ఎన్టీఆర్ బయోపిక్ కు కొత్త చిక్కులు! | New implications for NTR biopic!

Nadendla-Bhaskara-Rao-Elder-Son-Issues-Notices-on-NTR-biopic-Andhra-Talkies.jpg

ఎన్టీఆర్ బయోపిక్ కు కొత్త చిక్కులు!

తెలుగు సినిమా మరువని నటుడు తెలుగు ప్రజలు మరవలేని నాయకుడు ఎన్టీఆర్. రెండింటా ఆయన సంచనలమే. ఆయన జీవితంలో ఎన్నో ట్విస్టులున్నాయి. అలాంటి సినిమాను బయోపిక్ తేవడం ఒక సాహసం అయితే దానికి బాలకృష్ణ శ్రీకారం చుట్టడం మరో విశేషం. భారీ అంచనాల నడుమ మొదలైన ఈ సినిమాకు తేజ తొలుత డైరెక్టరుగా వ్యవహరించారు. చాలా గ్రాండ్గా లాంచ్ అయింది ఈ సినిమా. కానీ దర్శకుడు మారడం ఈ సినిమాకు మరో సంచలనం. అయితే అనంతరం క్రిష్ ప్రాజెక్టు చేపట్టడంతో మళ్లీ షూటింగ్ సాఫీగా సాగడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే తాజాగా ఆ సినిమా మరో వివాదంతో వార్తల్లోకి ఎక్కింది. 1983 సంచలన ఎన్నిక అనంతరం కేవలం ఏడాదిలోనే నాటకీయ పరిణామాల మధ్య ఎన్టీఆర్ తన పదవిని తన ప్రమేయం లేకుండా కోల్పోయారు. నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే మళ్లీ పదవిని తిరిగి చేపట్టారు ఎన్టీఆర్. కాబట్టి ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఇపుడు కచ్చితంగా ఆ సీన్ ఉంటుంది. దీంతో నాదెండ్ల పెద్దకుమారుడు ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

‘ఎన్టీఆర్’ బయోపిక్ పై నాదెండ్ల భాస్కరరావు కుటుంబం అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ మేరకు దర్శకుడు క్రిష్ హీరో బాలకృష్ణకు భాస్కరరావు పెద్దకుమారుడు నోటీసులు పంపారు. ఎమ్మెల్యే - నటుడి హోదాలో బాలకృష్ణకు రెండు నోటీసులు పంపినట్టు తెలిసింది. ఈ బయోపిక్ లో తన తండ్రి నాదెండ్ల భాస్కరరావు పాత్ర విషయమై తమ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని అన్నారు. ఆయన పాత్రను నెగిటివ్ షేడ్ లో చూపించే ప్రయత్నం జరుగుతోందని నోటీసుల్లో ఆరోపించారు. ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి అని ఆయనపై ‘బయోపిక్’ తీసుకోవడంలో తమకు ఏ అభ్యంతరం లేదు. కానీ తన తండ్రిని నెగెటివ్ గా చూపించే ప్రయత్నం మంచిది కాదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...