యూట్యూబ్ ఛానల్ ను వాడేసిన నీహారిక | Nihaarika used by YouTube channel

Niharika-Happy-Wedding-Promotional-Video-Andhra-Talkies.jpg

యూట్యూబ్ ఛానల్ ను వాడేసిన నీహారిక | Nihaarika used by YouTube channel

చెప్పేది తిన్నగా చెబితే అంత బాగా ఎక్కదు. అందుకే.. కాస్త భిన్నంగా.. మరికాస్త వెరైటీగా చెబితే ఆ కిక్కే వేరు. తాజాగా అలాంటి పనే చేసింది హ్యాపీ వెడ్డింగ్ టీమ్. ట్రైలర్ రిలీజ్ ను అందరి మాదిరి చేస్తే మజా ఏముంటుంది?  వైరల్ ఎందుకు అవుతుంది?  అందుకే.. రోటీన్ కు భిన్నంగా చేద్దామనుకున్న చిత్రబృందం.. ట్రైలర్ రిలీజ్ కు సంబంధించిన సమాచారాన్ని స్ప్రెడ్ అయ్యేలా చేయటం కోసం కట్ చేసిన ప్రమోషనల్ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నిహారిక చేత తిట్టించేసి.. ఆ వెంటనే సర్దుకునేలా చేస్తూ చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తోందా? మరింత క్లారిటీగా చెపుతాం. కారు దగ్గరకు వెళుతున్న నిహారిక ను మేడమ్.. మేడమ్ .. యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం.. మీ వెడ్డింగ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది?  దాని గురించి ఏమైనా చెబుతారా? అంటూ అమాయకంగా గొంతు వినిపిస్తుంది.

ఎన్టీఆర్ బయోపిక్ కు కొత్త చిక్కులు! | New implications for NTR biopic!

Nadendla-Bhaskara-Rao-Elder-Son-Issues-Notices-on-NTR-biopic-Andhra-Talkies.jpg

ఎన్టీఆర్ బయోపిక్ కు కొత్త చిక్కులు!

తెలుగు సినిమా మరువని నటుడు తెలుగు ప్రజలు మరవలేని నాయకుడు ఎన్టీఆర్. రెండింటా ఆయన సంచనలమే. ఆయన జీవితంలో ఎన్నో ట్విస్టులున్నాయి. అలాంటి సినిమాను బయోపిక్ తేవడం ఒక సాహసం అయితే దానికి బాలకృష్ణ శ్రీకారం చుట్టడం మరో విశేషం. భారీ అంచనాల నడుమ మొదలైన ఈ సినిమాకు తేజ తొలుత డైరెక్టరుగా వ్యవహరించారు. చాలా గ్రాండ్గా లాంచ్ అయింది ఈ సినిమా. కానీ దర్శకుడు మారడం ఈ సినిమాకు మరో సంచలనం. అయితే అనంతరం క్రిష్ ప్రాజెక్టు చేపట్టడంతో మళ్లీ షూటింగ్ సాఫీగా సాగడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.

ఎన్టీఆర్ బయోపిక్.. కొట్టిపారేశారు | NTR biopic has been dismissed

NTR-Biopic-Team-Condemns-Movie-in-Two-Parts-Andhra-Talkies.jpg

ఎన్టీఆర్ బయోపిక్.. కొట్టిపారేశారు | NTR biopic has been dismissed

సీనియర్ నందమూరి తారకరామారావు గారి జీవితాన్ని ఆయన తనయుడు బాలకృష్ణ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఇబ్బందుల తరువాత స్టార్ట్ చేసిన ఈ సినిమా వారానికో వార్తతో సంచలనం సృష్టిస్తోంది ఇంకా రెగ్యులర్ షూటింగ్ స్పీడ్ పెరగకముందే  రూమర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. కథపై ఎన్నో నెలలుగా కూర్చున్న తేజ సడన్ గా తప్పుకోవడం అందరికి షాక్ ఇచ్చింది.

ఇక మరో దర్శకుడు క్రిష్ సినిమా పగ్గాలు చేపట్టడంతో బాలయ్య ఊపిరి పీల్చుకున్నాడు. పనులు మొత్తం దర్శకుడి చేతిలోనే పెట్టేశాడు. కథ నుంచి నటీనటుల ఎంపిక విషయాల గురించి అన్ని క్రిష్ తన ఆధీనంలోనే జరిగేట్లు చూసుకుంటున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని దర్శకుడు క్రిష్ కథను పొడిగించాడని టాక్ వచ్చింది. అయితే చిత్ర యూనిట్ వాటిని కొట్టిపారేసింది.

మాళవిక.. ఇలా అయ్యిందేంటి? | What is this Malavika?

Malavika-Nair-At-Kalyan-Dhev-Vijetha-Audio-Launch-Andhra-Talkies.jpg

మాళవిక.. ఇలా అయ్యిందేంటి? | What is this Malavika?

గ్లామర్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకోవాలని చాలా మంది హీరోయిన్స్ కు ఉంటుంది. అయితే అందాలు విచ్చల విడిగా ఆరబోసినంత మాత్రాన ఆ ఇమేజ్ రాదు. సింపుల్ గా కనిపించినప్పటికీ గ్లామర్ గర్ల్ అని కొన్ని సార్లు నేమ్ వస్తుంది. ప్రస్తుతం సౌత్ లో గ్లామర్ గర్ల్స్ చాలా మంది ఉన్నారు. అయితే కొందరు అటు వైపు ఎక్కువగా వెళ్లడం లేదు. సింపుల్ గా కనిపించి నటనతో అవకాశాలను అందుకుంటున్నారు.

ఇకపోతే రీసెంట్ గా మాళవిక నాయర్ గ్లామర్ టచ్ ఇవ్వాలని అనుకుందో ఏమో గాని ఆమె వచ్చిన తీరుకు అందరూ షాక్ అయ్యారు. శారీ లో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. అమ్మడు కళ్యాణ్ దేవ్ - విజేత సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.రీసెంట్ గా జరిగిన ఆడియో రిలీజ్ వేడుకకు మాళవిక చాలా డిఫెరెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. చీరను చూటుకోవడంలో కొత్త తరహా స్టైల్ ని ఫాలో అయ్యి చివరికి కామెడీ అయ్యేలా చేసుకుంది.

బ్యాంకాక్ లో సాహో బ్యూటి రచ్చ | Sahu Beauti Racha in Bangkok

Shraddha-Kapoor-At-IIFA-2018-Andhra-Talkies.jpg

బ్యాంకాక్ లో సాహో బ్యూటి రచ్చ | Sahu Beauti Racha in Bangkok

నార్మల్ గా బయటకు వెలితేనే ఫ్యాషన్ వరల్డ్ లో ఉండే బ్యూటీల డ్రెస్సింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక సినీ వరల్డ్ లో ఉండే హీరోయిన్స్ కూడా అందరిని ఆకట్టుకునేలా రేడి అయ్యి వస్తారు. ఇక సినీమాకు సంబంధించిన వేడుకలు జరిగితే స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాలో ఎలా కనిపించినా కొన్ని సార్లు నార్మల్ గానే అనిపించే తారలు రియల్ లైఫ్ లో మాత్రం కొన్నిసార్లు డ్రెస్సింగ్ స్టైల్ లో షాక్ కి గురిచేస్తారు.

