బాబు గోగినేనిని ఉతికారేసింది

Sanjana-Anne-Fires-on-Babu-Gogineni-Andhra-Talkies.jpg

బాబు గోగినేనిని ఉతికారేసింది

‘బిగ్ బాస్’ రెండో సీజన్ నుంచి మొదటగా ఎలిమినేట్ అయిన సంజన.. షోలో మరో పార్టిసిపెంట్ అయిన బాబు గోగినేనిపై విరుచుకుపడింది. హౌస్ లో ఉండగానే ఆయన్ని టార్గెట్ చేసుకున్న సంజన.. ఎలిమినేట్ అయినపుడు కూడా ఆయన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. బాబు అందరూ అనుకున్నంత మంచి వాడు కాదని ఆమె ఆమె పేర్కొంది. వెళ్తూ వెళ్తూ బాంబు వేసింది కూడా బాబు మీదే. ఇక బయటికొచ్చాక టీవీ ఛానెళ్ల చర్చల్లో పాల్గొంటున్న సంజన.. అక్కడ కూడా బాబు గోగినేనినే లక్ష్యంగా చేసుకుంది. ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

బాబు పైకి కనిపించేంత మంచి వ్యక్తి కాదని.. ఆయనలో జనాలకు తెలియని మరో కోణం ఉందని ఆమె అంది.బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడు బాబు తనతో దారుణంగా వ్యవహరించారని ఆమె అంది. షోలో భాగంగా తొలి రోజు తాను జైల్లోకి వెళ్లినపుడు ఆ రోజు రాత్రి నన్ను బయటకు తీసుకురావాలని ఇంటి సభ్యులంతా భావించారని.. కానీ బాబు మాత్రం సంజన వద్ద.. నూతన్ నాయుడును బయటకు తీసుకురావాలని చెప్పారని సంజన వెల్లడించింది. ఒక ఆడపిల్ల జైల్లో ఉంటే బాబు ఇంత దారుణంగా ప్రవర్తించారని.. తన కూతురైతే ఆయన ఇలాగే చేసేవాడా అని ఆమె ప్రశ్నించింది. మహిళ అనే జాలి తన మీద ఆయన చూపించలేదని అంది. బాబు డబ్బు మనిషే అని.. ఆయన డబ్బులు తీసుకునే ఈ షోకు వచ్చారని ఆమె చెప్పింది. డబ్బు కోసమే హౌస్ లో డాన్సులు చేస్తున్నారని.. రాజకీయం చేస్తున్నారని.. జనాల్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నమూ చేస్తున్నారని ఆమె విమర్శించింది. విలువలు పోగొట్టుకోకూడదు.. ఫైట్ చేయాలని అంటున్న బాబూనే విలువలు కోల్పోయారని అంది.తాను మసాజ్ చేయమని అడిగినపుడు ఆయన చాలా ఓవరాక్షన్ చేశాడని.. డ్యాన్సులు చేయడానికి లేని ఇబ్బంది మసాజ్ చేయడానికేంటని ఆమె ప్రశ్నించింది. ఈ విషయాన్ని కావాలని తప్పుగా ప్రచారం చేశారని.. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక అన్ని టాస్కులూ చేయాల్సిందే అని ఆమె అంది. ‘సంజనకు బుద్ది రావాలి. సంజన సిగ్గు తెచ్చుకోవాలి’ అని బాబు అన్నారని.. కానీ తనకు సిగ్గు చెప్పడానికి ఆయనెవరని ఆమె ప్రశ్నించింది. ఆయనేమైనా మహేష్ బాబా.. ఆయన వయసెక్కడ.. నా వయసెక్కడ అని ప్రశ్నించిన సంజన.. ఆయనలాగా మనసులో ఏదో పెట్టుకుని పగ పెంచుకోవడం తనకు తెలియదని అంది. బాబు ముందు చేతులు కట్టుకుని కూర్చోవాలని.. అదే ఆయనకు కావాలని.. అలాంటివి చేయలేకే తాను బయటకు వచ్చేయాల్సి వచ్చిందని సంజన స్పష్టం చేసింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...