ఎన్టీఆర్ బయోపిక్.. కొట్టిపారేశారు | NTR biopic has been dismissed

NTR-Biopic-Team-Condemns-Movie-in-Two-Parts-Andhra-Talkies.jpg

ఎన్టీఆర్ బయోపిక్.. కొట్టిపారేశారు | NTR biopic has been dismissed

సీనియర్ నందమూరి తారకరామారావు గారి జీవితాన్ని ఆయన తనయుడు బాలకృష్ణ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఇబ్బందుల తరువాత స్టార్ట్ చేసిన ఈ సినిమా వారానికో వార్తతో సంచలనం సృష్టిస్తోంది ఇంకా రెగ్యులర్ షూటింగ్ స్పీడ్ పెరగకముందే  రూమర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. కథపై ఎన్నో నెలలుగా కూర్చున్న తేజ సడన్ గా తప్పుకోవడం అందరికి షాక్ ఇచ్చింది.

ఇక మరో దర్శకుడు క్రిష్ సినిమా పగ్గాలు చేపట్టడంతో బాలయ్య ఊపిరి పీల్చుకున్నాడు. పనులు మొత్తం దర్శకుడి చేతిలోనే పెట్టేశాడు. కథ నుంచి నటీనటుల ఎంపిక విషయాల గురించి అన్ని క్రిష్ తన ఆధీనంలోనే జరిగేట్లు చూసుకుంటున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని దర్శకుడు క్రిష్ కథను పొడిగించాడని టాక్ వచ్చింది. అయితే చిత్ర యూనిట్ వాటిని కొట్టిపారేసింది.ఎన్టీఆర్ బయోపిక్ లో అన్ని విషయాలు ఉంటాయని కొందరు చెబుతుంటే బాలయ్య మాత్రం ఏ అంశాన్ని చూపించాలి ఎలాంటి విషయాల్ని చూపించకూడదో తమకు తెలుసనీ ముందే చెప్పేశాడు. ఇక క్రిష్ ఇప్పటికే కథను మొత్తం చదివి స్క్రీన్ ప్లే ను సెట్ చేసుకున్నాడు. ఎమ్.ఎమ్.కీరవాణి తో నిరంతరం చర్చలు కూడా జరుపుతున్నారు. మరి ఈ సినిమా ఫైనల్ గా ఎలా ఉంటుందో చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...