తగ్గేదే లేదు.. పూరి మళ్ళీ రెడీ

Tollywood-Director-Puri-Jagannath-Starts-Working-For-Next-Project-Andhra-Talkies
సినిమా హిట్.. ఫ్లాపులతో సంబంధం లేకుండా చకచకా సినిమాలు చేసుకుంటూ పోవడం డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్పెషాలిటీ. తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా నిలబెట్టేందుకు ఆయనే స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ మెహబూబా సినిమా తీశాడు. తన రొటీన్ స్టయిల్ లో కాకుండా ఇండియా - పాక్ వార్ బ్యాక్ డ్రాప్ గా మెహబూబా సినిమా రూపొందించాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

మెహబూబూ ఫ్లాప్ టాక్ నుంచి పూరి త్వరగానే బయటపడ్డాడు. తన తరవాత సినిమా కూడా కొడుకుతోనే తీస్తానని పూరి జగన్నాథ్ ముందే ప్రకటించాడు. అందుకు తగినట్టే తరవాత సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలెట్టేశాడట. తాజాగా మెహబూబా సినిమా ప్రమోషన్ కోసం పూరి - ఆయన టీం యూఎస్ వెళ్లారు. పనిలో పనిగా తరవాత సినిమా కోసం లోకేషన్ల వేట కూడా సాగించేస్తున్నారనేది లేటెస్ట్ న్యూస్. ఈసారి తీసే మూవీ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ గా తీయబోతున్నాడని తెలుస్తోంది.

మెహబూబాకు మౌత్ టాక్ బాగుందని.. నెమ్మదిగా పికప్ అవుతుందని పూరి మొదట్లో లెక్కేశాడు. కానీ అలా ఏమీ జరగలేదు. మెహబూబా చేదు అనుభవం నుంచి బయటకు రావాలంటే వీలైనంత త్వరగా నెక్స్ట్స్ సినిమా మొదలుపెట్టేయడమే మంచిదనే ఆలోచనలో పూరి ఉన్నాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. పూరి జగన్నాథ్ తరవాత సినిమా కూడా తన సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ బ్యానర్ లోనే తీయబోతున్నాడు.

సెలబ్రెటీలను ఫాలో అయ్యేది మనుషులేనా?

Film-Stars-and-Their-Fake-Followers-in-Social-Media-Andhra-Talkies
సోషల్ మీడియా అంటే ఈ రోజుల్లో ఎక్కువగా తెలియని వారు ఉండరు. స్మార్ట్ ఫోన్ ఉంటే సోషల్ మీడియా యాప్ లకు అడిక్ట్ అయిపోతున్నారు. ఏది నిజం.. ఏది అబద్ధం అనే విషయాల్లో క్లారిటీ లేకుండా చర్చించుకోవడం కామన్ అయిపోయింది. ప్రస్తుతం చాలా వరకు సోషల్ మీడియాలో అబద్ధాలే ఎక్కువ అయ్యాయి. ఫెక్ ఎకౌంట్స్ లక్షల్లో క్రియేట్ అవుతున్నాయి. వాటి వల్ల సోషల్ మీడియా కంపెనీలకు చెడ్డ పేరు వస్తోంది.

దీంతో క్లోజ్ చెయ్యాలని రెడీ అయ్యాయి. ఇటీవల ట్విట్టర్ లో అదే పని చేయగా దాదాపు లక్షల్లో ఫెక్ అకౌంట్స్ ను గుర్తించారు. అయితే వాటి వల్ల సెలబ్రిటీలకు ఎఫెక్ట్ పడింది. ఎక్కువగా వారిని ఫాలో అవుతున్నది ఈ ఫెక్ ఎకౌంట్స్ అనే తేలింది. అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిన బాలీవుడ్ హీరో షారుక్ ని 48 పర్సెంట్ రియల్ నెటీజన్స్ ఫాలో అవుతున్నారు. ఇక సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ను 62 పర్సెంట్ రియల్ పర్సన్స్ ఫాలో అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక అత్యధికంగా రియల్ ఫాలోవర్స్ కలిగిన స్టార్ దీపిక పదుకొనె. ఆమెను 71 శాతం రియల్ ఫాలోవర్స్ ని కలిగి ఉంది.

