడూపెళ్లాలు ఇద్దరూ ఒకటే షర్ట్ ధరించడం అంటే.. పొగడాల్సిన విషయమే. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...