బిగ్ బాస్ లిస్టు.. ఎగ్జైటింగ్ గా లేదే | Big boss list is not an exaggeration

Bigg-Boss-Telugu-2nd-Season-Participants-Andhra-Talkies-Telugu.jpg

బిగ్ బాస్ లిస్టు.. ఎగ్జైటింగ్ గా లేదే | Big boss list is not an exaggeration

అనేకానేక సందేహాలకు తెరదించుతూ గత ఏడాది తెలుగులోకి అరంగేట్రం చేసిన ‘బిగ్ బాస్’ షో అంచనాల్ని మించి విజయం సాధించింది. ఇటు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్.. అతడి వాక్చాతుర్యం.. మరోవైపు పార్టిసిపెంట్ల ఆకర్షణ కూడా తోడై షో బాగానే విజయవంతమైంది. మరి ఈసారి ‘బిగ్ బాస్’ సీజన్ ఎలా నడుస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హోస్టుగా ఎన్టీఆర్ స్థానంలోకి వచ్చిన నాని మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఐతే ఈసారి పార్టిసిపెంట్లు ఎవరు.. వాళ్లు ఏ మేరకు జనాల దృష్టిని ఏమేరకు ఆకర్షిస్తారా అని చూస్తున్నారు. ఐతే కొన్ని రోజులుగా పార్టిసిపెంట్ల విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తుండగా.. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. ఆదివారం బిగ్ బాస్-2 మొదలు కాబోతున్న నేపథ్యంలో పార్టిసిపెంట్ల లిస్టు బయటికి వచ్చింది. ఐతే ఈ లిస్టు ఏమంత ఎగ్జైటింగ్ గా లేదు. తొలి సీజన్ తో పోలిస్తే ఈసారి పార్టిసిపెంట్లలో ఆసక్తి రేకెత్తించేవాళ్లు తక్కువమందే.

సింగర్ గీతా మాధురి.. టీవీ 9 యాంకర్ దీప్తి.. హీరో తనీష్.. సోషల్ యాక్టివిస్ట్ బాబు గోగినేని.. యాంకర్ శ్యామల.. నటుడు సామ్రాట్.. నటి తేజస్వి.. వీళ్లు మాత్రమే జనాలకు పరిచయం ఉన్నవాళ్లు. కానీ వీరిలో జనాల్ని ఎగ్జైట్ చేసేవాళ్లు తక్కువమందే.వీళ్లు కాకుండా భాను.. రోల్ రిధా.. కృతి దామరాజు.. దీప్తి సునైనా.. కౌశల్.. అమిత్ తివారి.. గణేష్.. సంజన.. నూతన్ నాయుడు అనేవాళ్లు పార్టిసిపెంట్ల జాబితాలో ఉన్నారు. వీళ్లెవరూ జనాలకు పరిచయం లేని వాళ్లే. మరి ఈ జాబితా ఏమేరకు షో వైపు జనాల్ని ఆకర్షిస్తుందో.. వీళ్లతో నాని ఎలా నెట్టుకొస్తాడో.. షో ఏమంత ఆసక్తికరంగా నడుస్తుందో చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...