ఇకపోతే రీసెంట్ గా బ్యాంకాక్ లో 2018 ఐఫా అవార్డ్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలీవుడ్ లో ప్రముఖ తారాగణం మొత్తం వేడుకలో పాల్గొంది. అయితే ఈ సెలబ్రేషన్స్ లో ప్రతి ఒక్క హీరోయిన్ హాట్ అండ్ సెక్సీ లుక్స్ తో దర్శనమిచ్చారు. అయితే హాట్ బ్యూటీలు ఎంత మంది వచ్చినప్పటికీ అందరిని ఎక్కువగా ఆకర్షించింది మంత్రం సాహో బ్యూటీనే. శ్రద్దా కపూర్ స్పెషల్ గా  పింక్ కలర్ శాటిన్ గౌన్ లో తన అందాలను సరికొత్తగా ప్రజెంట్ చేసింది. నార్మల్ గా ఉంటేనే అమ్మడు తన అందాలతో కుర్రకారును కవ్విస్తుంది. ఇక ఇలాంటి హాట్ క్లివేజ్ షోతో పింక్ డ్రెస్ లో రచ్చ చేసేసరికి వేడుకలో అందరి కళ్ళు ఆమె వైపే తిరిగాయి.

రెండో పెళ్లిపై రియాక్ట్ అయిన రేణూ! | Renu react on second marriage!

Renu-Desai-Responds-on-her-Engagement-Andhra-Talkies.jpg

రెండో పెళ్లిపై రియాక్ట్ అయిన రేణూ! | Renu react on second marriage!

పవన్ మాజీ భార్య ట్యాగ్ ఎంత భారమైందో రేణూకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో. ఓపక్క తనతో తెగ తెంపులయ్యాక.. తనదైన జీవితాన్ని పవన్ జీవిస్తుంటే.. రేణూను మాత్రం గతం వెంటాడుతూ ఉండటం తెలిసిందే. పవన్ తో విడిపోయి.. ఆయనకు మరో పెళ్లి జరిగిపోయిన తర్వాత కూడా పెళ్లి వద్దంటూ.. ఒక్కరిగానే ఉండాలంటూ చెప్పే వారు తక్కువే కాదు.

సింగిల్ మదర్కు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనుభవించే వారికి తెలుస్తాయి కానీ.. మామూలోళ్లకు ఓ పట్టాన అర్థం కావు. సింగిల్ మదర్ గా ఉండటం ఎన్ని తిప్పలో తాను స్వయంగా అనుభవించిన తర్వాతే రేణూ.. మరో తోడు అవసరమని ఫిక్స్ అయ్యారు. అదే విషయాన్ని ఓపెన్ గా చెప్పటం.. దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏమైనా.. తనను విపరీతంగా అభిమానించే అభిమానుల్ని హర్ట్ చేయకుండా ఉండేందుకు రేణూ పడే తపన ఎంతన్నది ఆమె పోస్టులు చూస్తే ఇట్టే అర్థమైపోతాయి.

బిగ్ బాస్ షో చిక్కుల్లో పడింది

Kamal-Haasan-Bigg-Boss-Tamil-2-into-trouble-Andhra-Telugu-Telugu.jpg

బిగ్ బాస్ షో చిక్కుల్లో పడింది

పోయినేడాది ముందుగా తమిళ ‘బిగ్ బాస్’ షో మొదలైన కొన్ని రోజులకు తెలుగు ‘బిగ్ బాస్’ మొదలైంది. ఈసారి ముందు తెలుగు ‘బిగ్ బాస్’ మొదలైతే.. తమిళ షో కొన్ని రోజులు లేటుగా ఆరంభమైంది. తెలుగు షోతో పోలిస్తే తమిళ ‘బిగ్ బాస్’ చాలా వివాదాలకు దారి తీసింది. ఒవియా ఉదంతం ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. ఈసారి కూడా కూడా తమిళ ‘బిగ్ బాస్’ ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘ఖుషీ’ భామ ముంతాజ్ లాంటి హాట్ బాంబ్ ఈసారి షోలో పాల్గొంటుండటం అక్కడి జనాల్లో క్యూరియాసిటీ తెస్తోంది. ఐతే ఈ షో ఆరంభంలోనే ఒక వివాదంలో చిక్కుకుంది. ఈ షో విషయంలో ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సి) అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళ ‘బిగ్ బాస్’ షో కోసం 70 శాతం మంది ముంబయి వాళ్లే పని చేస్తున్నారని ఆ సంస్థ ఆరోపించింది.

సెట్ అవుతుందా చైతూ

Naga-Chaitanya-as-ANR-in-NTR-Biopic-Andhra-Talkies-Telugu.jpg

సెట్ అవుతుందా చైతూ

మహానటి బయోపిక్ లో తాత ఎఎన్ఆర్ వేషం అనగానే నాగ చైతన్య చాలా ఆశించి ఉంటాడు కాని తన వరకు అంతగా వర్క్ అవుట్ కాలేదన్నది నిజం. సావిత్రి గారి ట్రాన్స్ లో పడిపోయిన ప్రేక్షకులు మిగిలిన ఏ పాత్రను అంతగా పట్టించుకోలేదు. దానికి తోడు చైతు చేసింది కూడా నాలుగైదు చిన్న సీన్లే కాబట్టి తాతగారి పాత్రలో మనవడిగా మెప్పించాడా లేదా అనే విషయం పెద్దగా చర్చకు రాలేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు మరోసారి ఎఎన్ ఆర్ లా నటించాలనే ప్రతిపాదన నాగ చైతన్య వద్దకు వచ్చిందట. బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కోసం ప్రపోజల్ వచ్చినట్టు టాక్.

బిగ్ బాస్ 'మసాలా' వెనుక మతలబు ఇదేనా? | Is this a big boss behind 'Masala'?

Madhavi-Latha-Sensational-Allegations-on-Bigg-Boss-2-Andhra-Talkies

బిగ్ బాస్ 'మసాలా' వెనుక మతలబు ఇదేనా? | Is this a big boss behind 'Masala'?

కొంతకాలంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో  క్యాస్టింగ్ కౌచ్ అనే పదం మార్మోగిపోతోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై రేగిన పెనుదుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణిగింది. ఇలా భావిస్తున్న తరుణంలో చికాగో సెక్స్ రాకెట్ రూపంలో మరోసారి టాలీవుడ్ - దక్షిణాది - తెలుగు నటీమణుల పేర్లు వార్తల్లోకెక్కాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆరోపిస్తూ ఓ తెలుగు టీవీ చానెల్ సంచలన కథనాన్ని వెలువరించింది. బిగ్ బాస్ కోర్ కమిటీ(సెలక్షన్) సభ్యుడి నుంచి నటి మాధవీలతకు ఆఫర్ వచ్చిందని అయితే `కమిట్ మెంట్ ` ఇస్తేనే అవకాశం దక్కుతుందని తెలపడంతో ఆమె తప్పుకుందని ఆ కథనంలో వెల్లడించింది. నటి మాధవీ లత కూడా ఆ చానెల్ లైవ్ షోలో ఆ ఫోన్ కాల్ తాలూకు విషయాలను వెల్లడించడం సంచలనం రేపింది. మాధవీలతో లైవ్ షో వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పెద్ద వివాదాలకు తావు లేకుండానే బిగ్ బాస్ -1 ను జూనియర్ ఎన్టీఆర్ రక్తి కట్టించి గ్రాండ్ సక్సెస్ చేశాడు. అయితే బిగ్ బాస్  సీజన్ -2 లో ఇంకొంచెం మసాలా ఉంటుందని ట్రైలర్ లోనే బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పేశారు. అయితే ఇప్పటి వరకు చూసిన బిగ్ బాస్ లో ఓ మోస్తరుగా మసాలా పాళ్లు కనిపించాయి. అయితే ముందు ముందు ఇంకా మసాలా పాళ్లు పెరగబోతున్నాయని ఆ చానెల్ కథనంలో వెల్లడించారు. ఆ  చానెల్ లైవ్ డిబేట్ లో పాల్గొన్న మాధవీ లత  అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనకు బిగ్ బాస్ కోర్ కమిటీ(సెలక్షన్) సభ్యుడి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ఆమె తెలిపింది. అయితే ఆ సభ్యుడు మాట్లాడిన తీరు తనకు ఎంతమాత్రం నచ్చకపోవడంతో తాను ఆ షోలో పాల్గొనలేదని చెప్పింది. బిగ్ బాస్ లో పాల్గొనాలంటే ముందుగా `కమిట్ మెంట్`(క్యాస్టింగ్ కౌచ్) ఇవ్వాలన్న విధంగా ఆ సభ్యుడు మాట్లాడాడట. బిగ్ బాస్ -2 సెక్సీగా - రొమాంటిక్ గా....ఉండబోతోందని...కొంచె మసాలా ఎక్కువని...చిన్న చిన్న బట్టలతో ఎక్స్ పోజ్ చేయాలని సదరు సభ్యుడు మాధవీలతతో అన్నాడట. వీపు బొడ్డు చూపించేలా డ్రెస్ లు వేసుకోవడం - షార్ట్స్ వేసుకోవడం ఇష్టమేనా అని అడిగారని....ఈ షోలో పాల్గొనాలని.....ఎంజాయ్ అండ్ హ్యావ్ ఫన్ అని మాధవీ లతతో ఆ సభ్యుడు చెప్పాడట.

తెలుగు అమ్మాయితో విశాల్ పెళ్లి..! | Vishal's wedding with Telugu girl | Andhra Talkies

Vishal-To-Marry-Telugu-Girl-Andhra-Talkies-45254545.jpg

తెలుగు అమ్మాయితో విశాల్ పెళ్లి..! | Vishal's wedding with Telugu girl | Andhra Talkies

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యాచ్ లర్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. తెలుగులో ప్రభాస్ లానే తమిళంలో స్టార్ హీరో అయిన విశాల్ కూడా తన పెళ్లిని ఎప్పటికప్పుడూ వాయిదా వేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. శరత్ కుమార్ కూతురితో ప్రేమ పెటాకులు అయ్యాక ఈ హీరో పెళ్లి చేసుకోవడానికి వెనుకాడుతున్నాడన్నది కోలీవుడ్ టాక్..

అయితే తాజాగా 40 ఏళ్లు ఉన్న విశాల్ ఓ తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త కోలీవుడ్ లో వైరల్ అయ్యింది. చైన్నైలో పుట్టి పెరిగిన విశాల్ స్వస్థలం తిరుపతి జిల్లానే. వాళ్ల నాన్న - తాతలు తెలుగువారే..

తాజాగా విశాఖపట్నంలో పర్యటించిన విశాల్ ను పెళ్లిపై ప్రశ్నించింది తెలుగు మీడియా. అయితే కాలమే నా పెళ్లి చేయాలని వేదాంతం చెప్పి తప్పించుకున్నాడు విశాల్.  అభిమన్యుడు తెలుగులో హిట్ కొట్టిన విశాల్ ఇప్పుడు తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త ఎంత వరకూ నిజమో చూడాలి మరి..

బాబు గోగినేనిని ఉతికారేసింది

Sanjana-Anne-Fires-on-Babu-Gogineni-Andhra-Talkies.jpg

బాబు గోగినేనిని ఉతికారేసింది

‘బిగ్ బాస్’ రెండో సీజన్ నుంచి మొదటగా ఎలిమినేట్ అయిన సంజన.. షోలో మరో పార్టిసిపెంట్ అయిన బాబు గోగినేనిపై విరుచుకుపడింది. హౌస్ లో ఉండగానే ఆయన్ని టార్గెట్ చేసుకున్న సంజన.. ఎలిమినేట్ అయినపుడు కూడా ఆయన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. బాబు అందరూ అనుకున్నంత మంచి వాడు కాదని ఆమె ఆమె పేర్కొంది. వెళ్తూ వెళ్తూ బాంబు వేసింది కూడా బాబు మీదే. ఇక బయటికొచ్చాక టీవీ ఛానెళ్ల చర్చల్లో పాల్గొంటున్న సంజన.. అక్కడ కూడా బాబు గోగినేనినే లక్ష్యంగా చేసుకుంది. ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

బాబు పైకి కనిపించేంత మంచి వ్యక్తి కాదని.. ఆయనలో జనాలకు తెలియని మరో కోణం ఉందని ఆమె అంది.బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడు బాబు తనతో దారుణంగా వ్యవహరించారని ఆమె అంది. షోలో భాగంగా తొలి రోజు తాను జైల్లోకి వెళ్లినపుడు ఆ రోజు రాత్రి నన్ను బయటకు తీసుకురావాలని ఇంటి సభ్యులంతా భావించారని.. కానీ బాబు మాత్రం సంజన వద్ద.. నూతన్ నాయుడును బయటకు తీసుకురావాలని చెప్పారని సంజన వెల్లడించింది. ఒక ఆడపిల్ల జైల్లో ఉంటే బాబు ఇంత దారుణంగా ప్రవర్తించారని.. తన కూతురైతే ఆయన ఇలాగే చేసేవాడా అని ఆమె ప్రశ్నించింది. మహిళ అనే జాలి తన మీద ఆయన చూపించలేదని అంది. బాబు డబ్బు మనిషే అని.. ఆయన డబ్బులు తీసుకునే ఈ షోకు వచ్చారని ఆమె చెప్పింది. డబ్బు కోసమే హౌస్ లో డాన్సులు చేస్తున్నారని.. రాజకీయం చేస్తున్నారని.. జనాల్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నమూ చేస్తున్నారని ఆమె విమర్శించింది. విలువలు పోగొట్టుకోకూడదు.. ఫైట్ చేయాలని అంటున్న బాబూనే విలువలు కోల్పోయారని అంది.

