బిగ్ బాస్-2పై కత్తి కుండబద్దలు కొట్టాడు | Andhra Talkies

Kathi-Mahesh-Opens-Up-On-Bigg-Boss-2-Andhra-Talkies-4564545748.jpg

బిగ్ బాస్-2పై కత్తి కుండబద్దలు కొట్టాడు

‘బిగ్ బాస్’ రెండో సీజన్ మీద ముందు నుంచి ఉన్న సందేహాలకు తగ్గట్లే ఈసారి షో ఏమంత ఆసక్తికరంగా సాగట్లేదు. ఎన్టీఆర్ స్థానంలోకి నాని రావడం కొంత మేర ఈ షో మీద ఆసక్తి తగ్గించగా.. ఈసారి పార్టిసిపెంట్లు అనుకున్న స్థాయిలో లేరు. దీనికి తోడు బిగ్ బాస్ హౌస్ లోపల జరుగుతున్న వ్యవహారాలు విసుగు తెప్పిస్తున్నాయి. చిరాకు పుట్టిస్తున్నాయి. షో మీద కొంత మేర నెగెటివ్ ఫీలింగ్ కలిగిస్తున్నాయి. ఈ విషయంలో గత ఏడాది పార్టిసిపెంట్ అయిన మహేష్ కత్తి సైతం కుండబద్దలు కొట్టేశాడు. ఈ ఏడాది ‘బిగ్ బాస్’ విషయంలో జనాల్లో ఎక్కువ నెగెటివిటీ కనిపిస్తోందంటూ కత్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగని తొలి వారం ఎలిమినేట్ అయిన సంజన అంటున్నట్లుగా ‘బిగ్ బాస్’లో కుట్రలు కుతంత్రాలు ఏమీ ఉండవని కత్తి అభిప్రాయపడ్డాడు.తొలి సీజన్లో తాము పాల్గొన్నపుడు పార్టిసిపెంట్ల మధ్య పోటీ మూడు.. నాలుగు వారాల నుంచి మొదలైందని.. కానీ ఈ ఏడాది తొలి వారం నుంచే అది మొదలు కావడం ఇబ్బందిగా మారిందని కత్తి అభిప్రాయపడ్డాడు. కొన్ని వారాల తర్వాత గేమ్ సీరియస్ అయ్యాక ఎవరో ఒకరిని బయటకు పంపాల్సి ఉంటుందని.. ఈ సారి ఫస్ట్ వీక్ లోనే ఇద్దరిని జైల్లో పెట్టేయడంతో కాంపిటీషన్ మొదలైందని. ఒక కుటుంబంలా కలిసుండే ప్రయత్నం చేద్దామనే ఆలోచన కూడా లేకుండా.. శత్రువర్గాలు-మిత్ర పక్షాలుగా మారిపోయి గొడవలు జరిగేంత స్థాయికి సీజన్-2 చేరడంతో జనాల్లో నెగిటివిటీని పెంచిందని కత్తి అభిప్రాయపడ్డాడు. మొదటి రోజు నుంచే కుట్రలు ప్రారంభం అయ్యాయని సంజన ఫీలవ్వడంలో తప్పులేదని కత్తి అన్నాడు. ఈ సారి సామాన్యులు కూడా ముగ్గురు లోపలికి వెళ్లడంతో పోటీ పెరిగిందని.. అన్న కత్తి తనను బయటికి పంపడంలో కుట్ర జరిగిందని.. ‘బిగ్ బాస్’ నిర్వాహకులే కుట్ర చేశారని అనడాన్ని తప్పుబట్టాడు. అక్కడి వాళ్లు నామినేట్ కావడంలో ఏమైనా జరగొచ్చు కానీ.. నిర్వాహకులు ఎవరినీ ఎలిమినేట్ చేయలేరని.. అది ప్రేక్షకుల చేతిలో ఉంటుందని కత్తి స్పష్టం చేశాడు. ఏదైనా ఆరోపించడం తేలికే కానీ.. రుజువు చేయడం కష్టమని కత్తి అభిప్రాయపడ్డాడు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...