ఇక టాలీవుడ్ సైడ్ నుంచి చూస్తే..6.78 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన సమంత కు 68 పర్సెంట్ రియల్ ఫాలోవర్స్ ఉన్నారు. అత్యధికంగా రాజమౌళి 72% రియల్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే.. సోషల్ మిడియలో మంచి ఫాలోయింగ్ ఉన్నట్లు టాక్ తెచ్చుకున్న అల్లు అర్జున్ కి అతి తక్కువ రియల్ ఫాలోవర్స్ ఉన్నారు. అతని ఎకౌంట్ ని ఫాలో అయ్యేది కేవలం 49% శాతం మంది మాత్రమే.. మిగతా 51% శాతం ఎకౌంట్స్ ఫేక్ అంట. అయితే అసలు ఈ ''ట్విట్టర్ ఆడిట్'' టూల్ ఎంతవరకు రియల్ అనేదే ఇప్పడు తేలాల్సిన విషయం!!

ప్రభాస్ ను కాపీ కొట్టేసిన సల్మాన్ ఖాన్ | Salman Khan who copied Prabhas

Salman Khan who copied Prabhas
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ ఇన్ స్పిరేషన్ తీసుకోవడం కామన్ అయిపోయింది. రీమేక్ లు మాత్రమే కాదు.. అడపాదడపా కాన్సెప్టులను తీసేసుకోవడం కూడా కనిపిస్తోంది. ఇప్పుడు రిలీజ్ కాని సినిమాల నుంచి కూడా థీమ్ లను లేపేయడం.. అది కూడా సల్మాన్ ఖాన్ లాంటి హీరో సినిమాలో ఇలాంటి ఫీట్స్ కనిపించడం చర్చనీయాంశం అవుతోంది.

రీసెంట్ గా సల్మాన్ ఖాన్ మూవీ రేస్3 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రతీ సారి ఈద్ పండుగకు సినిమా ఇచ్చే సల్లూ భాయ్.. ఇప్పుడు రేస్3 మూవీతో సక్సెస్ సాధిస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ చిత్రంలో పారాగ్లైడింగ్ ఫీట్ చేస్తూ.. సల్మాన్ ఖాన్ కనిపిస్తాడనే విషయం.. ట్రైలర్ లో ఓ సన్నివేశం ద్వారా అర్ధమవుతుంది. ఇలాంటి షాట్ ను.. దాదాపు ఏడాది క్రితమే టాలీవుడ్ చూపించేసింది. బాహుబలి2 మూవీతో పాటే ప్రభాస్ మరుసటి చిత్రం సాహోకు టీజర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సాహో టీజర్ లో చివరగా చూపించే షాట్ లో.. బుర్జ్ ఖలీఫా పై నుంచి ఓ వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తూ.. ఫీట్ చేస్తాడు. అప్పటికి గ్రాఫిక్స్ అయినా.. ఇప్పుడు రియల్ గానే ఆ షాట్ ను రూపొందిస్తున్నారు. కానీ ఈ ఫైట్ సీక్వెన్స్ థీమ్ ను రేస్3లో చూపించండం ఆలోచించాల్సిన విషయం. ప్రభాస్ సినిమాలో ఈ సీక్వెన్స్ ఉంటుందని తెలిసినా.. సల్మాన్ కాపీ చేసేయడం ఆశ్చర్యపరుస్తోంది. పారాగ్లైడింగ్ పై ప్రభాస్ కు పేటెంట్ రైట్స్ ఏమీ లేవు కానీ.. ఈ సన్నివేశం చూపించిన విధానం మాత్రం కాపీ అనే సంగతిని ధృవీకరించేస్తోంది.

కట్.. కట్.. మధ్యలో వాకౌట్ | Cut .. cut. Walkout in the middle

Cut .. cut. Walkout in the middle
సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుని సీన్ పర్ ఫెక్ట్ గా వస్తోందో లేదో పరిశీలిస్తూనే ఉంటారు డైరెక్టర్లు. ఏ మాత్రం తేడా అనిపించినా వెంటనే కట్ చెప్పేస్తారు. షూటింగ్ సీన్లకు కట్ చెప్పాల్సిన డైరెక్టర్లు అప్పుడప్పుడు సినిమాకే కట్ చెప్పేస్తున్నారు. యాక్టర్లతో పొసగక పోవడం వల్లనో.. నిర్మాతలను మెప్పించలేక పోవడం వల్లనో మొదలెట్టిన సినిమా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు.

తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత గాథతో ఆయన తనయుడు... హీరో బాలకృష్ణ రెడీ అయ్యారు. దీనికి ఏరికోరి తేజను డైరెక్టర్ గా తీసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి చేసి షూటింగ్ కు కొబ్బరికాయ కూడా కొట్టేశారు. తరవాత అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి తేజ స్వయంగా తప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి పిలుస్తున్నారనే టాక్ ఉందిలే. ఇంతకన్నా ముందు తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ మూవీ క్వీన్ రీమేక్ డైరెక్ట్ చేస్తున్న నీలకంఠ కూడా కొంత షూటింగ్ అయ్యాక ఆ ప్రాజెక్టును వదిలేసుకున్నాడు. ఇదే నీలకంఠ క్వీన్ మళయాళ వెర్షన్ మాత్రం కంప్లీట్ చేసేస్తున్నాడు. హీరోయిన్ తమన్నాతో అతడికి పడకపోవవడమే కారణమనే మాట అప్పట్లో వినిపించింది. ప్రస్తుతానికి తెలుగు క్వీన్ ప్రాజెక్టు పెండింగ్ లోనే ఉంది.

సొంత ప్రొడక్షన్ లో ఛలో సినిమాతో హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య డైరెక్టర్ సాయి శ్రీరామ్ తో సినిమా చేద్దామని రెడీ అయ్యాడు. ఈ సినిమాకు కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ అయ్యాక డైరెక్టర్ ఆ ప్రాజెక్టును వదిలేసి వేరే సినిమా పనిలో పడ్డాడు. నిన్ను వదిలి నేను పోలేనులే టైటిల్ తో నలుగురు హీరోయిన్లతో మొదలైన సినిమాకు సాయి శ్రీరామ్ డైరెక్షన్ చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్టుకు కూడా తరవాత అతడి ప్లేస్ లో సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ డైరెక్టర్ సీట్లోకి వచ్చాడు.

‘మహానటి’పై జెమిని గణేశన్ ఏమన్నాడంటే..| Gemini Ganesan comments on "Mahanati movie"

Gemini Ganesan comments on "Mahanati movie"
పండిత పుత్ర పరమ శుంఠ అంటారు. అలాగే పులి కడుపున పులే పుడుతుందని అంటారు. దుల్కర్ సల్మాన్ రెండో కోవకే చెందుతాడు. ఇండియన్ సినిమాలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న మమ్ముట్టి ఘన వారసత్వాన్ని అందుకుని నటుడిగా అరంగేట్రం చేసిన దుల్కర్.. చాలా త్వరగానే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అలాగని ఏ దశలోనూ తండ్రిని అనుకరించలేదు. ఆయన ఇమేజ్ ను వాడుకునే ప్రయత్నమూ చేయలేదు. తనకంటూ ఒక విభిన్న పంథా ఎంచుకుని నటుడిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వెళ్తున్నాడు. కేవలం మలయాళంలోనే కాక వేరే భాషల్లోనూ అతను తనదైన ముద్ర వేస్తున్నాడు. తమిళంలో ‘ఓకే కణ్మణి’తో మెప్పించిన దుల్కర్.. ‘మహానటి’ సినిమాతో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో జెమిని గణేశన్ పాత్రలో అతడి అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే.

‘మహానటి’ లాంటి సినిమాతో తెలుగు తెరకు పరిచయం కావడం.. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం పట్ల దుల్కర్ కూడా  సంతోషం వ్యక్తం చేశాడు. మలయాళంలో పెద్ద పెద్ద సినిమాలు చేసిన దుల్కర్.. తన కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ మూవీ అని చెప్పడం విశేషం. చాలా పెద్ద బేనర్లో.. భారీ తారాగణంతో.. సెట్లతో.. ఇంకా అనేక భారీ హంగులతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని.. ఈ సినిమా కోసం స్పెయిన్ నుంచి కెమెరామన్ వచ్చాడని.. సినిమాను చాలా అందంగా తీర్చిదిద్దాడని దుల్కర్ అన్నాడు. ఇక జెమిని గణేశన్ పాత్ర కోసం తాను ప్రిపేరైన విధానం గురించి అతను చెబుతూ.. జెమిని గణేశన్ సినిమాలు చాలానే చూశానని.. ఆయన ద్వారా సావిత్రికి పుట్టిన పిల్లలతోనూ ఎంతో మాట్లాడానని చెప్పాడు. తనకు తెలిసి జెమిని జీవితంలో బాధలు లేవని.. ఆయన చాలా సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాడని చెప్పాడు. రోజుకు 8 గంటల చొప్పున ఏడు రోజుల పాటు కష్టపడి ఈ చిత్రానికి తాను డబ్బింగ్ చెప్పినట్లు దుల్కర్ వెల్లడించాడు. ఈ పాత్రకు తాను డబ్బింగ్ చెప్పాలన్న నిర్ణయం దర్శకుడు అశ్విన్ దే అన్నాడు.
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...