బిగ్ బాస్-2పై కత్తి కుండబద్దలు కొట్టాడు | Andhra Talkies

Kathi-Mahesh-Opens-Up-On-Bigg-Boss-2-Andhra-Talkies-4564545748.jpg

బిగ్ బాస్-2పై కత్తి కుండబద్దలు కొట్టాడు

‘బిగ్ బాస్’ రెండో సీజన్ మీద ముందు నుంచి ఉన్న సందేహాలకు తగ్గట్లే ఈసారి షో ఏమంత ఆసక్తికరంగా సాగట్లేదు. ఎన్టీఆర్ స్థానంలోకి నాని రావడం కొంత మేర ఈ షో మీద ఆసక్తి తగ్గించగా.. ఈసారి పార్టిసిపెంట్లు అనుకున్న స్థాయిలో లేరు. దీనికి తోడు బిగ్ బాస్ హౌస్ లోపల జరుగుతున్న వ్యవహారాలు విసుగు తెప్పిస్తున్నాయి. చిరాకు పుట్టిస్తున్నాయి. షో మీద కొంత మేర నెగెటివ్ ఫీలింగ్ కలిగిస్తున్నాయి. ఈ విషయంలో గత ఏడాది పార్టిసిపెంట్ అయిన మహేష్ కత్తి సైతం కుండబద్దలు కొట్టేశాడు. ఈ ఏడాది ‘బిగ్ బాస్’ విషయంలో జనాల్లో ఎక్కువ నెగెటివిటీ కనిపిస్తోందంటూ కత్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగని తొలి వారం ఎలిమినేట్ అయిన సంజన అంటున్నట్లుగా ‘బిగ్ బాస్’లో కుట్రలు కుతంత్రాలు ఏమీ ఉండవని కత్తి అభిప్రాయపడ్డాడు.

యానిమేషన్ చిత్రం సరికొత్త రికార్డ్ | The newest record of the animated film | Andhra Talkies

Incredibles-Box-Office--Disney-Sequel-Lands-Record--180M-Debut-Andhra-Talkies-1234561.jpg

యానిమేషన్ చిత్రం సరికొత్త రికార్డ్ | The newest record of the animated film | Andhra Talkies

యానిమేషన్ సినిమాలకు ఉండే ఆదరణ గత కొంత కాలంగా ఎక్కువవుతోంది. కంప్యూటర్ మాయాజాలంతో కట్టిపడేసే యానిమేషన్ చిత్రాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎమోషన్ ని కూడా యాడ్ చేసి కన్నీళ్లు తెప్పించగలరు. హాలీవుడ్ లో చాలా వరకు యానిమేషన్ చిత్రాలకు అత్యధిక వసూళ్లు అందుతున్నాయి. ఇటీవల వచ్చిన ఇన్ క్రెడిబుల్స్ 2 అయితే ప్రపంచ బాక్స్ ఆఫీస్ లలో ఒకటిగా నిలిచింది. 

ఇప్పటివరకు రిలీజ్ అయిన యానిమేషన్ లలో ఈ సినిమానే అత్యధిక వేగంగా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఈ సూపర్ హీరో ఫిల్మ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. 4410 లొకేషన్స్ లలో రిలీజ్ అయ్యి అన్ని సినిమాలకంటే ఎక్కువ వేగంగా $185 మిళియన్స్ కొల్లగొట్టింది. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ - పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాయి. బ్రాడ్ బర్డ్ సినిమాకు దర్శకత్వం వహించారు. 2016 లో పిక్సల్ వారి  సీక్వెల్ ఫైండింగ్ డోరీ 135 మిలియన్ డాలర్లను ఫాస్ట్ గా అందుకుంది. 

100 కోట్లు.. ఏకంగా 13 సార్లు కొట్టాడు | 100 crores .. hit 13 times | Andhra Talkies

Salman-kHan-13-Times-Enters-in-100-Crores-Club-Andhra-Talkies.jpg

100 కోట్లు.. ఏకంగా 13 సార్లు కొట్టాడు | 100 crores .. hit 13 times | Andhra Talkies

ఈ రోజుల్లో బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల మార్కెట్ చాలా పెరుగుతోంది. సినిమా సినిమాకు లెక్కల్లో ఎదో విధంగా మార్పు వస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా స్టార్ హీరోలు మినిమమ్ 100 కోట్లు వసులు చేయడం పక్కా  అనేస్తున్నారు. ప్రస్తుతం ఖాన్ ల హవా గట్టిగా నడుస్తోంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ అయితే ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తూ 100 కోట్లను చాలా స్పీడ్ గా అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

రీసెంట్ గా రిలీజ్ అయిన రేస్ 3 సినిమా కూడా చాలా స్పీడ్ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అదికూడా ఫస్ట్ వీక్ లో.. మొదటి వారంలోనే వంద కోట్లు కొల్లగొట్టి తన స్టార్ స్టామినాను చూపించాడు. గతంలో చేసిన బజరంగీ భాయిజాన్ - సుల్తాన్ -  టైగర్ జిందా హహై కూడా తొలి మూడు రోజుల్లో వంద కోట్ల వసూళ్లను అందుకున్నాయి. ఇక ఇప్పుడు రేస్ 3 కూడా ఆ లిస్టులో చేరిపోయింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వరుసగా 13 సార్లు 100 కోట్లు కొల్లగొట్టిన హీరోగా కూడా కండల వీరుడు రికార్డ్ సృష్టించాడు. 

ల్యాబ్ ముందు శిల్పా.. రూమర్లే రూమర్లు | Shilpa-Shetty-was-recently-spotted-outside-a-diagnostic-centre-Andhra-Talkies

Shilpa-Shetty-was-recently-spotted-outside-a-diagnostic-centre-Andhra-Talkies

ల్యాబ్ ముందు శిల్పా.. రూమర్లే రూమర్లు | Shilpa-Shetty-was-recently-spotted-outside-a-diagnostic-centre-Andhra-Talkies

సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాలపై జనాలకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. వాళ్లకు సంబంధించి ఏ చిన్న విషయమైనా వార్తగా మారిపోతుంది. సెలబ్రెటీలు బయట ఎక్కడ కనిపించినా.. ఏం చేస్తున్నా జనాలు ఒక కన్నేసి ఉంచుతారు కాబట్టి వారి చర్యల్ని బట్టి రకరకాల అంచనాలకు వచ్చేస్తుంటారు. ఏవో పుకార్లు పుట్టించి ప్రచారం చేసేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ మాజీ హీరోయిన్ శిల్పా శెట్టి విషయంలో ఇలాంటి ప్రచారమే ఒకటి మొదలైంది.

శిల్పా ఒక డయాగ్నస్టిక్స్ సెంటర్ నుంచి రిపోర్టులతో బయటికి వస్తున్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక అభిమాని.. ‘‘శిల్పా చేతిలో రిపోర్ట్స్ పట్టుకుని టెస్ట్ ల్యాబ్ సెంటర్ నుంచి బయటికి రావడం చూశాను. ఏదైనా అద్భుతమా’’ అని ట్వీట్ చేశాడు. దీంతో దీని మీద పెద్ద డిస్కషన్లు మొదలైపోయాయి. శిల్పా మళ్లీ తల్లి కాబోతోందంటూ ప్రచారం జరిగిపోయింది. కొందరేమో ఏమైంది శిల్పా అంటూ ఆమెను ట్యాగ్ చేసి ఆరాలు తీయడం మొదలు పెట్టారు.

