యూట్యూబ్ ఛానల్ ను వాడేసిన నీహారిక | Nihaarika used by YouTube channel

Niharika-Happy-Wedding-Promotional-Video-Andhra-Talkies.jpg

యూట్యూబ్ ఛానల్ ను వాడేసిన నీహారిక | Nihaarika used by YouTube channel

చెప్పేది తిన్నగా చెబితే అంత బాగా ఎక్కదు. అందుకే.. కాస్త భిన్నంగా.. మరికాస్త వెరైటీగా చెబితే ఆ కిక్కే వేరు. తాజాగా అలాంటి పనే చేసింది హ్యాపీ వెడ్డింగ్ టీమ్. ట్రైలర్ రిలీజ్ ను అందరి మాదిరి చేస్తే మజా ఏముంటుంది?  వైరల్ ఎందుకు అవుతుంది?  అందుకే.. రోటీన్ కు భిన్నంగా చేద్దామనుకున్న చిత్రబృందం.. ట్రైలర్ రిలీజ్ కు సంబంధించిన సమాచారాన్ని స్ప్రెడ్ అయ్యేలా చేయటం కోసం కట్ చేసిన ప్రమోషనల్ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నిహారిక చేత తిట్టించేసి.. ఆ వెంటనే సర్దుకునేలా చేస్తూ చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తోందా? మరింత క్లారిటీగా చెపుతాం. కారు దగ్గరకు వెళుతున్న నిహారిక ను మేడమ్.. మేడమ్ .. యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం.. మీ వెడ్డింగ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది?  దాని గురించి ఏమైనా చెబుతారా? అంటూ అమాయకంగా గొంతు వినిపిస్తుంది.అంతే.. కారు ఎక్కబోతున్న నిహారిక బుస్సుమంటూ గుస్సా ప్రదర్శిస్తూ.. ఎవరయ్యా.. వీళ్లను లోపలికి రానిచ్చింది? అయినా.. నా పెళ్లి గురించి మీకెందుకయ్యా? నఇహారిక ఎప్పుడు చేసుకుంటుంది?  ఎక్కడ చేసుకుంటుంది? ఎందుకు చేసుకుంటుంది?  చూస్తే షాకవుతారు.. షేకవుతారు.. కిందపడి లేస్తారు.. పిచ్చా మీకేమైనా?  మీ థంబ్ నెయిల్స్ (లైక్స్) కోసం నా పేరును వాడుకుంటారా? అంటూ మండి పడుతుంది.
ఆ ఆగ్రహానికి డంగైనట్లుగా ఆ బక్కజీవి (ఫ్రేంలో కనిపించడు. అతని స్వరం మాత్రమే వినిపిస్తుంది) మాటల్ని కూడబలుక్కొని.. మేడమ్ మేం అడిగేది హ్యాపీ వెడ్డింగ్ మూవీ గురించి అంటూ మరింత వినయంగా అడగటం.. ఆ మాట విన్నంతనే.. చేతిలో ఉన్న వస్తువును కారు లోపల పెట్టి..ముఖానికి నవ్వు పులిమేసుకొని.. సారీ.. సారీ.. హ్యాపీ వెడ్డింగ్ ట్రైలర్ జూన్ 30న విడుదలవుతుంది.. మరిన్ని వివరాలు ఆ రోజు చెప్పేస్తాం.. సారీనే.. అంటూ కారు ఎక్కేసిన ప్రమోషనల్ వీడియో ఇట్టే ఆకట్టుకోవటమే కాదు.. ట్రైలర్ రిలీజ్ కు వినూత్నంగా ప్రమోషనల్ వీడియో కట్ చేశారన్న భావన కలుగుతుంది. అంతేకాదు.. ఇంత వెరైటీగా కట్ చేసిన నేపథ్యంలో.. ట్రైలర్ మరెంత బాగుంటుందన్న భావన కలుగ చేయటంలో హ్యాపీ వెడ్డింగ్ సక్సెస్ అయ్యినట్లే.

సుమంత్ అశ్విన్.. నిహారిక కొణిదెల జంటగా నటిస్తున్న హ్యాపీ వెడ్డింగ్కు లక్ష్మణ్ డైరెక్టర్. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తున్నారు. చూస్తుంటే ఈ మూవీ కొత్త ఫీల్ తెచ్చేలా ఉందనిపించక మానదు. సెలబ్రిటీలను యూట్యూబ్ ఛానళ్లు వాడేస్తే.. వాళ్లను తెలివిగా వాడేసిన హ్యాపీ వెడ్డింగ్ టీం.. సినిమాలో మరెందరిని ఎంతలా వాడేసిందో..?

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...