బిగ్ బాస్ లో టివి9 న్యూస్ యాంకర్ | TV 9 News Anchor in Big Bass

TV 9 News Anchor in Big Bass
టాలీవుడ్ లో ప్రస్తుతం సినీ ప్రేక్షకులు మొత్తం బిగ్ బాస్ షోపైన కన్నేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. షో ఎలా నడుస్తోంది.. ఎన్ని రౌండ్లు ఉంటాయి. ఈ సారి స్పెషల్ ఏంటి? నాని తారక్ స్థాయిలో ఇరగదీస్తాడా? ఇలాంటి ప్రశ్నలు చాలానే వస్తున్నాయి. అయితే అన్నిటికంటే ఒకే ఒక్క సందేహం మాత్రం రెగ్యులర్ గా వైరల్ అవుతోంది. అది షో స్టార్ట్ అయ్యే వరకు ఎండ్ అవ్వదు.

ఇంతకు బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ఎవరు అనే ప్రశ్న టాలీవుడ్ లో బాగా ట్రెండ్ అవుతోంది. గూగుల్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా సెర్చ్ చేసిన వాటిల్లో అదే ఉందట. ఇక కొన్ని రూమర్స్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే. ఓ లిస్టు కూడా ఉంది. అయితే ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. గత ఏడాది న్యూస్ యాంకర్ ను తెచ్చినట్లు ఇప్పుడు మరొక యాంకర్ ను తెచ్చారు.

టివి9 యాంకర్ గా కొనసాగుతున్న దీప్తి నల్లమొత్తును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు తేజస్వి మధివాడ సింగర్ గీతా మాధురి దాదాపు ఫైనల్ అయినట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఈ యాంకర్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంటెస్టెంట్ కి సంబంధించిన లిస్ట్ ను చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నప్పటీకి ఎదో ఒక వార్తలో పేర్లు లీక్ అవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే షో స్టార్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే. అయితే సదరు యాంకర్ ను తన ఫేస్ బుక్ పేజీలో ఒక నెటిజన్ మీరు బిగ్ బాస్ లో కంటెస్ట్ చేస్తున్నారా అని అడిగితే.. ఆమె ఆ కామెంట్ కు లైక్ కొట్టింది. దానితో అందరూ నిజమనే అనుకుంటున్నారు. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...