నానీని ఆడుకుంటున్న శ్రీరెడ్డి | Sri-Reddy-Tries-To-Troll-Nani-Andhra-Talkies

Sri-Reddy-Tries-To-Troll-Nani-Andhra-Talkies

నానీని ఆడుకుంటున్న శ్రీరెడ్డి | Sri-Reddy-Tries-To-Troll-Nani-Andhra-Talkies

అసలే ‘బిగ్ బాస్’ రెండో సీజన్కు ముందు అనుకున్నంత బజ్ లేదు. దీనికి తోడు షో ఫస్ట్ వీక్ రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. నాని షోను హోస్ట్ చేస్తున్న తీరు మీద ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. తారక్ తో ఇతడిని పోల్చడం ద్వారా గాలి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి శ్రీరెడ్డి చెలరేగిపోతోంది. నానిని సోషల్ మీడియాలో ఆడుకుంటోంది. ఇన్నాళ్లూ వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి.. ఇప్పుడు ‘బిగ్ బాస్’లో నాని పెర్ఫామెన్స్ పై విమర్శలు గుప్పిస్తోంది. తమకు తారకే బిగ్ బాస్ హోస్ట్ గా కావాలంటూ అతడి అభిమానులు మొదలుపెట్టిన క్యాంపైనింగ్ ను చూపిస్తూ నాని గాలి తీసే ప్రయత్నం చేస్తోంది శ్రీరెడ్డి. ఈ విషయమై ట్విట్టర్లో శ్రీరెడ్డి పెట్టిన మెసేజ్ వైరల్ అవుతోంది.

సెక్స్ రాకెట్ లో ఐదుగురు హీరోయిన్లపై కేసు! | Case for five heroines in sex racket

Case for five heroines in sex racket

సెక్స్ రాకెట్ లో ఐదుగురు హీరోయిన్లపై కేసు! | Case for five heroines in sex racket

అమెరికాలో టాలీవుడ్ హీరోయిన్లతో మోదుగుమూడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ - చంద్రకళ దంపతులు నడుపుతోన్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టయిన సంగతి తెలిసిందే. తనను బెదిరించి తనతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని....ఓ నటి ఇచ్చిణ ఫిర్యాదుతో ఈ సెక్స్ రాకెట్ బట్టబయలైంది. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫెడరల్ ఏజెన్సీ అధికారులు కిషన్ - చంద్రకళలను అరెస్టు చేశారు. అయితే ఈ సెక్స్ రాకెట్ లో దక్షిణాదికి చెందిన 5గురు హీరోయిన్లు అప్రూవర్లుగా మారినట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్లను ఎఫ్ బీఐ అధికారులు దాదాపు 6గంటలపాటు ప్ర ప్రశ్నించగా వారు ఆ సెక్స్ రాకెట్ గురించి సంచలన విషయాలు వెల్లడించారని తెలుస్తోంది. బెంగళూరు - చెన్నైకు చెందిన ఇద్దరు బడా హీరోయిన్లు - ఫ్లాప్ అయిన ద్విభాషా చిత్రంలో నటించిన ఓ హీరోయిన్ - తాజాగా పాలిటిక్స్ లో చేరిన చిన్న నటి - కొన్ని తెలుగు బ్లాక్ బస్టర్స్ హిట్స్ లో నటించిన కన్నడ నటి - పలు సినిమాల్లో నటించినా సక్సెస్ కాని మరో హీరోయిన్ ఉన్నట్లు తెలుస్తోంది. కిషన్ అకృత్యాలను వారు పోలీసులకు వెల్లడించారని తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కు తోడు దొరికిందా..? | Power star Pawan Kalyan has been linked with former wife Renu Desai.

Power star Pawan Kalyan has been linked with former wife Renu Desai
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో  చేసిన వ్యాఖ్యలు  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ కామెంట్స్ చూశాక ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు అర్థమవుతోంది.  శనివారం రేణుదేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటోను పోస్టు చేసింది. ఓ వ్యక్తి చేయి పట్టుకొని దిగిన ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఆ వ్యక్తి గురించి వివరిస్తూ ఓ కవితను కూడా రేణుదేశాయ్ పోస్టు చేయడంతో సంచలనమైంది.

అయితే రేణుదేశాయ్ చేయిపట్టుకున్న వ్యక్తి ఎవరనేది ఆమె బయటపెట్టలేదు. కేవలం అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కవితరూపంలో వెల్లడించి ఆశ్చర్యపరిచింది.. రేణు దేశాయ్ రాసుకొస్తూ ‘ప్రేమ కోసం నేను ఎక్కడెక్కడో వెతికాను. కవితలోనే అది దొరుకుతుందని భావించాను. కొన్ని సార్లు క్యాండిలైట్ డిన్నర్లు - మరికొన్నిసార్లు తీపి అబద్దాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి’ అంటూ రేణు కవితాత్మకంగా చెప్పింది.

దాంతోపాటు ‘నీ నిజాయితీ - నీ మాటల్లో నాకు ప్రేమ దొరికింది. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ వదిలి వెళ్లకు. నాలో నువ్వు ఆ నమ్మకాన్ని కల్పించావు’ అంటూ కవితను ముగించారు. దీంతో రేణు కు వ్యక్తి తోడు దొరికిందని.. అతడి గురించే ఆమె కవితలో చెప్పారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంలో ఆమె నేను రెండో పెళ్లి చేసుకుంటానని ప్రకటించినప్పుడు పవన్ అభిమానులు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పవన్ భార్య రెండో పెళ్లి చేసుకోవడం తమకి ఇష్టం లేదని ఆమె మాకు వదిన అంటూ చెప్పుకొచ్చారు. దీనితో పవన్ అభిమానుల దుర్మార్గపు ఆలోచనలకు ఆమె గట్టిగానే సోషల్ మీడియా సాక్షిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. మరికొంత మందైతే విడాకుల పేరుతొ చేసుకున్న ప్రతి భార్యను ఎంజాయ్ చేసి వదిలేస్తున్న పవన్ కు విలువ ఇవ్వాల్సిన పని లేదని రేణు దేశాయ్ సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చని ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు.

Resident Evil Telugu dubbed movie series ను Free గా Download చేసుకోండి.

Resident Evil Telugu dubbed movie series

Resident Evil Telugu dubbed movie series ను Free గా  Download చేసుకోండి.

