నాని మసాలా ఎంత వేశాడో... | How much did my nanny spice ...

నాని మసాలా ఎంత వేశాడో... | How much did my nanny spice ...

నాని మసాలా ఎంత వేశాడో... | How much did my nanny spice ...

తెలుగు టీవీలో అతి పెద్ద గేమ్ షో.. ఫస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు ప్రేక్షకులకు ఈ షో కాన్సెప్ట్ గురించి తెలిసింది తక్కువే. అందుకే స్టార్ మా ఛానల్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ను హోస్ట్ గా తీసుకుంది. ఎన్టీఆర్ హోస్టింగ్ ఈ షోకు సూపర్బ్ గా ప్లస్ అయింది. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేయడంతో ఈ షోకు మంచి రేటింగ్స్ వచ్చాయి.

బిగ్ బాస్ సీజన్ -2కు ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానంలోకి నాచురల్ స్టార్ నాని వచ్చాడు. ఈసారి ఇంకాస్త మసాలా అంటూ నాని ప్రోమోల్లో బాగానే ఆకట్టుకున్నాడు. నాని ఫస్ట్ లుక్ నుంచే ఎన్టీఆర్ తో పోల్చి చూస్తున్న జనాలు షోను ఎలా డీల్ చేస్తాడా అన్నదానిపై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఎన్టీఆర్ లాగే రియల్ లైఫ్ లోనూ చలాకీగా ఉండటం గ్యారంటీగా నానికి ప్లస్ పాయింటే. ఈ రకంగా నానికి హోస్టింగ్ పరంగా పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు. అయితే షోను రక్తి కట్టించడం అనేది పూర్తిగా అతడి టాలెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. జూన్ 10 నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఇందులో నాని ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది ఇంకాసేపట్లో తేలిపోతుంది.

మొదటి సీజన్ 70 రోజులు ఉండగా బిగ్ బాస్-2 వంద రోజుల పాటు కొనసాగనుంది. అందుకే నాని ఎక్కువ కాల్ షీట్లే ఈ షో కోసం కేటాయించాడు. ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీలో నాని హీరోగా నటిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది తప్ప మరోసినిమా ఏదీ కమిట్ అవలేదు. బిగ్ బాస్-2 అయిన తరవాతే నాని నెక్స్ట్ సినిమాకు ఓకే చెప్పే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...