కట్.. కట్.. మధ్యలో వాకౌట్ | Cut .. cut. Walkout in the middle

Cut .. cut. Walkout in the middle
సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుని సీన్ పర్ ఫెక్ట్ గా వస్తోందో లేదో పరిశీలిస్తూనే ఉంటారు డైరెక్టర్లు. ఏ మాత్రం తేడా అనిపించినా వెంటనే కట్ చెప్పేస్తారు. షూటింగ్ సీన్లకు కట్ చెప్పాల్సిన డైరెక్టర్లు అప్పుడప్పుడు సినిమాకే కట్ చెప్పేస్తున్నారు. యాక్టర్లతో పొసగక పోవడం వల్లనో.. నిర్మాతలను మెప్పించలేక పోవడం వల్లనో మొదలెట్టిన సినిమా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు.

తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత గాథతో ఆయన తనయుడు... హీరో బాలకృష్ణ రెడీ అయ్యారు. దీనికి ఏరికోరి తేజను డైరెక్టర్ గా తీసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి చేసి షూటింగ్ కు కొబ్బరికాయ కూడా కొట్టేశారు. తరవాత అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి తేజ స్వయంగా తప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి పిలుస్తున్నారనే టాక్ ఉందిలే. ఇంతకన్నా ముందు తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ మూవీ క్వీన్ రీమేక్ డైరెక్ట్ చేస్తున్న నీలకంఠ కూడా కొంత షూటింగ్ అయ్యాక ఆ ప్రాజెక్టును వదిలేసుకున్నాడు. ఇదే నీలకంఠ క్వీన్ మళయాళ వెర్షన్ మాత్రం కంప్లీట్ చేసేస్తున్నాడు. హీరోయిన్ తమన్నాతో అతడికి పడకపోవవడమే కారణమనే మాట అప్పట్లో వినిపించింది. ప్రస్తుతానికి తెలుగు క్వీన్ ప్రాజెక్టు పెండింగ్ లోనే ఉంది.

సొంత ప్రొడక్షన్ లో ఛలో సినిమాతో హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య డైరెక్టర్ సాయి శ్రీరామ్ తో సినిమా చేద్దామని రెడీ అయ్యాడు. ఈ సినిమాకు కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ అయ్యాక డైరెక్టర్ ఆ ప్రాజెక్టును వదిలేసి వేరే సినిమా పనిలో పడ్డాడు. నిన్ను వదిలి నేను పోలేనులే టైటిల్ తో నలుగురు హీరోయిన్లతో మొదలైన సినిమాకు సాయి శ్రీరామ్ డైరెక్షన్ చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్టుకు కూడా తరవాత అతడి ప్లేస్ లో సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ డైరెక్టర్ సీట్లోకి వచ్చాడు.

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...