అంబ్రిల్లా అనే పరిశోధనా సంస్థ T పేరు గల భయంకరమైన వైరస్ ను కనిపెడుతుంది. కొంతమంది స్వార్ధపరుల వలన అది ప్రయోగించబడి ఆ ప్రయోగ శాలలోని వారందరూ మనుషులను పీక్కుతినే నరరూప రాక్షసులుగా మారిపోతారు. అందులో వైరస్ సోకని మరికొంతమది వారి బారి నుండి తప్పించుకోవడమే ప్రధానాంశంగా సినిమాలన్నీ ఉంటాయి. అయితే ఆ T వైరస్ కేవలం ఆ పరిశోధనా సంస్థ కే పరిమితం కాకుండా మొత్తం నగరాలకు వ్యాపిస్తుంది. ప్రజలను ఆవైరస్ బారి నుండి ఎలా కాపాడాలి? ఆ వైరస్ సోకిన వారినందరినీ ఎలా మట్టు పెట్టాలి? అనేదే చివరి రెండు భాగాల ప్రధానాంశం. చూడడానికి చాలా ఇంటరెస్ట్ కలిగిస్తాయి. ఈ ఐదు సినిమాలు మంచి Full HD ఖ్వాలిటీతో లభిస్తాయి. మీకు ఇంట్రస్ట్ ఉంటే క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Click Here : Resident Evil Telugu dubbed movie series

నాని మసాలా ఎంత వేశాడో... | How much did my nanny spice ...

నాని మసాలా ఎంత వేశాడో... | How much did my nanny spice ...

నాని మసాలా ఎంత వేశాడో... | How much did my nanny spice ...

తెలుగు టీవీలో అతి పెద్ద గేమ్ షో.. ఫస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు ప్రేక్షకులకు ఈ షో కాన్సెప్ట్ గురించి తెలిసింది తక్కువే. అందుకే స్టార్ మా ఛానల్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ను హోస్ట్ గా తీసుకుంది. ఎన్టీఆర్ హోస్టింగ్ ఈ షోకు సూపర్బ్ గా ప్లస్ అయింది. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేయడంతో ఈ షోకు మంచి రేటింగ్స్ వచ్చాయి.

బిగ్ బాస్ సీజన్ -2కు ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానంలోకి నాచురల్ స్టార్ నాని వచ్చాడు. ఈసారి ఇంకాస్త మసాలా అంటూ నాని ప్రోమోల్లో బాగానే ఆకట్టుకున్నాడు. నాని ఫస్ట్ లుక్ నుంచే ఎన్టీఆర్ తో పోల్చి చూస్తున్న జనాలు షోను ఎలా డీల్ చేస్తాడా అన్నదానిపై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఎన్టీఆర్ లాగే రియల్ లైఫ్ లోనూ చలాకీగా ఉండటం గ్యారంటీగా నానికి ప్లస్ పాయింటే. ఈ రకంగా నానికి హోస్టింగ్ పరంగా పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు. అయితే షోను రక్తి కట్టించడం అనేది పూర్తిగా అతడి టాలెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. జూన్ 10 నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఇందులో నాని ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది ఇంకాసేపట్లో తేలిపోతుంది.

మొదటి సీజన్ 70 రోజులు ఉండగా బిగ్ బాస్-2 వంద రోజుల పాటు కొనసాగనుంది. అందుకే నాని ఎక్కువ కాల్ షీట్లే ఈ షో కోసం కేటాయించాడు. ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీలో నాని హీరోగా నటిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది తప్ప మరోసినిమా ఏదీ కమిట్ అవలేదు. బిగ్ బాస్-2 అయిన తరవాతే నాని నెక్స్ట్ సినిమాకు ఓకే చెప్పే అవకాశం ఉంది.

సాగరకన్య బర్త్ డే సంబరాలు చూశారా | Have you seen the Sagara kanya of the birthday celebrations?

సాగరకన్య బర్త్ డే సంబరాలు చూశారా | Have you seen the Sagara kanya of the birthday celebrations?

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి సినిమాలకు వీడ్కోలు చెప్పి నాలుగేళ్లు అవుతున్నా ఇంకా జనాలకు టచ్ లోనే ఉంది. టాలీవుడ్ జనాలకు కూడా ఈ బ్యూటీ పరిచయమే. కె.రాఘవేంద్ర రావు - వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సాహస వీరుడు సాగర కన్య సినిమాలో జలకన్య గా కనిపించి అందరిని ఆకర్షించింది. ఆ సినిమా తరువాతే శిల్పా బాలీవుడ్ మరిన్ని మంచి అవకాశాలు అందుకుంది.

ఇకపోతే అమ్మడు ఇటీవల తన 43వ పుట్టినరోజును జరుపుకుంది. తన కుటుంబ సభ్యుల సమక్షంలో భర్త రాజ్ కుంద్రా సెట్ చేసిన స్పెషల్ కేక్ ను కట్ చేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంది. కేక్ లో శిల్పా బొమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాన్ని  వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. శిల్పా పుట్టిన రోజు సందర్బంగా ఇతర సినీ తారలు కూడా వారి విషెస్ ను అందించారు. నెటిజన్స్ అయితే వివిధ రకాల ఫోటో ఎడిటింగ్ తో సీనియర్ నటికీ శుభాకాంక్షలు తెలిపారు. అది చూసి శిల్పా ఎంతో ఆనందపడింది. సూపర్ సూపర్ అంటూ భర్తను పొగిడేసింది. ఇక అభిమానులు కూడా ఆ వీడియో బావుంది అంటూ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.  

నిజానికి 43 ఏళ్ల వయసొచ్చాక కూడా అంత హాటుగా కనిపించడం అంటే శిల్పాకే చెందింది. అందుకే ఆమె చేసే యోగాలన్నా వాటి తాలూకు వీడియోలన్నా కూడా అభిమానులకు చాలా ఇష్టం.

బిగ్ బాస్ లిస్టు.. ఎగ్జైటింగ్ గా లేదే | Big boss list is not an exaggeration

Bigg-Boss-Telugu-2nd-Season-Participants-Andhra-Talkies-Telugu.jpg

బిగ్ బాస్ లిస్టు.. ఎగ్జైటింగ్ గా లేదే | Big boss list is not an exaggeration

అనేకానేక సందేహాలకు తెరదించుతూ గత ఏడాది తెలుగులోకి అరంగేట్రం చేసిన ‘బిగ్ బాస్’ షో అంచనాల్ని మించి విజయం సాధించింది. ఇటు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్.. అతడి వాక్చాతుర్యం.. మరోవైపు పార్టిసిపెంట్ల ఆకర్షణ కూడా తోడై షో బాగానే విజయవంతమైంది. మరి ఈసారి ‘బిగ్ బాస్’ సీజన్ ఎలా నడుస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హోస్టుగా ఎన్టీఆర్ స్థానంలోకి వచ్చిన నాని మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఐతే ఈసారి పార్టిసిపెంట్లు ఎవరు.. వాళ్లు ఏ మేరకు జనాల దృష్టిని ఏమేరకు ఆకర్షిస్తారా అని చూస్తున్నారు. ఐతే కొన్ని రోజులుగా పార్టిసిపెంట్ల విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తుండగా.. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. ఆదివారం బిగ్ బాస్-2 మొదలు కాబోతున్న నేపథ్యంలో పార్టిసిపెంట్ల లిస్టు బయటికి వచ్చింది. ఐతే ఈ లిస్టు ఏమంత ఎగ్జైటింగ్ గా లేదు. తొలి సీజన్ తో పోలిస్తే ఈసారి పార్టిసిపెంట్లలో ఆసక్తి రేకెత్తించేవాళ్లు తక్కువమందే.

