బిగ్ బాస్ 'మసాలా' వెనుక మతలబు ఇదేనా? | Is this a big boss behind 'Masala'?

Madhavi-Latha-Sensational-Allegations-on-Bigg-Boss-2-Andhra-Talkies

బిగ్ బాస్ 'మసాలా' వెనుక మతలబు ఇదేనా? | Is this a big boss behind 'Masala'?

కొంతకాలంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో  క్యాస్టింగ్ కౌచ్ అనే పదం మార్మోగిపోతోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై రేగిన పెనుదుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణిగింది. ఇలా భావిస్తున్న తరుణంలో చికాగో సెక్స్ రాకెట్ రూపంలో మరోసారి టాలీవుడ్ - దక్షిణాది - తెలుగు నటీమణుల పేర్లు వార్తల్లోకెక్కాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆరోపిస్తూ ఓ తెలుగు టీవీ చానెల్ సంచలన కథనాన్ని వెలువరించింది. బిగ్ బాస్ కోర్ కమిటీ(సెలక్షన్) సభ్యుడి నుంచి నటి మాధవీలతకు ఆఫర్ వచ్చిందని అయితే `కమిట్ మెంట్ ` ఇస్తేనే అవకాశం దక్కుతుందని తెలపడంతో ఆమె తప్పుకుందని ఆ కథనంలో వెల్లడించింది. నటి మాధవీ లత కూడా ఆ చానెల్ లైవ్ షోలో ఆ ఫోన్ కాల్ తాలూకు విషయాలను వెల్లడించడం సంచలనం రేపింది. మాధవీలతో లైవ్ షో వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పెద్ద వివాదాలకు తావు లేకుండానే బిగ్ బాస్ -1 ను జూనియర్ ఎన్టీఆర్ రక్తి కట్టించి గ్రాండ్ సక్సెస్ చేశాడు. అయితే బిగ్ బాస్  సీజన్ -2 లో ఇంకొంచెం మసాలా ఉంటుందని ట్రైలర్ లోనే బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పేశారు. అయితే ఇప్పటి వరకు చూసిన బిగ్ బాస్ లో ఓ మోస్తరుగా మసాలా పాళ్లు కనిపించాయి. అయితే ముందు ముందు ఇంకా మసాలా పాళ్లు పెరగబోతున్నాయని ఆ చానెల్ కథనంలో వెల్లడించారు. ఆ  చానెల్ లైవ్ డిబేట్ లో పాల్గొన్న మాధవీ లత  అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనకు బిగ్ బాస్ కోర్ కమిటీ(సెలక్షన్) సభ్యుడి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ఆమె తెలిపింది. అయితే ఆ సభ్యుడు మాట్లాడిన తీరు తనకు ఎంతమాత్రం నచ్చకపోవడంతో తాను ఆ షోలో పాల్గొనలేదని చెప్పింది. బిగ్ బాస్ లో పాల్గొనాలంటే ముందుగా `కమిట్ మెంట్`(క్యాస్టింగ్ కౌచ్) ఇవ్వాలన్న విధంగా ఆ సభ్యుడు మాట్లాడాడట. బిగ్ బాస్ -2 సెక్సీగా - రొమాంటిక్ గా....ఉండబోతోందని...కొంచె మసాలా ఎక్కువని...చిన్న చిన్న బట్టలతో ఎక్స్ పోజ్ చేయాలని సదరు సభ్యుడు మాధవీలతతో అన్నాడట. వీపు బొడ్డు చూపించేలా డ్రెస్ లు వేసుకోవడం - షార్ట్స్ వేసుకోవడం ఇష్టమేనా అని అడిగారని....ఈ షోలో పాల్గొనాలని.....ఎంజాయ్ అండ్ హ్యావ్ ఫన్ అని మాధవీ లతతో ఆ సభ్యుడు చెప్పాడట.అయితే అతడి వ్యాఖ్యలను తాను ఖండించానని మాధవీలత చెప్పింది. క్యాస్టింగ్ కౌచ్ కు తాను వ్యతిరేకంగా మాట్లాడానని....అటువంటి తనతో ఇలా మాట్లాడడం ఏమిటని మాధవీలత గట్టిగా చెప్పిందట. అయితే అదంతా ఓకే అని...ఇది క్యాస్టింగ్ కౌచ్ కాదు.....నువ్వు కూడా ఓ అమ్మాయివే....నీకు కోరికలుంటాయి...అని తనను ట్రాప్ చేసేందుకు చూశారని మాధవీలత చెప్పింది. బిగ్ బాస్ లో చాన్స్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని చాలామంది అమ్మాయిలు - సెలబ్రిటీలు అడుగుతున్నారని...ఆలోచించుకోవాలని మాధవీలతకు సలహా ఇచ్చారట. ఆ సభ్యుడి సంభాషణను యథాతధంగా తాను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశానని...ఆ తర్వాతి రోజు తనకు అదే నంబర్ నుంచి ఫోన్ వచ్చిందని మాధవీలత తెలిపింది. రెండో రోజు ఫోన్ చేసిన వ్యక్తి....మొదటి రోజు ఫోన్ చేసిన వ్యక్తి ఒకరేనని....అయితే రెండో రోజు మాత్రం తాను వేరే వ్యక్తి అని....అసలు బిగ్ బాస్ నుంచి అలాంటి ఫోన్ లు ఎవరూ చేయరని అతడు బుకాయించాడని మాధవీలత చెప్పింది. ఆ సభ్యుడు నటించడంతో తాను కూడా మొదటి రోజు కాల్ చేసిన వ్యక్తి ఎవరో తెలియదన్నట్లు నటించానని చెప్పింది. అయితే కొంతమంది అమ్మాయిలకు కొన్ని ఆశలుంటాయని బిగ్ బాస్ లో పాల్గొంటే పాపులర్ అవుతారు కాబట్టి కొందరు అమ్మాయిలు - సెలబ్రిటీలు దేనికైనా రెడీ అంటున్నారేమోనని అభిప్రాయపడింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...