100 కోట్లు.. ఏకంగా 13 సార్లు కొట్టాడు | 100 crores .. hit 13 times | Andhra Talkies

Salman-kHan-13-Times-Enters-in-100-Crores-Club-Andhra-Talkies.jpg

100 కోట్లు.. ఏకంగా 13 సార్లు కొట్టాడు | 100 crores .. hit 13 times | Andhra Talkies

ఈ రోజుల్లో బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల మార్కెట్ చాలా పెరుగుతోంది. సినిమా సినిమాకు లెక్కల్లో ఎదో విధంగా మార్పు వస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా స్టార్ హీరోలు మినిమమ్ 100 కోట్లు వసులు చేయడం పక్కా  అనేస్తున్నారు. ప్రస్తుతం ఖాన్ ల హవా గట్టిగా నడుస్తోంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ అయితే ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తూ 100 కోట్లను చాలా స్పీడ్ గా అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

రీసెంట్ గా రిలీజ్ అయిన రేస్ 3 సినిమా కూడా చాలా స్పీడ్ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అదికూడా ఫస్ట్ వీక్ లో.. మొదటి వారంలోనే వంద కోట్లు కొల్లగొట్టి తన స్టార్ స్టామినాను చూపించాడు. గతంలో చేసిన బజరంగీ భాయిజాన్ - సుల్తాన్ -  టైగర్ జిందా హహై కూడా తొలి మూడు రోజుల్లో వంద కోట్ల వసూళ్లను అందుకున్నాయి. ఇక ఇప్పుడు రేస్ 3 కూడా ఆ లిస్టులో చేరిపోయింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వరుసగా 13 సార్లు 100 కోట్లు కొల్లగొట్టిన హీరోగా కూడా కండల వీరుడు రికార్డ్ సృష్టించాడు. 


దబాంగ్ సినిమాతో మొదలైన రికార్డుల పర్వం రేజ్ 3 వరకు బాగానే సాగింది. ఇక నెక్స్ట్ ఓకె చేసిన రెండు సినిమాలు భరత్ - దబాంగ్ 3 ప్రాజెక్టులు కూడా ఈజీగా ఆ రికార్డును అందుకొని 15వ సంఖ్యకు చేరుతుందని చెప్పవచ్చు. మధ్యలో కొన్ని యావరేజ్ సినిమాలు కూడా 100 కోట్లను వసూలు చేయడం గమనార్హం. మినిమమ్ కలెక్షన్స్ అందుకునే హీరో కాబట్టి నిర్మాతలు సల్మాన్ తో సినిమా చేసేందుకు క్యూలో ఉన్నారు. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...