సింగర్ గీతా మాధురి.. టీవీ 9 యాంకర్ దీప్తి.. హీరో తనీష్.. సోషల్ యాక్టివిస్ట్ బాబు గోగినేని.. యాంకర్ శ్యామల.. నటుడు సామ్రాట్.. నటి తేజస్వి.. వీళ్లు మాత్రమే జనాలకు పరిచయం ఉన్నవాళ్లు. కానీ వీరిలో జనాల్ని ఎగ్జైట్ చేసేవాళ్లు తక్కువమందే.వీళ్లు కాకుండా భాను.. రోల్ రిధా.. కృతి దామరాజు.. దీప్తి సునైనా.. కౌశల్.. అమిత్ తివారి.. గణేష్.. సంజన.. నూతన్ నాయుడు అనేవాళ్లు పార్టిసిపెంట్ల జాబితాలో ఉన్నారు. వీళ్లెవరూ జనాలకు పరిచయం లేని వాళ్లే. మరి ఈ జాబితా ఏమేరకు షో వైపు జనాల్ని ఆకర్షిస్తుందో.. వీళ్లతో నాని ఎలా నెట్టుకొస్తాడో.. షో ఏమంత ఆసక్తికరంగా నడుస్తుందో చూడాలి.

ఆయనలో అంత స్పెషాలిటీ ఏంటో | What is specialty in him?

Telugu-Film-Makers-Encourages-Jockey-Shroff-Andhra-Talkies-Telugu
బాలీవుడ్ యాక్టర్లను తెలుగులో నటింపచేయడం.. ఎప్పుడూ క్రేజీగానే ఉంటుంది. హీరోయిన్స్ మాత్రమే కాదు.. విలన్స్ - క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తెలుగులోకి వస్తుంటారు. బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ కి తమ నటనా చాతుర్యం చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ ను తెలుగు ఫిలిం మేకర్స్ తెగ ఆదరిస్తారు.

ఎందుకో తెలియదు కానీ.. ఈయన అంటే మనోళ్లు తెగ మక్కువ చూపిస్తూ ఉంటారు. ఈయన చేసినన్ని స్ట్రెయిట్ తెలుగు ఫిలిమ్స్.. మరే బాలీవుడ్ యాక్టర్ చేసి ఉండడు కూడా. ప్రస్తుతం ప్రభాస్ ప్రెస్టీజియస్ మూవీ సాహోలో నటిస్తున్న జాకీ ష్రాఫ్.. టాలీవుడ్ మూవీ ప్రస్థానం ను హిందీలో సంజయ్ దత్ తో రీమేక్ చేస్తుండగా.. అందులో కూడా నటించేందుకు ఎంపికయ్యాడు. ఇంతలేసి ఆఫర్స్ వచ్చేయడానికి ఈయనేమీ గోల్డెన్ హ్యాండ్ కాదు.. పైగా తెలుగు సినిమాలకు సంబంధించి ఈయనో పెద్ద ఐరన్ లెగ్గు కూడా.

మంచు విష్ణు అస్త్రం.. దాసరి అరుణ్ కుమార్ మూవీ బ్యాంక్.. బ్లాక్ అండ్ వైట్.. ఎన్టీఆర్ శక్తి.. పవన్ కళ్యాణ్ పంజా.. ఇవీ ఇప్పటివరకూ జాకీ ష్రాఫ్ కనిపించిన తెలుగు సినిమాలు. అన్నీ ఆయా హీరోల కెరీర్ లో అప్పటివరకూ బడా ఫ్లాపులే. ఒకట్రెండు ఫ్లాపులకే ఐరన్ లెగ్ ముద్ర వేసే టాలీవుడ్.. జాకీ ష్రాఫ్ విషయంలో మాత్రం మళ్లీ మళ్లీ ఎందుకు ఛాన్సులిస్తున్నారో.. ఆయనలో అంత స్పెషాలిటీ ఏంటో అర్ధం కాని విషయం.

బిగ్ బాస్ లో టివి9 న్యూస్ యాంకర్ | TV 9 News Anchor in Big Bass

TV 9 News Anchor in Big Bass
టాలీవుడ్ లో ప్రస్తుతం సినీ ప్రేక్షకులు మొత్తం బిగ్ బాస్ షోపైన కన్నేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. షో ఎలా నడుస్తోంది.. ఎన్ని రౌండ్లు ఉంటాయి. ఈ సారి స్పెషల్ ఏంటి? నాని తారక్ స్థాయిలో ఇరగదీస్తాడా? ఇలాంటి ప్రశ్నలు చాలానే వస్తున్నాయి. అయితే అన్నిటికంటే ఒకే ఒక్క సందేహం మాత్రం రెగ్యులర్ గా వైరల్ అవుతోంది. అది షో స్టార్ట్ అయ్యే వరకు ఎండ్ అవ్వదు.

ఇంతకు బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ఎవరు అనే ప్రశ్న టాలీవుడ్ లో బాగా ట్రెండ్ అవుతోంది. గూగుల్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా సెర్చ్ చేసిన వాటిల్లో అదే ఉందట. ఇక కొన్ని రూమర్స్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే. ఓ లిస్టు కూడా ఉంది. అయితే ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. గత ఏడాది న్యూస్ యాంకర్ ను తెచ్చినట్లు ఇప్పుడు మరొక యాంకర్ ను తెచ్చారు.

టివి9 యాంకర్ గా కొనసాగుతున్న దీప్తి నల్లమొత్తును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు తేజస్వి మధివాడ సింగర్ గీతా మాధురి దాదాపు ఫైనల్ అయినట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఈ యాంకర్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంటెస్టెంట్ కి సంబంధించిన లిస్ట్ ను చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నప్పటీకి ఎదో ఒక వార్తలో పేర్లు లీక్ అవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే షో స్టార్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే. అయితే సదరు యాంకర్ ను తన ఫేస్ బుక్ పేజీలో ఒక నెటిజన్ మీరు బిగ్ బాస్ లో కంటెస్ట్ చేస్తున్నారా అని అడిగితే.. ఆమె ఆ కామెంట్ కు లైక్ కొట్టింది. దానితో అందరూ నిజమనే అనుకుంటున్నారు. 

