సెట్ అవుతుందా చైతూ

Naga-Chaitanya-as-ANR-in-NTR-Biopic-Andhra-Talkies-Telugu.jpg

సెట్ అవుతుందా చైతూ

మహానటి బయోపిక్ లో తాత ఎఎన్ఆర్ వేషం అనగానే నాగ చైతన్య చాలా ఆశించి ఉంటాడు కాని తన వరకు అంతగా వర్క్ అవుట్ కాలేదన్నది నిజం. సావిత్రి గారి ట్రాన్స్ లో పడిపోయిన ప్రేక్షకులు మిగిలిన ఏ పాత్రను అంతగా పట్టించుకోలేదు. దానికి తోడు చైతు చేసింది కూడా నాలుగైదు చిన్న సీన్లే కాబట్టి తాతగారి పాత్రలో మనవడిగా మెప్పించాడా లేదా అనే విషయం పెద్దగా చర్చకు రాలేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు మరోసారి ఎఎన్ ఆర్ లా నటించాలనే ప్రతిపాదన నాగ చైతన్య వద్దకు వచ్చిందట. బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కోసం ప్రపోజల్ వచ్చినట్టు టాక్.

ఎన్టీఆర్ నట జీవితంలో నాగేశ్వర్ రావు గారి పాత్ర చాలా ఉంది. ఇద్దరు కలిసి 14 మల్టీ స్టారర్ సినిమాల్లో నటించారు. అందులో ఒకటి రెండు తప్ప అన్ని బ్లాక్ బస్టర్స్. రామారావు గారు రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు సినిమా రంగం నుంచి ఆయన పిలిచింది ఇద్దరినే. ఒకరు నాగేశ్వర్ రావు గారు. మరొకరు కృష్ణగారు. వేర్వేరు కారణాల వల్ల ఇద్దరు సున్నితంగా తిరస్కరించారు. అది వేరే సంగతి.

అయినా ఇక్కడో లాజిక్ మిస్ అవుతున్నాడు క్రిష్. ఒకవేళ ఎఎన్ఆర్ పాత్ర చేయించాలి అనుకుంటే క్రిష్ నాగార్జునను సంప్రదించాలి. వయసు పరంగా బాలయ్య ఇమేజ్ పరంగా సరితూగేది అతనే కాబట్టి. అలా కాకుండా మీసాలకు తెల్ల రంగు రావడానికి ఇంకా చాలా టైం ఉన్న కుర్రాడైన చైతును అనుకోవడం కరెక్ట్ అని చెప్పలేం. పైగా స్క్రీన్ మీద ఉన్నప్పుడు బాలయ్య పర్సనాలిటీ ముందు ఎంత ఎఎన్ఆర్ పాత్ర అయినా చైతు తేలిపోతాడు. సో ఏ రకంగా చూసుకున్నా నాగ్ రైట్ ఛాయస్ అవుతాడు కానీ చైతు కాదు. మహానటిలో చైతు  చేసింది నిజమే కానీ చిరకాలం  గుర్తుండిపోయే స్పాన్ అందులో దొరకలేదు.

అసలే నాగ్ బాలయ్య ల మధ్య సంబంధాలు అంతంతమాత్రం అని ఎప్పటి నుంచో టాక్ ఉంది. అలాంటిది తండ్రి కొడుకుల్లో ఎవరైనా అంత ఈజీగా బయోపిక్ లోకి ఎంటరవుతారా అనేది వేచి చూడాలి . ఆర్టిస్టుల ఎంపికలో బాగా కష్టపడుతున్న క్రిష్ కు రానున్న రోజుల్లో సెలక్షన్ పరంగా చాలా ఛాలెంజులు ఎదురు చూస్తున్నాయి. మరి రామారావు గారి నట జీవితంలో ప్రతి ఒక్కరితో అంత అవినావభావ సంబంధం ఉంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...