పవన్ చిత్తశుద్ధిపై జనంలో పెరుగుతున్న పలు అనుమానాలు | There are many suspicions in the public on Pawan's integrity

Andhra-People-Raises-Doubts-on-Pawan-Kalyan-Political-Tour-Andhra-Talkies-Telugu.jpg
చిరంజీవి అంటే తెలుగు రాష్ర్రాల్లో ఒకప్పుడు తిరుగులేని క్రేజ్. ఆ క్రేజ్ తోనే ఆయన పెట్టిన ప్రజారాజ్యం పార్టీపై జనం ఆశలు - అంచనాలు పెట్టుకున్నారు. చిరంజీవి కూడా బస్సులో రాష్ట్రమంతా తిరుగుతూ ఎక్కడికక్కడ ప్రజాసమస్యలను గుర్తిస్తూ.. అప్పటి పాలక - విపక్షాల అవినీతిని ప్రశ్నిస్తూ జనాన్ని ఆకట్టుకున్నారు. కానీ ఎన్నికలు వచ్చేసరికి.. పార్టీని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు. సినిమా టిక్కెట్లు బ్లాకులో అమ్మినట్లుగా పార్టీ తరఫున ఎమ్మెల్యే - ఎంపీ టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. దాంతో... ఎంతోమంది అనర్హులు ఆయన పార్టీ నుంచి పోటీకి నిలిచారు. అంతవరకు ఆయన దేన్నైతే వ్యతిరేకిస్తూ మాట్లాడారో.. దేన్నైతే ప్రశ్నించారో అదే తరహా నేతలను తన పార్టీ నుంచి చట్ట సభలకు పంపించడానికి నిర్ణయించడంతో జనం ఆయన పార్టీని తిరస్కరించారు. దాంతో చచ్చీచెడి 18 సీట్లు సాధించిన ఆయన ఆ తరువాత ఏకంగా పార్టీనే అమ్మకానికి పెట్టేశారు. దాంతో ప్రజారాజ్యం పార్టీ ప్రజలకు ఏమాత్రం మేలు చేయకపోగా చిరంజీవికి మాత్రం కేంద్రంలో మంత్రి పదవి దక్కింది. అన్నిరకాలుగా గిట్టుబాటయింది. విభజన సమయంలో పరిస్థితులు అనుకూలంగా లేవని వదులుకున్నాడు కానీ లేదంటే సీఎం పదవి కూడా ఆయనకు దక్కేది. మొత్తానికి చిరంజీవి - ఆయన పార్టీ ప్రజారాజ్యం రెండూ జనాలను - ఎంతోమంది నేతలను నిలువునా ముంచేసినట్లయింది.
   
ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ కల్యాన్ జనసేన పార్టీతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఆయన మాటలూ.. రాజకీయ లక్ష్యాలు అన్నీ ప్రజారాజ్యం నాటి రోజులే గుర్తుకు తెస్తున్నాయి. ఏ జిల్లాకు వెళ్తే అక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్నారు. అక్కడి ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తున్నారు. అంతా.. ప్రజారాజ్యం తరహాలోనే ఒకింత డ్రామాతో సాగుతోంది. కానీ.. ప్రజామోదం ఉన్న - ప్రజాపక్షపాతం ఉన్న నేతలెవరూ ఆయన వెంట కనిపించడం లేదు. అంతా... రాజకీయ లక్ష్యాలున్నవారు.. ఇప్పుడున్న పార్టీల్లో సీట్లు దొరికే అవకాశాల్లేనివారు. బడాబడా కేండిడేట్లే దర్శనమిస్తున్నారు.. ఆయనకు ఆశ్రయమిస్తున్నారు. దీనికితోడు పైకి కనిపించకపోయినా సామాజిక వర్గ నేతల సందడి. అంతా అప్పటి పరిస్థితే... అందుకే జనసేన తీరు చూస్తున్నవారంతా ఇది చిరంజీవి ప్రజారాజ్యానికి జిరాక్సేనంటున్నారు. ప్రజలు దీన్ని నమ్మితే ప్రజారాజ్యం చేతిలో మోసపోయినట్లే మళ్లీ మోసపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
   
మరోవైపు ప్రస్తుతం విజయనగరంలో పర్యటిస్తున్న పవన్ అక్కడి టీడీపీ - వైసీపీ నేతలపై ఆరోపణలు మొదలుపెట్టారు. వైసీపీ - టీడీపీలు ఊళ్లను పంచుకుంటున్నాయన్నారు. జనసేన ఆవిర్భవించకపోతే వీరే దోచుకుంటారన్నారు. మరి.. ఇన్ని చెప్పిన పవన్ గత నాలుగేళ్లుగా టీడీపీతో కలిసి నడిచిన సమయంలో ఎన్ని ఊళ్లను తాను పంచుకున్నారు.. ఇంకా తానేమేమి పంచుకున్నారన్నదిమాత్రం చెప్పడం లేదు. అమరావతిలో తన ఇంటికి స్థలమెలా వచ్చింది... తన యాత్రలకు నిధులెవరు సమకూరుస్తున్నారు వంటివేమీ మాట్లాడడం లేదు. పైగా... 2019లో అధికారం తనదేనని పదేపదే చెబుతున్నారు. దీంతో టీడీపీ గుడిని మింగే రకమైతే ఈయన గుళ్లో లింగాన్నీ మింగే రకంలా కనిపిస్తున్నారని అంటున్నారు.

మరో వివాదంలో పడ్డ మహానటి | In another controversy, the Mahanati

Another-COntroversy-on-Mahanati-movie-Andhra-Talkies-Telugu.jpg
తెలుగు ప్రేక్షకులంతా ఎంతో అభిమానించే సావిత్రి జీవిత గాథతో మహానటి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సావిత్రి జీవితంలోని చూసిన ఎత్తుపల్లాలన్నింటినీ సజీవంగా కళ్లముందు నిలిపాడు. సావిత్రిగా కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉందనే గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతోంది.

అందరికీ తెలిసిన వ్యక్తుల బయోపిక్ తీయడం అంత సామాన్యమైన విషయమేం కాదు. ఏదో ఒక విషయంలో వివాదాలు తలెత్తడం మామూలే. ఇందుకు మహానటి మినహాయింపు ఏమీ కాదు. ఇప్పటికే జెమినీ గణేశన్ పెద్ద భార్య కుమార్తె తన తండ్రి గురించి తప్పుగా చూపించారంటూ ఫైరయింది. తాజాగా సావిత్రి పెదనాన్న కె.వి.చౌదరి సోదరుడి మనవరాలినంటూ విజయ అనే మహిళ మహానటి సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది.  ఈ సినిమాలో చౌదరి పాత్రను మంచివాడిగా చూపించారని.. కానీ ఆయన షోమాన్ అని.. తాగుబోతు అని ఆరోపించింది. సావిత్రికి మద్యం అలవాటవడానికి కారణం అలాంటి వ్యక్తి పెంపకంలో పెరగడమూ ఒక కారణమని చెప్పుకొచ్చింది.

దీంతోపాటు సావిత్రి కుమార్తె చాముండేశ్వరి తీరును విజయ తప్పుపట్టింది. సావిత్రి కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు ఆస్తి కోసం కన్నతల్లిపైనే కేసు వేసి కోర్టుకు లాగిందని.. తల్లి చివరి రోజుల్లో ఆమెను పట్టించుకోనే లేదంటూ ఆరోపణలు చేసింది. ఈ విషయాలను మహానటి టీం పట్టించుకోలేదన్నది విజయ అభ్యంతరం. ఈ ఆరోపణలను సావిత్రి కుమార్తె చాముండేశ్వరి వద్ద ప్రస్తావిస్తే తనకు తెలియని వ్యక్తులు చేసే కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కొట్టిపారేశారు. 
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...